గుజరాత్: బిపర్ జోయ్ తుఫాను గుజరాత్ తీర ప్రాంతాల్లో బీభత్సం సృష్టించడంతో గుజరాత్, సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లోని పోర్టులన్నిటి నుండి కార్యకలాపాలను నిలిపివేశారు అధికారులు. ముంద్రా, కండ్ల వంటి పోర్టుల నుండి రవాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ఢిల్లీ నుండి గుజరాత్ వచ్చిన ట్రక్ డ్రైవర్ ఒకతను కండ్ల పోర్టులో ఇరుక్కుపోయాడు. తన ఇంటికి క్షేమ సమాచారం ఇవ్వడానికి కూడా వీలులేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉండిపోయాడు. అతనిలాగే మరో ట్రక్ డ్రైవర్ తుఫాను ప్రభావంతో విద్యుత్తు నిలిచిపోయిన ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణకు కావాల్సిన సరుకులను ట్రక్ లో లోడ్ చేసుకుని అధికారుల ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నానని అన్నాడు.
ఢిల్లీ నుంచి వచ్చి ఇరుక్కుపోయాను..
ఇస్మాయిల్ షేక్ అని ఒక డ్రైవర్ గురువారం ఢిల్లీ నుండి తన ట్రక్లో లోడ్ తీసుకొచ్చి కండ్ల పోర్టు వద్ద దించిన నాటి నుండి తుఫాను ఉధృతం కావడంతో ఎక్కడికీ కదల్లేక అక్కడే రోడ్డు పక్కన ఉన్న ఒక హోటల్ దగ్గర ఉండిపోయాడు. ఇంటికి ఫోన్ చేద్దామంటే ఛార్జింగ్ లేక ఫోన్ డెడ్ అయిపొయింది. ఇంట్లో మావాళ్లు న గురించి కంగారుపడుతుంటారు. ముంద్రా నుండి మళ్ళీ లోడ్ ఎత్తుకుని హర్యానా వెళ్ళవలసి ఉండగా ఈ గాలులకు ఖాళీ బండితో రోడ్డు మీదకు వెళ్తే ఏం ప్రమాదం జరుగుతుందో నాని భయంతో ఇక్కడే ఆగిపోయానని అంటున్నాడు.
ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాను..
ఇదిలా ఉండగా విద్యుత్ నిలిచిపోయిన గ్రామాల్లో కరెంటును పునరుద్దీకరించడానికి అవసరమైన లోడును ఎక్కించుకుని మహమ్మద్ ఖాసం అనే మరో డ్రైవరు కూడా తుఫానులో ఇరుక్కుపోయాడు. అధికారులు ఆదేశమిస్తే తప్ప తానిక్కడ నుండి బయలుదేరలేని పరిస్థితుల్లో ఉన్నానన్నాడు.
సమయం పడుతుంది..
వారం రోజులుగా గుజరాత్లో అల్లకల్లోలం సృష్టిస్తోన్న భీకర బిపర్ జోయ్ తుఫాను తీరాన్ని తాకింది. ప్రచండ వేగంతో వీస్తున్న గాలులతో పాటు భారీ వర్షం కూడా పడుతుండడంతో ప్రజల జీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. సుమారుగా 1000 గ్రామాలకు విద్యుత్తు అంతరాయం కలగడంతో ప్రజలు అంధకారంలోనే మగ్గుతున్నారు. గాలుల బీభత్సానికి రోడ్లమీద చెట్లు విరిగిపడ్డాయి, కరెంటు స్తంభాలు నేలకూలాయి. గత మూడు రోజులుగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని, తుఫాను ఉధృతి తగ్గకపోవడంతో పునరుద్ధరీకరణ పనుల్లో కొంత ఆలస్యమవుతోందని అంటున్నారు అధికారులు.
ఇది కూడా చదవండి: బిపర్‌జోయ్ విలయం.. ఇద్దరు మృతి, 22 మందికి గాయాలు
Comments
Please login to add a commentAdd a comment