సాక్షి, ఢిల్లీ: జూన్ మూడో వారం వచ్చేసింది. ఈపాటికే వర్షాలు దంచికొట్టాలి. కానీ, ఎర్రటి ఎండలు మాత్రం మే నెలను తలపిస్తున్నాయి. పైగా అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జోయ్ తుపాను.. రుతుపవనాలపై పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగానే కొనసాగుతుండగా.. వర్షాలు ఇంకా ఆలస్యంగా కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఈలోపు ఆంధ్రప్రదేశ్‌లోని 478 మండలాల్లో అలర్ట్ జారీ చేసింది. మరో 2-3 రోజుల పాటు కోస్తాంధ్రలో వడగాల్పులు కొనసాగుతాయని తెలిపింది. అయితే.. రాయలసీమలో మాత్రం రేపటి(17-06) నుంచి వేడి తగ్గే అవకాశం ఉంటుందని అంచనా వేస్తోంది. అలాగే ఎల్లుండి నుంచి సీమలో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
తొలకరిని మోసుకొచ్చే నైరుతి రుతుపవనాలు.. ఈ ఏడాది దోబూచులాడుతున్నాయి. జూన్ 8నే కేరళను తాకి మెల్లిగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు చేరుకున్నట్లు కనిపించాయి. ఆలస్యంగా అయినా వచ్చేశాయంటూ సంబురపడే లోపే.. బిపోర్ జాయ్ తుపాను ప్రభావం దానిని ముందుకు కదలనివ్వకుండా అడ్డుకుంది. అంతా సవ్యంగా ఉంటే.. ఎల్లుండి(జూన్ 19) నుంచి నైరుతి రుతుపవనాలు ఏపీలోని ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment