mansoon
-
హైదరాబాద్: పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వాన
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారి మేఘాలు కమ్ముకొని.. పలు చోట్ల వాన కురిసింది. కోఠి, సెక్రటేరియట్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. పంజాగుట్ట, ఖైరతాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. బలహీన పడిన ఉపరీతల ఆవర్థనం ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి నిజామాబాద్ వరకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. మరో 2, 3 రోజుల్లో రాష్ట్రమంతా రుతుపవనాలు విస్తరించనున్నాయని హైదారబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరీతల ఆవర్థనం బలహీన పడిందని పేర్కొంది. ఈరోజు రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారీ వర్షం పడనున్నట్లు సూచించింది. వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాలకు భారీ వర్షాలు ఉన్నట్లు తెలిపింది. సాయంత్రం హైదరాబాద్‌కి ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది. దక్షిణ ఈశాన్య, మధ్య తెలంగాణ జిల్లాలకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాల పడతాయని పేర్కొంది. -
ఇది చినుకు కాలం, జనం వణుకు కాలం.. 3-4 వారాలు బాధించే జ్వరం..
ఇది చినుకుల కాలం. వర్షాకాలంలో డ్రైనేజీలు పొంగుతూ... మానవ విసర్జకాలు మంచినీళ్లతో కలవడం మామూలే. ఆ నీళ్లు తాగడం, అలా కలుషితమైన నీళ్లతో వండిన ఆహారాలతో టైఫాయిడ్ రావడం సా«ధారణం. మురికివాడలూ, పారిశుద్ధ్యవసతి అంతగా లేని ప్రాంతాల్లో ఇది ఇంకా ఎక్కువ. సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియమ్ టైఫాయిడ్ జ్వరానికి కారణం. ఇదే జాతికి చెందిన సాల్మొనెల్లా పారాటైఫీ అనే మరో రకం బ్యాక్టీరియా కూడా ఉంది. కాకపోతే దీంతో తీవ్రత కాస్తంత తక్కువ. ఈ సీజన్లో టైఫాయిడ్ వచ్చేందుకు అవకాశాలు ఉండటంతో ఈ జ్వరంపై అవగాహన కోసం ఈ కథనం. టైఫాయిడ్ బ్యాక్టీరియా మనుగడ సాగించేది కేవలం మానవ శరీరంలోనే. కొంతమందిలో దీని లక్షణాలేమీ బయటకు కనిపించవు. కానీ వారి నుంచి ఇతరులకు బ్యాక్టీరియా వ్యాపించినప్పుడు ఇతరుల్లో టైఫాయిడ్ బయటపడవచ్చు. ఇలా లక్షణాలు లేకుండా వ్యాప్తి చేసేవారిని క్యారియర్స్ అంటారు. మురికిగా ఉండే మెస్‌లూ, క్యాంటీన్లు, అపరిశుభ్రమైన హోటళ్లలో పనిచేసేవారిలో ఇది నిద్రాణంగా ఏళ్లతరబడి ఉండే అవకాశం ఉంది. వీళ్ల విసర్జకాలతో ఆహారం కలుషితమై... ఇతరులకు వ్యాధిని వ్యాప్తి చేసే అవకాశాలు ఎక్కువ. వీళ్లను క్రానిక్ క్యారియర్స్‌గా చెబుతారు. దేహంలోకి బ్యాక్టీరియా ప్రవేశించిన వారం లేదా రెండు వారాలలో లక్షణాలు బయటపడతాయి. టైఫాయిడ్ జ్వరమొచ్చాక అది దాదాపు 3 – 4 వారాల పాటు బాధిస్తుంది. లక్షణాలు: ► తీవ్రమైన జ్వరం (ఒక్కోసారి 104 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు మించి) ► ఆకలి మందగించడం ► తలనొప్పి ► గుండె స్పందనలు తగ్గడం (బ్రాడీకార్డియా) ► రక్తంలో తెల్లరక్తకణాల సంఖ్య తగ్గడం (ల్యూకోపీనియా) ► కొందరిలో నీళ్ల విరేచనాలు, పొట్టనొప్పి ► ఒంటి నొప్పులు ∙తీవ్రమైన అలసట, నిస్సత్తువ, నీరసం ► కొందరిలో ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం ► చాలా అరుదుగా కొందరిలో ర్యాష్‌తో పాటు మెడ, పొట్ట మీద గులాబీరంగు మచ్చలు కనిపించవచ్చు. ► జ్వరం కారణంగా దుష్ప్రభావాలు కనిపించకపోతే మూడు నుంచి నాలుగు వారాల్లో జ్వరం దానంతట అదే తగ్గుతుంది. నిర్ధారణ: మొదటివారంలో రక్తపరీక్షతో (బ్లడ్ కల్చర్) కచ్చితంగా కనుగొనవచ్చు. అందుకే మొదటివారంలో చేసే రక్తపరీక్షను గోల్డ్‌స్టాండర్డ్ పరీక్షగా పేర్కొనవచ్చు. రెండోవారంలో వైడాల్ టెస్ట్ అనే రక్తపరీక్షతో నిర్ధారణ చేస్తారు. మూడో వారంలో ఎముక మజ్జ (బోన్‌మ్యారో) కల్చర్ పరీక్షతో నిర్ధారణ చేస్తారు. ఈ పరీక్షలతో పాటు బయటకు కనిపించే టైఫాయిడ్ సాధారణ లక్షణాలను బట్టి దీన్ని నిర్ధారణ చేయవచ్చు గానీ... ఇలాంటి లక్షణాలే చాలా జ్వరాల్లో కనిపిస్తాయి కాబట్టి కేవలం లక్షణాలను బట్టే నిర్ధారణ అంత తేలిక కాదు. వైద్యపరీక్షలతో దీన్ని కచ్చితంగా నిర్ధారణ చేయవచ్చు. డ్రగ్ రెసిస్టెంట్ టైఫాయిడ్... ఇటీవల మందులకు లొంగని టైఫాయిడ్ ఎక్కువగా కనిపిస్తోంది. చిన్న చిన్న సమస్యలకూ విచక్షణరహితంగా యాంటీబయాటిక్స్ వాడటం, అది కూడా సరైన మోతాదులో కాకుండా ఇష్టం వచ్చిన మోతాదుల్లో వాడుతూ తుండటంతో డ్రగ్ రెసిస్టెంట్ టైఫాయిడ్ ఎక్కువగా కనిపిస్తోంది. పైగా దీని లక్షణాలు కూడా టైఫాయిడ్లా కనిపించవు. ఇలాంటి కేసుల్లో రోగికి చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా వైద్యం అందించాలి. గతంలో చాలా సాధారణ మందులతోనే అంటే క్లోరో క్వినలోన్స్ వంటి చాలా ప్రాథమికమైన మందులతోనే టైఫాయిడ్ త్వరగా తగ్గిపోయేది. కానీ డ్రగ్ రెసిస్టెంట్ టైఫాయిడ్ వచ్చిందంటే అది ఒక పట్టాన తగ్గక చాలా రకాల ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. మందులు కూడా పనిచేయకపోవడంతో వైద్యులు మరింత శక్తిమంతమైన మందులు వాడాల్సిన పరిస్థితి. అందుకే ఆన్ కౌంటర్ మందులు వద్దని డాక్టర్లు సూచిస్తుంటారు. టీకా అందుబాటులో... టైఫాయిడ్ నివారణకు టీకా అందుబాటులో ఉన్నందున... వచ్చాక మందుల వాడకం కంటే ముందుగా టీకాతోనే నివారించుకునే అవకాశం ఇప్పుడు ఉంది. ఈ సీజన్లో దూర ప్రయాణాలు చేసేవారికి ఇదెంతో మంచిది. నివారణ చర్యలతో, టీకాతో నివారణ తేలికే కాబట్టి దీన్ని నివారించుకోవడమే మేలు. చికిత్స : టైఫాయిడ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే... దీని కారణంగా ఇది సోకిన ప్రతి ఐదుగురిలో ఒకరు మరణించే అవకాశముంటుంది. అలా చూసినప్పుడు ఇది కొంచెం ప్రమాదకరమైన వ్యాధి. అందుకే చికిత్స తప్పనిసరి. పైగా 104 డిగ్రీలకు పైగా జ్వరం కారణంగా మరికొన్ని దుష్ప్రభావాలు కనిపించవచ్చు. చికిత్స అందకపోయినా లేదా తీవ్రత ఎక్కువగా ఉన్నా మెదడును దెబ్బతీసేలా మెనింజైటిస్, గుండెకు నష్టం చేకూరేలా మయోకారై్డటిస్, ప్యాంక్రియాస్‌ను దెబ్బతీస్తూ ప్యాంక్రియాటైటిస్, కొందరిలో పేగుల్లో రంధ్రం పడటం (పెర్ఫొరేషన్), పేగుల్లో రక్తస్రావం కావడం, కిడ్నీలు దెబ్బతినడం వంటి అనర్థాలు రావచ్చు. కొన్నిసార్లు చాలా అవయవాలు విఫలం కావడం (మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్) జరగవచ్చు. అందుకే టైఫాయిడ్ రోగులు సరైన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. ఫ్లూరోక్వినలోన్స్ / సెఫాలోస్పోరిన్స్ వంటి యాంటీబయాటిక్స్‌తో సాల్మొనెల్లా బ్యాక్టీరియా పూర్తిగా చనిపోతుంది. అయితే ఈ యాంటీబయాటిక్స్ పూర్తికోర్స్ వాడటం చాలా అవసరం. లేదంటే జబ్బు తిరగబెట్టవచ్చు. అది మరింత తీవ్రరూపం దాల్చవచ్చు. నివారణ : ఈగలతో దీని వ్యాప్తి చాలా ఎక్కువ. మలం మీద వాలి, అవే మళ్లీ ఆహారపదార్థాల మీద వాలే అవకాశం ఉన్నందున ఈగలను ముసరనివ్వకూడదు. ఈ సీజన్లో కుండల్లో చాలాకాలం నిల్వ ఉన్న నీటిని ఏమాత్రం తాగకూడదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా పట్టిన నీళ్లే తాగాలి. వీలైనంతవరకు నీటిని కాచి, వడపోసి చల్లార్చి తాగడం మంచిది. చేతులు కడుక్కునే అలవాటు లేనివారిలో ఇది ఎక్కువగా రావడం కనిపిస్తుంది. అందుకే తినేముందు లేదా తాగే ముందర చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇక మల విసర్జన తర్వాత తప్పనిసరిగా చేతులు సబ్బుతో కడుక్కోవాలి. అన్నం, కూరలు వేడివేడిగా ఉండగానే తినెయ్యాలి. వేడి చేయకుండా... నేరుగా నీళ్లను ఉపయోగించే చేసే తినుబండారాలతో టైఫాయిడ్ వ్యాప్తికి అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే ఈ సీజన్లో వేడిచేయకుండా నేరుగా నీళ్లను వాడే పానీపూరీ వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. వీలైనంతవరకు ఈ సీజన్ అంతా బయటి ఆహారాలకు దూరంగా ఉండటమే మంచిది. ఒకవేళ బయటి పదార్థాలు తినాల్సి వస్తే చల్లారిపోయాక అస్సలు తినకూడదు. కలుషిత జలాలతో తయారు చేసే ఐస్‌తో కూడా ఇది వ్యాపించే అవకాశం ఉన్నందున, అలాంటి ఐస్ వాడే చెరుకు రసం వంటి పానీయాలకు దూరంగా ఉండటం చాలా అవసరం. డాక్టర్ లింగయ్య మిర్యాల సీనియర్ ఫిజీషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ (చదవండి: వర్షాలలో ఎలుకలతో వచ్చే జబ్బు! ) -
Heavy Rains: ఉత్తర భారతానికి ఈ పరిస్థితి ఎందుకు?
ఢిల్లీ: ఆలస్యంగా వచ్చిన రుతుపవనాలు, బిపర్జోయ్ తుపాను ప్రభావమూ ఓ పక్క.. ఇంకోపక్క అధిక ఉష్ణోగ్రతల ప్రభావమూ ఈ యేడు వానల్ని ఆలస్యం చేశాయి. అయితే ఈలోపు రికార్డు స్థాయిలో ఉత్తరాదిన కురుస్తున్న వర్షాలు.. అతలాకుతలం చేస్తున్నాయి. భీకర వర్షాలతో సగానికి పైగా ఉత్తర భారతం నీట మునిగింది. మరోపక్క ఆస్తి నష్టంపై ఇప్పుడే అంచనాకి రాలేని స్థితిలో.. మృతుల సంఖ్యా వందకు పైనే ఉండొచ్చని తెలుస్తోంది. అయితే ఉన్నట్లుండి ఉత్తరాదిపై వరుణుడు ఇంతగా ప్రతాపం చూపించడానికి కారణంపై భారత వాతావరణ శాఖ స్పందించింది. ఉత్తర భారతంలో నెలకొన్న అసాధరణ పరిస్థితిపై ఐఎండీ స్పష్టత ఇచ్చింది. పశ్చిమ భాగంలో నెలకొన్న సంక్షోభం(వాతావరణ మార్పులు).. అదే సమయంలో రుతుపవనాల ప్రభావం వల్ల ఉత్తర భారత దేశంలో ఈ భీకర వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ అంటోంది. అలాగే జులై మొదటి వారంలో కురిసిన వర్షాలు.. మొత్తం దేశానికి లోటును భర్తీ చేశాయని తెలిపింది ఐఎండీ. ये आवाज किसकी है? #DelhiRains . Who know this ? #Chandigarh #Atlee #JawanPrevue #Heavyrainfall #Manali #PriyAnkit #TejRan #oriele #emeutes #himachalfloods pic.twitter.com/TC2OgiNqwd — Baba Chuskiwale (@BabaChuskiWale) July 10, 2023 #WATCH | Himachal Pradesh: Latest visuals from Mandi around Victoria Bridge and Panchvakhtra Temple. pic.twitter.com/1jnhmTr8V6 — ANI (@ANI) July 10, 2023 వర్షాకాలంలో సంచిత వర్షపాతం 243.2 మిల్లీమీటర్లకు చేరుకుంది, ఇది సాధారణం 239.1 మిమీ కంటే రెండు శాతం ఎక్కువ అని IMD ప్రకటించింది. అలాగే.. జూన్ చివరి నాటి కల్లా దేశం మొత్తం మీద 148.6 మి.మీ నమోదు కాగా.. అది సాధారణ వర్షపాతం కంటే 10 శాతం తక్కువ తెలిపింది. వాస్తవానికి ఈ జులైలో సాధారణ వర్షపాతమే నమోదు అవుతుందని ఐఎండీ అంచనా వేసింది. కానీ.. వాతావరణ మార్పుల వల్ల అంచనాలు తప్పి అధిక వర్షాలు కురుస్తున్నాయి. जितना हम प्रकृति को नुकसान पहुंचाएंगे, वो हमे भी उतना ही नुकसान पहुंचाएगी 😥 Pray for Himachal #Heavyrainfall #HimachalPradesh #flood #Himachalrain #himachalflood #staysafe #mandi #Kullu pic.twitter.com/j222xFbmbc — कंचन शर्मा (@itsKanchan7) July 10, 2023 ఉత్తర భారతంలో చాలా రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండచరియలు విరిగిపోవడం, ఆకస్మాత్తుగా వరదలు పొటెత్తడంతో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. పలు నదులు ఉప్పోంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, స్థానిక యంత్రాంగం రంగంలోకి దిగి వరదల్లో చిక్కుకున్నవారిని కాపాడుతున్నారు. వరదల ధాటికి.. వాహనాలు, రోడ్లు, వంతెనలు, భవనాలు సైతం కొట్టుకుపోతున్నాయి. #WATCH | Water level in Yamuna river reaches near danger mark at Old Railway Bridge. pic.twitter.com/oNfL7qwe1c — ANI (@ANI) July 10, 2023 #Heavyrainfall #HimachalPradesh pic.twitter.com/L0RGEKkzbI — Satendra Pandit (@SatendraPandi10) July 10, 2023 రాజధాని ఢిల్లీ రీజియన్ సహా.. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, జమ్ము కశ్మీర్, రాజస్థాన్‌కూ ఇంకా వాన ముప్పు తప్పలేదని వాతావరణ శాఖ హెచ్చరించింది. యమునా నది ఉగ్ర రూపం దాల్చి.. ముంచెత్తడానికి సిద్ధమవుతోంది. మరోవైపు సెంట్రల్ వాటర్ కమిషన్.. నీటి నిల్వలపైనా ఒక ప్రకటన చేసింది. రిజర్వాయర్లోల నీటి సామర్థ్యం మెరుగుపడిందని పేర్కొంది. -
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన నైరుతి
-
ఏపీలో విస్తరించిన నైరుతి రుతుపవనాలు
-
నేడు, రేపు తెలంగాణకు అతి భారీ వర్ష సూచన
-
తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
-
తెలంగాణలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు...ఇంకా ఇతర అప్డేట్స్
-
దెబ్బకొట్టిన బిపర్జోయ్.. ఏపీకి మండుటెండల అలర్ట్
సాక్షి, ఢిల్లీ: జూన్ మూడో వారం వచ్చేసింది. ఈపాటికే వర్షాలు దంచికొట్టాలి. కానీ, ఎర్రటి ఎండలు మాత్రం మే నెలను తలపిస్తున్నాయి. పైగా అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జోయ్ తుపాను.. రుతుపవనాలపై పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగానే కొనసాగుతుండగా.. వర్షాలు ఇంకా ఆలస్యంగా కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈలోపు ఆంధ్రప్రదేశ్‌లోని 478 మండలాల్లో అలర్ట్ జారీ చేసింది. మరో 2-3 రోజుల పాటు కోస్తాంధ్రలో వడగాల్పులు కొనసాగుతాయని తెలిపింది. అయితే.. రాయలసీమలో మాత్రం రేపటి(17-06) నుంచి వేడి తగ్గే అవకాశం ఉంటుందని అంచనా వేస్తోంది. అలాగే ఎల్లుండి నుంచి సీమలో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తొలకరిని మోసుకొచ్చే నైరుతి రుతుపవనాలు.. ఈ ఏడాది దోబూచులాడుతున్నాయి. జూన్ 8నే కేరళను తాకి మెల్లిగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు చేరుకున్నట్లు కనిపించాయి. ఆలస్యంగా అయినా వచ్చేశాయంటూ సంబురపడే లోపే.. బిపోర్ జాయ్ తుపాను ప్రభావం దానిని ముందుకు కదలనివ్వకుండా అడ్డుకుంది. అంతా సవ్యంగా ఉంటే.. ఎల్లుండి(జూన్ 19) నుంచి నైరుతి రుతుపవనాలు ఏపీలోని ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం కనిపిస్తోంది. -
ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు భారత్ వాతావరణ శాఖ చల్లని కబురు
-
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
-
గుడ్‌న్యూస్.. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
సాక్షి, ఢిల్లీ: భారత వాతావరణ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఇవాళే కేరళను తాకినట్లు అధికారికంగా ప్రకటించింది. అంతకు ముందు రేపు(శుక్రవారం) రుతుపవనాలు కేరళను తాకొచ్చని ఐఎండీ అంచనా వేసింది. అయితే.. ముందుగానే ఇవాళ చేరుకుంది. రుతుపవనాల రాక ప్రభావంతో.. రానున్న 48 గంటల్లో కేరళ, కర్ణాటక, తమిళనాడు సహా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలుపడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కాస్త ఆలస్యంగా రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని చెబుతోంది. వారం తర్వాతే అంతటా వర్షాలు ఉంటాయని పేర్కొంది. ఈ ఏడాది దోబూచులాడిన రుతుపవనాలు.. ఆలస్యంగా ప్రవేశించాయి. దక్షిణ అరేబియా సముద్రం మీదుగా పడమట గాలులు కొనసాగుతున్నాయి. అంతకు ముందు పశ్చిమ గాలుల లోతులో పెరుగుదల, ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్, కేరళ తీర ప్రాంతాలపై మేఘావృతం ఉధృతం కావడం వంటి పరిణామాలు కనిపించాయి. తెలంగాణలో మూడురోజులపాటు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని తెలిపింది వాతావరణశాఖ. అయితే.. గురు, శుక్రవారాల్లో ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఏపీకి ఉపశమనం కాస్త ఆలస్యం కావొచ్చని అంచనా వేస్తోంది. -
పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా
-
పురిటిపాట్లు..
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం మొట్లతిమ్మాపురం గ్రామం.. మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వర్షాకాలం వస్తే మధ్యలో ఉన్న ఉడుముల (వట్టె)వాగు దాటి వెళ్లాలి. గత 4 రోజుల కింద గ్రామానికి చెందిన తోట రవీందర్ అనే యువకుడు వాగు దాటే ప్రయత్నం చేసి నీటిలో కొట్టుకుపోయి మరణించాడు. యువకుడే వాగు దాటలేక మరణిస్తే.. ఇక మహిళలు, గర్భిణుల పరిస్థితి ఎలా ఉంటుందో..! ‘భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం చింతపెట్టిగూడెం గ్రామం నుంచి బయటకు రావాలంటే మధ్యలో ఉన్న పారేటి వాగు దాటాలి. ఈ వాగు కొద్దిపాటి వర్షానికే పొంగుతుంది. దీంతో ఇటీవల ఆ గ్రామానికి చెందిన గర్భిణికి పురిటి నొప్పులు రాగా.. ఎడ్లబండిపై వాగు దాటించి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బంగారుచెలక, అక్కడి నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తగూడెం వెళ్లి ఆస్పత్రిలో చేర్పించారు. సాక్షి, మహబూబాబాద్: వానాకాలం వస్తే చాలు రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతంలో ఉండే గర్భిణులకు వణుకు మొదలవు తుంది. వాగులు, వంకలు దాటి ప్రసవం కోసం ఆస్పత్రుల కు వెళ్లాలంటే కత్తిమీద సాములా మారుతోంది. నిండుచూ లాలికి నొప్పులు వస్తే వారిని ఆస్పత్రికి తరలించడం ఎంత కష్టమో చెప్పలేం. ఏజెన్సీ ప్రాంతాల్లో గర్భిణులు ప్రసవం, ఇతర అత్యవసర వైద్యం చేయించుకోవాలంటే ముందుగా గిరిజన గ్రామాల రహదారిపై ఉన్న వాగులు దాటితేనే వైద్యం అందుతుంది. ఇక ఆ వాగు దాటాలంటే ఎడ్లబండ్లు, జోలెలే శరణ్యం. ఇలా రాష్ట్రంలోని మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని గిరిజనులు ఇలాంటి దారుణ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఏజెన్సీ జిల్లాల్లో నెలలు నిండిన మొత్తం గర్భిణులు దాదాపు 3,869 మంది ఉన్నట్లు అంచనా. ►మహబూబాబాద్ జిల్లా గంగారం, గూడూరు, కొత్తగూడ, బయ్యారం, గార్లతో పాటు నెల్లికుదురు, కేసముద్రం మండలాల్లోని పలు గ్రామాలకు సరైన రోడ్డు మార్గాలు లేవు. ఉన్నా మధ్యలో వాగులు దాటాల్సి ఉంటుంది. దీంతో ఊట్ల మట్టెవాడ, మొట్ల తిమ్మాపురం, ముస్మి, దొరవారి తిమ్మాపురం గ్రామాలతో పాటు ఏజెన్సీలోని 10 గ్రామాలకు రాకపోకలు బంద్ అవుతాయి. ►నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంత మండలం ముల్గర నుంచి కల్వకుర్తికి వెళ్లాలంటే దుందభివాగు దాటాలి. అమ్రాబాద్ మండలం కుమ్మరంపల్లి నుంచి సమీప ఆస్పత్రికి వెళ్లాలంటే మధ్యలో ఉన్న మందవాగు దాటాలి. ►భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని మేడికుంట–మిట్టపల్లి మధ్య మస్మివాగు, రాఘబోయినగూడెం చెరువు అలుగు పడి ముల్కలపల్లి, బోటితండా మధ్య, ఇల్లెందు, తొడిదెలగూడెం మ«ధ్య చెరువు అలుగు పడటంతో పరిసర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతా యి. టేకులపల్లి మండలం రోళ్లపాడు, మురుట్ల, సాయ మ్మ, గడ్డిచెరువు ముర్రేడు వాగుల్లోకి వరద నీరు భారీగా చేరి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ముత్యాలంపాడు, తావుర్యాతండా, రాజుతండా, జండాలతండా, పెట్రాంచెలక సమీపంలోని వాగుల ఉధృతితో ఈ గ్రామాల రాకపోకలకు బ్రేక్ పడింది. సోములగూడెం, బిక్కుతండాపై లో లెవల్ బ్రిడ్జి ఉంది. బూడిదవాగు పొంగితే బ్రిడ్జిపై రాకపోకలు స్తంభిస్తాయి. గుండాల మండలంలో కిన్నెరసాని వాగుపై ఉన్న లో లెవల్ చప్టాల కారణంగా వర్షాలు కురిసినప్పుడు పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. అశ్వాపురం–గొందిగూడెం ప్రధాన రహదారిపై ఉన్న లో లెవెల్ బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహిస్తే గొందిగూడెం, గొందిగూడెం కొత్తూరు, ఎలకలగూడెం, మనుబోతులగూడెం గ్రామ పంచాయతీల్లోని 8 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ►ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం రిమ్మ, తుమ్మపహాడ్, సిరికొండ, రాజులగూడ, నారాయణపూర్ గ్రామా లు. నేరేడుగండి, ఇంద్రవెల్లి, నార్నూరు, గాదిగూడ, ఉట్నూరు, బజార్హత్నూర్, బోథ్ మండలాల్లోని 36 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. ►ములుగు జిల్లాలో వాజేడు మండలంలో కొంగలవాగుల దాటితే పెనుగోడు గ్రామానికి, చాకలివాగు దాటితే వాజేడు మండల కేంద్రానికి వెళ్తారు. కన్నాయిగూడెం మండలం ఐలాపూర్, వెంకటాపురం–కె మండలంలో కర్రవానిగుంపు, మల్లారం గ్రామాలకు వెళ్లాంటే మద్యంలో కంకలవాగును దాటివెళ్లాల్సి ఉంటుంది. ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని జలగవంచతో పాటు జిల్లావ్యాప్తంగా ఇరువై గ్రామాలకు వర్షాకాలం వస్తే రోడ్డు మార్గం కూడా ఉండదు. బయ్యారం–మొట్లతిమ్మాపురం మధ్యలో ఉన్న ఉడుము వాగును దాటుతున్న మహిళలు -
ఉత్తర బంగాళాఖాతంలో ఈనెల 11న అల్పపీడనం!
సాక్షి, అమరావతి: ఉత్తర బంగాళాఖాతంలో ఈనెల 11న అల్పపీడనం ఏర్పడే అవకాశం వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక నేడు(బుధవారం), రేపు( గురువారం) రాయలసీమలో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం వాతావరణ శాఖ పేర్కొంది. కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బుధవారం భారీ వర్షం కురిసింది. హుస్నాబాద్, అక్కన్నపేట, కొహెడ మండలాల్లో భారీ వాన పడింది. మేడ్చల్, సిరిసిల్ల, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో భారీ వర్షం కురవడంతో పలు రోడ్లు, లోతట్టు పాంతాల్లో వాన నీరు నిలిచింది. ఇక రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు రానున్న రెండు మూడు రోజుల్లో రాష్ట్రమంతటా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రానికి పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నట్లు తెలిపింది. ఈనెల 11న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే సూచించింది. ఈనెల 11 నుంచి 13 వరకు భారీ వర్షాలు నమోదవుతాయని, ఉత్తర, తూర్పు ప్రాంతంలోని జిల్లాల్లో అతిభారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలున్నాయని వివరించింది. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రాగల 48 గంటల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని వివరించింది. చదవండి: గ్రామీణ రోడ్లకు విరివిగా నిధులు విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్ -
సాధారణం కంటే అధిక వర్షపాతం
న్యూఢిల్లీ: దేశంలో నాలుగు నెలల వర్షాకాలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) బుధవారం ప్రకటించింది. వరుసగా రెండో ఏడాది మంచి వర్షాలు కురిశాయని తెలియజేసింది. ఈ ఏడాది కురిసిన వర్షం గత 30 ఏళ్లలో మూడో అతిపెద్ద వర్షపాతమని వెల్లడించింది. దేశంలో నాలుగు నెలల్లో సగటున(ఎల్పీఏ) 109 శాతం వర్షం కురిసింది. సాధారణం కంటే అధికంగా జూన్‌లో 118 శాతం, ఆగస్టులో 127, సెప్టెంబర్‌లో 104 శాతం వర్షం పడింది. జూలైలో మాత్రం కేవలం 90 శాతం వర్షం కురిసింది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు సగటున 95.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు జాతీయ వాతావరణ అంచనా కేంద్రం(ఎన్‌డబ్ల్యూఎఫ్‌సీ) శాస్త్రవేత్త ఆర్కే జెన్మానీ తెలిపారు. ఈసారి 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సాధారణ వర్షాలు కురిశాయి. 9 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బిహార్, గుజరాత్, మేఘాలయా, గోవా, తమిళనాడు, కర్ణాటక, లక్షద్వీప్‌లో సాధారణ కంటే అధిక వర్షాలు కురిశాయి. ఆగస్టులో ఎల్పీఏ 127గా నమోదైంది. గత 44 ఏళ్లలో ఒక నెలలో ఈ స్థాయిలో వర్షం పడడం ఇదే మొదటిసారి. 1976 ఆగస్టులో 128.4 ఎల్‌పీఎ నమోదైంది. రికార్డు స్థాయిలో పంటల సాగు భారత్‌లో వర్షాల సీజన్ జూన్ 1న మొదలై సెప్టెంబర్ 30న ముగుస్తుంది. దేశంలో వార్షిక వర్షపాతంలో 70 శాతం వర్షాలు నైరుతి రుతుపవనాల వల్లే కురుస్తాయి. దేశంలో ఈసారి మంచి వర్షాలు కురవడంతో రైతన్నలు రికార్డు స్థాయిలో గత వారం నాటికి 1,116.88 లక్షల హెక్టార్లలో పంటలు వేశారని కేంద్ర వ్యవసాయ శాఖ తెలియజేసింది. గత సంవత్సరం కేవలం 1,066.06 లక్షల హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయని గుర్తుచేసింది. -
11 రాష్టాల్లో వరదలు.. 868 మంది మృతి
న్యూఢిల్లీ : దేశంలో గత వారం రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. దీంతో జూలై చివర్లో నమోదైన వర్షపాత లోటును తుడిచిపెట్టేలా విస్తృతంగా వానలు కురుస్తున్నాయి. నాలుగు నెలల సీజన్లో ఇప్పటివరకు నమోదైన వర్షపాతం దీర్ఘకాలిక సగటు కంటే అధికంగా 103% గా ఉంది. ఆగస్టు 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. దీని వల్ల పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గతనెలలో కురిసిన వర్షాలతో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షభీబత్సం చాలామందిని బలిగొన్న సంగతి తెలిసిందే. కేరళలోనూ భారీ వర్షం కారణంగా కొండ చరియలు విరిగిపడి 55 మంది మరణించారు. (19న మరో అల్ప పీడనం: వాతావరణ శాఖ) ఆగస్టు 12 నాటికి దేశంలోని 11 రాష్ర్టాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా 868 మంది ప్రాణాలు కోల్పోయారని మంత్రిత్వ శాఖ నివేదికలో వెల్లడించింది. గత ఏడాది ఇదే సీజన్లో 908 మంది చనిపోయారు. ఈ సంవత్సరం కూడా అసాధారణమైన వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జైపూర్ లోని ఓ ప్రాంతంలో కేవలం ఆరు గంటల సమయంలోనే 25 సెం.మీ. వర్షం నమోదవగా , గత 24 గంటల్లో రాజస్తాన్,ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ రాష్ర్టాల్లో భారీ వర్షాలు నమోదైనట్లు వాతావరణ శాఖ సీనియర్ శాస్త్రవేత్త ఆర్.కె. జెనమణి అన్నారు.ఆగస్టు నెలలోనే ఇప్పటివరకు మూడు అల్పపీడనాలు ఏర్పడ్డాయి. హిమాలయాల నుంచి రుతుపవనాలు వేగంగా వీస్తున్నాయని దీంతో ఈశాన్య రాష్ర్టాల్లో భారీ వర్షాపాతం నమోదైనట్లు వెల్లడించారు. గత కొన్ని వారాలుగా ఉత్తర అరేబియా సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే క్రమంగా పెరుగుతున్నాయి. దీని వల్ల భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం సంభవించే అవకాశం ఉందని తెలిపారు. జూన్ నెలలో 17.6% మిగులు లోటు, జూలై 9.7% లోటు వర్షపాతం నమోదవగా, ఆగస్టులో అల్పపీడనంతో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ నివేదించింది. గత కొన్ని రోజులుగా అత్యధికంగా ఛత్తీస్‌గడ్‌లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. అక్కడి భోపాల్‌పట్నం, భైరామ్ఘర్లలో వరుసగా 22, 32 సెం.మీల వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతం నుంచి రుతుపవనాలు వేగంగా కదులుతున్నందున రాబోయే రెండు రోజుల్లో తుఫాను వచ్చే అవకాశం ఉందని అధికారులను అప్రమత్తం చేశారు. ఆగస్టు 18న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని దీని వల్ల రాజస్తాన్, ఉత్తరాఖండ్, పంజాబ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ, గోవా, ఛత్తీస్గడ్, మహారాష్ర్టలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆదివారం విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. (అలీగఢ్ బీజేపీ మాజీ మేయర్‌పై సంచలన ఆరోపణలు) -
భారీ వర్షాలకు 132 మంది మృతి
ఖాట్మండు : నేపాల్‌లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. ఎడతెరిపి లేని ఈ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. భారీ వర్షాల కారణంగా నేపాల్‌లో ఇప్పటి వరకు మరణించిన వారిసంఖ్య 132కు చేరుకోగా 128 మందికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. మరో 53 మంది గల్లంతయ్యారని తెలిపారు. ఒక్క మయాగ్డి ప్రాంతంలోనే 27 మంది మరణించినట్లు పేర్కొన్నారు. కొండచరియలు విరిగిపడటంతో పలు ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో వందలాది మంది ప్రజలు నిరాశ్రయులు కావడంతో స్థానిక పాఠశాల భవనాలు, కమ్యూనిటీ కేంద్రాల్లో తలదాచుకున్నారు. (నేపాల్ సంక్షోభం: మరోసారి వాయిదా పడ్డ సమావేశం ) శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని గుర్తిస్తున్నామని సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించామన్నారు. గల్లంతైన వారి జాడ కోసం అన్వేషిస్తున్నామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. టెరాయ్ ప్రాంతంలో అల్ప పీడనం కారణంగా భారీగా వర్షపాతం నమోదవుతుందని నేపాల్ వాతావరనణ విభాగం వెల్లడించింన సంగతి తెలిసిందే. లోతట్లు ప్రాంతాల్లోని ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను అప్రమత్తం చేసింది. వర్షాల కారణంగా నారాయణి సహా ఇతర ప్రధాన నదులు పొంగి పొర్లుతున్నాయి. కాగా పరిస్థితిపై సమీక్షిస్తున్న అధికారులు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. (‘చైనాను మార్చకుంటే అది మనల్ని మింగేస్తుంది’) Nepal: Flooding & landslide in parts of Nepal following heavy rainfall; visuals from Chitwan area. 132 people dead,128 injured, 53 missing&998 families affected due to rainfall, landslides&floods in the country as of 23rd July: Nepal Disaster Risk Reduction&Management Authority pic.twitter.com/X4yetUwBJW — ANI (@ANI) July 24, 2020 -
నేపాల్‌లో వర్షాలు: 60 మంది మృతి
ఖాట్మండు : నేపాల్‌లో గత నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడి మరణించిన వారి సంఖ్య 60కు చేరుకుంది. 41 మంది గల్లంతైనట్లు గుర్తించామని అధికారులు వెల్లడించారు. ఒక్క మయాగ్డి ప్రాంతంలోనే 27 మంది మరణించినట్లు పేర్కొన్నారు. కొండచరియలు విరిగిపడటంతో పలు ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో వందలాది మంది ప్రజలు నిరాశ్రయులు కావడంతో స్థానిక పాఠశాల భవనాలు, కమ్యూనిటీ కేంద్రాల్లో తలదాచుకున్నారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని గుర్తిస్తున్నామని సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించామని, మొదటి దశలో వారిని బయటికి తీయడానికి 30-35 గంటల సమయం పట్టిందని పేర్కొన్నారు. మరికొంత మంది జాడ కోసం అన్వేషిస్తున్నామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. (షాకింగ్ విషయాలు వెల్లడించిన యునెస్కో నివేదిక) కొండచరియలు విరిగిపడటంతో ఇళ్లు కూలి ఇప్పటికే వెయ్యిమందికి పైగా ప్రజలు నిరాశ్రయులు అయ్యారని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే భారీ వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని అక్కడి స్థానిక మీడియా నివేదించింది. వర్షాల కారణంగా నారాయణి సహా ఇతర ప్రధాన నదులు పొంగి పొర్లుతున్నాయి. దేశ వ్యాప్తంగా వారాంతంలో భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. టెరాయ్ ప్రాంతంలో అల్ప పీడనం కారణంగా భారీగా వర్షపాతం నమోదవుతుందని తాజా బులెటెన్‌లో వెల్లడించింది. (పాక్ కాదు.. చైనానే డేంజర్: శరద్ పవార్) -
నేపాల్‌లో భారీ వర్షాలు.. 22 మంది మృతి
ఖాట్మండు : నేపాల్‌లో గత 48 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడి చనిపోయిన వారిసంఖ్య 22కు చేరుకుంది. ముఖ్యంగా కస్కి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ జిల్లాలో ముగ్గురు పిల్లలతో సహా ఏడుగురు మరణించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. పోఖారా జిల్లా సారంగకాట్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున భారీ వర్షాలకు కొండచరియలు విరిగి నివాస స్థలాలపై పడడంతో చాలా ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా మరో 10 మంది గాయపడటంతో వారిని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. (విరిగిపడిన కొండచరియలు.. 12 మంది మృతి) గురువారం రాత్రి రెండు వేర్వేరు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. లాంజంగ్ జిల్లా బెసిషాహర్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. మయాగ్డి జిల్లాలో కొండచరియలు విరిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోగా జజార్కోట్ జిల్లాలో ఏడుగురి మృతదేహాలను వెలికితీసినట్టు మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. చాలామంది వాటికింద చిక్కుకుపోయినట్లు గుర్తించిన అధికారులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. అన్ని ప్రాంతాల్లో కలిపి ఇప్పటివరకు 44 మంది గల్లంతైనట్లు గుర్తించామని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నేపాల్ అధికారులు అంచనా వేశారు. ఆగకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నారాయణి సహా ఇతర ప్రధాన నదులు పొంగి పొర్లుతున్నాయి. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. -
కేరళకు నైరుతి, ఏపీలో మోస్తరు వర్షాలు
సాక్షి, విజయవాడ: నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించడంతో ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని విజయవాడ వాతావరణ కేంద్రం సూచించంది. కాగా దక్షిణ అరేబియా సముద్రం, లక్షద్వీప్ దీవులు, మాల్దీవులు, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌లోని కొన్ని ప్రాంతాలు, కోమోరిన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం: రానున్న మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గంటకు 30 నుంచి 40 కిలో మీటర్లు)తో ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గంటకు 30 నుంచి 40కిలోమీటర్లు)తో దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీ సెల్సియస్ నుంచి 43 డిగ్రీ సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమ: సోమవారం ఉరుములు, మెరుపులుతో రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమలో అక్కడక్కడ గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీ సెల్సియస్ నుంచి 43 డిగ్రీ సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. రేపు ఉరుములు, మెరుపులుతో రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. -
రాగల 24 గంటల్లో కేరళలోకి రుతుపవనాలు
సాక్షి,హైదరాబాద్: తీవ్రమైన ఎండ దాటకి ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు నేడు కురిసిన వర్షం కాస్త ఉపశమనం ఇచ్చింది. రాగల 24 గంటల్లో కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది. చత్తీస్‌గఢ్ నుంచి లక్షదీవులు, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక, కేరళ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుందని పేర్కొంది. దక్షిణ, కోస్తా ఆంధ్రలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర పేర్కొంది. తెలంగాణలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర వెల్లడించింది. -
వచ్చే 3 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాగల 24 గంటల్లో మాల్దీవులు, కోమోరిన్‌లోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ – నికోబార్ దీవుల్లో మిగిలిన ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఆగ్నేయ అరేబియా సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రం ప్రాంతాల్లో ఈ నెల 31న అల్పపీడనం ఏర్పడవచ్చునని తెలిపింది. దీని ప్రభావం వల్ల జూన్ 1న కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు వెల్లడించారు. మరోవైపు పశ్చిమ మధ్య అరేబియా సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న నైరుతి అరేబియా సముద్రం ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల పశ్చిమ మధ్య అరేబియా సముద్ర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందన్నారు. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పియర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని ఆయన తెలిపారు. ఇది మరింత బలపడి రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. అలాగే రాగల 72 గంటల్లో ఇది వాయవ్య దిశగా దక్షిణ ఒమన్, తూర్పు యెమెన్ తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉందన్నారు. ఇక విదర్భ నుంచి ఇంటీరియర్ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితలద్రోణి కొనసాగుతోందని రాజారావు తెలిపారు. వచ్చే 3 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు రాగల మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతోపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని రాజారావు వెల్లడించారు. శుక్రవారం ఆదిలాబాద్, కొమురంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, జనగామ, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ వడగాడ్పులు వీచే అవకాశం ఉందని చెప్పారు. -
జూన్ 5న నైరుతి రుతుపవనాల రాక
సాక్షి, న్యూఢిల్లీ: కేరళకు నైరుతి రుతపవనాలు ఈ ఏడాది నాలుగైదు రోజులు ఆలస్యంగా ప్రవేశించనున్నాయి. జూన్ 5న నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణంగా జూన్ 1వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు రావాల్సి ఉండగా, ఈ ఏడాది కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధముగా మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది రాగల 12 గంటలలో అదే ప్రాంతంలో వాయుగుండముగా మారే అవకాశం ఉంది. ఇది మరింత బలపడి దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతములో మే 16 వ తేదీ సాయంత్రానికి తుఫానుగా మారే అవకాశం ఉంది. ఇది ప్రారంభంలో మే 17 వ తేదీ వరకు వాయువ్య దిశగా ప్రయాణించి, తరువాత మే 18 నుండి 20 వ తేదీలలో ఉత్తర ఈశాన్య దిశగా ఉత్తర బంగాళాఖాతం వైపు ప్రయాణించే అవకాశం ఉంది. రాగల 48 గంటలలో ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం మరియు నికోబార్ దీవులలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఇవాళ (శుక్రవారం) ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. శనివారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40 కిలో) తో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40కిలోమీటర్ల) తో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. -
మాన్సూన్... మారింది సీన్
తొలకరి చినుకులలో కాసేపు తడవడానికి ఎంతగా తహతహలాడతామో... కాస్త వర్షాలు ముదరగానే పనులెక్కడ కావోనని అంతగా భయపడతాం. పనులుంటేనే బయటకు కదలడానికి భయపెట్టే రుతుపవనాల సీజన్లో జాలీగా జర్నీ చేసే సరదా ఉంటుందా? అంటే ఉండడమే కాదు ఆ సరదా పెరుగుతోంది కూడా అంటున్నారు ట్రావెల్ ఎక్స్పర్ట్స్. సాక్షి, సిటీబ్యూరో:సాధారణంగా రుతుపవనాల సమయంలో ట్రెక్కర్స్, అడ్వంచర్ యాత్రికులు మాత్రమే తప్ప సాధారణ టూరిస్ట్‌ల సంఖ్య ఎక్కువ ఉండదనేది ట్రావెల్ సంస్థల అంచనా. అయితే గత కొంతకాలంగా వారి ఆ అంచనా తిరగబడిందని, ఈసారి 70 శాతం ట్రావెల్ ఎంక్వయిరీలు సాధారణ పర్యాటకుల నుంచే వచ్చాయని ట్రావెల్ సంస్థలు వెల్లడించాయి. గత కొంత కాలంగా ఉన్న ఈ ట్రెండ్ ఈ సారి మరింత స్పష్టంగా కనిపించిందని, గత ఏడాది కంటే సాధారణ పర్యాటకుల సంఖ్య 20 శాతం పెరిగిందని అంటున్నాయి. వర్షాల వల్ల వచ్చే ఇబ్బందులకు ఇప్పుడు అత్యాధునికమైన అన్ని రకాల పరిష్కారాలు అందుబాటులో ఉండడమే దీనికి కారణమని అంటున్న వీరు వెల్లడించిన మరికొన్ని విశేషాలు... ఎంచుకుంటున్నారిలా... ఈ సీజన్లో ట్రావెలర్స్ ప్రధానంగా రిసార్ట్స్‌కు దగ్గరలో ఉండే బీచ్ వెకేషన్స్, స్టేకేషన్స్, కొండ ప్రాంతాలకు సమీపంలోని జలపాతాలు, వీటితో పాటుగా మంచి ఆహారం ఉన్న ప్లేస్‌లనే ఎంచుకుంటున్నారు. మహారాష్ట్రలోని లోనోవాలా, సిల్వస్సా, లావాసా, సాప్యుటరా, మహాబలేశ్వర్, దమన్, నాసిక్‌లు ఈ సీజన్లో ఎక్కువ మంది ఎంచుకునే స్టేకేషన్స్గా వృద్ధి చెందుతున్నాయి. అలాగే ముస్సోరి, నైనిటాల్ వంటి హిల్ స్టేషన్లు ఎంచుకుంటున్నారు. జైసల్మీర్, జైపూర్, బికనీర్, జోథ్‌పూర్, ఉదయ్‌పూర్... వైపుగా రోడ్ ట్రిప్స్ నడుస్తున్నాయి. అడ్వంచరిస్టులు ఢిల్లీ టు లడఖ్‌కి బాగా రాకపోకలు సాగిస్తున్నారు. తీవ్రమైన వర్షపాతాన్ని ఆస్వాదించేవాళ్లు డార్జిలింగ్, అస్సాం, మేఘాలయ వంటి పచ్చని, పర్యావరణహిత వాతావరణాన్ని ఆస్వాదించడానికి. మాన్సూన్ ట్రావెలర్స్‌కు ప్రియమైనవిగా మున్నార్, వాయనాడ్, తెక్కడి, కూర్గ్, కబిని ప్రాంతాలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. అయితే వీటిలో దేశంలోని ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతానికి దగ్గర్లో ఉన్న వాటినే ఎంచుకుంటున్నారు. మాన్సూన్ ట్రావెలింగ్ పెరిగింది... గతంతో పోలిస్తే వర్షాల సమయంలో ప్రయాణాలు చేసేవారు బాగా పెరిగారు. మాకు వస్తున్న ఎంక్వయిరీల్లో అత్యధిక భాగం ఫ్యామిలీ సెగ్మెంట్‌వే కావడం విశేషం. – కరణ్ ఆనంద్, కాక్స్ అండ్ కింగ్స్ -
వదలని వాన.. 43 మంది మృతి..!
పట్నా : గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పొరుగు దేశం నేపాల్ అతలాకుతలమైంది. నదుల్లో వరద పొంగిపొర్లడంతో కొండప్రాంతాల్లోని ప్రజలకు తీవ్ర ముప్పు నెలకొంది. ఇప్పటికే అక్కడ 43 మంది వరదల్లో చిక్కుకుని మృతి చెందగా.. మరో 24 మంది గల్లంతయినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. లలిత్పూర్, ఖోతంగ్, భోజ్‌పూర్, కావ్రే, మాక్వాన్‌పూర్, సిందూలి, ధాదింగ్ ప్రాంతాల్లో ప్రాణనష్టం ఎక్కువగా జరిగినట్టు తెలుస్తోంది. ఇక ఎడతెగని వర్షాల కారణంగా నేపాల్ సరిహద్దు రాష్ట్రమైన బిహార్‌లోని 6 జిల్లాలు వరదమయమయ్యాయి. సుపాల్, మజఫర్‌పూర్, తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్, అరారియా, కిషన్ గంజ్ జిలాల్లోలోని ప్రజల్ని స్థానిక యంత్రాంగం, జాతీయ విపత్తు సహాయక బృందాలు (ఎన్డీఆర్ఎఫ్) సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఆదివారం కూడా నేపాల్‌లో ఓ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు వాతావరణశాఖ తెలిపింది. భారీ వర్షాలు, వరదల కారణంగా కోషి, గండక్, బుది గండక్, గంగ, భాగమతి నదుల్లో వరద ఉధృతి పెరిగినట్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని, ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని బిహార్ సీఎం నితీష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. -
కోస్తాంధ్రలో మూడు రోజుల పాటు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు కోస్తాంధ్రపై సాధారణంగా ప్రభావం చూపుతున్నాయి. రాయలసీమలో బలహీనంగా ఉన్నాయి. మరోవైపు వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 3.1 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో దక్షిణం దిశగా ఆవరించి ఉంది. వీటి ఫలితంగా రానున్న మూడు రోజులు కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం రాత్రి నివేదికలో తెలిపింది. శనివారం కోస్తాంధ్రలో అనేక ప్రాంతాల్లో మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. నైరుతి దిశ నుంచి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సూచించారు. గడచిన 24 గంటల్లో కోస్తాంధ్రలో అనేక చోట్ల వర్షాలు కురిశాయి. అమలాపురంలో 7, భీమవరంలో 4, హోలగుండలో 2, తుని, కొయ్యలగూడెం, కంభం, బెస్తవారిపేట, తిరువూరు, పొదిలి, అర్థవీడు, వీరఘట్టం, పోలవరం, గరుగుబిల్లి, పార్వతీపురంల్లో ఒక్కో సెంటీమీటరు వర్షం కురిసింది. -
సర్పగండం
సాక్షి, విజయనగరం : వర్షాకాలం మొదలవడంతోనే పాముల సంచారం పెరిగింది. ఇప్పటికే జిల్లాలో అనేక మంది పాముకాటుకు గురయ్యారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు రాత్రి వేళల్లో పంటలకు నీరు పెట్టేందుకు వెళ్లి విష సర్పాల కాటుకు గురివుతుంటారు. పంట పొలాల్లోనే ఎక్కువ సాధారణంగా నిర్జన ప్రదేశాలను ఎక్కువగా ఇష్టపడే పాములు ఆహారం కోసం జనారణ్యంలోకి చొచ్చుకొస్తున్నాయి. చెత్తా చెదారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, పాడు బడిన భవన శిధిలాలు, పూరి గుడిసెలు, గుబురుగా ఉండే పంటచేలల్లో ఎక్కువగా నివసిస్తున్నాయి. ఎలుకలు, కప్పలను ఎక్కువగా ఇష్టపడే పాములు పొలాల్లో రాత్రి పూట సంచరిస్తూ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రక్త పింజర ఇది అటవీ ప్రాంతంలో ఎక్కువుగా సంచరిస్తూ ఉంటుంది. ఇది కాటేసిన రెండు గంటల తర్వాత విషం శరీరంలోకి ఎక్కుతుంది. ఈ పాము కాటేసిన వెంటనే విషాన్ని తొలగించేందుకు వెంటనే ప్రాథమిక చికిత్స చేయాలి. కట్ల పాము ఈ పాము కరిచిన వెంటనే విషం రక్తంలో కలుస్తుంది. ప్రాణాపాయం ఎక్కువ. విషం రక్తంలోకి చేరకముందే చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంది. రాత్రి వేళ జాగ్రత్త జిల్లాలో వరి, మొక్కజొన్న, చెరుకు, అరటి, చోడి, కూరగాయలు, మిరప తదితర పంటలను రైతులు సాగు చేశారు. రైతులు రాత్రి పూట పొలాల్లో నీరు పెట్టడానికి వెళ్లి పాముకాటుకు గురివుతున్నారు. జనవరి నెల నుంచి జూన్ నెల వరకు 414 పాముకాటుకు గురయ్యారు. అవగాహనతోనే ప్రాణ రక్షణ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులకు పాములపై కనీస అవగాహన అవసరమని వైద్యులు అంటున్నారు. కనిపించే పాములన్నీ విషపూరితం కాదు. కట్ల పాము, తాచు పాము, రక్తపింజర, నాగుపాము వంటి 15 శాతం పాములతోనే ముప్పు ఉంది. సరైన సమయంలో చికిత్స పొందితే విషసర్పం కరిచినా ప్రాణాపాయం ఉండదు. జాగ్రత్తలు తప్పనిసరి రాత్రి వేళ పొలాలకు వెళ్లేటప్పుడు చెప్పులు, టార్చిలైట్లతో పాటు శబ్ధం చేసే పరికరాలను వెంట తీసుకుని వెళ్లడం మంచిది. పాముకాటుకు గురైన వారు ఎలాంటి ఆందోళనకు గురికావలసిన అవసరం లేదు. తీవ్ర ఒత్తిడికి గురైతే రక్తపోటు పెరగడంతో పాటు గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. పసర వైద్యం, మంత్రాలు అంటూ అలసత్వం వహిస్తే ప్రాణాలకే ప్రమాదం. పాముకాటు వేయగానే పైభాగం గుడ్డతో కట్టాలి. కాటు వేసిన భాగాన్ని కొత్త బ్లేడుతో గాటు వేసి రక్తాన్ని నోటితో లాగేయాలి. నోటి గాయాలున్న వారు ఇలా చేయకూడదు. ప్రాథమిక వైద్యం అందించిన వెంటనే ఆస్పత్రికి తీసుకుని వెళ్లాలి. కరిచిన పాము ఏదో తెలుసుకుంటే చికిత్స అందించడం సులభం అవుతుంది. ఆందోళన వద్దు పాముకాటు వేస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అప్రమత్తంగా ఉంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. అన్ని పీహెచ్‌సీల్లో యాంటీ వీనమ్ మందు అందుబాటులో ఉంది. రైతులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పాముకాటు వేసిన వెంటనే వీలైనంత తొందరగా ఆస్పత్రికి తీసుకుని రావాలి. – బోళం పద్మావతి, జనరల్ ఫిజిషియన్, కేంద్రాస్పత్రి -
భారీగా తగ్గిన ఆహార ధాన్యాల దిగుబడి
సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్రలోని మరాఠ్వాడలో జూన్ ఐదవ తేదీన జల్లులు కురియడంతో తొలకరి జల్లులంటూ స్థానిక పత్రికలన్నీ పెద్ద పెద్ద హెడ్డింగ్లతో వార్తను రాశాయి. 2017, ఆగస్టు 17వ తేదీ తర్వాత వర్షపు జల్లులు చూడడం వారు ఇదే మొదటి సారి. 2016 సంవత్సరం తర్వాత ఎప్పుడు భారీ వర్షాలు కురిశాయో మాత్రం అక్కడి ప్రజలకు గుర్తు కూడా లేదు. ఈసారి వర్షాలు పడకపోతే పంటను వదులుకోవాలని రైతులు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఆహార ధాన్యాల దిగుబడి కూడా బాగా పడిపోయింది. 2018 చలికాలపు ఆహార ధాన్యాల దిగుబడి గతేడాదితో పోలిస్తే 63 శాతం పడిపోయింది. చిరుధాన్యాలు 68 శాతం, పప్పులు 51 శాతం, నూనె గింజలు 70 శాతం, గోధుమ 61 శాతం, మొక్కజొన్నలు 75 శాతం, నువ్వుల దిగుబడి 92 శాతం పడిపోయాయి. ఈసారి దిగుబడుల గురించి ప్రశ్నించగా, పంటలు వేసే పరిస్థితులేవంటుంటే ఇంక దిగుబడులు ఎలా ఉంటాయని మెట్టసాగు వ్యవసాయంలో ఆరితేరిన కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి విజయ్ అన్నా బరేడ్ వ్యాఖ్యానించారు. ఒక్క మరాఠ్వాడలోనే కాకుండా, విదర్భ, తెలంగాణలో కూడా ఈ సారి మెట్టసాగుపై రైతులు ఆశలు వదులుకున్నారు. గతంలో రుతుపవనాల కాలంలో వర్షపాతం 80 నుంచి 90 శాతం వర్షం కురిసేదని, వాతావరణ మార్పుల కారణాల వల్ల వర్షాలు తగ్గుముఖం పట్టాయని స్థానిక శాస్త్రవేత్తలు తెలిపారు. -
2,3 తడులతో సరిపోయేలా..
సాక్షి, హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు ఆలస్యం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళికపై దృష్టి సారించింది. ఒకవేళ రుతుపవనాలు ఈ మూడు, నాలుగు రోజుల్లో వచ్చినా, ఆ తర్వాత వర్షపాతం అనుకున్నస్థాయిలో నమోదు కాకపోయినా తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు ముమ్మరం చేసింది. రైతులతో ఎటువంటి పంటలు సాగు చేయించాలనే దిశగా వ్యవసాయశాఖ ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేసింది. మరో రెండు, మూడు రోజులు వేచి చూసి ఈ ప్రణాళిక విడుదల చేయనున్నట్లు తెలిసింది. స్వల్పకాలిక రకాలైన విత్తనాలను కూడా వ్యవసాయ శాఖ సిద్ధంగా పెట్టుకుంది. ఈ నెల 23 వరకు రాష్ట్రానికి నైరుతి చేరుకునే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఇప్పటికే ప్రకటించారు. జయశంకర్ వ్యవసాయ వర్సిటీ, జాతీయ మెట్ట పంటల పరిశోధనల సంస్థ, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా కలిసి విడతల వారీ ప్రణాళికను సిద్ధం చేసుకున్నాయి. మరోవైపు నైరుతి రుతుపవనాలు ఆలస్యం, రాష్ట్రంలోని పంటల సాగు పరిస్థితిపై జయశంకర్ వర్సిటీ శాస్త్రవేత్తలు, అధికారుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నివేదికలు తెప్పించుకున్నట్లు తెలిసింది. వానల రాకలో ఏం తేడా వచ్చినా వెంటనే ప్రత్యామ్నాయం వైపు మళ్లే విధంగా సిద్ధంగా ఉండాలని అధికారులకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఎలాంటి పంటలు సాగు చేయాలనే దానిపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. తక్కువ నీటితో పంటల సాగు... నైరుతి రుతుపవనాలు సాధారణంగా ఈ నెల 8వ తేదీన రా>ష్ట్రంలోకి ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించినా ఇప్పటివరకు వాటి జాడలేదు. ఈ నెల 22 లేదా 23వ తేదీన వస్తాయని ప్రకటించారు. ఆ తేదీల్లోగా వచ్చినా రాకున్నా ఇప్పటికే రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతులు లక్షల ఎకరాల్లో విత్తనాలు ఇప్పటికే చల్లాల్సి ఉండగా, వేలాది ఎకరాల్లో కూడా వేయలేకపోయారు. ఆ మధ్య ఆదిలాబాద్సహా అక్కడక్కడా పత్తి విత్తనాలు వేసినా, చినుకు పడక వేడికి అవి భూమిలోనే మాడిపోయాయి. జూన్‌లో సాధారణం కంటే 60 నుంచి 70 శాతం తక్కువ వర్షపాతం నమోదయ్యే పరిస్థితి నెలకొంది. వాస్తవంగా ఈ నెల 20 నాటికి వరి నార్లు పోసుకోవాల్సి ఉండగా ఎక్కడా ఆ ఊసు లేదు. ఖరీఫ్‌లో 7.50 లక్షల మెట్రిక్ టన్నుల విత్తనాల పంపిణీ లక్ష్యంగా ఉంది. ఇందులో ఇప్పటివరకు 1.85 లక్షల క్వింటాళ్ల విత్తనాలు మాత్రమే విక్రయించినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇందులో వరి ఈసారి 2.80 లక్షల విత్తనాల పంపిణీ లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 31 వేల క్వింటాళ్లు మాత్రమే అమ్ముడుపోయాయి. సోయాబీన్ 2 లక్షల క్వింటాళ్లకుగాను 85 వేల క్వింటాళ్లు విక్రయించారు. మొక్కజొన్న 80 వేల క్వింటాళ్లకుగాను ఒక క్వింటా కూడా రైతులు కొనుగోలు చేయలేదు. ఈ ఖరీఫ్‌లో రాష్ట్రవ్యాప్తంగా 1.10 కోట్ల ఎకరాలలో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ ముందుగా అంచనా వేసింది. అయితే, నైరుతి ఆలస్యంతో దీనిని తగ్గించనున్నారు. వర్షధార పంటల్లో కూడా చాలా తక్కువనీటితో రెండు, మూడు తడులు ఇస్తే పండే పంటల వైపు రైతులను మళ్లించనున్నారు. వర్షాలు ఆలస్యం అవుతుండటంతో పత్తి సాగు తగ్గించడం, ఈ పంటను నల్ల నేలలకే పరిమితం చేయడం వంటివి ప్రత్యామ్నాయ ప్లాన్‌లో భాగంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎక్కువ నీటి అవసరంలేని మొక్కజొన్న, జొన్న, కంది, సోయాబీన్ సాగును ప్రోత్సహించనున్నారు. ఇందులో స్వల్పకాలిక రకాల విత్తనాలు వ్యవసాయశాఖ, విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రైతులకు అందుబాటులో ఉంచనుంది. మొక్కజొన్న, పత్తి, సోయాచిక్కుడు జూలై 15 వరకు విత్తుకోవచ్చని వ్యవసాయవర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. కంది జూలై 31 వరకు, పెసర, జొన్న జూన్ 30 వరకు, మధ్యకాలిక రకాలతో వరి నారు పోసుకోవడానికి జూలై 10, స్వల్పకాలిక రకాలకు జూలై 31 వరకు అవకాశముంది. వర్షాభావ పరిస్థితుల్లో ఎరువుల వాడకంపై, నీటి ఆదాపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. మూడు, నాలుగు రోజుల్లో అల్పపీడనం... కోస్తాంధ్ర తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రాగల 3, 4 రోజుల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో బుధ, గురువారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
900 ఏళ్ల నాడు అలా జరిగినందువల్లే..
ఖరగ్‌పూర్ : ప్రపంచంలోనే గొప్ప నాగరికతగా భాసిల్లిన సింధునాగరికత అంతరించడానికి గల కారణాన్ని ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 900 ఏళ్లపాటు కొనసాగిన కరువు కారణంగానే 4,350 ఏళ్లక్రితం సింధు నాగరికత తుడిచిపెట్టుకు పోయిందని తెలిపారు. రుతుపవనాలు ఆలస్యంగా రావడం వల్ల కరువు వచ్చిందని.. కొన్నేళ్ల తర్వాత తీవ్ర రూపం దాల్చడంతో ప్రజలు అక్కడి నుంచి మైదానాలకు వలస వెళ్లారని భౌగోళిక శాస్త్ర ప్రొఫెసర్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. వీరంతా గంగా యమునా లోయ గుండా ప్రయాణిస్తూ ఉత్తరప్రదేశ్, బీహార్, తూర్పు బెంగాల్, దక్షిణ వింధ్యాచల్, దక్షిణ గుజరాత్‌కు చేరుకున్నారన్నారు. ఇందుకు గల ఆధారాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. జియోలజీ, జియోఫిజిక్స్ డిపార్ట్మెంట్కు చెందిన పరిశోధకులు.. రుతుపవనాలు సకాలంలో రాకపోవడం వల్ల 5 వేల ఏళ్ల క్రితం వాయువ్య హియాలయాల్లో వర్షభావ పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. దీని వల్ల నదులు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని క్రమంగా అది కరువుకు దారితీసిందని తెలిపారు. ఈ పరిస్థితి 9 వందల ఏళ్ల పాటు కొనసాగడం వల్ల అప్పటివరకు సిరిసంపదలతో వర్థిల్లిన సింధు నాగరికత వైభవం కోల్పోయిందని నివేదికలో పేర్కొన్నారు. వారి పరిశోధనకు ఆధారాలుగా లడఖ్‌లోని మోరిరి సరస్సుకు సంబంధించిన 5 వేల సంవత్సరాల రుతుపవన, శీతోష్ణస్థితి మార్పుల పట్టికను ఐఐటీ బృందం జతచేసింది. -
విస్తారంగా వర్షాలు
- కోసిగిలో అత్యధికంగా 88.6 మి.మీ. వర్షపాతం - జిల్లా సగటున 38.8 మి.మీ. నమోదు - ఉల్లికి అపార నష్టం - గణేష్ నిమజ్జనానికి తొలగిన నీటి అడ్డంకులు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా వ్యాప్తంగా వర్షాలు ఊపందుకున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం రాత్రి వరకు విస్తారంగా కురిశాయి. అత్యధికంగా కోసిగిలో 88.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. అతి తక్కువగా కొలిమిగుండ్ల, చిప్పగిరి మండలాల్లో సెం.మీ. ప్రకారం నమోదు కాగా శ్రీశైలం మండలంలో అసలు నమోదు కాలేదు. ఒక్క రోజులోనే జిల్లా వ్యాప్తంగా 38.8 మి.మీ. నమోదు కావడం విశేషం. ఇటీవలి వరకు ఒక మోస్తరు వర్షాలకే పరిమితమైన రుతుపవనాలు బంగాళాఖాతంలో అల్పపీడనం తోడుకావడంతో జోరందుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడంతో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. ఫలితంగా గణేష్ నిమజ్జనానికి నీటి సమస్య తీరినట్లయింది. ఉల్లి రైతు గగ్గోలు... కర్నూలు, ఆదోని రెవెన్యూ డివిజన్లో కోత దశలో ఉన్న ఉల్లికి ప్రస్తుత వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వందల హెక్టార్లలో పంట నీట మునిగింది. వర్షాలు వల్ల ఉల్లి తడుస్తుండటం వల్ల నాణ్యత తగ్గి ధరలు తగ్గిపోతుండటంతో రైతుల ఆందోళన చెందుతున్నారు. కొసిగి, గోనెగండ్ల, నందవరం, ఎమ్మిగనూరు తదితర మండలాల్లో భారీ వర్షాలకు పత్తి పంట నీట మునిగింది. ఆగస్టు సాధారణ వర్షపాతం 135 మి.మీ. ఉండగా ఇప్పటి వరకు 163.7 మి.మీ. వర్షపాతం నమోదైంది. -
వర్షించిన ఆశలు
జిల్లాలో భారీ వర్షం - ఆస్పరిలో అత్యధికంగా 77 మి.మీ., వర్షపాతం - ముమ్మరంగా ఖరీఫ్ పనులు కర్నూలు(అగ్రికల్చర్): నైరుతి రుతపవనాల ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో ఖరీఫ్ సీజన్ ఆశాజనకంగా సాగుతోంది. కరువు కోరల్లో చిక్కుకొని అల్లాడుతున్న రైతులకు వర్షాలు ఊరటనిస్తున్నాయి. ఖరీఫ్ ఆరంభం నుంచే వర్షాలు పడుతుండటంతో సకాలంలో విత్తనం వేసుకునే అవకాశం లభించింది. గురువారం రాత్రి నుంచి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఉదయం వరకు అత్యధికంగా ఆస్పరిలో 77 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. హాలహర్వి, తుగ్గలి, శ్రీశైలం మండలాలు మినహా జిల్లాలోని ఆన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి అతి భారీ వర్షం కురిసింది. ఆస్పరి, ఆదోని, కౌతాళం, నందవరం మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. గడివేముల, వెలుగోడు, ఆత్మకూరు, కోడుమూరు, వెల్దుర్తి, హొళగుంద, చిప్పగిరి, మద్దికెర మండలాల్లో తేలికపాటి వర్షాలు పడగా.. మిగిలిన అన్ని మండలాల్లోనూ వర్షాలు ఆశాజనకంగా ఉన్నాయి. 29 మండలాల్లో 10 మి.మీ.,కు పైగా వర్షపాతం నమోదయింది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు జిల్లా మొత్తం మీద సగటున 18 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జూన్ నెల సాధారణ వర్షపాతం 77.2 మి.మీ., ఉండగా 16 రోజుల్లోనే 71.7 మి.మీ., వర్షపాతం నమోదయింది. దాదాపు అన్ని మండలాల్లో వర్షాలు పడటంతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఉక్కిరిబిక్కిరి చేసిన నీటి సమస్య ఇప్పుడిప్పుడే పరిష్కారం అవుతోంది. వర్షాల రాకతో పత్తి, ఆముదం, కంది విత్తనం పనులు ఊపందుకున్నాయి. కర్నూలు, ఆదోని డివిజన్లలో పత్తి సాగు ముమ్మరంగా సాగుతోంది. కాగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి కర్నూలు, కల్లూరు సహా వివిధ మండలాల్లో వర్షం కురిసింది. గ్రామాల్లో నకిలీ బీటి పత్తి విత్తనాలదే హవా వర్షాలు ఆశాజనకంగా పడుతుండటంతో నకిలీ విత్తనాలు గ్రామాల్లో వెల్లువెత్తుతున్నాయి. సకాలంలో వర్షాలు పడటం, పత్తి సాగు భారీగా పెరిగే అవకాశం ఉండటంతో నకిలీలకు రెక్కలొచ్చాయి. ఈ ఏడాది 3 లక్షలకు పైగా హెక్టార్లలో పత్తి సాగు అయ్యే అవకాశం ఉంది. గుంటూరు ప్రాంతానికి చెందిన కొందరు జిల్లాలో తిష్టవేసి నకిలీలను మార్కెట్లోకి విస్తరింపచేస్తున్నట్లు తెలుస్తోంది. గద్వాల ప్రాంతానికి చెందిన కొందరు గ్రామాల్లో పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలను రైతులకు అంటగడుతున్నట్లు సమాచారం. ఎమ్మిగనూరు, ఆదోని, పత్తికొండ, మంత్రాలయం, దేవనకొండ, కోడుమూరు, సి.బెళగల్, ఆస్పరి తదితర మండలాల్లో నకిలీ బిటీ విత్తనాల వ్యాపారం జోరుగా సాగుతోంది. జిల్లాలోని వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం మండలం వర్షపాతం(మిల్లీమీటర్లలో) ఆస్పరి 77 ఆదోని 51.2 కౌతాళం 46.4 నందవరం 44 కోసిగి 43.4 శిరువెళ్ల 39.4 కల్లూరు 37.6 కర్నూలు 36.4 మహనంది 36.2 బండిఆత్మకూరు 34.2 సంజామల 34.2 డోన్ 32.2 చాగలమర్రి 31.2 నంద్యాల 30 -
రానున్న మూడు రోజులు వర్షాలే వర్షాలు!
విశాఖపట్నం: బంగాళాఖాతం సముద్రంలో ఏర్పడిన వాయుగుండం ఊపుతో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో తెలంగాణ, రాయలసీమ, దక్షిణ కోస్తాకు రుతుపవనాలు విస్తరించాయి. ఉత్తర కోస్తాలోని నర్సాపూర్ వరకు రుతుపవనాలు విస్తరించాయని వాతావరణశాఖ తెలిపింది. రుతుపవనాలు వేగంగా విస్తరించడంతో ఉష్ణోగ్రతలు తగ్గడమే కాకుండా వరుసగా వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. గత రెండుమూడు రోజులుగా వానలు కురవడంతో ప్రజలు, రైతులు ఎంతో ఊరట చెందారు. తాజాగా బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడటంతో వచ్చే రెండు, మూడు రోజుల్లో కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. -
నంద్యాలలో భారీ వర్షం
కర్నూలు(అగ్రికల్చర్): నైరుతి రుతుపవనాలు రాష్ట్ర్రంలోకి ప్రవేశించడంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో పిడుగులు పడే ప్రమాదం ఉందని జిల్లా యంత్రాంగాన్ని హెచ్చరించింది. శనివారం నంద్యాలలో అత్యధికంగా 55.8 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆదివారం కూడా కొన్ని చోట్ల వర్షాలు కురిశాయి. -
రుతుపవనాలు వచ్చేస్తున్నాయి!
► తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లటి కబురు ► ఈ నెల 30న కేరళను తాకుతాయి: ఐఎండీ ► ఈ నెల 29కే.. స్కైమెట్ అంచనా సాక్షి నాలెడ్జ్ సెంటర్: మాడు పగిలే ఎండలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లటి కబురు. వేడెక్కిన వాతావరణాన్ని చల్లబరిచేందుకు రుతుపవనాలు సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది రుతుపవనాలు సకాలంలో.. అంటే ఈ నెల 30వ తేదీల్లోనే కేరళ తీరాన్ని తాకనున్నాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. అయితే అంతకంటే ఒక రోజు ముందే రుతుపవనాలు తాకుతాయని వాతావరణ అధ్యయన సంస్థ స్కైమెట్ ప్రకటించింది. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది రుతుపవనాల విస్తరణ, ప్రభావం కొంచెం మెరుగ్గా ఉంటుందని స్కైమెట్ శాస్త్రవేత్త ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. నాలుగు నెలల రుతుపవనాల సీజన్ మొత్తమ్మీద వర్షపాతం దీర్ఘకాలిక సగటులో 95 శాతం వరకూ ఉండవచ్చని స్కైమెట్ అంచనా వేస్తోంది. నైరుతి రుతుపవనాలు జూన్ 1న కేరళను తాకి.. ఆ తర్వాత దశలవారీగా జూలై 15 నాటికి దేశమంతా విస్తరిస్తాయి. అయితే గత ఏడాది ఎల్‌నినో కారణంగా రుతుపవనాల రాక, విస్తరణలోనూ ఇబ్బందులు ఎదురయ్యాయి. వారం ఆలస్యంగా తీరాన్ని తాకిన మేఘాలు ఆ తర్వాత కొంతకాలం స్తబ్దుగా ఉండిపోయాయి. అయితే ఈ ఏడాది అందుకు భిన్నంగా ఉండబోతోందని స్కైమెట్ అంచనా వేస్తోంది. కొన్నిరోజులుగా కేరళతోపాటు, తమిళనాడు అంతర్భాగాల్లో ముందస్తు వానలు కురుస్తుండగా.. ఈ నెల 25 నుంచి ఈ ప్రక్రియ మరింత వేగం పుంజుకోనుంది. విదర్భ, తెలంగాణ వంటి దేశ మధ్య ప్రాంతాల్లో భూమి ఉపరితలం బాగా వేడెక్కి ఉండటం బంగాళాఖాతంలో అల్పపీడన పరిస్థితులు ఏర్పడేందుకు, తద్వారా రుతుపవనాల రాకకు తోడ్పడతాయని స్కైమెట్ అంచనా వేస్తోంది. రెండు నెలల క్రితం ఉన్న ఎల్‌నినో పరిస్థితుల స్థానంలో బలహీనమైన లానినా పరిస్థితులు ఏర్పడటం కూడా రుతుపవనాలపై ప్రభావం చూపుతోంది. మే చివరికల్లా కేరళ తీరాన్ని తాకే సమయానికే దీని ప్రభావంతో కేరళ, కర్ణాటకలతోపాటు తెలంగాణ, ఏపీలోని రాయలసీమ ప్రాంతాల్లో చెదురు మదురు వర్షాలు కురుస్తాయని.. స్కైమెట్ అంటోంది. అలాగే జూన్ నెలలో తెలంగాణ, ఏపీలో తగినన్ని వర్షాలు కురుస్తాయని.. సగటు వర్షపాతానికి ఒకట్రెండు శాతం ఎక్కువ వానలు కురిసినా కురవవచ్చని అంచనా వేస్తోంది. -
ఈ నెలాఖరుకు శుభవార్త!
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ఆశాజనకంగా ఉండబోతున్నాయా? అవుననే అంటున్నాయి ముందస్తు వాతావరణ నివేదికలు. ఈ విషయాన్ని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి హర్ష వర్ధన్ సైతం బుధవారం లోక్ సభలో వెల్లడిందారు. 'నైరుతి రుతుపవనాలు మే చివరినాటికి గానీ.. జూన్ మొదటి వారంలో గానీ కేరళను తాకే అవకాశం ఉంది. అలాగే భారత వాతావరణ విభాగంతో పాటు అన్ని వాతావరణ సంస్థలు తమ ముందస్తు నివేదికల్లో ఈ సారి సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగానే నమోదవుతుందని చెప్పాయి' అని ప్రశ్నోత్తరాల సమయంలో హర్ష వర్థన్ లోక్‌సభలో వెల్లడించారు. 2005- 2014 మధ్య కాలంలో మాదిరిగానే సరైన సమయంలో రుతుపవనాలు కేరళకు రాబోతున్నాయని దీనికి సంబంధించిన ముందస్తు సూచనను మే 15న విడుదల చేస్తామని ఆయన తెలిపారు. -
సగానికి పడిపోనున్న ఆహారధాన్యాల ఉత్పత్తి
-
దిగుబడులు అంతంతే!
సగానికి పడిపోనున్న ఆహారధాన్యాల ఉత్పత్తి ఖరీఫ్‌లో 75 శాతానికి దిగజారిన వరి పంటలు 68 శాతానికే పరిమితమైన పప్పుధాన్యాల సాగు రుతుపవనాలు సకాలంలో రాకపోవడం వల్లే దుస్థితి వ్యవసాయ శాఖ నివేదికలో తాజా అంచనాలు సాక్షి, హైదరాబాద్: ఈ ఖరీఫ్ సీజన్లో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. నెలాఖరుతో సీజన్ ముగుస్తున్న నేపథ్యంలో పంటల సాగు సాధారణం కన్నా 20 శాతం తక్కువగా ఉన్నట్లు వ్యవసాయ శాఖ తేల్చింది. ఈసారి రుతుపవనాలు నిర్ణీత సమయంలో రాకపోవడమే ఇందుకు కారణం. చాలా ప్రాంతాల్లో మంచి వర్షాలు లేకపోవడంతో సాగు చేసిన పంటల పరిస్థితి కూడా అంత ఆశాజనకంగా లేదు. ఫలితంగా ఖరీఫ్‌లో ఆహారధాన్యాల దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశముందని వ్యవసాయ శాఖ ఆందోళన చెందుతోంది. అధికారుల అంచనా ప్రకారం ఈ సీజన్లో రాష్ర్టంలో 20.60 లక్షల హెక్టార్లలో ఆహారధాన్యాల సాగు జరగాల్సి ఉండగా.. 16.41 లక్షల హెక్టార్లలోనే(80%) పంటలను వేశారు. అందులో వరి 10.04 లక్షల హెక్టార్లలో సాగవ్వాల్సి ఉండగా.. 7.53 లక్షల హెక్టార్లకే(75%) పరిమితమైంది. ఇక పప్పుధాన్యాలు 4.92 లక్షల హెక్టార్లకు బదులు కేవలం 3.35 లక్షల హెకార్టలో(68%) సాగవుతోంది. ఈ మేరకు పంటల పరిస్థితిపై వ్యవసాయ శాఖ బుధవారం తాజా నివేదికను విడుదల చేసింది. నూనె గింజల సాగు మాత్రం 119 శాతం జరిగిందని పేర్కొంది. సకాలంలో వర్షాలు కురవకపోవడం, ఆలస్యంగా పంటలు వేయడంతో దిగుబడి భారీగా తగ్గవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఖరీఫ్‌లో ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 66.37 లక్షల టన్నులు. అందులో వరి 57.31 లక్షల టన్నులు కాగా, పప్పుధాన్యాల లక్ష్యం 3.22 లక్షల టన్నులు, నూనెగింజల లక్ష్యం 5.58 లక్షల టన్నులుగా ఉంది. అయితే ఈసారి దిగుబడులు ఇందులో సగానికి పడిపోయే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 316 మండలాల్లో లోటు వర్షపాతం ఇటీవల కొంతమేర వర్షాలు కురిసినా.. అంతకుముందు జూన్, జూలై నెలల్లో సరైన వర్షాలు లేకపోవడంతో రాష్ట్రంలో వర్షపాతం కొరత ఇంకా ఎక్కువగానే ఉంది. ఇప్పటికీ 28 శాతం లోటు వర్షపాతం నమోదైంది. 8 జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదైంది. కేవలం రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లోనే పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. మండలాలవారీగా పరిశీలిస్తే 316 మండలాల్లో వర్షపాతం కొరత ఉంది. 19 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులున్నాయి. కేవలం 106 మండలాల్లోనే సాధారణ వర్షపాతం నమోదైంది. 23 మండలాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. ఇందులో అత్యధికంగా 16 మండలాలు మహబూబ్‌నగర్ జిల్లాలోనివే. రంగారెడ్డిలో 4, వరంగల్‌లో రెండు మండలాలు ఉన్నాయి. మరోవైపు భూగర్భ జలాలు పెద్దగా పెరగలేదు. ఇప్పటికీ తెలంగాణలో గత ఏడాదితో పోల్చితే సాధారణం కన్నా 2.17 మీటర్ల అదనపు లోతులోనే జలాలు ఉన్నాయి. లోటు వర్షపాతం కారణంగా చెరువులు పెద్దగా నిండకపోవడంతో రబీ పరిస్థితి కూడా ప్రశ్నార్థకంగా మారింది.