సాక్షి, అమరావతి: ఉత్తర బంగాళాఖాతంలో ఈనెల 11న అల్పపీడనం ఏర్పడే అవకాశం వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక నేడు(బుధవారం), రేపు( గురువారం) రాయలసీమలో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం వాతావరణ శాఖ పేర్కొంది.
కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం
కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బుధవారం భారీ వర్షం కురిసింది. హుస్నాబాద్, అక్కన్నపేట, కొహెడ మండలాల్లో భారీ వాన పడింది. మేడ్చల్, సిరిసిల్ల, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో భారీ వర్షం కురవడంతో పలు రోడ్లు, లోతట్టు పాంతాల్లో వాన నీరు నిలిచింది. ఇక రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు రానున్న రెండు మూడు రోజుల్లో రాష్ట్రమంతటా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రానికి పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నట్లు తెలిపింది. ఈనెల 11న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే సూచించింది.
ఈనెల 11 నుంచి 13 వరకు భారీ వర్షాలు నమోదవుతాయని, ఉత్తర, తూర్పు ప్రాంతంలోని జిల్లాల్లో అతిభారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలున్నాయని వివరించింది. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రాగల 48 గంటల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని వివరించింది.
చదవండి: గ్రామీణ రోడ్లకు విరివిగా నిధులు విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment