karim nagar district
-
‘బాబు, రేవంత్ కలిసి హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేస్తారు’
సాక్షి, కరీంనగర్: హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేసే ఆలోచనలో ఉన్నారు జాగ్రత్తగా ఉండాలని ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏపీలో చంద్రబాబు గెలిస్తే.. బాబు, రేవంత్ కలిసి హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేస్తారని అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.‘‘రేవంత్ రెడ్డి బీజేపీతో పొత్తు పెట్టుకుని హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే కుట్ర జరుగుతోంది. నేను గెలిస్తే వాటిని కొట్లాడి అడ్డుకుంటా. హైదరాబాద్ నుండి కరీంనగర్‌కు రైలు రాబోతుంది.. అది నేను చేసిన పని.. గెలిస్తే వస్తుంది. తెలంగాణా నిధుల కోసం మోదీని నేను కలిసినన్ని సార్లు బండి సంజయ్ కలిశాడా?. కరీంనగర్ స్మార్ట్ సిటీకి వేయి కోట్లు తెచ్చిన. యువకుల్లరా మీకు ఉద్యోగాలు కావాలా.. విధ్వంసాలు కావాలా? అభివృద్ధి కోసం నా వెంట రండి.ప్రజా స్పందన చూస్తే భారీ మెజరిటితో గెలువబోతున్నానన్న ధీమా కలుగుతోంది.పాంప్లెంట్లులో మోదీ బొమ్మ పెట్టకుండానే సంజయ్ ప్రచారం చేసిండు. కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం కేంద్రంలో ప్రతి మంత్రిని కలిసినా నేను. బండి సంజయ్ కరీంనగర్ అభివృద్ధి కోసం మోదీని ఏనాడూ కలువలేదు. కేబుల్ బ్రిడ్జిపైన నేడు చెత్త పేరుకు పోయింది.. అభివృద్ధి ఎటు పోతుంది? నా కళ్ళకు నీళ్లు వస్తున్నాయి. ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్న నన్ను భారీ మెజారిటీతో గెలిపించండి. కరీంనగర్‌ను వైబ్రెంట్ కరీంనగర్‌గా మార్చి చూపిస్తా’’ అని వినోద్ కుమార్ అన్నారు. -
ట్రాన్స్‌కో ఏఈ పాడుపని.. నీతోనే పెళ్లంటూ యువతికి మత్తు మందు ఇచ్చి..
నాంపల్లి(హైదరాబాద్): నీతోనే నా పెళ్లంటూ ఓ యువతిని ట్రాన్స్‌కో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) దయాకర్ జాదవ్ మోసగించాడు. వివాహం చేసుకుంటానంటూ కరీంనగర్‌లోని తన గదికి తీసుకెళ్లి మత్తు మందు ఇచ్చి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం గర్భధారణ పరీక్షల నిమిత్తం సోమాజిగూడకు తీసుకెళ్లాడు. అక్కడ ఓ గైనకాలజిస్ట్ దగ్గర పరీక్షలు చేయించి టాబ్లెట్స్ ఇప్పించాడు. తన కోరిక తీర్చుకున్నాక “ఇకపై నీతో నా పెళ్లి జరగదంటూ ప్లేటు ఫిరాయించాడు. బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ ఆదివారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది. చదవండి: శ్రీకాకుళం జిల్లాలో అమానుష ఘటన.. బతికున్న తల్లి కూతుళ్లను మట్టితో పూడ్చి.. బాధితురాలు తెలిపిన మేరకు.. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం శ్రీలంక కాలనీకి దయాకర్ జాదవ్ “టీఎస్‌ట్రాన్స్‌కో’ లో అసిస్టెంట్ ఇంజినీరు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బీటెక్ చదివిన ఓ యువతితో నిశ్చితార్థం జరిగింది. కాబోయే భార్యాభర్తలమేనంటూ దయాకర్ సదరు యువతితో నమ్మబలికి శారీరకంగా లొంగతీసుకున్నాడు. ఈ క్రమంలోనే రూ.2 కోట్లు కట్నం ఇచ్చే మరో సంబంధం తనకు వచ్చిందంటూ బుకాయించి ఆమెను దూరం పెట్టాడు. దీంతో అమ్మాయి బంధువులు ఇందుకు కారణమేమిటో తెలుసుకునేందుకు అతడితో ఫోన్ ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా మాట్లాడే ప్రయత్నం చేయంగా అన్ని దారులను బ్లాక్ చేసిపెట్టాడని బాధితురాలు వాపోయింది. నిందితుడు దయాకర్ జాదవ్‌తో పాటు అతడి తల్లి లక్ష్మి, సోదరి లత, సోదరుడు విలాకర్, స్నేహితుడు బీర ప్రకాష్‌లను బాధ్యులుగా ఫిర్యాదులో చేర్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విచారణకు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన సమగ్రమైన నివేదికను డిసెంబరు 19వ తేదీలోగా అందజేయాలంటూ జిల్లా పోలీసు శాఖ అధికారులకు నోటీసులు జారీ చేసింది. -
11 ఏళ్ల కిందట సంచలనం.. ఇప్పటి యువ ఐపీఎస్‌లకు పాఠమైంది..
సిరిసిల్ల(రాజన్న సిరిసిల్ల): డబ్బుల కోసం వేసిన వలపుగాలానికి సంపన్న వ్యక్తి చిక్కాడు. మహిళతో సుతిమెత్తగా మాట్లాడిస్తూ.. అతడ్ని ట్రాప్ చేసి దూర ప్రాంతానికి రప్పించారు. ఓ గదిలో బంధించారు. అతడి కుటుంబానికి ఫోన్ చేసి లక్షలు డిమాండ్ చేశారు. సొమ్ములిచ్చేంత వరకు ఆ వ్యక్తిని చిత్రహింసలు పెట్టారు. తమను గుర్తు పడితే లైఫ్‌కే ప్రమాదమని చంపేశారు. మృతదేహం వానస రాకుండా ఫ్రిజ్‌లో కుక్కేశారు. పదిరోజులైనా ఆచూకీ లభించలేదు. కేసును చాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని వినియోగించి ఛేదించారు. నిందితులను పట్టుకుని జైలుకు పంపారు. ఆ హత్యకేసులో ఆరుగురికి యావజ్జీవ శిక్ష పడింది. సిరిసిల్లలో 2011 జూన్‌లో సంచలనం సృష్టించిన ఈ ఘటన ఇప్పుడు హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ ఐపీఎస్‌లకు పాఠమైంది. మిస్టరీగా మారిన యువకుడి హత్యోదంతాన్ని అన్ని ఆధారాలతో సహా కోర్టు ఎదుట ఉంచడంలో పోలీసులు సక్సెస్ అయిన తీరును అకాడమీలో హిస్టరీగా బోధించారు. 11 ఏళ్ల కిందట సంచలనం సృష్టించిన ఆ ఘటనపై ప్రత్యేక కథనం.! చదవండి👉: బొంగులో చికెన్ తెలుసు కానీ.. బొంగులో కల్లు పేరు విన్నారా? క్రైం నంబరు 173/2011 సిరిసిల్ల పట్టణంలోని సుభాష్‌నగర్‌కు చెందిన ప్రముఖ వస్త్ర వ్యాపా రి గర్దాస్ శ్రీనివాస్(42). అతనికి భార్య లలిత, ఇద్దరు పిల్లలు సాయికృష్ణ, శ్రీకాంత్, తల్లిదండ్రులు సునంద, నర్సప్ప ఉన్నారు. సుజాత అనే మహిళ శ్రీనివాస్‌కు ఫోన్లో పరిచయమైంది. హైదరాబాద్ రావాల్సిందిగా కోరింది. శ్రీనివాస్ 2011 జూన్ 20న హైదరాబాద్ ఉప్పల్‌లోని ఏఆర్కే అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. ఆరుగురు సభ్యులు గల ముఠా పథకం ప్రకారం అతన్ని నిర్బంధించి కుటుంబసభ్యులను రూ.25లక్షలు డిమాండ్ చేశారు. శ్రీనివాస్ తండ్రి నర్సప్ప నిందితులు సూచించిన బ్యాంకు ఖాతాలో రూ.1.50 లక్షలు వేశాడు. ఆ డబ్బులను వివిధ ఏటీఎంల నుంచి డ్రా చేసుకున్నారు. తమను గుర్తుపడితే సమస్య ఏర్పడుతుందని అదే అపార్ట్మెంట్లో హత్యచేశారు. ఫ్రిజ్‌లో శవాన్ని మూటకట్టి ఉంచారు. ఈ ఘటనపై సిరిసిల్ల పోలీసులు క్రైం నంబరు 173/ 2011 కేసు నమోదు చేశారు. పక్కావ్యూహంతో.. వలపు వల ♦ప్రస్తుత మంచిర్యాల జిల్లాకు చెందిన కొండపాక శ్రీధర్ ఉరఫ్ శేఖర్(30) 2003 నుంచి వివిధ నేరాల్లో జైలుకు వెళ్లాడు. భార్యను హత్య చేసిన కేసులో సిరిసిల్ల తారకరామనగర్‌కు చెందిన మేర్గు చిరంజీవి జైలుకు వెళ్లాడు. వీరిద్దరు అక్కడే పరిచయమయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత శ్రీధర్ సిరిసిల్లు మకాం మర్చాడు. ♦సిరిసిల్లలో ప్రముఖ వస్త్రవ్యాపారి గర్దాస్ శ్రీనివాస్ ఇంట్లో అద్దెకు ఉండే ఆకులేని ఇందిరతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. భర్తతో విడాకులై ఒంటరిగా ఉంటున్న కొక్కుల సుజాతను వివాహం చేసుకున్నాడు. తనకు పెద్దమొత్తంలో డబ్బులు కావాలని తొలుత పరిచయమైన ఇందిరతో చెప్పాడు. ♦తమ ఇంటి యజమాని శ్రీనివాస్ బాగా ఆస్తిపరుడని అతన్ని ట్రాప్ చేస్తే డబ్బులు గుంజవచ్చని ఇందిర సలహా ఇచ్చింది. పథకం ప్రకారం.. హైదరాబాద్ ఉప్పల్‌లో ఓ అపార్ట్మెంట్లో రెండునెలల కోసం ప్లాట్‌ను అద్దెకు తీసుకున్నారు. శ్రీధర్ సుజాతతో శ్రీనివాస్‌కు ఫోన్ చేయించి ట్రాప్ చేశారు. ♦2011 జూన్ 20న శ్రీనివాస్‌ను హైదరాబాద్ రావాల్సిందిగా సుజాత కోరగా.. శ్రీనివాస్ వెళ్లి అపార్ట్మెంట్లో బంధి అయ్యాడు. సిరిసిల్లకు చెందిన మేర్గు చిరంజీవి, గూడూరి రాజు సహకారంతో శ్రీధర్ శ్రీనివాస్‌ను బంధించాడు. శ్రీనివాస్ తండ్రి గడ్దాస్ నర్సప్పకు ఫోన్ చేసి రూ.25 లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. వాళ్లు చెప్పిన అకౌంటులో నర్సప్ప రూ.1.50 లక్షలు వేయగా.. నిందితులు హైదరాబాద్‌లోని వివిధ ఏటీఎంల నుంచి రూ.1.25 లక్షలు డ్రా చేశారు. ♦బంధీగా ఉన్న శ్రీనివాస్ జూన్ 25న పెద్ద ఎత్తున కేకలు వేయడంతో ప్లాట్లోనే అతన్ని హత్య చేశారు. శవం వాసన రాకుండా దాచే ందుకు కొత్త ఫ్రీజ్ కొన్నారు. శవాన్ని మూట గా అందులో ఉంచారు. జూన్ 26న ఇందిర, కొండ రాజును హైదరాబాద్‌కు పిలిచి రూ.లక్షతో పాటు బైక్ ఇచ్చి సిరిసిల్లకు వెళ్లి అక్కడి ఎం జరుగుతుందో ఎప్పటికప్పుడు ఫోన్లో చెప్పాల్సిందిగా నిందితులు సూచించారు. చదవండి👉: కడుపులో 11.57కోట్ల కొకైన్.. 2017 సెప్టెంబరు 12న శిక్ష శ్రీనివాస్ హత్యకేసులో పోలీసులు శాస్త్రీయంగా విచారించారు. సెల్‌ఫోన్ సంభాషణ ఆధారంగా కొండ రాజును ముందుగా పట్టుకున్నారు. అతడ్ని విచారించి అపార్ట్మెంటుకు వెళ్లగా.. ఫ్రీజ్‌లో శవం బయటçపడింది. నిందితులు భీవండికి పారిపోగా.. అప్పటి సిరిసిల్ల ఓఎస్డీ ధరావత్ జానకీ, ప్రొబేషనరీ డీఎస్పీ శ్రీనివాస్, సిరిసిల్ల టౌన్ సీఐ సర్వర్ కేసును శాస్త్రీయంగా ఛేదించారు. 2017 సెప్టెంబరు 12న కరీంనగర్ న్యాయస్థానం నిందితులు కొండపాక శ్రీధర్, ఆకులేని ఇందిర, కొక్కుల సుజాత, మేర్గు చిరంజీవి, గూడూరి రాజు, కొండ రాజుకు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. చిరంజీవి అప్పటికే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండు నెలలకు చార్జ్‌షీట్ అప్పుడు నేను సిరిసిల్ల టౌన్ సీఐగా ఉన్నాను. ఈ కేసును చాలెంజ్‌గా తీసుకుని నిందితులను పట్టుకున్నాం. అప్పటి పోలీసు ఉన్నతాధికారుల సూచన... సహకారంతో అన్ని జాగ్రత్తలు తీసుకుని, అన్ని ఆధారాలు సేకరించి రెండు నెలల్లో చార్జ్‌షీట్ వేశాం. నిందితులకు శిక్ష పడింది. ప్రస్తుతం ఆ కేసును శిక్షణ ఐపీఎస్‌లకు ఇటీవల పాఠంగా బోధించారు. – సర్వర్, ఎస్బీ, సీఐ, సిరిసిల్ల -
త్వరలో కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటన!
సాక్షి, కరీంనగర్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన అనంతరం ఆయన ఒకేసారి ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం వేములవాడ, ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు పుణ్యక్షేత్రాల సందర్శనకు రానుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇటీవల ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి పునర్నిర్మాణంలో కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపిన విషయం తెలిసిందే. వేములవాడ, కొండగట్ట పుణ్యక్షేత్రాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ లేదా ప్రత్యేక రోడ్ మ్యాప్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. సీఎం పర్యటనకు కావాల్సిన ఏర్పాట్లను జగిత్యాల, సిరిసిల్ల కలెక్టర్, ఎస్పీలు ముమ్మరం చేశారు. కొండగట్టుకు మాస్టర్‌ప్లానే శరణ్యం.. జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంపై పార్కింగ్, తాగునీరు, గదులు, ప్రాథమిక చికిత్స కేంద్రం, మెట్లదారి అభివృద్ధి, సెంట్రల్ లైటింగ్, ఘాట్ రోడ్ పునరుద్ధరణ, 100 ఫీట్ల రోడ్డు, కోతుల పార్కు, కొండగట్టు రైల్వే స్టేషన్ హాల్టింగ్ సౌకర్యం, బస్టాండ్ సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. ఇవన్నీ తీరాలంటే.. కేవలం మాస్టర్ ప్లాన్‌తో సాధ్యమవుతుంది. ‘కొండగట్టు మాస్టర్ ప్లాన్‌పై సీఎం దృష్టికి తీసుకెళ్లాను. కొండకు రావాలని కోరాను. గత పాలకుల సమయంలో కొండగట్టు ఆలయం అభివృద్ధికి నోచుకోలేదు. కొండగట్టును మరో యాదాద్రి తరహాలోనే సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తారు’ అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. యాదాద్రి తరహాలో... రాజాద్రి! సీఎం 2019 డిసెంబరు 30లో చివరిసారిగా పర్యటించారు. అంతకుముందు 2015 జూన్ 18లోనూ వచ్చారు. ఆ సమయంలో ఆలయ సముదాయాలను కలియ తిరిగిన కేసీఆర్ రూ.100 కోట్ల ప్రత్యేక ప్యాకేజీతో యాదాద్రి తరహాలో రాజాద్రిని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. సీఎం హామీ మేరకు అధికారులు ప్రతిపాదనలు సమర్పించారు. అయితే.. ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికీ ఆలయానికి ప్రత్యేక నిధులేమీ విడుదల కాలేదు. ‘వేములవాడ ప్రాంతంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పూర్తి అవగాహన ఉంది. సీఎం దంపతుల వివాహం కూడా ఇక్కడే జరిగింది. అందుకే.. వేములవాడ అంటే ఆయనకు ప్రత్యేక అభిమానం ఉంది. తప్పకుండా వేములవాడను ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసేలా ఆయన ప్రత్యేక చొరవ తీసుంటారు’ అని ఎమ్మెల్యే రమేశ్ బాబు చెప్పారు. -
బండి సంజయ్.. నీకు దమ్ముంటే ఆయనపై గెలువు చూద్దాం..!!
-
విషాదం: సింగరేణి బొగ్గు గని ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, పెద్దపల్లి/రామగిరి/గోదావరిఖని: మూడు రోజుల రెస్క్యూ ఆపరేషన్ ఎట్టకేలకు ముగిసింది. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి పరిధిలోని ఏపీఏ అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు (ఏఎల్పీ)లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. అసిస్టెంట్ మేనేజర్ తేజ, సెఫ్టీ ఆఫీసర్ జయరాజ్, కార్మికుడు శ్రీకాంత్ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ముగ్గురి మృతదేహాలను రెస్క్యూ టీమ్ బయటకు తీసింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న ఏడుగురిలో నలుగురు క్షేమంగా ఉన్నారని, ముగ్గురు మృతి మరణించారని అధికారులు తెలిపారు. ఏఎల్పీ బొగ్గుగనిలో 86వ లెవల్ వద్ద రూఫ్ బోల్డ్ పనులు చేస్తుండగా ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఏరియా సేఫ్టీ ఆఫీసర్, డిప్యూటీ మేనేజర్‌సహా మరో ఐదుగురు కార్మికులు ప్రమాదంలో చిక్కుకోగా.. ముగ్గురిని సోమవారమే బయటకు తీసుకొచ్చారు. రవీందర్‌ను రెస్క్యూ టీం మంగళవారం కాపాడింది. సంబంధిత వార్త: ఆ ముగ్గురూ ఎక్కడ? -
జమ్మికుంట క్రీడాకారుడికి బంగారు పతకం
Asia Youth Sports CHampionship 2021: Jammikunta Prashanth Wins Gold: జమ్మికుంట పట్టణంలోని కేశవపూర్ గ్రామానికి చెందిన పాతకాల ప్రశాంత్ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాడు. హైదరాబాద్ నాంపల్లి పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రశాంత్ నేపాల్‌లోని పోక్రాలో నవంబర్ 22 నుంచి 25 వరకు నిర్వహించిన ఆసియా యూత్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్ 2021లో పాల్గొన్నాడు. 3000 మీటర్ల రన్నింగ్‌లో సీనియర్ కేటగిరిలో బంగారు పతకం సాధించాడు. జాతీయ స్థాయిలో కరీంనగర్ జిల్లా, జమ్మికుంట పట్టణానికి ఖ్యాతి తీ సుకువచ్చాడని ప్రశాంత్‌ను జమ్మికుంట పోలీసులు, ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు, కేశవపూర్ గ్రామస్తులు అభినందించారు. చదవండి: Krunal Pandya: కృనాల్ పాండ్యా కీలక నిర్ణయం... తప్పుకొంటున్నా.. అయితే.. -
మళ్లీ వైరల్ అవుతున్న బుల్లెట్ బండి
-
Bullet Bandi: మళ్లీ వైరల్ అవుతున్న బుల్లెట్ బండి
సాక్షి, కరీంనగర్: సోషల్ మీడియాలో సెన్సెషన్ క్రియేట్ చేసిన బుల్లెట్ బండి పాట మళ్లీ వైరల్ అవుతోంది. బుల్లెట్ బండి పాటకు ఇప్పుడు చాలా క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. బుల్లెట్ బండి పాట విడుదల అయ్యినప్పటి నుంచి పెళ్లిళ్లు, ఫంక్షన్స్ ఆ పాట లేకుండా ఉండటం లేదంటే అతిశయోక్తి కాదు. ఈ పాటకు పిల్లలు, పెద్దలు, నవ దంపతులు అంతా స్టెప్పులు వేస్తూ ఆడిపాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తాజాగా బుల్లెట్ బండి పాటపై జాయింట్ కలెక్టర్ దంపతులు స్టెప్పులు వేశారు. వివరాలు.. కరీంనగర్ జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ బర్త్ డే వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. సెలవు రోజు కావడంతో బంధువులు ఫ్రెండ్స్‌తో బర్త్‌డే జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ దంపతులు బుల్లెట్ బండి పాటకి స్టెప్పులు వేసి బంధువులకి ఉత్సాహన్ని కలిగించారు. దీంతో మళ్లీ బుల్లెట్ బండిపాట సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతోంది. -
Huzurabad Bypoll: బెట్టింగ్ 50 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించడంతో పాటు ప్రధాన పార్టీలకు ప్రతి ష్టాత్మకంగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నికపై కోట్ల మొత్తంలో పందేలు కాస్తున్నారు. రెండు పార్టీల నాయకులతో పాటు భారీ స్థాయిలో కమీషన్ దండుకునేందుకు బెట్టింగ్ రాయుళ్లు రంగంలోకి దిగారు. హుజూరాబాద్, వరంగల్, కరీంనగర్ ప్రాం తాల్లోనే రూ.50 కోట్లకు పైగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయంటే ఫలితంపై ఎంతటి ఉత్కంఠ నెలకొందో అర్థం చేసుకోవచ్చు. ఈటల.. కాదు గెల్లు రాజకీయ నాయకులు, పార్టీలు, గెలుపు, మెజారిటీ.. ఇలా నాలుగు రకాల బెట్టింగ్‌లకు రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు తెరలేపారు. ఈటల గెలుస్తాడని లేదు గెల్లు శ్రీనివాస్ గెలుస్తాడని రెండు పార్టీలుగా విడిపోయిన నాయకులు అభ్యర్థులపై రూ.10 లక్షలు చొప్పున బెట్టింగ్‌లు పెట్టారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందినవారే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల వారు, విదేశాల్లో ఉన్నవారు సైతం భారీ స్థాయిలో బెట్టింగ్‌లో పాల్గొన్నట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నగరంలోని కూకట్‌పల్లికి చెందిన కొంతమంది నాయకులు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుస్తాడని రూ.3 కోట్లకు పైగా బెట్టింగ్ చేశారు. గెల్లు శ్రీనివాస్ గెలుస్తాడని మరో పార్టీకి చెందిన నాయకులు రూ.3 కోట్లు పోటీ బెట్టింగ్ కాశారు. మెజారిటీపై బెట్టింగ్.. ఈటల గెలుపుపై గట్టి విశ్వాసంతో ఉన్న ఆయన అభిమానులు ఈ మేరకు భారీ స్థాయిలో పందేలు కాసినట్టు తెలిసింది. 35 వేల పైచిలుకు మెజారిటీతో ఈటల గెలుస్తారని కొందరు బెట్టింగ్ కాయగా, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ 25 వేల మెజారిటీతో గెలుస్తాడని టీఆర్ఎస్ నేతలు పోటీ బెట్టింగ్ కాసినట్టు హుజూరాబాద్‌లో చర్చ జరుగుతోంది. మెజారిటీపై ఒక్క హుజూరాబాద్‌లోనే రూ.10 కోట్లకు పైగా బెట్టింగ్ జరిగినట్టు పోలీసువర్గాలు అనుమానిస్తున్నాయి. ఎన్ఆర్ఐలు కూడా.. ఇక అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయి, సింగపూర్, సౌదీలో ఉన్న వాళ్లు సైతం బెట్టింగ్‌లు కాశారు. జమ్మికుంట, కమలాపూర్, భూపాలపల్లి, హుస్నాబాద్, బెజ్జంకికి చెందిన కొంతమంది ఆయా దేశాల్లో స్థిరపడ్డారు. వీరంతా ఈటల, గెల్లు గెలుపుపై బెట్టింగ్ కాసినట్లు తెలుస్తోంది. మరికొంత మంది ఈ మేరకు తమ సంబంధీకులను సంప్రదిస్తున్నారు. ఎటు వైపు వేయాలి? ఎంత వేయాలి? మెజారిటీ మీద వేయాలా? లేక కేవలం గెలుస్తారని మాత్రమే వేయాలా? అని ఆరా తీసినట్లు సమాచారం. కొందరు ఏకంగా వాట్సాప్ గ్రూపు పెట్టి రూ.10 లక్షల చొప్పున ఇద్దరు అభ్యర్థులపై బెట్టింగ్‌లు వేశారు. ఈ వాట్సాప్ గ్రూప్‌లో 48 మంది ఉన్నారని తెలిసింది. తగ్గేదే లేదన్న కార్పొరేట్లర్లు వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లలో కార్పొరేటర్లుగా ఉన్న కొంతమంది లీడర్లు కూడా పోటాపోటీగా బెట్టింగ్‌కు దిగారు. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా సాగుతున్న ఎన్నికపై ఎవరు గెలుస్తారన్న దానిపై రూ.20 లక్షల చొప్పున బెట్టింగ్‌కు దిగారు. కరీంనగర్‌లోని ఓ కార్పొరేటర్ టీఆర్ఎస్ అభ్యర్థిపై రూ.25 లక్షల పందెం కాసినట్టు స్థానికుల ద్వారా తెలిసింది. బీజేపీ తరఫున గెలిచిన హైదరాబాద్ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు కొంతమంది ఈటల 40 వేల మెజారిటీతో గెలుస్తారని రూ.10 లక్షల చొప్పున నలుగురు టీఆర్ఎస్ కార్పొరేట్లర్లతో బెట్టింగ్‌లు పెట్టినట్టు చర్చ జరుగుతోంది. -
Huzurabad Bypoll: ఓటెత్తిన హుజూరాబాద్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠను, ఆసక్తిని రేకెత్తించిన హుజూరాబాద్ ఉపఎన్నిక అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఓటు వేసేందుకు ప్రజలు పోటెత్తడంతో రికార్డు స్థాయిలో 86.33% పోలింగ్ నమోదైంది. 2018 ఎన్నికల్లో 82.19% పోలింగ్ నమోదు కావడం గమనార్హం. అధికార టీఆర్ఎస్ సహా అన్ని పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈటల రాజేందర్ (బీజేపీ), గెల్లు శ్రీనివాస్‌యాదవ్ (టీఆర్ఎస్), బల్మూరి వెంకట్ (కాంగ్రెస్)లు ప్రధాన పార్టీల తరఫున బరిలో నిలిచిన విషయం తెలిసిందే. గతంలో పలుమార్లు టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి వరుస విజయాలు సాధించిన ఈటల, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈసారి బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగడంతో ఈ ఉప ఎన్నికకు ప్రాధాన్యత చేకూరింది. 12 గంటల పోలింగ్ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న ఓటర్లు భారీ సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నానికే 45% దాటిన పోలింగ్ నియోజకవర్గంలోని ఇల్లందకుంట, జమ్మికుంట, వీణవంక, హుజూరాబాద్, కమలాపూర్‌లలో ఉదయం 7 గంటలకే ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు చేరుకోవడం ప్రారంభమైంది. జమ్మికుంట మున్సిపాలిటీ, హుజూరాబాద్ మున్సిపాలిటీలో ఉదయం 9 తరువాత పోలింగ్ ఊపందుకుంది. ఉదయం 7 నుంచి 9 గంటల సమయంలో 10.61 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం పూట వృద్ధులు, వికలాంగులు ఎక్కువగా ఓట్లు వేసేందుకు వచ్చారు. పోలింగ్ సమయం రాత్రి 7 గంటల వరకు ఉన్నా.. మధ్యాహ్నం లోగానే ఓటు వేసేందుకు స్థానికులు ఆసక్తి చూపించారు. మధ్యాహ్నం ఒంటిగంటకే పోలింగ్ 45 శాతం దాటడం అధికారులను ఆశ్చర్యపరిచింది. రైతులు, ఇతర వ్యవసాయ పనులు, ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునేవారు, ఇతర ప్రాంతాల్లో సెటిలైనవారు మాత్రం సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల సమయంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటలకే చీకటి పడినా.. అధికారులు ముందస్తుగా చేపట్టిన చర్యల కారణంగా అంతా ఇబ్బందుల్లేకుండా ఓట్లేశారు. చివరి గంటలో కరోనా పాజిటివ్ రోగులు ఓటేసేందుకు అనుమతించారు. సాయంత్రానికి 76.26 శాతానికి చేరుకున్న పోలింగ్ పర్సంటేజీ, చివరగా పోలింగ్ ముగిసేసరికి గతంలో ఎన్నడూ లేనివిధంగా 86.33 శాతానికి చేరింది. మూడంచెల భద్రతలో ఈవీఎంలు గతంలో పోలింగ్ సాయంత్రం 5 గంటలకే ముగిసేది. కానీ కరోనా నిబంధనలతో రెండు గంటలు అదనంగా సమయం ఇచ్చారు. అయినా మండలాల్లోని చాలా ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటలకే పోలింగ్ ముగిసింది. అలాంటి కేంద్రాల్లో 7 గంటల తరువాత ఈవీఎంలను సీజ్ చేసి కరీంనగర్‌కు తరలించారు. ఇల్లందకుంట, జమ్మికుంట, వీణవంక వంటి కొన్ని పోలింగ్స్టేషన్లలో ఓటర్లు సాయంత్రం కూడా బారులు తీరారు. రాత్రి ఏడు గంటల లోపు క్యూలో ఉన్నవారిని అధికారులు ఓటు వేసేందుకు అనుమతించారు. ఈవీఎంలన్నీ కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ కళాశాలకు తరలించి కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. నవంబర్ 2వ తేదీన కౌంటింగ్ జరగనుంది. అదేరోజు అభ్యర్థుల భవితవ్యంపై ప్రజా తీర్పు వెలువడనుంది. భారీ బందోబస్తు నియోజకవర్గంలో మొత్తం 305 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అందులో 172 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు, 73 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఇందుకు అనుగుణంగా దాదాపు 1,800 మంది (90 కంపెనీలు) కేంద్ర బలగాలు, 2,000 మందికి పైగా స్థానిక పోలీసులు కలిపి మొత్తం సుమారు 4,000 మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడక్కడా చిన్నచిన్న గొడవలు నియోజకవర్గంలో పలుచోట్ల చిన్నచిన్న ఘటనలు చోటు చేసుకున్నాయి. ఉదయం టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్‌రెడ్డి వీణవంక పోలింగ్ కేంద్రంలో పర్యటించిన సమయంలో బీజేపీ నేతలు ఘర్షణకు దిగారు. మరోవైపు నియోజకవర్గంలోని ఐదు మండలాలు, రెండు మున్సిపాలిటీల్లో ఓటర్లకు డబ్బుల పంపిణీపై బీజేపీ, టీఆర్ఎస్ నేతలు పరస్పరం ఆరోపణలకు దిగారు. మరికొన్ని చోట్ల రెండుపార్టీల నేతలు బాహాబాహీకి దిగారు. ► జమ్మికుంట పట్టణంలోని ఎంప్లాయిస్ కాలనీలో అధికార పార్టీ వారు డబ్బులు పంచుతున్నారని బీజెపీ నేతలు ధర్నాకు దిగారు. ► జమ్మికుంట మండలంలోని శాయంపేట గ్రామంలో అధికార పార్టీ తరఫున ఓ మీడియా ప్రతినిధి డబ్బులు పంచుతుండగా స్థానికులు పట్టుకున్నారు. ► హుజూరాబాద్‌లోని రెండు వార్డుల్లో డబ్బులు పంపిణీ చేసిన ఓ పార్టీకి చెందిన స్థానికేతర నేతలను స్థానికులు అడ్డుకోవడం గొడవకు దారితీసింది. ► ఇల్లందకుంట మండలం సిరిసేడు, శ్రీరాములుపల్లిలో డబ్బులు పంచుతున్నారంటూ గొడవలు జరిగాయి. ► తమ డబ్బులు ఇవ్వలేదంటూ వీణవంక మండలం గంగారం, ఇల్లందకుంట మండలం టేకుర్తి గ్రామాల్లో ఓటర్లు నిరసన వ్యక్తం చేశారు. ► మధ్యాహ్నం వరకు స్థానికులు, ఆ తరువాత ఇతర ప్రాంతాల్లో నివసించేవారు అధికంగా పోలింగ్‌లో పాల్గొన్నారు. ఇదే సమయంలో తమకు అనుకూలంగా ఉండే వర్గాలన్నీ అకస్మాత్తుగా మరో పార్టీకి ఓటేశాయనే ప్రచారం ప్రధాన పార్టీల్లో జరిగింది. దీంతో ఎవరి ఓట్లు ఏ పార్టీకి పడ్డాయో తెలియని అయోమయం నెలకొంది. ఎగ్జిట్ పోల్ సర్వేలు దాదాపు ప్రతి పోలింగ్‌స్టేషన్ వద్ద పలు సంస్థలు ఎగ్జిట్ పోల్ సర్వేలు నిర్వహించాయి. ఓటర్ల నాడిని తెలుసుకునే ప్రయత్నం చేశాయి. కానీ చాలామంది తీర్పును వెల్లడించేందుకు నిరాకరించారు. దీంతో ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపారు అన్న విషయంలో అన్ని పార్లీల్లోనూ ఉత్కంఠ నెలకొంది. మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం, రాజకీయ పార్టీలు ఊపిరి పీల్చుకున్నాయి. -
భారీగా పెరిగిన వరి కోత యంత్రాల అద్దె ధరలు
జగిత్యాల అగ్రికల్చర్: కోతకొచ్చిన పంట చేతికొచ్చే వేళ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి.. వరికోత మెషీన్ల అద్దెలకు రెక్కలొచ్చాయి. ట్రాక్టర్ల బాడుగ భారంగా మారింది. వరికోతలకు వినియోగించే టైర్ హార్వెస్టర్ అద్దె గతేడాది గంటకు రూ.1,800–రూ.2,000 ఉండగా, డీజిల్ ధరలు పెరగడంతో ఈసారి రూ.2,300–రూ.2,500 వరకు యజమానులు పెంచేశారు. పొలాల్లో తడి ఆరక టైర్ హార్వెస్టర్లు దిగబడుతుండటంతో చైన్ హార్వెస్టర్లను వినియోగించాల్సి వస్తోంది. అయితే ఇవి తెలంగాణలో తక్కువ సంఖ్యలో ఉండటంతో కొందరు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుంచి అద్దెకు తీసుకొచ్చి డిమాం డ్‌ను బట్టి గంటకు రూ.3,500– రూ.4,500 వరకు వసూలు చేస్తు న్నారు. ప్రస్తుత వానాకాలంలో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరిసాగైంది. ఈ లెక్కన వరికోతల నిమిత్తం రాష్ట్ర రైతాంగంపై రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశముంది. తడిసిమోపెడు..: ఇదివరకు టైర్ హార్వెస్టర్‌తో ఎకరా పొలంలోని వరి పైరును గంటలో కోయిస్తే, ఇప్పుడు పొలాల్లో తేమ కారణంగా గంటన్నర పడుతోంది. హార్వెస్టర్ డ్రైవర్ మామూళ్లతో కలుపుకుని గంటకు రూ.4 వేల వరకు ఖర్చు అవుతోంది. అదే చైన్ హార్వెస్టర్‌తో ఎకరం పైరు కోయిస్తే 2 నుంచి 2.30 గంటల వరకు సమయం పడుతోంది. అంటే.. చైన్ హార్వెస్టర్‌తో కోయిస్తే దాదాపు రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు ఖర్చు వస్తోంది. ధాన్యాన్ని ట్రాక్టర్లలో కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకెళ్లేందుకు ఒక్కో ట్రిప్పుకు గతేడాది రూ.500 ఖర్చు కాగా, ఈసారి దాదాపు రూ.వెయ్యి వరకు పెరిగింది. ధాన్యంలో తేమతోపాటు తప్ప, తాలు ఉందంటూ తిప్పలు పెడుతుండటంతో ఆరబెట్టడం, మెషీన్ల ద్వారా తూర్పార పట్టడం వంటివి చేసేందుకు మరో రూ.2 వేలు –రూ.3 వేలు రైతులు వెచ్చించాల్సి వస్తోంది. హమాలీల కూలీ, లారీ డ్రైవర్ల మామూళ్లు.. ఇలా రైతులపై మోయలేని భారం పడుతోంది. తేమ అధికంగా ఉండే నేలల్లో ఇతర పంటలు పండించే పరిస్థితి లేక వరిసాగు వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు. ఖర్చులు రెట్టింపయ్యాయి వర్షాలకుతోడు సాగునీటి కాలువల ద్వారా నీరు నిరంతరం పారుతోంది. వ్యవసాయ బావుల నుంచి నీరు పైకి ఉబికి వస్తున్నది. దీంతో పొలాలు ఎప్పుడూ తేమగా ఉంటున్నాయి. ఫలితంగా టైర్ హార్వెస్టర్‌తో వరికోసే పరిస్థితి లేదు. నాలుగు ఎకరాల్లోని వరిని చైన్ హార్వెస్టర్‌తో కోయిస్తే, దాదాపు రూ.30 వేలు ఖర్చు వచ్చింది. అంతకుముందు టైర్ హార్వెస్టర్ ఖర్చు రూ.8 వేల –రూ.9 వేలు అయ్యేది. – యాళ్ల గోపాల్‌రెడ్డి, తొంబరావుపేట, మేడిపల్లి మండలం, జగిత్యాల జిల్లా ఏమీ మిగలడం లేదు రోజూ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం లీటర్ రూ.104–రూ.105 మధ్య ఉంది. రెండునెలలు వరికోతలు ఉంటాయి. మున్ముందు డీజిల్ ధర ఇంకా ఎంత పెరుగుతుందో తెలియదు. అందుకే హార్వెస్టర్ అద్దెలు పెంచక తప్పడంలేదు. కరోనా నేపథ్యంలో డ్రైవర్ల జీతాలతోపాటు మరమ్మతు ఖర్చులు రెట్టింపయ్యాయి. మాకు ఏమీ మిగలడం లేదు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం కట్టడమే ఇబ్బందిగా మారింది. – శ్రీనివాస్‌రెడ్డి, హార్వెస్టర్ యజమాని, పోరండ్ల -
డీజీపీ, ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: డీజీపీ మహేందర్‌రెడ్డితోపాటు ప్రతిపక్ష నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లాకేంద్రంలో జరిగిన మీడియా చిట్‌చాట్‌లో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సామాజికవర్గం ఆధారంగా డీజీపీని అనుమానిస్తున్నారని, ఇది తగదని అన్నా రు. పోలీసుల్లో ఒకే విభాగానికి ప్రభుత్వపెద్దలు పెద్దపీట వేస్తున్నారని, పోలీసు శాఖ రెండు వర్గాలుగా చీలిపోయిందని వ్యాఖ్యానించారు. ఎన్కౌంటర్ స్పెషలిస్టులుగా పేరొందిన కరీంనగర్ జిల్లాకు చెందిన వేణుగోపాల్‌రావు, నర్సింగరావు, ప్రవీణ్‌రావు, రమణకుమార్‌లతో కూడిన 30 మంది బృందంతో రాజకీయ నేతలపై ఆధునిక సాంకేతికతతో నిఘా పెట్టారని, దీని కోసం ఓ విశ్రాంత ఐపీఎస్ నేతృత్వంలో ప్రత్యేక సెల్ నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ఒకవర్గానికి చెందిన ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా తమవర్గానికి ప్రాధాన్యతనిస్తున్నారని, ఈ మేరకు ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారి గజానన్ని డిప్యుటేషన్ మీద తీసుకువచ్చారని ఆరోపించారు. తనకు అనుకూలమైన అధికారులకు హైదరాబాద్‌లో పోస్టింగులు ఇప్పించుకుని అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. వాటాల పంచాయితీతోనే ఉపఎన్నిక ఇరవై ఏళ్లు మంత్రి హరీశ్‌రావుతో సహవాసం చేసిన ఈటల రాజేందర్ అకస్మాత్తుగా దొంగ ఎలా అయ్యారని రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్ చైర్మన్‌గా ఉన్న టీఆర్ఎస్ అనే కంపెనీలో వాటా అడుగుతున్నాడన్న అక్కసుతోనే రాజేందర్‌ను డైరెక్టర్ పదవి నుంచి తొలగించారని ఎద్దేవా చేశారు. అవినీతి సొమ్ము పంచుకునే విషయంలో తలెత్తిన వివాదాలే ఈటల రాజీనామాకు దారితీశాయని, అందుకే హుజూరాబాద్ ఉపఎన్నిక వచ్చిందని అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ రెండూ తోడుదొంగలేనని విమర్శించారు. ఏడేళ్లలో ప్రధాని గ్యాస్, పెట్రో, నిత్యావసరాల ధరలు పెంచడం తప్ప ఇంకేమీ చేయలేదని ఆరోపించారు. కేసీఆర్ నయా నిజాం అని, తన సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు అల్లుడు హరీశ్‌రావు అనే ఖాసీం రిజ్వీని దింపారని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, కవిత తెలంగాణను పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీలో కేసీఆర్ బీజేపీ, నడ్డా బీజేపీ అని రెండు విభాగాలు ఉన్నాయని, బండి సంజయ్ ఆటలో అరటి పండు అని వ్యాఖ్యానించారు. అందుకే మురళీధర్ రావు, సుగుణాకర్‌రావు, విద్యాసాగర్‌రావులు బండి సంజయ్‌ని పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. 2022లో ముందస్తు ఎన్నికలకు.. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత టీఆర్ఎస్లో ముసలం పుడుతుందని రేవంత్ జోస్యం చెప్పారు. కుమారుడిని ముఖ్యమంత్రిని చేసేందుకు 2022 డిసెంబర్లో కేసీఆర్ ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తారని చెప్పారు. సీఎం కేసీఆర్‌కు సూసైడ్ టెండెన్సీ ఉందని, ప్రశాంతంగా ఉన్న వాతావరణం చెదరగొట్టడం ఆయనకు అలవాటేనని అన్నారు. ఇందుకు 2004 నుంచి 2018 వరకు తన పార్టీ ప్రజాప్రతినిధులు, ఆయన చేసిన రాజీనామాలు, ముందస్తు ఎన్నికలే నిదర్శనమని పేర్కొన్నారు. దళితబంధు కోసం ఇప్పుడు కేటాయించిన రూ.రెండు వేల కోట్లనే విడుదల చేయలేదని,మాటలతో మభ్యపెట్టే కేసీఆర్‌ను 2022 ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడిస్తారని, ఆ దెబ్బకు కేసీఆర్ ఆత్మహత్య చేసుకుంటారని అన్నారు. హైదరాబాద్‌లో వరద సాయం కోసం రూ.10 వేలే సరిగా ఇవ్వనివారు, దళితబంధు కింద లక్షలాది మందికి రూ.10 లక్షల చొప్పున ఎలా ఇస్తారని ప్రశ్నించారు. -
నిరూపిస్తే దేనికైనా సిద్ధం!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘బీజేపీ లేఖ రాయడం వల్లే దళిత బంధు ఆగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నారు. టీఆర్ఎస్ వల్లే పథకం ఆగిపోయిందని నేను నిరూపిస్తా.. నువ్వు రాజీనామా చేస్తావా? ఒకవేళ బీజేపీ వల్లే పథకం ఆగిపోయిందని నువ్వు నిరూపించు.. నేను దేనికైనా సిద్ధం..’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు. హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన జమ్మికుంట రూరల్ గ్రామాల్లో బుధవారం పర్యటించారు. తొలుత అంకుషాపూర్, మడిపెల్లి గ్రామాల్లో పర్యటించిన ఆయన రాష్ట్రంలో టీఆర్ఎస్ పతనం ఖాయమైందని, హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ ఓడిపోతుందని తెలిసే కేసీఆర్ కొత్త డ్రామాలకు తెరదీశారని దుయ్యబట్టారు. హుజూరాబాద్‌లో ఓడిపోతామనే భయంతోనే దళితులకు డబ్బులు ఇవ్వకుండా అకౌంట్లు ఫ్రీజ్ చేయించాడని, ఎన్నికల తరువాత కేసీఆరే కోర్టులో కేసు వేయించి దళిత బంధు డబ్బు దళితులకు అందకుండా చేస్తాడని ఆరోపించారు. బీజేపీని గెలిపిస్తే.. కేసీఆర్ అహంకారం అణిగిపోయి ఫాంహౌస్‌ను వీడి ఒళ్లు వంచి పనిచేస్తాడని అన్నారు. ఓడిపోయే సీట్ల ప్రచారానికి పంపి హరీశ్‌రావును బలిపశువును చేస్తున్నారని, హరీశన్నా జాగ్రత్త అంటూ హితవు పలికారు. -
BJP: వ్యూహాలు సిద్ధం.. హుజూరాబాద్‌లో గెలవాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నిక బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ స్థానాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కైవసం చేసుకోవాలన్న పార్టీ అధినాయకత్వం ఆదేశాలతో రాష్ట్ర పార్టీ తదనుగుణ వ్యూహాలు సిద్ధం చేసింది. ఇరవై ఏళ్లకు పైగా టీఆర్ఎస్ ముఖ్యనేతగా, కేసీఆర్ ఉద్యమ సహచరుడిగా కొనసాగి, ఆరు పర్యాయాలు ఎదురులేకుండా ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ ఇమేజీ తమకు తప్పకుండా ఉపయోగపడుతుందని బీజేపీ గట్టిగా నమ్ముతోంది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరిన ఈటల వెంట.. ఆ పార్టీ ముఖ్యనేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు చాలామంది బీజేపీలోకి రాకపోవడంతో సొంతపార్టీ కార్యకర్తలతోనే బూత్‌స్థాయి ఓటర్ల మద్దతును కూడగట్టేందుకు నడుం బిగిస్తోంది. హుజూరాబాద్ ప్రజల్లో ఈటలకున్న మంచిపేరును వినియోగించుకుని అధికార పార్టీగా టీఆర్ఎస్కు ఉండే అదనపు అవకాశాలను అధిగమించాలని భావిస్తోంది. వ్యూహాత్మకంగా అన్నిస్థాయిల్లో పార్టీ ఇన్చార్జీలను నియమించుకుని ముందుకు సాగుతోంది. ఇప్పుడు గెలిస్తే ‘2023’కు ఊపు అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రధానపోటీదారుగా నిలిచి గణనీయమైన సంఖ్యలో కార్పొరేటర్లు గెలుపొందారు. ఆ తర్వాత నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ పరిస్థితిని అధిగమించి ఇప్పుడు హుజూరాబాద్‌ను చేజిక్కించుకుంటే, 2023 అసెంబ్లీ ఎన్నికల కసరత్తులో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్లేందుకు ఈ విజయం దోహదపడతుందని బీజేపీ భావిస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలు, నియంతృత్వ పోకడలు ఇప్పటికే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగామని అంచనా వేస్తోంది. ఈటల రాజేందర్ రాజీనామా తర్వాతే దళిత బంధు స్కీం ప్రకటించడం, హుజూరాబాద్‌లో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడంలోని అధికార పార్టీ ఎత్తుగడలను కూడా వివరించగలిగామని భావిస్తోంది. దళితబంధు ద్వారా హుజూరాబాద్ లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10 లక్షలు డిపాజిట్ చేసినా ఆ మొత్తాన్ని డ్రా చేయకుండా స్తంభింపచేయడం (ఫ్రీజింగ్)తో ఏర్పడిన అసంతృప్తి, ఇంకా ఈ లబ్ధి అందని వారిలో ఉన్న వ్యతిరేకత వల్ల ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రతికూల ఫలితాలొచ్చే అవకాశాలున్నాయని బీజేపీ నాయకులు అంచనా వేస్తున్నారు. వికేంద్రీకరణ వ్యూహంతో ఓటర్ల వద్దకు.. ఈసీ వివిధ రూపాల్లో విధించిన ఆంక్షల నేపథ్యంలో తొలుత ఎన్నికల ప్రచారానికి రావాలని భావించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇప్పుడా ఆలోచనను విరమించుకున్నారు. కేవలం వెయ్యిమందితోనే బహిరంగసభలు నిర్వహించాల్సి ఉండడంతో ఇతర ముఖ్యనేతలు సైతం ఈ ప్రచారంలో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఎక్కడకక్కడ వికేంద్రీకరణ వ్యూహాన్ని అనుసరించాలని నేతలు నిర్ణయించారు. వివిధ మండలాలు, గ్రామాలుగా చిన్న చిన్న బృందాలుగా విడిపోయి వీలైనంత ఎక్కువ మంది ఓటర్లను కలుసుకునేలా కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నారు. బూత్ స్థాయిలో శక్తి కేంద్రాలు క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ సమన్వయానికి, పోలింగ్ బూత్‌స్థాయిలో విస్తృత ప్రచారానికి శక్తి కేంద్రాలను ఏర్పాటు చేశారు. నాలుగైదు పోలింగ్ బూత్‌లను కలిపి లేదా ఒకటి, రెండు గ్రామాలకు ఒకటి చొప్పున ఇప్పటికే మొత్తం 98 శక్తి కేంద్రాలకు స్థానిక ఇన్చార్జిల నియామకం పూర్తయింది. ఓటర్ల జాబితాలోని ఒక్కో పేజీలో ఉన్న ఓటర్లను కలిసి, సమన్వయం చేసేందుకు పన్నా ప్రముఖ్ (ఓటర్ల జాబితాలోని ఒక్కో పేజీ ఓటర్ల ఇన్చార్జి)లను నియమించారు. దసరా తర్వాత దూకుడే... దసరా పండుగ దాకా ‘గ్రౌండ్‌వర్క్’పూర్తిచేసి ఆ తర్వాత ఒక్కసారిగా దూకుడు పెంచాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఎన్నికల తేదీ సమీపించే కొద్దీ వేడిపెంచి ప్రచారాన్ని ఉధృతం చేసే వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈనెల 15 తర్వాత రాష్ట్రపార్టీ నాయకత్వం మొదలు, అన్నిస్థాయిల్లోని నాయకులు పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రణాళికల రూపకల్పన, ప్రచారంలో నిమగ్నమై ప్రత్యక్షంగా ఆయా అంశాలను పర్యవేక్షించనున్నారు. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పోటీపడుతుండగా, కాంగ్రెస్ తమ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. కేసీఆర్ వ్యూహం ఇక్కడ పనిచేయదు ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయం. అధికార టీఆర్ఎస్ ఎలాంటి ప్రలోభాలకు గురిచేసినా ఓటర్లు వాటికి లొంగే పరిస్థితే లేదు. హుజూరాబాద్ ఆత్మగౌరాన్ని ప్రజలు కాపాడుకుంటారు. కేసీఆర్ ఏ వ్యూహం పన్నినా ఇక్కడ పనిచేయదు. వారి అబద్ధపు అస్త్రాలన్నీ ఖర్చయిపోయాయి. తమ గుండెల్లో నిలిచి, వారిని అనేక సందర్భాల్లో, కష్టకాలంలో ఆదుకున్న ఈటల పక్షానే ప్రజలు నిలవబోతున్నారు. ఏ ఊరికి వెళ్లినా అంతా ఈటల నామస్మరణే చేస్తున్నారు. కమలం గుర్తుకే ఓటేస్తామని కరాఖండిగా చెబుతున్నారు. – బీజేపీ హుజూరాబాద్ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఏపీ జితేందర్‌రెడ్డి -
Karimnagar: సిల్వర్ స్క్రీన్‌పై కరీంనగర్ వెలుగులు
ఒక్కచాన్స్.. ఒకేఒక్క చాన్స్ అంటూ వీళ్లు క్రిష్ణానగర్ చుట్టూ కాళ్లరిగేలా తిరగలేదు.. సినిమాల్లో అవకాశం కోసం ఏళ్లకేళ్లు ఎదురుచూడలేదు. చేస్తున్న పనిని, అన్నం పెడుతున్న ఊరును వదిలిపెట్టలేదు. ఉన్నచోటు నుంచే తమ ప్రతిభను ప్రదర్శించారు. అవకాశాన్ని.. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకున్నారు. యూట్యూబ్‌లో సొంతంగా ఒక వేదికను ఏర్పాటుచేసుకుని తామేంటో నిరూపించుకున్నారు. షార్ట్‌ఫిల్మ్‌లు, ప్రయివేటు ఆల్బంల ద్వారా తమ టాలెంటును మొదట ప్రజలు గుర్తించేలా కష్టపడ్డారు. ఆ కష్టమే ఇప్పుడు వారిని స్టార్లను చేసింది. అనతికాలంలోనే సినిమాల్లో, పెద్దపెద్ద రియాలిటీషోల్లో అవకాశం వచ్చేలా చేసింది. ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్‌పై ఉమ్మడి కరీంనగర్ వెలుగులు విరజిమ్ముతున్నాయి. మై విలేజ్ షో ద్వారా ఫేమ్ అయిన బిగ్‌బాస్ గంగవ్వ, అనిల్ జీల సినిమాల్లో బిజీగా మారారు. మరికొందరు యాక్టర్లు, సింగర్లు, డైరెక్టర్లు పలు సినిమాల్లో ప్రతిభ చూపి స్టార్.. స్టార్.. సూపర్‌స్టార్ అనిపించుకుంటున్నారు. యూట్యూబ్ ద్వారా రంగుల ప్రపంచంలో ప్రస్థానం ప్రారంభించి వెండితెరపై వెలుగుతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సినీ కళాకారులపై ‘సాక్షి’ వీకెండ్ స్పెషల్..!!] పేరు: గంగవ్వ యూట్యూబ్ చానల్ మై విలేజ్ షో షార్ట్‌ఫిల్మ్: 120కి పైగా సినిమాలు: 4 ‘ఇస్మార్ట్’ గంగవ్వ మల్యాల(చొప్పదండి): జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లికి చెందిన మై విలేజ్‌షో గంగవ్వ అంటే ఇప్పుడు ప్రపంచమంతా పరిచయమే. బడిముఖం చూడని గంగవ్వ కష్టాల కడలిని ఈదింది. ముక్కుసూటిగా మాట్లాడే తత్వం.. కల్మషం లేని ఆమె మనసు.. ఆరు పదుల వయసులో ప్రపంచానికి స్టార్‌గా పరిచయం చేశాయి. ఇదే గ్రామానికి చెందిన శ్రీరాం శ్రీకాంత్ ప్రారంభించిన మై విలేజ్ షో యూట్యూబ్ చానల్ గంగవ్వ జీవితాన్ని మార్చివేసింది. 120కిపైగా వీడియోల్లో, నాలుగు పెద్ద సినిమాల్లో నటించింది. ఓ రియాలిటీ షోతో మరింత ఫేమస్ అ యిన గంగవ్వ.. ఇల్లు కట్టుకోవాలనే తనకలను నెరవేర్చుకుంది. జీవితమంతా.. ముళ్లబాటే గంగవ్వ జీవితమంతా ముళ్లబాటలోనే సాగింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. బీడీలు చేస్తూ తమ్ముళ్లకు ఆసరాగా నిలిచింది.ఐదేళ్లలో బాల్య వివాహం జరిగింది. అత్తాగారిల్లే జీవితమైంది.భర్త గంగయ్య పదిహేనేళ్లపాటు గల్ఫ్ వెళ్లాడు. ఐదేళ్లపాటు దుబాయ్ నుంచి కబురు లేకపోవడంతో ఉన్నాడో లేడో కూడా తెలియని వేదనతో గడిపింది. మరో పదేళ్లు గల్ఫ్ వెళ్లినా నయాపైసా పంపలేదు. ఇక్కడి నుంచే అప్పుచేసి, పైసలు పంపిస్తే ఇంటికి తిరిగివచ్చాడు. కలోగంజో తాగి, పొద్దంతా వ్యవసాయ పనులకు వెళ్లి, రాత్రి బీడీలు చేస్తూ పిల్లలను పెద్ద చేసింది. ఆరుపదుల వయసులో.. గంగవ్వకు మై విలేజ్ షో మరో జన్మనిచ్చింది. అవ్వలోని సహజ నటిని మై విలేజ్ షో దర్శకుడు శ్రీరాం శ్రీకాంత్ ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇంటర్నెట్ కష్టాలు అనే షార్ట్‌ఫిల్మ్‌తో యూ ట్యూబ్‌లో అడుగుపెట్టి.. సుమారు 120కిపైగా లఘుచిత్రాల్లో నటించింది. సినీ నటులుసైతం గంగవ్వతో సెల్ఫీకోసం ఎదురుచూసేలా ఎదిగింది. గంగవ్వ సహజ నటనను చూసిన సినిమా డైరెక్టర్లు అవకాశం ఇవ్వడంతో మల్లేశం, ఇస్మార్ట్ శంకర్, రాజరాజచోర, లవ్‌స్టోరీలో తనేంటో నిరూపించుకుంది. రెండు టీవీ రియాలిటీషోల్లో అదరగొట్టింది. గంగవ్వ మాట తీరు..ఆప్యాయత..కల్మ షం లేని తన వ్యక్తిత్వానికి అద్దం పడుతోంది. ఏ అవసరం ఉన్నా ఇప్పటికీ ప్యాసింజర్ ఆటోల్లో వెళ్తుండడం ఆమె నిరాడంబరతకు నిదర్శనం. ‘చిన్నప్పటి నుంచి కష్టాలు, కన్నీళ్లతోనే గడిపిన. పొద్దంతా వ్యవసాయ పనికి వెళ్లివచ్చి, బీడీలు చేసేదాన్ని. సదువు అసలే రాదు. ఎక్కడెక్కడి నుండో నా దగ్గరికి అచ్చి.. సెల్ఫీలు దిగుతున్నరు. ఇంటికాడ ఉంటే శ్రీకాంత్ అచ్చి, నేను చెప్పినట్టు చేత్తవా గంగవ్వ అని, షూటింగ్ మొదలు పెట్టిండు. ఇంట్ల టీవీ కూడా లేదు. సినిమాలో నటిస్తా అని అనుకోలేదు. ఇప్పటికి నాలుగు సినిమాలు విడుదల ఐనయ్. ఇంకా వేరే సినిమాలో నటిస్తున్న.. ఇప్పుడు కూడా ఊటీలో షూటింగ్లో ఉన్న.. నాకు తెలిసింది ఒక్కటే. నా పని నేను సేత్త’ అని గంగవ్వ చెప్పుకొచ్చింది. పేరు: రాదండి సదయ్య యూట్యూబ్ చానల్ సదన్న కామెడీ షార్ట్‌ఫిల్మ్‌లు: 200కి పైగా సినిమాలు: 10 ఆర్ఎస్ నందా.. కామెడీకి ఫిదా విద్యానగర్(కరీంనగర్): ఆర్ఎస్ నంద.. యూట్యూబ్ ప్రపంచానికి పరిచయం కాకముందే ఇతని కామెడీ షార్ట్‌ఫిల్మ్‌లను సిడీల రూపంలో అభిమానులు వీక్షించేవారు. రెండు వందలకు పైగా షార్ట్‌ఫిల్మ్‌లు తీసిన ఆర్ఎస్ నందకు దాదాపు ఐదు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. నటన అంటే ప్రాణం ఓదెల మండలం కనగర్తికి చెందిన రాదండి సదయ్యకు చిన్నతనం నుంచే నటన అంటే ప్రాణం. పదేళ్ల వయసులోనే బుర్రకథలు చెప్పేందుకు ఆసక్తి చూపేవాడు. 2007నుంచే లఘుచిత్రాలు తీయడం ప్రారంభిచాడు. యూట్యూబ్ హవా ప్రారంభం కావడంతో 2013లో కోడెం సంతోశ్‌తో కలిసి ‘సదన్న కామెడీ’ చానెల్ ద్వారా ‘గుట్టల్లో గుసగుస’తో యూట్యూబ్‌లో తొలి అడుగువేశాడు. ఇప్పటివరకు దాదా పు 200కు పైగా విలేజ్ కామెడీ షార్ట్ఫిలిమ్స్ చేశాడు. కామెడీ స్టార్‌గా దేశవిదేశాల్లో గుర్తింపు సాధించాడు. సినిమా అవకాశాలు కూడా రావడంతో బతుకమ్మ, నానీ బుజ్జి బంగారం, తుపాకీ రాముడు, సంత, చిన్ని గుండెల్లో ఎన్ని ఆశలో, నేనేసరోజన, గున్నమామిడి కొమ్మ మీద తదితర 10కి పైగా సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం మరిన్ని సినిమాల్లోనూ బిజీగా ఉన్నట్లు తెలిపాడు. పేరు: అనిల్ జీల యూట్యూబ్ చానల్: మై విలేజ్ షో షార్ట్‌ఫిల్మ్‌లు: 200 కి పైగా సినిమాలు: 5 క్రేజీహీరో.. అనిల్ మల్యాల(చొప్పదండి): ఎన్ఎస్ఎస్ వలంటీర్‌గా సేవచేసేందుకు లంబాడిపల్లి వెళ్లి.. యూట్యూబర్‌గా తనలోని ప్రతిభకు పదును పెట్టుకుని.. ప్రపంచస్థాయిలో గుర్తింపు సాధించి, యువతకు క్రేజీ హీరోగా మారాడు అనిల్ జీల. ఉపాధ్యాయుడిగా విద్యాబుద్ధులు బోధిసూ్తనే తన ఆలోచనలను వీడియో రూపంలో ప్రదర్శిస్తూ.. సహచరుడు, మై విలేజ్ షో వ్యవస్థాపకుడు శ్రీరాం శ్రీకాంత్‌తో జట్టుకట్టాడు. మై విలేజ్ షోలో నటిస్తూ.. తనలో దాగిఉన్న ప్రతిభను చాటుకున్నాడు. స్వయంగా వ్లాగ్ నిర్వహిస్తూ ఏకంగా 7లక్షల ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలో నటిస్తూనే.. యూత్ ఐకాన్‌గా నిలిచాడు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం దర్గపల్లి గ్రామానికి చెందిన నిర్మల–మల్లేశం కొడుకు అనిల్ జీల. టీటీసీ చేసేటప్పుడు ఎన్ఎస్ఎస్ క్యాంపులో భాగంగా లంబాడిపల్లికి వచ్చాడు. అప్పుడే శ్రీరాం శ్రీకాంత్‌తో పరిచయం ఏర్పడింది. జమ్మికుంటలో రెండేళ్లపాటు ఉపాధ్యాయుడిగా పనిచేసి, ఐదేళ్లక్రితం వేసవిసెలవుల్లో లంబాడిపల్లికి వచ్చిన అనిల్ జీల శ్రీకాంత్ దర్శకత్వంతో పాటు ఇతర లఘుచిత్రాలు సుమారు 200లకుపైగా నటించారు. కికీ చాలెంజ్ తన జీవితాన్ని మలుపు తిప్పగా, రైతు పడుతున్న కష్టాల వీడియోతో అనిల్‌కు ఫాలోయింగ్ పెరిగింది. ఏడు లక్షల ఫాలోవర్స్.. మై విలేజ్ షో వీడియోలతోపాటు తన వ్యక్తిగత జీవిత విశేషాలను అప్లోడ్ చేసేందుకు అనిల్ జీల వ్లాగ్ ప్రారంభించాడు. షూటింగ్లో.. ఇంట్లో.. ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఆ విశేషాలు తెలిసేలా వ్లాగ్‌లో పెడుతుండడంతో ప్రస్తుతం అనిల్‌కు 7లక్షల మంది ఫాలోవర్లు పెరిగారు. యూట్యూబ్ వీడియోల్లో నటిసూ్తనే సినిమాల్లో చాన్స్ కొట్టేశాడు అనిల్. ఇతడి సహజమైన నటనతో నేటియువతకు హీరోగా మారాడు. అనిల్ నటనకు సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్‌తోపాటు, ఎస్ఆర్ కల్యాణ మంటపం సినిమాలు ఇప్పటికే రిలీజ్ కాగా, దర్శకుడు నవీన్ బేతిగంటి తీస్తున్న ‘రామన్న యూత్’ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. మై విలేజ్ షో తీస్తున్న ఓ వెబ్సిరీస్లోసైతం నటిస్తున్నాడు. పాటల మాంత్రికుడు మల్లిక్ గొల్లపల్లి(ధర్మపురి): పల్లెపదాలు ఆయన పాటలకు ప్రాణాలు. తాను రాసే పాటలోని ప్రతీ అక్షరం గ్రామీణ జీవన సుమధురం. మట్టిమనుషుల మధ్య బాధలు, బంధుత్వాలను జానపదాలుగా మలిచి చిత్రీకరిస్తూ.. జానపద ఆణిముత్యంగా రాణిస్తున్నాడు జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్కు చెందిన ఎస్వీ మల్లిక్‌తేజ. ఎస్వీ మ్యూజిక్ చానల్ ద్వారా 150కి ప్రయివేటు పాటలు రాసి, పాడిన, వీక్షకులకు అందించగా.. ఆరులక్షల మంది పాలోవర్స్ను సొంతం చేసుకున్నాడు మల్లిక్‌తేజ. ఇటీవల వచ్చిన రుణం సినిమాకు సంగీత దర్శకుడిగా కూడా పనిచేశాడు. చిన్నతనం నుంచే.. మల్లిక్‌తేజ డిగ్రీవరకు చదివాడు. చిన్నతనం నుంచి అమ్మమ్మవాళ్ల ఊర్లో పెరిగాడు. తాత మ్యాకల వెంకయ్యతో గొర్రెలు మేపేందుకు వెళ్లి జానపదాలు నేర్చుకున్నాడు. ఆ పాటలనే స్కూళ్లో పాడేవాడు. ఇంటర్‌లోనే పాటలు రాయడం, పాడడం ప్రారంభించాడు. అప్పుడే జగిత్యాలకు వచ్చిన సుద్దాల అశోక్‌తేజ మల్లిక్పాటకు ముగ్దుడయ్యాడు. మల్లిక్‌ను హైదరాబాద్ పిలిపించుకుని మెలకువలు నేర్పించాడు. తరువాత యూట్యూబ్‌లో ఎస్వీ మ్యూజిక్ చానల్‌ను ప్రారంభించాడు. 2018 జనవరిలో తీసిన ‘నేనొస్తాబావ’ పాటకు 3కోట్లవ్యూస్ను సాధించాడు. ‘మదనాసుందారి’ పాట అత్యంత ప్రేక్షక ఆదరణ సాధించింది. ఎస్వీ మ్యూజిక్ చానల్ద్వారా 150కి పైగా ప్రయివేటు పాటలు చిత్రీకరించాడు. ఆరులక్షల పాలోవర్స్ ఉన్నారు. సినిమాల్లో అవకాశం రావడంతో 2019 ఏప్రిల్‌లో విడుదలైన రుణం సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేశాడు. కన్నడంలో భన్నదకనుసు, రంగిన దునియాకు మ్యూజిక్ డైరెక్టరుగా పరేషాన్ సినిమాలో పాట పాడాడు. పాటే రమేశ్ ప్రాణం గొల్లపల్లి(ధర్మపురి): యక్షగానం నుంచి పుట్టిన జానపద కళాకారుడు గడ్డం రమేశ్. జగిత్యాల జిల్లా చిన్నాపూర్కు చెందిన రమేశ్ తండ్రి అనంతం యక్షగానం చేస్తుండేవాడు. తండ్రిని అనుకరిస్తూ రమేశ్ తాను చదువుతున్న పాఠశాల వేదికపై యక్షగానం ప్రదర్శిస్తుండేవాడు. తరువాత జానపద పాటలు పాడిన రమేశ్ స్థానికంగా పేరు సంపాదించాడు. 2002లో రమేశ్ ప్రతిభను గుర్తించిన ధర్మపురి సీఐ హోంగార్డుగా ఉద్యోగం కల్పించాడు. పోలీసు కళాబృందంతో కలిసి ప్రదర్శనలు ఇస్తూ.. ప్రజలను చైతనం చేస్తున్నాడు. 2011లో రేలారెరేలా కార్యక్రమంలో పాల్గొని విజేతగా నిలిచాడు. తరువాత పలు ప్రదర్శనలు ఇచ్చాడు. 2018లో యూట్యూబ్‌లో గడ్డం మ్యూజిక్ చానల్ ప్రారంభించాడు. ‘నీలమ్మ నిమ్మసుక్క రాయిడు సోలో’ పాట మంచి గుర్తింపు పొందింది. ‘అత్తకొడుకా.. ముద్దల మారెల్లయ్య’ పాట 37లక్షల వ్యూస్ దాటింది. రమేశ్ ప్రతిభను జగిత్యాల జిల్లాకు చెందిన డైరెక్టర్ రాజ్నరేంద్ర, నిర్మాత గుగ్గిల్ల శివ ప్రసాద్ గుర్తించి సినిమాల్లో అవకాశం ఇచ్చారు. ఇలా సింగర్‌గా సినిమాల్లోనూ రాణిస్తున్నాడు. అంచెలంచెలుగా.. ఇల్లందకుంట(హుజురాబాద్): ఇంటర్ చదువుతున్న రోజుల్లోనే ఆ కుర్రాడికి సిని మాలంటే పిచ్చి. చూసిన ప్రతీ సినిమాను ‘అక్కడ ఆ సీన్ ఉండాల్సింది కాదు.. అక్కడ ఆ ఫైట్ ఇలా తీయాల్సి ఉండే’ అంటూ స్నేహితులతో పంచుకునేవాడు. అలా సినిమాలపై అతడికి ఉన్న ఆసక్తి డైరెక్టర్‌గా కావాలని సంకల్పిచింది. మొదట్లో అవకాశం రాకపోవడంతో యూట్యూబ్ ద్వారా లఘుచిత్రాలతో తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు జమ్మికుంటకు చెందిన సూర్యతేజ. తన ప్రతిభను గుర్తించిన చాలా మంది నిర్మాతలు డైరెక్టరుగా అవకాశం కల్పించారు. గుంటూరుకు చెందిన రాములు– శ్రీదేవి కుటుంబం 20ఏళ్ల క్రితమే కరీంనగర్‌కు వచ్చింది. రాములు ప్రైవేట్ విద్యాసంస్థల్లో వంటమనిషిగా చేసేవాడు. వీరికొడుకు సూర్యతేజకు చిన్నతనం నుంచి సినిమాలంటే పిచ్చి. స్నేహితులు తమాషాగా సినిమా పిచ్చోడు అంటూ ఎగతాళి చేసిన సందర్భాలున్నాయి. అవకాశం కోసం తిరిగితే ఎవరూ ఆదరించలేదు. సినిమారంగంపై ఉన్న మక్కువతో సొంతంగా కెమెరా కొనుక్కుని లఘుచిత్రాలు తీయడం ప్రారంభించాడు. పోలీసు డిపార్టుమెంటు చేస్తున్న సేవలపై 500కు పైగా లఘుచిత్రాలు తీశాడు. 2013లో తీసిన దేశం కోసం లఘుచిత్రం పేరుతెచ్చి పెట్టింది. తరువాత దర్శకుడు సుకుమార్ దగ్గర పనిచేశాడు. ఆనంద్‌సాయి, ఈశ్వర్, పైడిరమేతో పాటు పెద్దదర్శకుల వద్ద సలహాలు తీసుకుని సొంతంగా సినిమాలు చేస్తున్నాడు. 2019లో షైన్పిక్చర్స్ బ్యానర్‌పై తీసిన ‘తలచినదే జరిగిందా’ సినిమా సూర్యకు గుర్తింపునిచ్చింది. వెండితెరపై మరెందరో.. విద్యానగర్(కరీంనగర్): కళలు, కళాకారులకు వేదికైన కరీంనగర్ నుంచి చాలామంది వెండితెరపై సైతం వెలుగుతున్నారు. కరీంనగర్‌లోని మార్కెండేయకాలనీకి చెందిన జి.రాధిక ఇంటర్‌నుంచే నటనలో పేరు సాధించింది. భర్త ప్రోత్సాహంతో లఘుచిత్రాల్లో నటించడం ప్రారంభించింది. తక్కువ సమయంలో పేరు సంపాదించి, సహజనటిగా వెలుగొందుతోంది. ఇప్పటి వరకు 700కు పైగా షార్ట్‌ఫిల్మ్‌లతో పాటు దొరసాని, విరాటపర్వం, భిక్ష, గల్లీగ్యాంగ్, స్కైలాబ్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం సితార బ్యానర్‌పై నిర్మిస్తున్న సినిమాలో కీరోల్ చేస్తోంది. గోదావరిఖనికి చెందిన ఏదుల స్వప్న 250 లఘుచిత్రాల్లో నటించింది. గల్లీగ్యాంగ్, పరేషాన్, నువ్వునేను ఒక్కటైతే, బతుకంతాబ్రహ్మచారి, బిచ్చగాడా మజాకా సినిమాల్లో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బైరాన్‌పల్లి సినిమాలో నటిస్తోంది. వేములవాడకు చెందిన గోలి శివరామ్‌రెడ్డి నాటకాల్లో నటిస్తారు. 15 షార్ట్‌ఫిల్మ్‌లు చేశారు. పరేషాన్ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఇటీవల నటించిన తుపాకులగూడెం సినిమా విడుదలకు సిద్ధమైంది. -
Harish Rao: బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు
హుజూరాబాద్: ‘బీజేపీ ఈ రాష్ట్రంలో అధికారంలో లేదు.. వచ్చే అవకాశమే లేదు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఒకవేళ గెలిస్తే ఆ పారీ్టకి ఇద్దరు ఎమ్మెల్యేలకు బదులు ముగ్గురవుతారు. అంతే తప్ప ప్రజలకేం లాభం’అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం ఆయన హుజూరాబాద్‌లో మాజీ స్పీకర్ మధుసూదనాచారితో కలసి విశ్వకర్మ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, జమ్మికుంటలో విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్‌తో పాటు, హుజూరాబాద్‌లో విశ్వకర్మ మనుమయ సంఘం కోసం ప్రొఫెసర్ జయశంకర్ భవన్ పేరుతో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నామని తెలిపారు. నిన్నటిదాకా మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్, కల్యాణలక్ష్మి పథకాన్ని దండుగ అన్నారని, అలాంటి వ్యక్తికి ఓటేస్తారా? అని ప్రశ్నించారు. ‘17 ఏళ్లు ఈటలకు అవకాశమిచ్చారు. ఒక్కసారి గెల్లు శ్రీనివాస్‌కు అవకాశం ఇవ్వండి. ఇన్నేళ్లలో పూర్తి కాని పనులను రాబోయే రెండేళ్లలో పూర్తిచేసి చూపిస్తాం’అని అన్నారు. ‘ఈటల రాజేందర్ ఓటుకు రూ.30 వేలు ఇస్తానని అంటున్నాడంట. డబ్బులిచ్చే బదులు గ్యాస్ సిలిండర్, పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించేలా చూస్తే మంచిది’అని మంత్రి హరీశ్‌రావు హితవు పలికారు. -
వైఎస్సార్ పాలనలోనే అన్ని వర్గాలకు న్యాయం
హుజూరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలోనే అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పారు. సీఎం కేసీఆర్ పాల నలో నిరుద్యోగం నాలుగింతలు పెరిగిందన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడులో షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు రుణమాఫీ చేసిన ఘనత వైఎస్సార్‌దేనని చెప్పారు. భరోసా ఇవ్వని సర్కారు దేశంలో నిరుద్యోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మనది ఒకటని షర్మిల తెలిపారు. రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ఇప్పుడున్న ప్రభుత్వం తామున్నామన్న ధైర్యం ఎందుకు ఇవ్వ డం లేదని ప్రశ్నించారు. అమాయక యువత ఉద్యోగాలు రాక నిరాశతో ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. దొర బాంచన్ బతుకులకు స్వస్తి చెప్పండి తెలంగాణలో పథకాలు రావాలంటే ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయని షర్మిల చెప్పారు. దొర బాంచన్ బతుకులకు స్వస్తి చెప్పి ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని పిలుపునిచ్చా రు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో దళితుల బంధువుగా మారినట్లు కేసీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని దళితులంతా హుజూరాబాద్‌కు వచ్చి ఓటు నమోదు చేసుకొని రూ.10 లక్షల కోసం డిమాండ్ చేయాలన్నారు. నిరుద్యోగులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దని, తాము అండగా ఉంటామని చెప్పారు. దీక్షకు ముందు.. ఉద్యోగం రాకపోవడంతో ఇటీవల రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సిరిసేడు గ్రామానికి చెందిన మహ్మద్ షబ్బీర్ కుటుంబసభ్యులను షర్మిల పరామర్శించారు. ఆర్థిక సహాయం అందించడంతో పాటు కుటుంబంలో చదువుకున్న వారికి ప్రైవేట్‌గా మంచి ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఫీల్డ్ అసిస్టెంట్ల సమ్మెలో పాల్గొననున్న షర్మిల లక్డీకాపూల్: రాష్ట్రంలోని ఫీల్డ్ అసిస్టెంట్లు తమ సమస్యల పరిష్కారానికి తలపెట్టిన సమ్మెకు వైఎస్ షర్మిల సంఘీభావం తెలిపారు. బుధవారం ఉద యం 10.30కి ఆమె ఇందిరాపార్కులో నిర్వహించనున్న ఫీల్డ్ అసిస్టెంట్ల సమ్మెలో పాల్గొననున్నారు. -
ఈటల చిన్నోడు.. తర్వాత చూసుకుందాం
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ఇల్లందకుంట(కరీంనగర్): ‘ఈటల రాజేందర్ చిన్నోడు.. అయ్యేది లేదు.. సచ్చేది లేదు..’’ అని టీఆర్ఎస్ హుజూరాబాద్ నేతతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌కు వచ్చినప్పుడు దానికి సంబంధించి అన్ని విషయాలు మాట్లాడుకుందామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘దళిత బంధు’ పథకానికి సంబంధించి ఈ నెల 26న ప్రగతిభవన్‌లో అవగాహన సదస్సు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దానికి హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి 427 మంది దళిత ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇందులో భాగంగా ఇల్లందకుంట మండలం తనుగుల గ్రామ ఎంపీటీసీ వాసాల నిరోష భర్త రామస్వామికి సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. దళితులను ప్రగతిభవన్ సమావేశానికి తీసుకెళ్లే ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. రామస్వామితో సీఎం కేసీఆర్ సంభాషణ ఇదీ.. సీఎం: హలో రామస్వామి గారు.. బాగున్నారా? రామస్వామి: బాగున్నాను.. సార్. సీఎం: రామస్వామిగారు దళితబంధు విజయం మీద తెలంగాణ దళిత జాతి భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇది బాధ్యతతో, ఓపికతో, çస్పష్టమైన అవగాహన దృక్పథంతో చేసే పని. రామస్వామి: అవును సార్.. సీఎం: నా రిక్వెస్ట్ ఏందంటే.. మీ జిల్లా కలెక్టర్ మీకు ఫోన్ చేస్తడు. మీరు ఆయన దగ్గర రేపు లంచ్ చేయాలె. 26 నాటి కార్యక్రమం గురించి అవగాహన చేసుకోవాలె. 26న ఉదయం అందరూ మీ మండల కేంద్రంలో జమ అయితరు. అక్కడ ప్రభుత్వం బ్రేక్‌ఫాస్ట్ ఏర్పాటు చేస్తది. బస్సు ఉంటది. అంతా బస్సులో ఎక్కి హుజూరాబాద్ టౌన్‌కు వెళ్తరు. అన్ని మండలాల బస్సులు అక్కడికి వస్తయి. అంతా మొత్తం 427 మంది.. 30, 40 మంది అధికారులు ఉంటరు. అక్కడి నుంచి నా దగ్గరకు వస్తరు. ఆ రోజంతా నేను మీతోనే ఉంటా. రామస్వామి: సంతోషం సార్.. సీఎం: ప్రగతిభవన్‌కు రాగానే టీ తాగి మీటింగ్ స్టార్ట్ చేసుకుంటం. రెండు గంటలు మీటింగ్.. తర్వాత లంచ్ చేసుకొని.. మళ్లీ 2 గంటలు కూర్చొని అపోహలు, అనుమానాలు, మంచీచెడ్డా మాట్లాడుకుందాం. హుజూరాబాద్ నియోజకవర్గం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పోవాల్సి ఉంటుంది. అన్నీ ప్రభుత్వమే ఏర్పాటు చేస్తది. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. నేను మీతోనే ఉంటాను. రామస్వామి: థ్యాంక్స్ సార్. మా జాతికి న్యాయం జరుగుతుందనే సంపూర్ణ భరోసా ఉంది. మీరు ఫిక్స్ అయితే అవుతుంది సార్. సీఎం: వందకు వంద శాతం చేద్దాం. ప్రాణం పోయినా వెనుకాడేదిలేదు. రెండేళ్లలో ఎక్కడి నుంచి ఎక్కడి పోతమో ప్రపంచానికి చూపిద్దాం. రామస్వామి: ఓకే సార్.. నమస్కారం సార్. ఈటలది చిన్న విషయం! రామస్వామి: నేను 2001 నుంచీ పనిచేస్తున్నాను సర్. కానీ ఈటల రాజేందర్ నన్ను ఎప్పుడూ పట్టించుకోలే. అవసరం, సందర్భం వచ్చినప్పుడు ప్రతి విషయంలో పక్కనపెట్టిండు. అయినా నేను మీ (కేసీఆర్) నాయకత్వం మీద నమ్మకంతో పనిచేసుకుంటూ వచ్చిన. మొన్న 2018లో కూడా ఎంపీటీసీ టికెట్ ఇవ్వకపోతే.. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచినం సర్. తర్వాత ఈటల రాజేందర్ దగ్గరికి ఎప్పుడూ కూడా పోలేదు. నాకు వినోద్‌కుమార్ సార్, పరిపాటి రవీందర్‌రెడ్డి సార్ నాకు దేవుడిలా ఉన్నారు. సీఎం: ఒక రిక్వెస్టు ఏందంటే.. మీరు వచ్చేయండి ఇక్కడికి (ప్రగతి భవన్‌కు).. ఆ రోజు చెప్తాను. అన్ని విషయాలు మాట్లాడుకుందాం. వాడు చిన్నోడు.. రాజేందర్‌తో అయ్యేది లేదు.. సచ్చేది లేదు. విడిచిపెట్టండి. అది చిన్న విషయం.. చూసుకుందాం.. దళితబంధు మనకు పెద్ద విషయం. ప్రపంచానికే సందేశం ఇచ్చే మిషన్ ఇది. దీన్ని విజయవంతం చేసి చూపిద్దాం. -
Photo Feature: ఇలా కూడా టీకాలు వేస్తారు!
భారీ వర్షంతో భాగ్యనరం తడిసిముద్దయింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కురిసిన వర్షంతో భాగ్యనగర వాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. టీకాలు వేయించుకునేందుకు ప్రజలు వ్యాక్సినేషన్ కేంద్రాల ఎదుట బారులు తీరుతున్నారు. బెంగాల్లో పడవలో వెళ్లి మరీ టీకాలు వేస్తున్నారు. మరిన్ని ‘చిత్ర’ వార్తల కోసం ఇక్కడ చూడండి. -
రసవత్తరంగా ‘హుజురాబాద్’ రాజకీయాలు
సాక్షి, కరీంనగర్: హుజురాబాద్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఉప ఎన్నిక ఎప్పుడనేది స్పష్టంగా తెలియకపోయినప్పటికీ రాజకీయ పార్టీల నేతలు హల్చల్ చేస్తున్నారు. ముగ్గురు మంత్రులు నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ జమ్మికుంట వీణవంక మండలాల్లో పర్యటించి ఈటలపై విమర్శలు సంధించారు. ఈటల స్వప్రయోజనాల కోసమే ప్రయత్నించారే తప్ప ఏనాడు నియోజకవర్గ అభివృద్ధి గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో పార్టీ కార్యకర్తల సమావేశాలు నిర్వహించడం పట్ల బీజేపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం హుజురాబాద్‌లో ఏవిధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో మిగతా నియోజకవర్గాల్లో అదేవిధంగా చేపట్టాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ తీవ్రమవుతుండడంతో ఏం జరుగుతుందో అర్థం కాక నియోజకవర్గ ప్రజలు అయోమయంలో ఉన్నారు. చదవండి: హుజూరాబాద్‌లో ‘సోషల్’ వార్‌కు రెడీ.. రేవంత్‌రెడ్డి వ్యూహాత్మక అడుగులు: ఆసక్తికర భేటీ -
పీవీని కేసీఆర్ అవమానించారు: బండి సంజయ్
భీమదేవరపల్లి: భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్, వేడుకలను తూతూమంత్రంగా నిర్వహించి ఆయనను అవమానపర్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మం డలంలోని ఆయన స్వగ్రామమైన వంగరను సోమ వారం సంజయ్ సందర్శించారు. ఈ సందర్భంగా పీవీ విగ్రహం వద్ద నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ పీవీ శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తామని గతంలో కేసీఆర్ చెప్పగానే ఒవైసీ సోదరుల్లో ఒకరు పీవీ ఘాట్‌ను కూలుస్తామని ప్రకటించాడని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌కు పీవీపై ప్రేమ ఉంటే అలాంటి మాటలన్నందుకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. చదవండి: నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు: కోమటిరెడ్డి -
Huzurabad: ‘సాగర్’ ఫార్మూలాతో ఈటలకు చెక్.. బాస్ ప్లాన్ ఇదేనా?
సాక్షి, కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది సస్పెన్స్ గా మారింది. గులాబీ దళపతి మదిలో ఎవరున్నారు?.. పార్టీ టిక్కెట్ ఎవరికి దక్కనుందనేది ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది. కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ముద్దసాని దామోదర్‌రెడ్డి కుటుంబ సభ్యులకే టికెట్ దక్కనుందా లేక బీసీలకే అవకాశం రానుందా? అవసరమనుకుంటే జంప్ జిలానీల వైపు కారు పార్టీ మొగ్గుచూపుతుందా? అంటే, ఎవ్వరికీ అంతుచిక్కడం లేదనే సమాధానం వస్తుంది. అయితే డజన్‌కు పైగా అశావాహులు పోటీలో ఉన్నప్పటికీ.. బీ ఫామ్ దక్కించుకునే అదృష్టవంతులు ఎవరనే చర్చ సాగుతోంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ గులాబీ గూటికి గుడ్ బై చెప్పి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపిలో చేరడంతో ఉత్పన్నమవుతున్న హుజురాబాద్ ఉప ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొన్నటి వరకు టీఆర్ఎస్లో ఉండి మంత్రిగా కొనసాగిన ఈటల, రాజీనామా చేసి బీజేపిలో చేరి ఏడో సారి ఎమ్మెల్యేగా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బీజేపి అభ్యర్థిగా బరిలో నిలువనున్నారు. ఆత్మ గౌరవం పేరుతో బరిలో నిలుస్తున్న ఈటలను ఢీ కొట్టేందుకు అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి వెతుకులాటలో పడింది. ఈటలకు ధీటైన అభ్యర్థి కోసం కసరత్తు చేస్తోంది. మారుతున్న రాజకీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈటల బలం, బలహీనతలను బేరీజు వేసుకుంటు రాజకీయంగా దెబ్బతీసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఈటలపై పోటీ చేసేందుకు అశావాహులు జాబితా రోజురోజుకు పెరుగుతుంది. డజన్‌కు పైగా మంది ఇప్పటికే తమ పేరును పరిశీలించాలని కోరుతున్నప్పటికి పలు అంశాలను పరిగణలోకి తీసుకుని పలువురి పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. సామాజిక, రాజకీయ అంశాలతోపాటు స్థానికత, యువతను పరిగణనలోకి తీసుకుని ఈటలకు ధీటైన అభ్యర్థి కోసం ఆరా తీస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా మాజీ ఎమ్మెల్యేలు, రిటైర్డ్ ఐఏఎస్, ఇతర పార్టీల నేతల గురించి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. టాప్ ఫైవ్‌లో మాత్రం పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి కుటుంబం నుంచి లేదా కెప్టెన్ లక్ష్మీకాంతరావు కుటుంబం నుంచి అభ్యర్థిని ఎంపిక చేస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దామోదర్ రెడ్డి సోదరుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వేములవాడ టెంపుల్ అథారిటి వైస్ చైర్మెన్ ముద్దసాని పురుషోత్తం రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. దామోదర్‌రెడ్డి ఇమేజ్, రెడ్డి సామాజిక వర్గం ఓట్లు, నియోజకవర్గంలోని మామిడాలపల్లికి చెందిన స్థానికుడు, టీఆర్ఎస్ బ్రాండ్ కలిస్తే విజయం సాధించవచ్చనే అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. పురుషోత్తమ్ రెడ్డికి పరిపాలన పరమైన అనుభవం ఉన్నా, రాజకీయ పరమైన అనుభవం లేదు. ఇక అదే ఇంటి నుంచి దామోదర్ రెడ్డి తనయుడు కాశ్యప్ రెడ్డి టీఆర్ఎస్లో చేరి పోటీకి సిద్ధమవుతున్నారు. కాశ్యప్ రెడ్డి 2014లో ఈటలపై టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ కుటుంబం నుంచి కాకుంటే కేసీఆర్ రాజకీయంగా ఎదుగుదలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన కెప్టెన్ కుటుంబంలో వొడితెల రాజేశ్వర్ రావు మనువడు ప్రణవ్ బాబు పేరును సైతం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ రెండు కుటుంబాలను కాదనుకుంటే బీసీ అయిన ఈటలను మరో బీసీ నేతతో ఢీకొట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణను టీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. రమణ కాదంటే ఆ స్థాయిలో ఉన్న బీసీ నేత టీసీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్‌ను సైతం పార్టీలోకి అహ్వానించి అవకాశం ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. పొన్నం ఇమేజ్, విపక్షాలు చేసే విమర్శలకు దీటైన సమాధానం చెప్పే సత్తా ఉన్న నాయకుడిగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు కుటుంబాలు సామాజిక అంశం ప్రక్కన పెడితే మాజీ ఎంపీ వినోద్, కాంగ్రెస్‌లో ఉన్న ప్రవీణ్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, బీజేపీలో ఉన్న పెద్దిరెడ్డి పేర్లు సైతం వినిపిస్తున్నాయి. ఈటలకు రాజకీయంగా చెక్ పెట్టేందుకు నాగార్జునసాగర్ ఉపఎన్నికలో అనుసరించిన ఫార్ములాను హుజురాబాద్‌లో అమలు చేసే పనిలో గులాబీ దళపతి నిమగ్నమైనట్లు తెలుస్తోంది. సాగర్‌లో రాజకీయ అనుభవం లేని నోముల భగత్ బరిలో నిలిపి, సీఎం స్థాయి అభ్యర్థి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని రాజకీయాల నుంచి తప్పుకునే పరిస్థితి తీసుకువచ్చారు. అలాంటి పరిస్థితి రాజేందర్‌కు రావాలంటే హుజురాబాద్ ఉపఎన్నికలో రాజకీయంగా అనుభవం లేని వారిని బరిలో నిలిపి విజయం సాధించేందుకు కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. చదవండి: Huzurabad: టార్గెట్ ఈటల..పెద్దిరెడ్డి మాటల వెనుక అర్థం ఏమిటో? ‘ఈటలకు తొలిరోజే అవమానం’ -
ఉత్తర బంగాళాఖాతంలో ఈనెల 11న అల్పపీడనం!
సాక్షి, అమరావతి: ఉత్తర బంగాళాఖాతంలో ఈనెల 11న అల్పపీడనం ఏర్పడే అవకాశం వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక నేడు(బుధవారం), రేపు( గురువారం) రాయలసీమలో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం వాతావరణ శాఖ పేర్కొంది. కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బుధవారం భారీ వర్షం కురిసింది. హుస్నాబాద్, అక్కన్నపేట, కొహెడ మండలాల్లో భారీ వాన పడింది. మేడ్చల్, సిరిసిల్ల, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో భారీ వర్షం కురవడంతో పలు రోడ్లు, లోతట్టు పాంతాల్లో వాన నీరు నిలిచింది. ఇక రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు రానున్న రెండు మూడు రోజుల్లో రాష్ట్రమంతటా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రానికి పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నట్లు తెలిపింది. ఈనెల 11న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే సూచించింది. ఈనెల 11 నుంచి 13 వరకు భారీ వర్షాలు నమోదవుతాయని, ఉత్తర, తూర్పు ప్రాంతంలోని జిల్లాల్లో అతిభారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలున్నాయని వివరించింది. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రాగల 48 గంటల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని వివరించింది. చదవండి: గ్రామీణ రోడ్లకు విరివిగా నిధులు విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్ -
Huzurabad: మళ్లీ తెరపైకి పీవీ జిల్లా..
భీమదేవరపల్లి: దివంగత భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరిట ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలనే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. నూతన జిల్లాల ఏర్పాటు సమయంలో హుజురాబాద్ కేంద్రంగా పీవీ పేరిట జిల్లా ఏర్పాటు చేయాలని హుజురాబాద్ జిల్లా సాధన సమితి పేరిట ఉద్యమాలు జరిగాయి. అయితే పీవీ శతజయంతి ఉత్సవాలు సమీపిస్తున్న తరుణంలో.. హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్‌పై ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో ఆయన టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో హుజురాబాద్‌ను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే స్థానిక ప్రజలను టీఆర్ఎస్కు మరింత అనుకూలంగా మలుచుకోవచ్చని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. అలాగే వరంగల్ అర్బన్, రూరల్ జిల్లా కేంద్రాలు రెండు ఒకే చోట ఉండటంతో అభివృద్ధి వికేంద్రీకరణ జరగడం లేదన్న వాదన సైతం ఉంది. దీంతో వరంగల్ అర్బన్ జిల్లా స్థానంలో హుజురాబాద్‌ను ప్రకటించే అవకాశాలు సైతం లేకపోలేదని తెలుస్తోంది. వంగరలోని పీవీ విగ్రహం పట్టించుకోని నాయకులు పీవీ మరణానంతరం సొంత పార్టీ నాయకులే ఆయనను పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. అయితే దక్షాణాది రాష్ట్రాల నుంచి అత్యున్నతమైన ప్రధాని పీఠాన్ని అధిష్టించిన పీవీపై టీఆర్ఎస్ ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఆయన జయంతి, వర్ధంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడంతో పాటుగా రూ.11కోట్ల వ్యయంతో పీవీ స్వగ్రామమైన వంగరలో పీవీ స్మృతివనం, భీమదేవరపల్లి కస్తూరీబాగాంధీ పాఠాశాల నుంచి వంగర వరకు డబుల్ బీటీ రోడ్డు, ఆర్చీ తదితర పనులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా పీవీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని తలపెట్టింది. ఈనెల 28న పీవీ శతజయంతి నేపథ్యంలో వంగరలోని పోలీస్‌స్టేషన్ ఎదుట పీవీ స్మృతివనం పనులు సైతం జరుగుతున్నాయి. ఇప్పటికే పీవీ నివాస గృహాన్ని వారి కుటుంబ సభ్యులు ఆధునీకరించడంతో పాటుగా పీవీ ఉపయోగించిన వస్తువులను హైదరాబాద్ నుంచి వంగరకు తరలించి భద్రపరిచారు. వాటిని పీవీ ఇంట్లో ఏర్పాటు కానున్న మ్యూజియంలో ప్రదర్శించనున్నారు. 12 మండలాలతో నూతన జిల్లా.. కాగా హుజురాబాద్ జిల్లా ఏర్పాటుకు 12 మండలాలు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. పీవీ గ్రామమైన వంగరకు 8 కిలోమీటర్ల దూరంలోని హుజురాబాద్‌ను జిల్లా కేంద్రంగా ప్రకటించి అందులోకి వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోని భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాలు, కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, శం కరపట్నం, సైదాపూర్, చిగురుమామిడితో పాటుగా భీమదేవరపల్లి మండల పరిధిలోని పీవీ స్వగ్రామం వంగర, వీరభద్రస్వామి దేవస్థానం కల్గిన కొత్తకొండను మండలాలుగా ఏర్పాటు చేసి మొత్తం 12 మండలాలతో నూతన జిల్లా ఏర్పాటు కు అవకాశాలు మెండుగా ఉన్నట్లు సమాచారం. వంగరలోని పీవీ ఇల్లు శతజయంతి ఉత్సవాల్లో ప్రకటించే అవకాశం ఈనెల 28న జరగనున్న పీవీ శతజయంతి ఉత్సవాల్లో హుజురాబాద్‌ను జిల్లాగా ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇక్కడ జరిగే ఉప ఎన్నికల్లో ఈటలకు చెక్ పెట్టడంతో పాటుగా ఈ ప్రాంత ప్రజలను టీఆర్ఎస్ వైపు తిప్పుకోవడంలో సఫలీకృతం కావచ్చనే అభిప్రాయం ఆ పార్టీలో నెలకొంది. అయితే ఇప్పటికే పీవీ కూతురు సురభి వాణీదేవీకి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి గెలిపించిన విషయం తెలిసిందే. అయితే పీవీ శతజయంతి ఉత్సవాలకు వంగరకు సీఎం కేసీఆర్ హాజరై జిల్లా ప్రకటనతో పాటుగా ఈ ప్రాంత అభివృద్ధిపై వరాల జల్లు కురిపించే అవకాశాలున్నట్లు ఆ పార్టీ నేతలు, రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. దీక్షకు సిద్ధమవుతున్న గ్రామస్తులు అయితే పీవీ పేరిట జిల్లా ఏర్పాటుతో పాటుగా వంగరను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని స్థానికులు కండె రమేశ్, కండె చక్రపాణి, కండె సుధాకర్ తదితరులు దీక్షకు సిద్ధమవుతున్నారు. వీరితో పాటు కొత్తకొండను మండలంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో చెప్యాల ప్రకాశ్, ఉప్పుల కుమారస్వామి, సిద్దమల్ల కృష్ణ తదితరులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. చదవండి: Huzurabad: ఉప ఎన్నికపై గులాబీ వ్యూహం -
Etela Rajender: ఈటలతో పాటే తుల ఉమ రాజీనామా?!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఊహించినదే జరిగింది. నెలరోజుల ఉత్కంఠకు ముగింపు లభించింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తనకు రాజకీయ జీవితాన్నిచ్చిన టీఆర్ఎస్ పార్టీతో తెగతెంపులు చేసుకున్నారు. తన మద్దతుదారులతో కలిసి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేశారు. ఆ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకుంటానని ప్రకటించారు. దీంతో 19 సంవత్సరాల పాటు టీఆర్ఎస్తో ఉన్న అనుబంధానికి ఫుల్స్టాప్ పడింది. ఢిల్లీలో బీజేపీ జాతీయ నాయకులను కలిసి వచ్చిన తరువాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ను వదిలి బీజేపీలో చేరాలని ఈటల నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తరువాతే బీజేపీలో చేరాలనే నిబంధన మేరకే ఆయన శుక్రవారం పార్టీకి రాజీనామా చేశారు. ఒకటి రెండు రోజుల్లో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి తన రాజీనామా లేఖను పంపించనున్నారు. ఈ వారం రోజుల్లోనే ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉంది. 11వ తేదీ వరకు మంచిరోజులు లేకపోవడంతో బీజేపీలో చేరిక కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు ఈటల వర్గాల ద్వారా తెలిసింది. ఈటల రాజీనామా ఆమోదం పొందితే మరోసారి హుజూరాబాద్‌కు ఉప ఎన్నిక అనివార్యం కానుంది. పార్టీ కార్యకర్త నుంచి మంత్రిగా ఎదిగి.. తెలంగాణ రాష్ట్ర సమితి చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు టీఆర్ఎస్ స్థాపించిన తరువాత 2002లో ఈటల రాజేందర్ గులాబీ కండువా కప్పుకున్నారు. ఉద్యమాల ఖిల్లాగా పేరొందిన కరీంనగర్ జిల్లా నుంచి టీఆర్ఎస్లో చేరిన కొద్దిమంది ముఖ్య నాయకుల్లో ఆయన ఒకరు. బీసీ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకొని పౌల్ట్రీ పరిశ్రమను స్థాపించిన ఈటలను కేసీఆర్ ప్రోత్సహించారు. అందులో భాగంగానే సామాన్య కార్యకర్తగా పార్టీలో చేరిన ఆయనకు రాజకీయంగా అవకాశాలు కల్పించారు. కేసీఆర్‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొనడం, బీసీ నాయకుడిగా గొంతెత్తడం ఉత్తర తెలంగాణలో ఆయన కీలక నేతగా ఎదిగేందుకు దోహదపడ్డాయి. ఈ క్రమంలోనే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పార్టీ ముఖ్య నాయకుల్లో ఒకరిగా, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పలు పదవులు నిర్వర్తించారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కమలాపూర్ నుంచి పోటీ చేసి అప్పటి టీడీపీ నేత, మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డిపై తొలిసారి విజయం సాధించారు. నాటి నుంచి వెనుదిరిగి చూడని ఈటల 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి ఘన విజయం సాధించారు. 2009లో శాసనసభ స్థానాల పునర్విభజనలో హుజూరాబాద్‌కు వెళ్లిన ఈటల మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేసి విజయాన్ని అందుకున్నారు. 2010లో తెలంగాణ ఆత్మగౌరవ నినాదంతో జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి గెలిచారు. శాసనసభలో టీఆర్ఎస్ ఎల్పీ నాయకుడిగా 2014 వరకు కొనసాగారు. 2014లో రాష్ట్ర అవతరణ అనంతరం జరిగిన ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి కేసీఆర్ కేబినెట్లో ఏకంగా ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2018 ఎన్నికల్లో గెలిచి టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు హుజూరాబాద్ ఎమ్మెల్యేగానే రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తరువాత జరిగిన పరిణామాలతో నెలరోజుల క్రితం మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన ఈటల ఇప్పుడు పార్టీకి రాజీనామా చేశారు. రేపోమాపో ఎమ్మెల్యే పదవికి గుడ్‌బై చెప్తారు. నియోజకవర్గంలోని ప్రతీ మండలం నుంచి కనీసం 50 మందికి తగ్గకుండా స్థానిక నాయకులు శుక్రవారం శామీర్‌పేటలోని ఈటల నివాసానికి వెళ్లి మద్దతు ప్రకటించారు. కాగా.. ఈటల టీఆర్ఎస్కి రాజీనామా చేసి హుజూరాబాద్‌కు రానున్న నేపథ్యంలో టీఆర్ఎస్ కౌంటర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఉప ఎన్నిక అనివార్యం అని తేలడంతో మాజీ మంత్రిపై ముప్పేట దాడికి టీఆర్ఎస్ రంగం సిద్ధం చేస్తోంది. ఈనెల 11, 12 తేదీల్లో మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్ తదితర ముఖ్య నాయకులతో హుజూరాబాద్‌లో పర్యటన ఖరారైంది. మొత్తంగా మండలాల్లో ఈటలకు మద్దతుగా ని లిచిన పార్టీ కేడర్‌ను కూడా ఆయనకు దూరం చేసే ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఈటల రాజీ నామా ప్రకటన తరువాత ఆయన సొంత మండలం కమలాపూర్‌లో టీఆర్ఎస్ నాయకులు శుక్రవారం సంబరాలు చేసుకోవడం, కేసీఆర్ ఫొటో కు క్షీరాభిషేకం చేయడం వంటి చర్యలు గులాబీ పార్టీ వ్యూహాన్ని బహిర్గతం చేస్తోంది. ఈటల రాజీనామాతో రాజకీయం మరింత వేడెక్కింది. ముప్పేట దాడికి టీఆర్ఎస్ ప్రణాళిక మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైనప్పటి నుంచే ఈటల రాజేందర్‌పై టీఆర్ఎస్ అధిష్టానం నజర్ పెట్టింది. కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్‌ను ఇన్చార్జిగా నియమించింది. హుజూరాబాద్ నుంచి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులెవ్వరూ ఆయన వెంట వెళ్లకుండా ‘కట్టుదిట్టమైన’ ఏర్పాట్లు చేయించింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఈటల వెంట జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ తుల ఉమతోపాటు హుజూరాబాద్‌కు చెందిన కొందరు నాయకులు మినహా ఎవరూ వెళ్లలేదు. ప్రజాబలం తనకు ఉందని చెపుతున్న ఈటలను ప్రజాప్రతినిధులను కట్టడి చేయడంతో ఇరుకున పెట్టి విజయం సాధించారు. ఈ క్రమంలో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. చదవండి: ఈటల వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతల కౌంటర్ -
Coronavirus: మమ్మీ, డాడీ.. ఎప్పుడొస్తారు?
సాక్షి, జగిత్యాల: లేవగానే గుడ్‌మార్నింగ్ చెప్పే డాడీ గొంతు కొద్దిరోజులుగా వినిపించట్లేదు. అల్లరి చేస్తే.. వారించే మమ్మీ కనిపించట్లేదు. జ్వరం వచ్చిందని ఆస్పత్రికి వెళ్లిన అమ్మానాన్న తిరిగి రాలేదు. గేటు చప్పుడు అయినప్పుడల్లా అమ్మానాన్న వచ్చారన్న సంబరంతో పరిగెత్తుకెళ్తున్నారు. అభం శుభం తెలియని చిన్నారులకు తల్లిదండ్రుల మరణవార్త తెలియకపోవడంతో ‘అమ్మా, నాన్న ఎక్కడ’అంటూ ప్రశ్నిస్తున్నారు. రేపు వస్తారంటూ బంధువులు చెప్పే మాటలు నమ్మి ఎదురుచూస్తున్నారు. జగిత్యాల జిల్లా పురాణిపేటకు చెందిన వనమాల నాగరాజు(38) బెంగళూరు లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడి భార్య లహరిక (32) గృహిణి. వీరికి ఇద్దరు పిల్లలు దివిజ (10), హైందవి (6). బెంగళూరులో ఉండగా, నెల కింద వారందరికీ కరోనా సోకింది. మొదట భార్య.. తర్వాత భర్త.. తొలుత అందరూ హోం ఐసోలేషన్ లో ఉండి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే కొద్దిరోజులకే దంపతులిద్దరి పరిస్థితి విషమంగా మారింది. దీంతో కుటుంబం మొత్తం హైదరాబాద్‌కు వచ్చింది. భార్యభర్తలిద్దరూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. త్వరలోనే వచ్చేస్తామంటూ చిన్నారులిద్దరినీ బంధువుల ఇంటికి పంపారు. నాగరాజుకు అమ్మానాన్న లేకపోవడంతో బంధువులే వారిని చూసుకున్నారు. మే 12న లహరిక ఆరోగ్యం విషమించి చికిత్స పొందుతూ చనిపోయింది. విషయం నాగరాజుకు చెబితే అతడి ఆరోగ్యం దెబ్బతిని ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని బంధువులు చెప్పలేదు. హైదరాబాద్‌లోనే లహరిక అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే 4 రోజుల తర్వాత భార్య చనిపోయిన విషయం నాగరాజుకు తెలిసింది. ఆ తర్వాత అతడి ఆరోగ్య పరిస్థితి కూడా విషమించి చికిత్స పొందుతూ మే 17న చనిపోయాడు. నాగరాజు మృతదేహానికీ మున్సిపల్ సిబ్బందే అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా, ఇద్దరి చికిత్సకు రూ.25 లక్షలకు పైగా ఖర్చయినా ప్రాణాలు దక్కలేదు. చదవండి: Corona Vaccine: టీకా వేసుకున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి! -
కేటీఆర్ భరోసా: ‘గూడు చెదిరిన గువ్వల’ ‘సాక్షి’ కథనం
సిరిసిల్ల: కరోనా కాటుకు అమ్మానాన్నలను కోల్పోయి అనాథలైన అన్నాచెల్లెళ్ల భవిష్యత్‌కు తాను భరోసా ఇస్తున్నానని రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కె.తారక రామారావు సోమవారం స్పష్టం చేశారు. సిరిసిల్ల పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన ఆటో డ్రైవర్‌షేక్ ఖలీమ్ (40), అతడి భార్య నికత్ తబుసమ్ (38) ఐదు రోజుల వ్యవధిలో కరోనాతో మృతి చెందారు. దీంతో ఆ దంపతుల పిల్లలు అమాన్ (15), రుమాన (13) అనాథలయ్యారు. పిల్లలు కూడా కరోనాతో బాధపడుతున్నారు. పిల్లల పరిస్థితిపై ‘గూడు చెదిరిన గువ్వలు’శీర్షికన ‘సాక్షి’లో సోమవారం కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్.. కలెక్టర్ కృష్ణభాస్కర్‌తో మాట్లాడారు. ఆ పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత వారి చదువులు, భవిష్యత్‌కు తాను అండగా ఉంటానని మంత్రి వెల్లడించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ అధికారి ఎల్లయ్య, చైల్డ్‌లైన్ సిబ్బంది విద్యానగర్‌లోని చిన్నారుల ఇంటికి వెళ్లి నెలరోజులకు సరిపడా నిత్యావసరాలు అందజేశారు. పిల్లలను మెరుగైన వైద్యం కోసం సిరిసిల్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు వారి వైద్య చికిత్సలను పర్యవేక్షించారు. చదవండి: కరోనా కల్లోలం: గూడు చెదిరిన గువ్వలు -
Putta Madhu: 10 రోజుల అజ్ఞాతంపై నోరు విప్పిన పుట్టా!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హైకోర్టు న్యాయ వాది వామన్‌రావు దంపతుల హత్యతో తనకెలాంటి సంబంధం లేదని ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు పోలీసులకు చెప్పినట్టు సమాచారం. సంబంధం లేనప్పుడు 10 రోజుల పాటు ఎందుకు పారిపోయారని ప్రశ్నించగా.. కేసులకు భయపడి అజ్ఞాతంలోకి వెళ్లానని సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. కుంట శ్రీను, బిట్టు శ్రీను, ఇతరులు వారి వ్యక్తిగత కారణాల వల్లనే వామన్‌రావు దంపతులను హత్య చేసి ఉంటారని పేర్కొ న్నట్టు సమాచారం. దీంతో కేసు పురోగతి దిశగా పోలీసులకు ఆధారాలేమీ లభించలేదని తెలిసింది. మంగళవారం నాలుగో రోజు మధు దంపతులను గంటన్నరపాటు విచారించిన పోలీసులు తిరిగి పంపించేశారు. తామెప్పుడు పిలిచినా హాజరు కావాలని స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు వేర్వేరు వాహనాల్లో వచ్చిన మధు, ఆయన భార్య శైలజను పోలీసులు వేర్వేరుగానే విచారించారు. ఈ కేసులో వీరి ప్రమేయంపై స్పష్టమైన ఆధారాలు లభించలేదని ఓ అధికారి ‘సాక్షి’తో చెప్పారు. 34 ఖాతాల పరిశీలన పూర్తి ఈ కేసుకు సంబంధించి పలువురి బ్యాంకు ఖాతాలను 4 రోజులుగా పరిశీలించిన పోలీసులు.. అనుమానాలకు తావిచ్చే స్థాయిలో లావాదేవీలు లేవని నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. మొత్తం 39 ఖాతాల ను పరిశీలించాల్సి ఉండగా.. ఇంకా 5 ఖాతాల సమాచారం రావలసి ఉందని ఓ అధికారి తెలిపారు. దీంతో మరో 3 రోజుల పాటు విచారణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటికి వెళ్లేందుకు అనుమతి పుట్ట మధును ఈనెల 8న ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం నుంచి రామగుండం తీసుకువచ్చినట్లు ప్రకటించిన పోలీసులు.. సోమవా రం రాత్రి వరకు కమిషనరేట్‌లోనే ఉంచి విచారించారు. తర్వాత ఇంటికి వెళ్లేందుకు అనుమతిచ్చారు. రాత్రి 11 గంటల తర్వాత మంథని వచ్చిన మధుకు నేతలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం జయశంకర్ భూపాలపల్లి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్శిణి, పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్రఘువీర్సింగ్, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఆయన నివాసానికి వచ్చి కలిశారు. చదవండి: Etelaకు చెక్.. టీఆర్ఎస్ భావి నేతగా తెరపైకి కౌశిక్ రెడ్డి! -
లాయర్ల హత్య కేసు: ఏరోజు ఏం జరిగిందంటే..?
సాక్షి, హైదరాబాద్: న్యాయవాదులైన గట్టు వామనరావు దంపతుల హత్య కేసులో అనుమానితుడిగా అరెస్టయిన పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు అదృశ్యం, అరెస్టు సంచలనంగా మారింది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు బీజం మార్చిలోనే పడినట్లు అర్థమవుతుంది. పుట్ట, అతని అనుచరులకు సంబంధించి మార్చిలోనే బలమైన ఆధారాలు లభించాయి. సూత్రధారులు, పాత్రధారులు ఎవరన్న విషయంలో ఇద్దరు కీలక పోలీసు ఉన్నతాధికారులకు ఈ ఆధారాలు చేరడంతో మంథనిలో పరి ణామాలు వేగంగా మారాయి. అనేక ఆకస్మిక మా ర్పులు చోటు చేసుకున్నాయి. మార్చి నుంచి పరిణామాలను పరిశీలిస్తే ఇవన్నీ అవగతమవుతాయి. ఏరోజు ఏం జరిగిందంటే..? ► మార్చి 26: మంథని కోర్టులో బిట్టు శ్రీనుతో వీడియో కాల్ చేయించే ప్రయత్నం చేశారన్న ఆరోపణలతో మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజపై కేసు నమోదు. ► మార్చి 31: 2018లో కుంట శ్రీను ఓ హత్యకు రూ.60 లక్షల సుపారీ మాట్లాడిన ఆడియో టేపుపై ఫోరెన్సిక్ విచారణ కోసం పోలీసుల పిటిషన్ ► ఏప్రిల్ 3: మంథని ఇన్స్పెక్టర్గా ఉన్న మహేందర్ బదిలీ. ఆయన స్థానంలో మహేందర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ ► ఏప్రిల్ 16: ఐజీ నాగిరెడ్డికి గట్టు వామనరావు తండ్రి కిషన్ రావు లేఖ. పుట్ట మధు, పుట్ట శైలజ, పూదరి సత్యనారాయణల పాత్రలపై లోతుగా దర్యాప్తు జరపాలని వినతి. ► ఏప్రిల్ 29: మధు కీలక అనుచరుల్లో ఒకరి విచారణ ► ఏప్రిల్ 30: విచారణకు రావాలని మధుకు నోటీసులు. అదేరోజు రాత్రి నుంచి మధు అదృశ్యం. ► మే 1: మధు కోసం గాలింపు మొదలు. ► మే 6: మంథని నియోజకవర్గంలో ఉన్న రామగిరి, ముత్తారం, బసంత్‌నగర్, మంథని ఎస్సైల బదిలీ. ► మే 7: మంథని ఇన్స్పెక్టర్ మహేందర్‌రెడ్డి బదిలీ ► మే 8: మధు ఏపీలోని రాజమండ్రి సమీపంలో ఉన్నట్లు గుర్తింపు. ► మే 9: భీమవరంలో పుట్ట మధును అదుపులోకి తీసుకున్న పోలీసులు, అదేరోజు సాయంత్రానికి రామగుండం కమిషనరేట్‌కు చేరుకున్నారు. ► మే10: మధును విచారించిన పోలీసులు. గుంజపడుగులో అక్రమ నిర్మాణాల వద్ద గ్రామపంచాయతీ అధికారులు సాంకేతిక ఆధారాలే కీలకం.. ఈ కేసులో మొదటి నుంచి పుట్ట మధు పేరు బలంగానే వినిపిస్తోంది. మార్చిలో దర్యాప్తు వేగం పుంజుకుంది. మే 17న చార్జిషీటు దాఖలు చేయాల్సిన సమయం దగ్గర పడుతున్న సమయంలోనే పుట్ట మధును విచారణకు పిలవడం గమనార్హం. ఈ క్రమంలో పుట్ట మధు, అతని భార్య పుట్ట శైలజ, మార్కెట్ కమిటీ చైర్మ¯Œ పూదరి సత్యనారాయణలు విచారణలో ఏం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో పోలీసులు పలు సాంకేతిక ఆధారాలపై దృష్టి సారించారు. అవి ఏంటంటే..! ► ఫిబ్రవరి 17న గట్టు వామన్ రావు హత్య జరిగిన తరువాత.. నిందితులు కుంట శ్రీను, బిట్టు శ్రీనులు మాట్లాడిన కాల్ డేటా రికార్డ్ (సీడీఆర్) కీలకం కానుంది. ఈ వివరాలు పోలీసులు ఇప్పటికే సేకరించినట్లు తెలిసింది. ► వామన్‌రావు మరణవాంగ్మూలం వీడియోలు కూడా కీలకం కానున్నాయి. అందులో ఓ వీడియోలో పుట్ట మధు పేరునూ చెప్పినట్లు ఉంది. దీనికి సంబంధించిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక పోలీసుల చేతిలో ఉన్నట్లు సమాచారం. ► కుంట శ్రీను రూ.60 లక్షలకు 2018లో సుపారీ ఎవరితో మాట్లాడాడు? అతడు దొరికితే ఎవరి హత్యకు సుపారీ మాట్లాడారు? అన్న విషయాలు వెలుగుచూస్తాయి. ► గుంజపడుగులో శ్రీను అక్రమ ఇంటి నిర్మాణానికి గ్రామపంచాయతీ గతంలో అభ్యంతరం తెలిపింది. అయినా పనులు ఆగలేదు. దీని వెనక ఎవరున్నారో తెలుసుకునే యత్నం చేస్తున్నారు. బిట్టు శ్రీను వాడిన కారు వివరాలు ఏడాదైనా నంబర్‌ప్లేటు ఏదీ? బిట్టు శ్రీను హత్యకు ఉపయోగించిన కారు విషయంపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ మారుతీ బ్రిజా కారును 2020 ఫిబ్రవరిలో కొన్నారు. అదే నెల 24న టీఎస్22ఈ1288 నంబరుతో పర్మినెంటు రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ వాహనం బిట్టు శ్రీను భార్య తులసిగారి స్వరూప పేరు మీద ఉంది. ఏడాది కిందటేరిజిస్ట్రేషన్ చేసినా హత్య జరిగేరోజు వరకు టెంపరరీ రిజిస్ట్రేషన్ తోనే బిట్టు శ్రీను సంచరించాడు. అదే విధంగా కారుకు ఉన్న నల్ల అద్దాల షీట్ కూడా తీయలేదు. వాస్తవానికి వాహనం అద్దాలకు నల్లఫిల్మ్ ఉంటే పోలీసులు చర్యలు తీసుకోవాలి. ఈ కారు కొనుగోలు వెనక ఎవరున్నారు? ఎవరు సమకూర్చారు? అన్న విషయాలపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. -
ఒంట్లో బాగోలేదని: బామ్మను ఇంట్లోకి అనుమతించని మనుమరాలు
సాక్షి, వేములవాడ: ఆమె శతాధిక వృద్ధురాలు.. నిలువనీడలేదు.. మండుటెండలు.. పైగా అనారోగ్యం.. జీవిత చరమాంకంలో ఆ బామ్మకు ఎంత కష్టం! మాతృ దినోత్సవం రోజునే ఈ ముసలమ్మకు ఎంత కష్టం! తలదాచుకునేందుకు దిక్కులేక బిక్కుబిక్కుమంటోంది.. రోడ్డు పక్కన టెంట్ కింద మూలుగుతోంది. ఎములాడ రాజన్నకు కూడా ఆమె మూగరోదన వినిపించనట్టుంది! ‘బామ్మా.. మా ఇంటికి రా’అని ఆపన్నహస్తం అందించేవారే కరువయ్యారు. మానవత్వం మంటగలిసింది. వివరాలు... రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన పంబి వెంకటస్వామి తన తల్లి తులసమ్మ(103), భార్యతో కలసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. నాలుగు రోజుల క్రితం తులసమ్మ ఆరోగ్యం క్షీణించింది. ఆమె చనిపోతే తమకు అరిష్టమని భావించి ఇంటి యజమానులు వారిని బయటకు వెళ్లగొట్టారు. దీంతో వెంకటస్వామి తల్లి, భార్యను తీసుకుని అదే పట్టణంలో ఉంటున్న తన కుమార్తె సునీత ఇంటికి వెళ్లాడు. అయితే, సునీత, ఆమె కుమారుడు శ్రీకాంత్, కూతురు.. బామ్మను ఇంట్లోకి రానివ్వలేదు. అనారోగ్యంతో బాధపడుతున్న బామ్మకు ఏమైనా అయితే మంచిది కాదని భావించి, ఇంటికి తాళం వేసి ఎటో వెళ్లిపోయారు. దీంతో వెంకటస్వామి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల సూచనతో మళ్లీ అద్దె ఇంటికి వెళ్లినా యజమానులు అనుమతించలేదు. గత్యంతరంలేక మళ్లీ తన కూతురి ఇంటికి వెళ్లాడు. మళ్లీ ఆమె ససేమిరా అనడంతో రోడ్డు పక్కన టెంట్ వేసుకొని దాని కిందే తన తల్లితో కలసి తలదాచుకుంటున్నారు. పోలీసులు స్పందించి వెంకటస్వామి కూతురు, మనుమడు, మనుమరాలుకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. చదవండి: వేల ఏళ్ల క్రితమే కరోనా కజిన్ సిస్టర్! -
వామన్‌రావు దంపతుల హత్య కేసులో కీలక మలుపు
సాక్షి, కరీంనగర్ : వామన్‌రావు దంపతుల హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. పుట్ట మధు సహా మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండవ రోజు పుట్ట మధును పలు అంశాలపై విచారించారు. హత్యకు ముందు రూ.2 కోట్లు విత్‌డ్రా విషయం సహా.. ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్ ఇంటి నిర్మాణంపైనా ఆరా తీశారు. వామన్‌రావు తండ్రి కిషన్‌రావునూ విచారించారు. హత్యలో పుట్ట మధు, భార్య శైలజ ప్రమేయం ఉందని కిషన్‌రావు చెప్పారు. కాగా, ఈ జంటహత్యల కేసులో ఇప్పటికే ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను కీలకంగా ఉన్నారు. -
Putta Madhu: హత్యకు ముందు డ్రా చేసిన 2 కోట్లపై ఆరా
సాక్షి, పెద్దపల్లి: న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధును పోలీసులు రెండో రోజు విచారిస్తున్నారు. లాయర్ల హత్య జరగడానికి ముందు పుట్టా మధు రూ. 2 కోట్లు డ్రా చేసిన వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హత్య కేసు ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్ జైల్లో ఉండగా గుంజపడుగులో నిందితుడి ఇంటి నిర్మాణం శరవేగంగా సాగడంపై కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు. అదేవిధంగా పుట్టా మధు అనుచరులు సత్యనారాయణ, సతీష్ పోలీసుల అదుపులో ఉన్నారు. గతంలో న్యాయవాద దంపతులు పుట్టా మధు దంపతులపై కోర్టులో కేసులు వేసిన విషయం తెలిసిందే. న్యాయవాది దంపతుల హత్య కేసులో పుట్టా శైలజను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక నాలుగు రాష్ట్రాల్లో 4 వాహనాలను మారుస్తూ పట్టా మధు 6 ఫోన్లు మార్చినట్లు పోలీసులు వెల్లడించారు. చదవండి: Putta Madhu: అత్యంత పకడ్బందీగా అజ్ఞాతం చదవండి: సంచలనం సృష్టించిన పుట్ట మధు అదృశ్యం కేసు -
Putta Madhu: భీమవరం ఎపిసోడ్లో నిజమెంత?
సాక్షి, హైదరాబాద్: న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అజ్ఞాతంలోకి వెళ్ళిన పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు.. తన ఆచూకీ పోలీసులకు చిక్కకుండా చాలా పకడ్బందీగా వ్యవహరించాడు. నిన్నమొన్నటి వరకు ఎక్కడా సెల్‌ఫోన్ వాడలేదు, కుటుంబ సభ్యులు, అనుచరులను ఫోన్లో సంప్రదించలేదు. సొంత వాహనం వాడలేదు. హోటళ్లు, లాడ్జిలలో కాకుండా తెలిసిన వారి వద్దే తలదాచుకున్నాడు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌తో పాటు వివిధ రాష్ట్రాల్లో తిరిగాడనే అనుమానాలున్నా, ఎక్కడా సొంత ఏటీఎం కార్డు కూడా వాడలేదంటే ఎంత పకడ్బందీగా వ్యవహరించాడో అర్థమవుతోంది. మధుకు ఆప్తుడైన కర్ణాటకకు చెందిన ఓ మిత్రుడికి ఏపీలోని రావులపాలెంలో ఉన్నవారితో సంబంధాలు ఉన్నాయని, ఆ పరిచయాల ఆధారంగా మధు భీమవరంలో ఆశ్రయం పొందినట్లు పోలీసువర్గాలు చెబుతున్నాయి. మధు ఆచూకీ కనిపెట్టాలని మధుకు దగ్గరగా ఉండే ఓ ఇన్స్పెక్టర్ను ఉన్నతాధికారులు ఆదేశించారని, ఆ అధికారి సూచనల మేరకు ఇటీవల కుటుంబ సభ్యులు మధును సంప్రదించగా.. ఆ సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా భీమవరంలో అతని జాడను కనిపెట్టారని చెబుతున్నారు. సుపారీ టేపులపై రెండున్నరేళ్ల తర్వాత కేసు! వామన్‌రావు దంపతుల హత్య కేసు నిందితుల్లో ఒకరైన కుంట శ్రీను పేరుతో, 2018 ఎన్నికలకు ముందు మధు పేరును ప్రస్తావిస్తూ ఓ హత్యకు సంబంధించి జరిగిన సుపారీ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హత్యకు డీల్ రూ.60 లక్షలకు కుదిరింది. రెండున్నరేళ్ల తర్వాత, వామన్‌రావు హత్య అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు, ఇటీవల వాయిస్ టెస్టుకు అను మతి కోరుతూ మంథని కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఇన్ని రోజులు కుంటశ్రీను ఎవరితో సుపారీ మాట్లాడాడు? అసలు ఆ గొంతు ఎవరిది? అన్న విషయాన్ని తేల్చకపోవడం గమనార్హం. చదవండి: లాయర్ల హత్య: ‘అప్పటి ఆరోగ్య మంత్రిపై అనుమానం’ -
అసైన్డ్ భూమిని ఆక్రమించడం తప్పు కాదా..?
హుజూరాబాద్: బాధ్యత గల మంత్రిగా ఉంటూ ఈటల రాజేందర్ 66 ఎకరాల అసైన్డ్ భూములను ఆక్రమించడం తప్పు కాదా?’ అని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు ప్రశ్నించారు. బుధవారం హుజూరాబాద్ మండలం సింగాపూర్‌లోని తన నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడారు. హుజూ రాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలను ఈటల ప్రోత్సహించారని ఆరోపించారు. కమలాపూర్ నియోజకవర్గంలో 2001లోనే బలమైన పార్టీగా అవతరించిందని, 2004లో ఈటల టీఆర్ఎస్లోకి వచ్చారన్నారు. ఈటలను సీఎం సొంత తమ్ముడిలా చూసుకున్నారని, పార్టీలో అధిక ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. ‘రైతుబంధు’ను కేసీఆర్ ఇక్కడే ప్రారంభించారని.. అయినా పథకాలపై వ్యతిరేక ధోరణితో ఈటల మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. చదవండి: ‘కేసీఆర్ బయటకు రా.. ప్రజల కష్టాలు చూడు’ -
సీఎం కేసీఆర్ చిన్ననాటి స్నేహితుడు మృతి
సాక్షి, మానకొండూర్: ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్ననాటి స్నేహితుడు, కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం కొండపల్కల గ్రామానికి చెందిన తిరునగరి సంపత్‌కుమార్ గుండెపోటుతో బుధవారం రాత్రి కన్నుమూశారు. కేసీఆర్, సంపత్‌కుమార్ చదువుకునే రోజుల్లో మంచి మిత్రులని, ఒకే గదిలో ఉండేవారని గ్రామస్తులు తెలిపారు. సీఎం హోదాలో కేసీఆర్ కొన్ని నెలల క్రితం కరీంనగర్‌కు వచ్చినప్పుడు ఉత్తర తెలంగాణ భవన్లో ఉన్న కేసీఆర్‌ను కలిసేందుకు సంపత్‌కుమార్ వెళ్లారు. సంపత్‌కుమార్‌ను చూసి సీఎం చిరునవ్వుతో పలకరించి, ఆప్యాయతతో హత్తుకున్నారు. అక్కడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు ఆయన సంపత్‌ను పరిచయం చేశారు. హైదరాబాద్‌లో ఒకే గదిలో కలసి ఉన్న జ్ఞాపకాలను సీఎం గుర్తు చేయడంతో సంపత్‌కుమార్ ఆ రోజు సంతోషపడ్డారు. కాగా, సంపత్‌కుమార్ అవివాహితుడు కావడంతో ఆయన సోదరుడు అంత్యక్రియలు నిర్వహించారు. చదవండి: పోరాటయోధుడు గుమ్మి పుల్లన్న మృతి సింగరేణిలో ఉద్యోగాలు; హైకోర్టు కీలక ఆదేశాలు -
స్మార్ట్ సిటీ తెచ్చిన ఘనత వినోద్ కుమార్‌దే: మంత్రి
సాక్షి, కరీంనగర్: జిల్లాకు స్మార్ట్ సిటీ తెచ్చిన ఘనత ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్‌దేనని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. జిల్లా అభివృద్ధిలో పాలుపంచుకొని నగరాభివృద్ధికి కృషి చేస్తున్న ఆయనకు ప్రత్యేక అభినంద తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సాహసోపేత నిర్ణయంతో విప్లవాత్మకమైన రెవెన్యూ చట్టాన్ని తెచ్చారు. సీఎం కేసిఆర్ ఎలాంటి చట్టాన్ని ప్రవేశ పెట్టిన ప్రజల శ్రేయస్సు కోసమే. భూమి తగాదాలను నివారించడం కోసం కేసీఆర్ ఈ చట్టన్ని రూపొందించారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తుంది. ఎన్నో ఏళ్ళనాటి భూ సమస్యలకు ఈ చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుంది. కరీంనగర్ జిల్లా అధికార యంత్రాంగం, రాజకీయ యంత్రాంగం కలిసి టీమ్ వర్క్‌గా పని చేస్తున్నాం. ఈ టీమ్‌ను ప్రజల సేవ కోసం సీఎం కేసీఆర్ తయారు చేశారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా జిల్లాను అభివృద్ది బాటలో తీర్చిదిద్దడమే టీం ప్రధాన లక్ష్యం. (బీజేపీకి తెలంగాణలో భవిష్యత్ లేదు) కరీంనగర్ నగర ప్రజలకు సాగు, త్రాగు నీటికి ఎలాంటి ఇబ్పంది లేదు. ఇది శుభ పరిణామం. గతంలో అడవులకు పుట్టినిల్లు కరీంనగర్ జిల్లా. జిల్లాల విభజనతో కరీంనగర్‌కు అడవుల శాతం తగ్గింది. 33 జిల్లాల్లో అతి తక్కువ అడవులు ఉన్న జిల్లాగా మారింది. కాంక్రీట్ జంగల్‌గా మారిన జిల్లాలో యుద్ద ప్రాతిపదిక మొక్కలు నాటుతున్నాం. జిల్లా వ్యాప్తంగా 6వ విడుతలో 55 లక్షల మొక్కలు నాటడానికి శ్రీకారం చుట్టాం. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 43.85 లక్షల మొక్కలను నాటాం. 15 రోజుల సమయంలో మిగిలిన మొక్కలు నాటి టార్గెట్ పూర్తి చేస్తాం. రానున్న రెండు సంవత్సరాల్లో వనాలకు పుట్టినిల్లుగా కరీంనగర్‌ను మారుస్తాం. సీఎం చొరవతో అందమైన రోడ్లు వేశాం. చిరకాల వాంఛ అయిన మంచి నీటిని ప్రతి రోజూ అందిస్తున్నాం. రానున్న రోజుల్లో 24/7 అందిస్తాం. నగరంలో పారిశుధ్యాన్ని మెరుగు పరిచాం. ప్రజల కోసం 15 ఈ-టాయిలెట్లను అందుబాటులోకి తెస్తున్నాం. ఈ రోజు రెండు ప్రారంభించాం. నగర ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తాం. నగరంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను కూడా ప్రజలకు త్వరలో అందుబాటులోకి తెస్తాం. ఇప్పటికే వాటికి సంబంధించిన డీపీఆర్ తయారు చేశాం. త్వరలోనే కేబుల్ బ్రిడ్జ్‌ను ప్రారంభించేందుకు ఆలోచన చేస్తున్నాం. దసరాలోగా ముఖ్యమంత్రి అనుమతి మేరకు ప్రారంభించి అందుబాటులోకి తెస్తాం. ప్రజల సహకారంతో రానున్న రోజుల్లో ఉత్తర తెలంగాణలో ఆదర్శమైన జిల్లాగా కరీంనగర్‌ను అభివృద్ధి చేస్తాం' అని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. -
ఏం డాక్టర్‌వయ్యా.. దిమాక్ ఉందా?
సాక్షి, కరీంనగర్ జిల్లా: కాంగ్రెస్ నేత తీరుతో హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రిలో కలకలం రేగింది. ఇటీవల గుండెపోటుతో మరణించిన ప్రవీణ్ అనే వ్యక్తి మృతికి ఆసుపత్రి సూపరింటెండెంట్ కారణమని ఆరోపిస్తూ పీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గురువారం జమ్మికుంట, హుజురాబాద్ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు, సేవలను పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కౌశిక్ రెడ్డిని భట్టి విక్రమార్క వారించినా వినకుండా సూపరింటెండెంట్ వైపు వేలు చూపుతూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏం డాక్టర్‌వయ్యా...దిమాక్ ఉంటా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మర్డర్ కేసు నమోదు చేయించి, సస్పెండ్ చేసే వరకు ఊరుకోమంటూ సూపరిండెంట్‌పై కౌశిక్‌రెడ్డి మండిపడ్డారు. హుజురాబాద్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న ప్రవీణ్‌ను సూపరింటెండెంట్ విధుల నుంచి తొలగించడంతో మానసిక ఆందోళనతోనే అతడికి గుండెపోటు వచ్చిందని కౌశిక్‌రెడ్డి ధ్వజమెత్తారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్, సూపరింటెండెంట్ కలిసి ఎంతమందిని చంపుతారని ప్రశ్నించారు. తమ కార్యకర్తలు ఆసుపత్రికి వస్తే కేసులు పెట్టి వేధిస్తారా.. నీ అంతు చూస్తామంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో ఆసుపత్రిలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. -
విడదీస్తారని.. తనువు వీడారు
సైదాపూర్(హుజూరాబాద్): ఓ వేడుకలో ఏర్పడిన పరిచయం.. స్నేహంగా మారింది. క్రమంగా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. రెండేళ్లుగా ప్రేమాయణం సాగించారు. ఇటీవల పెళ్లి చేసుకోవాలనుకున్నారు. విషయం పెద్దలకు చెప్పే ధైర్యం చేయలేదు. చెప్పినా పెళ్లికి ఒప్పుకోరని భయపడ్డారు. విషయం పెద్దలకు తెలిస్తే తమను విడదీస్తారని.. వీడిపోయి బతకడం కన్నా.. కలిసి చావడమే మేలనుకున్నారు. క్రిమిసంహారక మందు తాగి తనువు చాలించారు. ఈ విషాద సంఘటన సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామంలో శనివారం జరిగింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఠాకూర్ వీరాసింగ్ ఏడాది పసికందుగా వరంగల్ జిల్లా కాశిబుగ్గ పోలీసులకు దొరికాడు. పోలీసుల తమదగ్గర పని చేస్తున్న ఠాకూర్ ప్రతాప్‌సింగ్–శోభారాణి దంపతులకు పెంపకానికి ఇచ్చారు. అప్పటికే ఈ దంపతులకు చిన్న కూతురు ఉంది. వీరాసింగ్‌ను పెంపకానికి తీసుకున్న కొద్ది రోజులకే శోభారాణి–ప్రతాప్‌సింగ్‌లు మృతిచెందాడు. ప్రతాప్‌సింగ్ బావ రాణాప్రతాప్‌సింగ్–బేబీబాయి వీరాసింగ్‌తో పాటు పాపను దుద్దెనపల్లికి తీసుకొచ్చారు. బడీడుకు వచ్చాక ఇద్దరిని హుస్నాబాద్ హాస్టల్లో చదివించారు. పాప హాస్టల్ నుంచి పారిపోయింది. ఇప్పటి వరకు ఆచూకీ లేదు. 5వ తరగతి వరకు చదువుకున్న వీరాసింగ్(25) చదవు మానేశాడు. లారీ డ్రైవింగ్ నేర్చుకున్నాడు. కొన్నేళ్లుగా లారీ డ్రైవింగ్ చేస్తున్నాడు. ఈనేపథ్యంలో ఎలిగేడు మండలం నారాయణపల్లికి చెందిన యాదగిరి సంపత్–స్వప్న కూతురు లయమాధురి(19) 8వ తరగతి చదివి మానేసింది. లయమాధురి, వీరాసింగ్లు ఓ ఫంక్షన్లో కలుసుకున్నారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. రెండేళ్ల ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లాలనుకున్నారు. ప్రేమ విషయం పెద్దలకు చెప్పడానికి ధైర్యం చాలలేదు. దీంతో గురువారం రాత్రి 12.30 గంటలకు దుద్దెనపల్లిలో క్రిమిసంహారకమందు తాగారు. తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బంధువులకు చెప్పి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే బంధువులు హుజూరాబాద్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు లయమాధురి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వరంగల్ ఆస్పత్రి నుంచి లయమాధురిని కరీంనగర్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ లయమాధురి శనివారం రాత్రి 1.45 గంటలకు, వీరాసింగ్ ఉదయం 5.30 గంటలకు మృతి చెందారు. -
వివేక్ ఔట్.. వెంకటేశ్‌కే టికెట్
సాక్షి, కరీంనగర్: పెద్దపల్లి మాజీఎంపీ, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడు గడ్డం వివేకానందకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ షాకిచ్చారు. పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్డ్ సీటు బరి నుంచి వివేక్‌ను తప్పించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బాల్క సుమన్ చేతిలో ఓడిపోయిన బోర్లకుంట వెంకటేశ్ నేతకు ఈ సీటు కేటాయించారు. అనూహ్యంగా టీఆర్ఎస్లో చేరిన తొలిరోజే ఎంపీ అభ్యర్థిగా బోర్లకుంట వెంకటేష్ నేత టికెట్ దక్కించుకున్నారు. ఆయనకు కేసీఆర్ శుక్రవారం బీఫారం అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముసలం.. అసెంబ్లీ ఎన్నికల అనంతరం పెద్దపల్లి లోక్‌సభ టీఆర్ఎస్లో పుట్టిన ముసలం చివరికి వివేక్ పుట్టిముంచింది. పెద్దపల్లి లోక్‌సభ అభ్యర్థిగా 2017లో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన వివేక్‌కు కేసీఆర్ తగిన ప్రాధాన్యత ఇచ్చారు. వివేక్‌కు ఎలాంటి ఆటంకం కలగకూడదని పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బాల్క సుమన్‌ను చెన్నూరు అసెంబ్లీ నుంచి పోటీ చేయించారు. విచిత్రం ఏంటంటే అదే సుమన్ తనచేతిలో ఓడిపోయిన వెంకటేష్ నేతకు ఎంపీటికెట్ ఇప్పించడంలో కీలకపాత్ర పోషించడం. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ లోక్‌సభ పరిధిలోని ఏడు సీట్లలో టీఆర్ఎస్ రెండు సిట్టింగ్‌లను కోల్పోయింది. మంథనిలో పుట్ట మధు, రామగుండంలో సోమారపు సత్యనారాయణ ఓడిపోగా.. ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ కేవలం 500లోపు ఓట్లతో అతికష్టంగా విజయం సాధించారు. మంచిర్యాలలో టీఆర్ఎస్ అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావు కేవలం 4800 ఓట్లతో గెలవగా.. పెద్దపల్లిలో మనోహర్‌రెడ్డిది 10 వేలలోపు మెజారిటీనే. బెల్లంపల్లిలో ఏకంగా వివేక్ సోదరుడు గడ్డం వినోద్ టీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్యకు ప్రధాన ప్రత్యర్థిగా పోటీ చేసి కేవలం 10వేల ఓట్లతో ఓడిపోయారు. చెన్నూరులో మిన హా ఈ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సీట్లలో స్వల్ప మెజారిటీనే దక్కింది. ఈ పరిణామంతో గెలిచిన ఎమ్మెల్యేలతోపాటు ఓడిన సిట్టింగ్‌లూ తీవ్రంగా స్పందించా రు. ధర్మపురిలో కార్యకర్తల సమావేశంలో కొప్పుల వర్గీయులు తొలిసారిగా వివేక్‌పై నిప్పులు చెరిగారు. ఈశ్వర్‌ను ఓడించడానికి కాంగ్రెస్ అభ్యర్థికి వివేక్ రూ.3 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. ధర్మపురిలో మొదలైన ముసలం ఎమ్మెల్యేలు బాహాటంగా అసంతృప్తి వెళ్లగక్కేవరకూ వెళ్లింది. ఈ పరిణామాలపై ‘సాక్షి’ ప్రధాన సంచికలో కథనాలు రావడంతో చివరికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించి వివేక్, మంత్రి కొప్పుల, ఎమ్మెల్యే సుమన్‌ను పిలిపించి రాజీకుదిర్చే ప్రయత్నాలు చేశారు. కేటీఆర్ సమక్షంలోనే ఎన్నికల్లో జరిగిన పరిణామాలన్నింటినీ ఈశ్వర్, సుమన్ ఏకరువు పెట్టడం, మిగతా ఎమ్మెల్యేలు సైతం వంత పాడడంతో వివేక్‌పై వేటు ఖాయమని తేలింది. టికెట్ల కేటాయింపు తుదిదశకు చేరుకున్న సమయంలో గురువారం పెద్దపల్లి లోక్‌సభ పరిధిలోని ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఇక్కడా తమ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా కుండబద్దలు కొట్టిన ఎమ్మెల్యేలు ప్రత్యామ్నాయంగా నేతకాని సామాజికవర్గానికి చెందిన బోర్లకుంట వెంకటేష్‌నేత పేరును తెరపైకి తెచ్చినట్లు సమాచారం. ఎస్సీల్లోని ఉప కుల సమీకరణలు, ఎమ్మెల్యేల మద్దతు, కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకుని వెంకటేష్ నేతకు సీటు ఖరారు చేశారు. పార్టీలో చేరకుండానే చక్రం తిప్పిన వెంకటేష్ అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన వెంకటేష్ నేత పెద్దపల్లి లోక్‌సభ పరిధిలోని టీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలను గమనించి పావులు కదిపారు. అప్పుడే పెద్దపల్లి లోక్‌సభపై కన్నేసిన వెంకటేష్ కాంగ్రెస్‌కు దూరమయ్యారు. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు వివేక్‌ను ఒంటరిని చేయడంతో ఆ స్థానంలోకి వెళ్లేందుకు తొలుత నేతకాని సామాజి క వర్గాన్ని అస్త్రంగా ఉపయోగించుకున్నారు. బెల్లంపల్లి, చెన్నూరు, పెద్దపల్లి, మంచిర్యాల అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండడంతో అదే వర్గానికి చెందిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ద్వారా నరుక్కుంటూ వచ్చారు. తనను ఓడించిన సుమ న్కు దగ్గరైన వెంకటేష్ ఆయన మద్దతు కూడగట్టుకున్నా రు. మంత్రి ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే చందర్‌ను కలిసి అవకాశం ఇప్పించాలని కోరారు. కేటీఆర్ సిఫారసుతో ముఖ్యమంత్రి కేసీఆర్ టికెట్ ఖరారు చేశారు. గురువారం మధ్యాహ్నం సుమన్‌తో కలిసి టీఆర్ఎస్లో చేరిన వెంకటేష్ నేత అభ్యర్థిగా బీఫారం దక్కించుకుని రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించారు. వివేక్ భవితవ్యం ఎటు? పెద్దపల్లి సీటు చేజారిన వివేక్ రాజకీయ భవిష్యత్తు చిక్కుల్లో పడింది. 2013లో తెలంగాణ ఉద్యమం చివరి దశలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎంపీగా ఉంటూనే తన సోదరుడు వినోద్‌తో కలిసి టీఆర్ఎస్లో చేరిన ఆయన ఎన్నికలముందు తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. అప్పట్లో వివేక్‌కు ఎంపీ సీటు ఖరారైనప్పటికీ.. తన సోదరుడు వినోద్‌కు చెన్నూరు టికెట్ ఇవ్వని కారణంగా పార్టీని వీడారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో పెద్దపల్లి టికెట్ హామీతో మరోసారి టీఆర్ఎస్లో చేరారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా తన సోదరుడికి టికెట్ విషయంలో కేసీఆర్ ఆగ్రహానికి గురయ్యారు. వినోద్ బీఎస్పీ నుంచి పోటీ చేయగా, టీఆర్ఎస్ అభ్యర్థి చిన్నయ్యకు వ్యతిరేకంగా తన సోదరుడిని గెలిపించేందుకు కృషి చేశారని ప్రభుత్వ నిఘావర్గాలు కేసీఆర్‌కు సమాచారం ఇచ్చాయి. అదే సమయంలో మిగతా ఎమ్మెల్యేలు కూడా తమను ఓడించేందుకు వివేక్ ప్రయత్నించారని చేసిన ఫిర్యాదులతో ఆయన సీటుపై వేటు పరిపూర్ణమైంది. ఇప్పుడు మరో పార్టీలోకి వెళ్లే సాహసం చేస్తారా..? లేదా..? అనేది అర్థం కావడం లేదు. బీజేపీ నేతలు ఇప్పటికే వివేక్‌తో టచ్‌లో ఉండి, పెద్దపల్లి సీటుకు అభ్యర్థిని ప్రకటించలేదు. వివేక్ బీజేపీలో చేరితే టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం సిద్ధంగా ఉంది. అయితే గతంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో మరోసారి సాహసం చేస్తారా..? లేదా..? అనేది చూడాల్సిందే. -
పథకాలు కొనసాగాలంటే టీఆర్ఎస్కు ఓటేయ్యాలి: కేసీఆర్
సాక్షి, కరీంనగర్/జగిత్యాల : సంక్షేమ పథకాలు కొనసాగాలంటే టీఆర్ఎస్ పార్టీకి ఓటేయ్యాలని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ప్రజలకు సూచించారు. సోమవారం కరీంనగర్, జగిత్యాల నియోజకవర్లాల్లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించబోతోందని కేసీఆర్ స్పష్టం చేశారు. నాలుగేళ్ల తమ పాలనలో సంపద పెంచి పేదలకు పంచామని, 17.17 శాతం అభివృద్ధితో తెలంగాణ.. దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిందన్నారు. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి అదే స్థాయిలో జరగాలన్నా.. సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా.. టీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. అన్ని ఆలోచించి ఎవరూ గెలిస్తే న్యాయం జరుగుతుందో వారిని గెలిపించుకోవాలన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలు చేశారని, అలాంటి బాబుతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ వలసాధిపత్యాన్ని రుద్దే ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రజలు ఆగమాగం కాకుండా ఆలోచించి ఓటేయ్యాలని సూచించారు. పోటీ కేవలం టీడీపీ - కాంగ్రెస్ కూటమి, టీఆర్ఎస్కు మాత్రమేనని, మిగతా వాళ్ల గురించి అనవసరం లేదన్నారు. టీడీపీ-కాంగ్రెస్‌లు కలిపి 58 ఏండ్లు పాలించాయని, వారి పాలనలో కరెంట్ ఎట్లా ఉందో. ఇప్పుడు ఎట్ల ఉందో ఆలోచించాలన్నారు. మిషన్ భగీరథ మరో నెలరోజుల్లో పూర్తి కాబోతుందని, రాబోయే రోజుల్లో విద్యా విధానంలో సమూల మార్పులు తెస్తామన్నారు. జగిత్యా, కరీంనగర్ టీఆర్ఎస్ అభ్యర్థులు సంజయ్ కుమార్, గంగుల కమలాకర్‌లను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. -
జగిత్యాలలో ఏపీ ఇంటెలిజెన్స్ రహస్య సర్వే!
సాక్షి, జగిత్యాల: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇంటెలిజెన్స్ పోలీసుల రహస్య సర్వే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతోంది. తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఏపీ పోలీసుల సర్వే పలు అనుమానాలకు దారి తీస్తోంది. వారం క్రితం కోరుట్ల నియోజకవర్గానికి చెందిన ఓ పార్టీ వలస నేతను (ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నారు) ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు కలవడం.. తిరిగి సొంతగూటికి రావాలని కోరడం అప్పట్లో చర్చనీయాంశమైంది. తాజాగా ఈ నెల 26న ధర్మపురి మండల కేంద్రంలో పర్యటించిన ముగ్గురు ఇంటెలిజెన్స్ పోలీసులు రహస్య సర్వే నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో ఏ పార్టీ విజయం సాధిస్తుంది? అభ్యర్థుల విజయావకాశాలపై స్థానికులతో ఆరా తీస్తూ జిల్లా పోలీసులకు చిక్కారు. ఏపీ పోలీసుల మాటతీరును గమనించిన స్థానికులు.. విషయాన్ని ఇక్కడి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలో దిగిన ధర్మపురి పోలీసులు ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. తాము ఏపీ ఇంటెలిజెన్స్ విభాగానికి చెం దిన వాళ్లమని చెప్పడంతో స్థానికులు అవాక్కయ్యా రు. ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు డబ్బులు కూడా పంపిణీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీ పోలీసులు రాష్ట్రంలో సర్వే నిర్వహించడంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌కు మంత్రి కేటీఆర్ ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ సైతం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. జిల్లాలోనే మకాం? ఏపీకి చెందిన ఇంటెలిజెన్స్ సిబ్బంది 25 మంది 15 రోజుల నుంచే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మకాం వేసినట్లు తెలుస్తోంది. కోరుట్ల, ధర్మపురిలో వెలుగుచూసిన ఘటనలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. మిగతా ప్రాంతాల్లోనూ ఏపీ పోలీసులు సామాన్య వ్యక్తుల్లా సర్వే చేస్తుండటంతో విషయం వెలుగులోకి రావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహాకూటమిలో ఓ పార్టీ అభ్యర్థులపై ఇంటెలిజెన్స్ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇదే క్రమం లో ఆయా ప్రాంతాల్లో ఆ పార్టీ స్థితిగతులు, నాయకులపై ఆరా తీస్తున్నారని ధర్మపురి ఘటనతో స్పష్టమైం ది. సామాన్య వ్యక్తుల్లా సర్వే చేస్తుండటంతో తమ కం టబడలేదని జిల్లా పోలీసులు చెబుతున్నారు. కాగా, ఏపీ ఇంటెలిజెన్స్ సిబ్బందిని స్థానిక పోలీసులు విచారణ లేకుండానే వదిలిపెట్టడంతో ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. వారిని విచారిస్తే పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చేవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ధర్మపురి ఎస్ఐ అంజయ్య వివరణ ఇస్తూ, ‘ధర్మపురిలో అనుమానాస్పదస్థితిలో ముగ్గురు తిరుగుతున్నట్లు కొందరు ఫిర్యాదు చేశారు. వెంటనే బ్లూ కోల్ట్స్ బృందాన్ని పంపించాం. అక్కడికెళ్లాక వారు హైదరాబాద్ నుంచి వచ్చిన పోలీసులమని చెప్పడం తో అక్కడి నుంచి వచ్చేశాం’ అని చెప్పారు. -
కరీంనగర్లో కాల్పులు
తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి. తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని బుడగ జంగాల కాలనీకి చెందిన తూర్పాటి స్వప్న(35)ను ఆమె భర్త కనకయ్య తుపాకీతో కాల్చి పరారయ్యాడు. ఈ ఘటనలో బుల్లెట్ ఆమె తొడభాగం నుంచి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. స్థానికులు స్పందించి కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తుపాకీని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. నిందితుడు కనకయ్య పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని తిమ్మాపూర్ సీఐ కరుణాకర్ తెలిపారు. బుడగ జంగాలకు చెందిన కనకయ్య ఇటీవలే నేపాల్ నుంచి వచ్చినట్లు తెలిసింది. అక్కడే ఈ తుపాకీని కొనుగోలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. స్వప్న ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. భార్యపై అనుమానం పెంచుకోవడంతో పాటు వరకట్నం కోసం వేధించినట్లు తెలిసిందని, ఆ నేపథ్యంలోనే తుపాకీతో కాల్చినట్లు భావిస్తున్నారు. -
తమ్ముడి హత్య కేసులో అన్న అరెస్టు
కోల్‌సిటీ(రామగుండం) : తమ్ముడిని హత్య చేసిన కేసులో పాతనేరస్తుడైన అన్నను శుక్రవారం గోదావరిఖని ఏసీపీ రక్షిత కె.మూర్తి అరెస్టు చేశారు. గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన వివరాలను వెల్లడించారు. లెనిన్‌నగర్‌కు చెందిన ధనాల దుర్గారావు అలియాస్ చంటి(23) అనే యువకుడిని, రామగుండంలోని మజీద్‌రోడ్‌లో ఉంటున్న అతని అన్న ధనాల చంద్రశేఖర్ ఈనెల 16న కత్తితో దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావం కావడంతో మృతి చెందాడు. భార్య, పిల్లలతో రామగుండంలో ఉంటూ కూలి పని చేసుకుంటున్న చంద్రశేఖర్ మద్యానికి బానిసయ్యాడు. ఖర్చులకు డబ్బులు కావాలంటూ లెనిన్‌నగర్‌లోని తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి గొడవ చేసేవాడు. రెండు లక్షల రూపాయాలతోపాటు ఇంటిలో వాటా కావాలంటూ హత్య జరిగిన రెండ్రోజుల ముందు గొడవ చేశాడు. ఈనెల 16న సాయంత్రం ఇదే విషయంపై మళ్లీ తల్లిదండ్రులను డబ్బులు ఇవ్వాలని, ఇంటిలో వాటా ఇవ్వాలని, లేకుంటే చంపేస్తానని బెదిరించాడు. డబ్బుల కోసం మమ్మల్ని కొట్టడానికి ఇంటికి వస్తున్నావు, నీకు డబ్బులు ఇవ్వము, ఇంట్లోంచి వెళ్లిపోవాలని తల్లి అనడంతో ఆగ్రహంతో తల్లిపై కత్తితో పొడవబోయిన చంద్రశేఖర్‌ను అప్పటికే ఇంట్లో ఉన్న రెండో తమ్ముడు శివశంకర్, చిన్న తమ్ముడు దుర్గారావు, తండ్రి రామారావు అడ్డుకున్నారు. దీంతో మరింత కోపానికి లోనై తమ్ముడు దుర్గారావును కత్తితో పొడిచి పారిపోయాడు. తీవ్రరక్తస్రావం కావడంతో మెరుగైన చికిత్సకోసం కరీంనగర్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. గురువారం సాయంత్రం చంద్రశేఖర్‌ను రామగుండంలోని అతడి ఇంటివద్ద పోలీసులు పట్టుకున్నట్లు ఏసీపీ తెలిపారు. నిందితుడి దగ్గర కత్తితోపాటు ద్విచక్రవాహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా చంద్రశేఖర్ ఇప్పటికే 12 దొంగతనం కేసులతోపాటు ఒక హత్య కేసు, ఇల్లును తగులబెట్టిన కేసులో నిందితుడుగా ఉన్నాడని ఏసీపీ తెలిపారు. నేరం చేస్తే కఠిన చర్యలు.. నేరాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని ఏసీపీ రక్షిత కె.మూర్తి హెచ్చరించారు. చిన్నచిన్న సమస్యలకే హత్యలకు పాల్పడడం విచిత్రంగా ఉందన్నారు. నగరంలో ప్రతీరోజూ ప్రత్యేక పోలీసుల బృందాలు తనిఖీలు చేపడుడుతాయని.. ఎవరైన అసాంఘీక చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగర ప్రజలు కూడా గొడవలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమావేశంలో సీఐ వాసుదేవరావు, ఎస్సై దేవయ్య, ఏఎస్సై శారద, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. – రక్షిత కె.మూర్తి, ఏసీపీ -
రాజన్న నిత్యాన్నదాన సత్రంలో మంటలు
వేములవాడ: వేములవాడ రాజన్న ని త్యాన్నదాన సత్రం లో బుధవారం ఉద యం బాయిలర్ ము ట్టించే క్రమంలో మంటలు చెలరేగా యి. వెంటనే తేరుకు న్న సిబ్బంది మంటలు ఆర్పేశారు. దీం తో ఎర్రం మల్లేశం అనే వ్యక్తి తలవెం ట్రుకలు కాలిపోయాయి. స్వల్పగాయాలతో బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న ఏఈవో దేవేందర్, ఎస్పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ లచ్చన్న, ఎస్బీ పోలీసులు, సత్రానికి చేరుకుని విచారణ చేపట్టారు. జాగ్రత్తలు పాటించాలనీ, నిబంధనల మేరకు సిబ్బందిని అనుమతించాలని ఏఈవో సత్రం ఇన్చార్జీలను ఆదేశించారు. టౌన్ సీఐ ఎన్. వెంకటస్వామి ఘటనపై ఆరా తీశారు. అధికారుల సీరియస్.. రాజన్న ఆలయంలోని పలు విభాగాల్లో ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం రోజురోజుకు పెరిగిపోతుండటంతో ఆలయ ఈవో రా జేశ్వర్ సీరియస్‌గా వ్యవహరించినట్లు తెలిసింది. మంటలు చెలరేగిన సమయంలో గాయపడిన మల్లేశంకు ఆలయానికి ఎలాంటి సంబంధం లేదని.. ప్రైవేట్ వ్యక్తులను ఎందుకు అనుమతి స్తున్నారని సిబ్బందిని మందలించారు. కాగా సత్రం ఇన్చార్జి రాములుకు మ ల్లేశం సమీప బంధువు కావడంతో అ ప్పుడప్పుడు తనకు సాయంగా ఉంటా డని రాములు పేర్కొనడం గమనార్హం. -
చిట్టీవ్యాపారి ఇంటి ఎదుట దంపతుల ఆందోళన
జమ్మికుంట(హుజూరాబాద్): జమ్మికుంట మండలంలోని బిజిగిరిషరీఫ్ గ్రామానికి చెందిన బిజిగిరి ప్రభాకర్ భార్య కవితతో కలిసి జమ్మికుంట పట్టణంలోని చిట్టీ వ్యాపారి రమేశ్ ఇంటి ఎదుట మంగళవారం బైఠాయించాడు. చిట్టీ పాడుకుని ష్యూరిటీగా ఇచ్చిన బ్లాంక్ చెక్కును చిట్టీ డబ్బులు మొత్తం చెల్లించన తర్వాత కూడా రమేశ్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమ చెక్కు తమకు ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. బాధితుడు ప్రభాకర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. జమ్మికుంట పట్టణంలో ప్రభాకర్ గతంలో సెలూన్ షాపు నిర్వహించేవాడు. ఇతడి వద్దనే కటింగ్ చేయించుకునే చిట్టీ వ్యాపారి రమేశ్ తన వద్ద చిట్టీ వేయాలని ఒత్తిడి చేయడంతో ప్రభాకర్ రూ.9 లక్షల చిట్టీ వేశాడు. ప్రారంభమైన మొదటి నెలలోనే చిట్టీని యాక్షన్‌లో రూ.4.50 లక్షలకు పాడిన ప్రభాకర్ ష్యూరిటీగా రమేశ్‌కు బ్లాంక్ చెక్కు ఇచ్చాడు. అయితే రమేశ్ చిట్టీ డబ్బులు రూ.4.50 లక్షల కు బదులు రూ.3 లక్షలు మాత్రమే ఇచ్చాడు. ఈక్రమంలో ప్రతి నెల చిట్టీ డబ్బులు చెల్లించుకుంటూ వచ్చిన ప్రభాకర్ సుమారు రూ.3.60 లక్షలు కట్టాడు. తర్వాత ఆర్థిక ఇబ్బందులతో చిట్టీ కట్టలేనని చెప్పాడు. తనకు రావాల్సి డబ్బులు, బ్లాంక్ చెక్కు ఇవ్వాలని రమేశ్‌ను కోరాడు. చిట్టి వ్యాపారి మాత్రం చెక్కును కోర్టులో వేసి ప్రభాకర్‌కే నోటీసులు పంపించాడు. దీనిపై జమ్మికుంట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఇద్దరి మధ్య పంచాయతీ జరిగిందని, అందులో రూ.2 లక్షలు చిట్టి వ్యాపారికి ఇచ్చేలా ఒప్పందం జరిగింది. ఆ డబ్బులు కూడా ప్రభాకర్ ముట్టజెప్పాడు. అయినా చెక్కు ఇవ్వకపోవడంతో భార్యతో కలిసి ఆందోళనకు దిగాడు. తన వెంట సూపర్వాస్మ తెచ్చుకుని చెక్కు ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటామని దంపతులు హెచ్చరించారు. ఇంటో రమేశ్ లేకపోవడంతో పరిస్థితిని ఆయన భార్యకు వారు వివరించారు. ఆమె ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయింది. ఉదయం 9 నుంచి రాత్రి7 గంటల వరకు అక్కడే బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి న్యాయం చేస్తామంటూ స్టేషన్‌కు తీసుకెళ్లారు. -
భవనం పైనుంచి పడి యువకుడు మృతి
జ్యోతినగర్(రామగుండం): ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఎన్టీపీసీలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. ఎన్టీపీసీ ప్రాజెక్టులో ఓ కంపెనీ ఆధ్వర్యంలో జార్కండ్‌కు చెందిన మిథిలేష్‌కుమార్(29) కొద్దిరోజులుగా పనులు చేస్తున్నాడు. శనివారం ఆర్ధరాత్రి సమయంలో భవనం పైనుండి ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. శబ్దం రావడంతో గదిలో ఉంటున్న వచ్చి చూడగా మిథిలేశ్ గాయపడి ఉన్నాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హనుమాన్ జయంతి ఏర్పాట్లపై సమీక్ష
కొండగట్టు(చొప్పదండి): కొండగట్టు అంజన్న ఆలయంలో ఈనెల 31న నిర్వహించే చిన్నజయంతి ఉత్సవాల ఏర్పాట్లపై ఎస్పీ సునీల్‌దత్ శుక్రవారం సమీక్షించారు. ఆలయ ఈవో అమరేందర్, డీఎస్పీ భద్రయ్య, జగిత్యాల రూరల్ సీఐ శ్రీనివాసచౌదరి, మల్యాల సీఐ నాగేందర్‌గౌడ్ హాజరయ్యారు. అంతకుముందు ఎస్పీ ఆలయం పరిసరాలు, క్యూలైన్, కోనేరు, కల్యాణకట్ట, సీతమ్మకన్నీటి గుంత, బేతాళస్వామి ఆలయం, వాహనాల పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించారు. దీక్షాపరులకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారో ఆలయ ఈవోను అడిగి తెలుసుకున్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. సూపరింటెండెంట్ శ్రీనివాసశర్మ, ఎస్ఐ నీలం రవి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. -
జవాన్ పెళ్లి కల చెదిరిపోయిన వేళ..
తాండూర్(బెల్లంపల్లి) : ప్రతి ఒక్కరి జీవితంలో వివాహ వేడుకకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. జీవితాంతం చెదిరిపోని జ్ఞాపకంగా మిగిలిపోయే ఘనమైన ఘట్టమది. అలాంటి క్షణాల కోసం యువతీ యువకుల ఎదురుచూపుల గురించి చెప్పనక్కర్లేదు. సరిగ్గా అలాంటి సందర్భంలోనే జరగరానిది ఘటన జరిగితే.. ఎంత విషాదం..! ఇంద్రకుమార్... సీఆర్పీఎఫ్ జవాన్. వయస్సు 29 ఏళ్లు. తాండూర్ మండలం కిష్టంపేట గ్రామం. తండ్రి లింగాల బానయ్య చనిపోయాడు. తల్లి మల్లమ్మ, ఇద్దరు అక్కాచెల్లెళ్లు, ఒక తమ్ముడు ఉన్నారు. అక్కాచెళ్లెళ్లకు పెళ్లి కాగా.. తల్లి, తమ్ముడికి ఇతడే ఆధారం. ఏ వయస్సులో జరగాల్సిన ముచ్చట ఆ వయస్సులో జరగాలని పెద్దలు అంటారు కదా! ఇంద్రకుమార్‌కు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఉండటంతో ఇంట్లోవాళ్లు పెళ్లి సంబం దాలు చూశారు. ఈనెల 25న నిశ్చితార్థం ఖరారు చేసి సమాచారం అందించారు. 2014లో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరిన ఇంద్రకుమార్ రాయ్‌ఘడ్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. తన నిశ్చితార్థానికి హాజరయ్యేందుకు ఈనెల 19న సెలవుపై ఇంటికి వచ్చేందుకు బయలుదేరాడు. మార్గ మధ్యంలో ఘోరం జరిగిపోయింది. ఇంద్రకుమార్ రైలులో వస్తుండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు వద్ద రైలునుంచి జారిపడ్డాడు. తీవ్ర గాయాలైన అతడిని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి చనిపోయాడు. కుటుంబసభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు. సీఆర్ఎఫ్ అధికారుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని శుక్రవారం కిష్టంపేటకు తీసుకొచ్చారు. వరంగల్ రేంజ్ సీఆర్పీఎఫ్ కమాండర్ రమేష్ కబాడియా, ఎస్సైలు సిగ్గు కుమార్, అర్జున్‌రెడ్డి, 58 బెటాలియన్ జవాన్లు, తాండూర్ తహసీల్దార్ రామచంద్రయ్య, తాండూర్ ఎస్సై రవి.. ఇంద్రకుమార్ భౌతికకాయంపై జాతీయ జెండాను కప్పి నివాళులర్పించారు. అనంతరం సీఆర్పీఎఫ్ జవానులు గాలిలోకి కాల్పులు జరిపి సైనిక వందనం సమర్పించారు. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. సీఆర్పీఎఫ్ బెటాలియన్ తరపున మృతుడి తల్లి మల్లమ్మకు రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఎక్స్‌గ్రేషియా, మృతుడి తల్లికి పెన్షన్‌ను త్వరగా వచ్చేలా చూస్తానని సీఆర్పీఎఫ్ కమాండర్ రమేష్ కబాడియా హామీ ఇచ్చారు. -
‘ఫుల్’గా తాగేశారు..
ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మద్యం అమ్మకాలు ‘ఫుల్’గా సాగుతున్నాయి. మూడు ఫుల్ బాటిళ్లు.. ఆరు బీర్లు అన్న చందంగా అమ్మకాలు కిక్కు ఎక్కిస్తున్నాయి. ఒకప్పుడు రెవెన్యూ విభాగంలో ఓ భాగంగా ఉన్న అబ్కారీ శాఖ.. ఇప్పుడు రెవెన్యూ పరంగా ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా మారింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2015–16 సంవత్సరంలో నూతన మద్యం పాలసీ అమల్లోకి తీసుకొచ్చింది. రెండేళ్ల కాల పరిమితిలో ఉమ్మడి జిల్లాలో ఎక్సైజ్ శాఖ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 158 దుకాణాలకు 1,541 దరఖాస్తులు రాగా వీటి ద్వారా రూ.7.70 కోట్ల ఆదాయం అదనంగా ఎక్సైజ్ శాఖకు వచ్చింది. రెండేళ్ల లైసెన్స్ ఫీజుల ద్వారా రూ.132 కోట్ల ఆదాయం వచ్చింది. ఇదే కాకుండా ఈ రెండేళ్లలో ఆగస్టు వరకు రూ.1,666 కోట్ల మద్యం అమ్మకాలు జరగడం గమనార్హం. గతంలో మద్యం పాలసీ ఏడాదిపాటు మాత్రమే నిర్వహించే వారు. 2014–15 సంవత్సరంలో మద్యం అమ్మకాల ద్వారా రూ.593.99 కోట్లు రాగా, ప్రతీ ఏడాది ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2015–16 సంవత్సరంలో రూ.794.09 కోట్లు, 2016–17(ఆగస్టు వరకు) రూ.872.35 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. 2014 సంవత్సరంతో పోలిస్గే మూడేళ్లలో రూ.280 కోట్ల ఆదాయం పెరిగింది. రూ.7.70 కోట్ల ఆదాయం.. 2015–16లో కొత్త మద్యం పాలసీ అమల్లో భాగంగా డీలర్లను ఎంపిక చేసే క్రమంలోనూ ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చింది. దరఖాస్తు ప్రక్రియలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 158 దుకాణాలకు 1,541 దరఖాస్తులు రావడం, దరఖాస్తుదారుడికి ఫీజు తిరిగి ఇచ్చే వీలులేకపోవడంతో ప్రభుత్వానికి భారీగా దాయం సమకూరింది. ఫలితంగా దరఖాస్తుల ద్వారా రూ.7.70 కోట్ల ఆదాయం అదనంగా సర్కారు ఖజానాలో చేరింది. ప్రస్తుతం ఈ ఏడాది కొత్త మద్యం పాలసీకి నోటిఫికేషన్ విడుదల కావడంతో ఉమ్మడి జిల్లాలో 160 మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించారు. ఈ ఏడాది దరఖాస్తు ఫీజు రూ.లక్షకు పెంచడంతో గత పాలసీ కంటే ఈ ఏడాది మరింత ఆదాయం వచ్చింది. దరఖాస్తుల ద్వారా చేసుకున్న ఫీజును తిరిగి ఇచ్చే అవకాశం లేకపోవడంతో ఆ మొత్తం ఎక్సైజ్ శాఖ ఖాతాలోనే జమ కానుంది. మంగళవారం చివరి రోజు ఉమ్మడి జిల్లాలో దరఖాస్తులు వెల్లువెత్తడంతో రూ.18.15 కోట్ల ఆదాయం వచ్చింది. మద్యం అమ్మకాలు.. ఉమ్మడి జిల్లాలో 158 మద్యం దుకాణాలు ఉండగా గత రెండేళ్లలో విక్రయాలు విపరీతంగా పెరిగాయి. 2015–16లో 18,09,713 ఐఎంఎల్ కేసులు(పెట్టెలు) అమ్ముడుపోగా, బీర్లు 16,07,964 కేసులు అమ్ముడు పోయాయి. వీటి ద్వారా రూ.794.09 కోట్ల ఆదాయం వచ్చింది. 2016–17 సంవత్సరంలో 18,82,657 ఐంఎల్ కేసులు, 17,05,645 కేసులు అమ్ముడుపోగా వీటి ద్వారా రూ.872.35 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ లెక్కన చూస్తే గతేడాది కంటే ఈ ఏడాది మద్యం అమ్మకాల కేసులతోపాటు ఆదాయం పెరిగింది. 2014–15 సంవత్సరంలో 12,86,955 ఐఎంఎల్ కేసులు, 14,15,766 బీర్ల కేసులు అమ్ముడుపోగా, వీటి ద్వారా రూ.593.99 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే గత మూడేళ్లలో అమ్మకాలు ఏడాదికేడాది పెరుగుతూ వస్తున్నాయి. -
టీ-టీడీపీకి మరో షాక్
కరీంనగర్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. కరీంనగర్ జిల్లా వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండ్ర నళిని బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. ఆమె రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడికి పంపినట్లు తెలిపారు. 30 ఏళ్ళుగా పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న తనకు పార్టీలో సరైన గుర్తింపు లభించడం లేదని నళిని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో టీడీపీ ఉనికి ప్రమాదకరంగా మారిందని.... ఆదరణలేని పార్టీలో ఉండలేక రాజీనామా చేస్తున్నానని ఆమె అన్నారు. తన భవిష్యత్తు ప్రణాళికను త్వరలో ప్రకటిస్తానని నళిని చెప్పారు. -
కరీంనగర్లో భారీ వర్షం
కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేని వర్షాలు ప్రజలను కుదిపేస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో ఆదివారం ఎడతెరిపి లేకుండా వాన పడింది. జిల్లా వ్యాప్తంగా సగటున 6.8 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మహదేవ్‌పూర్‌లో 13.6 సెంటీ మీటర్లు, కమలాపూర్, మహాముత్తారంలో 12.6, వీణవంకం, కాటారంలలో 11 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కమలాపూర్ మండలం అంబాల, శంబునిపల్లిలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. అంబాల కల్వర్టు తెగిపోవడంతో హన్మ కొండ, కమలాపూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రామగుండం ఓపెన్ కాస్ట్‌లోకి వరద నీరు చేరి బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది.