తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేని వర్షాలు ప్రజలను కుదిపేస్తున్నాయి.
కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేని వర్షాలు ప్రజలను కుదిపేస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో ఆదివారం ఎడతెరిపి లేకుండా వాన పడింది. జిల్లా వ్యాప్తంగా సగటున 6.8 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మహదేవ్పూర్లో 13.6 సెంటీ మీటర్లు, కమలాపూర్, మహాముత్తారంలో 12.6, వీణవంకం, కాటారంలలో 11 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
కమలాపూర్ మండలం అంబాల, శంబునిపల్లిలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. అంబాల కల్వర్టు తెగిపోవడంతో హన్మ కొండ, కమలాపూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రామగుండం ఓపెన్ కాస్ట్లోకి వరద నీరు చేరి బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది.