![Karimnagar Joint Collector Couple Bullet Bandi Song Dance Video Viral - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/15/Dance-Video-Viral.jpg.webp?itok=JCzUzalv)
సాక్షి, కరీంనగర్: సోషల్ మీడియాలో సెన్సెషన్ క్రియేట్ చేసిన బుల్లెట్ బండి పాట మళ్లీ వైరల్ అవుతోంది. బుల్లెట్ బండి పాటకు ఇప్పుడు చాలా క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. బుల్లెట్ బండి పాట విడుదల అయ్యినప్పటి నుంచి పెళ్లిళ్లు, ఫంక్షన్స్ ఆ పాట లేకుండా ఉండటం లేదంటే అతిశయోక్తి కాదు.
ఈ పాటకు పిల్లలు, పెద్దలు, నవ దంపతులు అంతా స్టెప్పులు వేస్తూ ఆడిపాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తాజాగా బుల్లెట్ బండి పాటపై జాయింట్ కలెక్టర్ దంపతులు స్టెప్పులు వేశారు. వివరాలు.. కరీంనగర్ జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ బర్త్ డే వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి.
సెలవు రోజు కావడంతో బంధువులు ఫ్రెండ్స్‌తో బర్త్‌డే జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ దంపతులు బుల్లెట్ బండి పాటకి స్టెప్పులు వేసి బంధువులకి ఉత్సాహన్ని కలిగించారు. దీంతో మళ్లీ బుల్లెట్ బండిపాట సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment