సాక్షి, కరీంనగర్ : వామన్‌రావు దంపతుల హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. పుట్ట మధు సహా మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండవ రోజు పుట్ట మధును పలు అంశాలపై విచారించారు. హత్యకు ముందు రూ.2 కోట్లు విత్‌డ్రా విషయం సహా.. ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్ ఇంటి నిర్మాణంపైనా ఆరా తీశారు. వామన్‌రావు తండ్రి కిషన్‌రావునూ విచారించారు.
హత్యలో పుట్ట మధు, భార్య శైలజ ప్రమేయం ఉందని కిషన్‌రావు చెప్పారు. కాగా, ఈ జంటహత్యల కేసులో ఇప్పటికే ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను కీలకంగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment