putta Madhu
-
పెద్దపల్లి: పుట్టామధుకు అవిశ్వాస గండం?
సాక్షి, పెద్దపల్లి: మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా పరిషత్ ప్రస్తుత ఛైర్మన్ పుట్టామధుపై అవిశ్వాసం కత్తి వేలాడుతోంది. ఆయనపై అవిశ్వాసం పెట్టడానికి జెడ్పీటీసీలు సిద్ధమైనట్లు సమాచారం. దీంతో ఉత్కంఠ నెలకొంది. జెడ్పీటీసీ సభ్యులు రహస్యంగా మంతనాలు సాగిస్తున్నారు. 2,3 రోజుల్లో అవిశ్వాస తీర్మానానికి జడ్పీటీసీలు సిద్ధమవుతున్నారు. మెజార్టీ సభ్యుల అసమ్మతితో అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. కాగా, బుధవారం స్టాండింగ్కమిటీ సమావేశం ఉన్నప్పటికీ ఇద్దరు సభ్యులు మినహా మెజారిటీ జడ్పీటీసీలు కాకపోవడంతో పలు అనుమానాలకు దారితీస్తుంది. అసంతృప్త జడ్పీటీసీలు వేర్వేరు చోట్ల క్యాంపులు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. గత నెల 28న జరగాల్సిన జడ్పీ జనరల్ బాడీ సమావేశం వాయిదా పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే మెజారిటీ బీఆర్ఎస్ సభ్యులు అవిశ్వాసానికి రంగం సిద్దం చేసుకున్నట్లు సమాచారం. ఈ రోజు ఎన్టీపీసీలో జరగాల్సిన జెడ్పీ సర్వ సభ్య సమావేశం కూడా కోరం లేక వాయిదా పడింది. జిల్లాలోని 13 మంది జెడ్పీటీసీలకు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 11 మంది జెడ్పీటీసీలు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు గెలుపొందారు. ఇటీవలే బీఆర్ఎస్ను వీడిన పాలకుర్తి జెడ్పీటీసి కందుల సంధ్యారాణి బీజేపీలో చేరారు. ఓదెల జెడ్పీటీసి గంటా రాములు కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. మెజారిటీ సభ్యుల అసమ్మతి నేపథ్యంలో అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. ఇదీ చదవండి: ముఖేష్ గౌడ్ కొడుకు దారెటు.? -
ఆయన తూర్పు.. ఈయన పడమర..! సెంటిమెంట్ కలిసొచ్చేదెవరికో..?
సాక్షి, పెద్దపల్లి: వారిద్దరూ రాజకీయాల్లో తూర్పుపడమరలు. ఒకరు కాంగ్రెస్ పార్టీ నేత అయితే.. మరొకరు బీఆర్ఎస్ నాయకుడు. కానీ వారిద్దరికీ సెంటిమెంట్ ముత్తారం కేంద్రంగా ఎన్నికల ప్రచారం షురూ చేయడం. వారే మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జెడ్పీ చైర్మన్ పుట్ట మధు. ఇటీవల బీఆర్ఎస్ టికెట్ ఖరారు కావడంతో పుట్ట మధు ముత్తారం కేంద్రంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా పాదయాత్ర ప్రారంభించారు. తూర్పువైపు ఉన్న మండలాల్లో తన పాదయాత్ర కొనసాగించి నియోజకవర్గం చుట్టివచ్చారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు సైతం ముత్తారం కేంద్రంగా భారీసభ నిర్వహించి పడమర దిశగా తన ప్రచారం మొదలు పెట్టారు. ఈ ఇద్దరు నేతలు ముత్తారం సెంటిమెంట్‌గా ఎన్నికల ప్రచారం ఇక్కడి నుంచే ప్రారంభించినా.. ఎవరికి కలిసివస్తుందోనని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. -
TS Election 2023: మూడు పార్టీలు కుట్ర పన్నుతున్నాయి.. : పుట్ట మధు
పెద్దపల్లి: పేద కుటుంబం నుంచి వచ్చిన తాను పేదల కష్టాలు తీర్చుతుంటే ఓర్వలేని కాంగ్రెస్ ఇతర పార్టీలతో కలిసి తనపై కుట్ర చేస్తోందని, అయినా ప్రజల్లో తనపై విశ్వాసం ఉందని మంథని బీఆర్ఎస్ అభ్యర్థి, జెడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు. ఆయన బుధవారం మంథనికి రాగా.. కమాన్‌పూర్ మండలం గొల్లపల్లి నుంచి మంథని వరకు మంగళహారతులు, బైక్‌ర్యాలీతో స్వాగతం పలికారు. మంథని వద్ద భారీ గజమాలతో సన్మానించారు. అంబేద్కర్ కూడలిలో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ నాయకులు తమ పార్టీలోని కొందరు అసమ్మతివాదులతో కలిసి తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నాయకులు కసాయి కాంగ్రెస్‌ను నమ్మితే మోసపోతారని తెలిపారు. ఆత్మగౌరవం, పేదల ఆకలితీర్చేందుకు అనేకమంది అడవిబాట పడితే ఈ ప్రాంత నాయకత్వం కారణంగా వందలాది మంది నేలకొరిగారని గుర్తు చేశారు. గతంలో ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన ప్రజలకు రుణపడి ఉంటానని, 2014 కంటే రెట్టింపు ఉత్సాహం కార్యకర్తలో కనిపిస్తోందని, వంద రోజులు తన కోసం కష్టపడితే ఐదేళ్లు కడుపులో పెట్టుకొని చూసుకుంటానని మధు తెలిపారు. జయశశంకర్భూపాలపల్లి జెడ్పీ చైర్మన్ జక్కుశ్రీహర్షిణి, మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
పుట్టకే టికెట్.. మంథనిలో ఉత్కంఠ పోరు!
మంథని నియోజకవర్గంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది ప్రధానమంత్రి అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు మూడుసార్లు మంథని నియోజక వర్గ ఎమ్మెల్యేగా గెలుపొంది స్పీకర్‌గా సేవలందించారు. అనంతరం దుద్దిల్ల శ్రీధర్ బాబు నాలుగు సార్లు గెలుపొంది వివిధ శాఖలకు మంత్రిగా, ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ► నియోజకవర్గం గురించి ఏవైనా ఆసక్తికర అంశాలు: మధుకర్ హత్య, న్యాయవాదులైన గట్టు వామన్ రావు - నాగమణి దంపతుల హత్య. ► ఈ నియోజకవర్గంలో ఎన్నికలను ప్రభావితం చేసే అత్యంత కీలకమైన అంశం కాళేశ్వరం ప్రాజెక్ట్ మంథని ఎమ్మెల్యేగా ఉన్న దుద్ధిళ్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కావడం, అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన పుట్ట మధు ప్రస్తుతం పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌గా ఉన్నాడు. బీజెపి నుంచి మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి తనయుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి పార్టీ బలోపేతం చేస్తూ ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్నాడు. కాంగ్రెస్ నుంచి శ్రీధర్ బాబు, బీజెపి పార్టీ నుంచి సునీల్ రెడ్డికి పోటీ ఎవరూ లేకపోవడం పార్టీ టికెట్ కన్ఫాం కావడంతో గెలుపు కోసం ఎవరి ప్రచారాలు వారు చేసుకుంటూ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఆశావాహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది... ప్రస్తుత పెద్దపెల్లి జెడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇన్‌చార్జీగా ఉన్న పుట్ట మధుపై హైకోర్టు న్యాయవాద గట్టు వామన్ రావు - నాగమణి దంపతులు హత్య అనంతరం వచ్చిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆ సమయంలో పుట్టమధు పది రోజులు కనిపించకుండపోవడం నియోజకవర్గ వ్యాప్తంగా చర్చకు దారితీసాయి. తన రాజకీయ అస్తిత్వం కాపాడుకోవడానికి పుట్టమధు బహుజనవాదం, బీసీ వాదాన్ని భుజానికెత్తుకున్నారు. కాటారం సింగిల్ విండో చైర్మన్‌గా ఉన్న చల్ల నారాయణరెడ్డి ఇటీవల రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఆయా శుభకార్యాలకు నియోజకవర్గ వ్యాప్తంగా తిరుగుతున్నాడు. పార్టీ అధిష్టానంతో నిత్యం టచ్‌లో ఉంటూ, బీఆర్ఎస్ అసంతృప్త నేతలను చేరదీస్తూ పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేస్తానంటున్నాడు... రెండు రోజుల క్రితం పెద్దపెల్లి మాజీ ఎంపీ చేలిమల సుగుణ కుమారి మంథని, పెద్దపల్లిలో పర్యటించారు. చాలా సంవత్సరాలుగా విదేశాల్లో ఉంటున్న మాజీ ఎంపీ సుగుణకుమారి ఒక్కసారిగా ప్రత్యక్షం కావడంతో పొలిటికల్ సర్కిల్లో ఆమె రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఆమె మద్దతుదారులు అంటున్నారు. అయితే సుగుణ కుమారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? ఎంపీగా పోటీ చేస్తారా?.. పెద్దపెల్లి పార్లమెంటు పరిధిలోని ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు.. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు.. ఇలా వివిధ రకాల గాసిప్స్ స్టార్ట్ అయ్యాయి. రాజకీయ పార్టీల వారీగా ఎవరెవరు ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్నారు? దుదిల్ల శ్రీధర్ బాబు (కాంగ్రెస్ పార్టీ). చంద్రుడు పట్ల సునీల్ రెడ్డి (బిజెపి పార్టీ). పుట్ట మధుకర్ (బీఆర్ఎస్ పార్టీ) మంథని నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలు: మంథని నియోజవర్గంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాపకంగా నిర్వహించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ కారణంగా పంట పొలాలు నీట మునుగుతుండటం. అన్నారం బ్యారేజీ బ్యాక్ వాటర్‌తో గోదావరి నదిని ఆనుకొని ఉన్న గ్రామాలైన ఖాన్ సాయిపేట, ఆరెంద, మల్లారం, ఖానాపూర్, ఉప్పట్ల, విలోచవరం, పోతారం తదితర గ్రామాల్లో గత నాలుగు సంవత్సరాలుగా పంటలు పండలేని పరిస్థితి. గోదావరినదిని ఆనుకొని కరకట్ట నిర్మించాలని లేని పక్షంలో భూసేకరణ చేయాలని కోరుతున్న రైతులు. ఇసుక క్వారీలతో వందలాది లారీలు నిత్యం రాకపోకలతో కాటారం- మంథని ప్రధాన రహదారులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి, దీంతో ప్రజలు ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నాయి. అంతేకాదు తరచూ లారీల రాకపోకల కారణంగా అక్కడ రోడ్డు ప్రమాదాలు జరగడంతో ఇంటి పెద్దలను కొల్పోయి ఎన్నో కుటుంబాలు ఆసరా కోల్పోతున్నాయి. మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న మంథని, మున్సిపాలిటీగా మారడంతో పనులు లేక ఉపాధి కోల్పోయిన పేద మధ్యతరగతి కుటుంబాలు. పేరు గొప్ప ఊరు దిబ్బగా మారిన మంథని మున్సిపాలిటీ పరిధిలో చూస్తే మాత్రం ఎక్కడ చూసినా విగ్రహాలే ఎక్కడికక్కడే పేరుకపోయిన సమస్యలు. పట్టణం లోని మాతాశిశు హాస్పిటల్ ముందున్న డంపింగ్ యార్డ్ లో కాల్చిన చెత్త వలన వచ్చే పొగతో అనారోగ్య బారినపడుతున్న ప్రజలు. రామగిరి మండలంలో ప్రధానంగా సింగరేణి భూ నిర్వాసితుల సమస్యలు, భూ నిర్వాసితులకు ఇటు సింగరేణి పరంగా అటు ప్రభుత్వ పరంగా రావలసిన బెనిఫిట్స్ రాకపోవడం రెంటికి చెడ్డ రేవడిలా మారింది... మంథని నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రం వచ్చాక పెద్దగా అభివృద్ధి పనులు ఏమీ జరగలేదని, మిషన్ భగీరథ పేరుతో ఉన్న రోడ్లను ధ్వంసం చేశారని, సహజ వనలను దోచుకుపోతున్నారనేది మాత్రం వాస్తవం... ముఖ్యంగా రైతుబంధు, రైతు భీమా లాంటి పథకాలు రావడంలేదని ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు: వృత్తిపరంగా రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా సింగరేణి బోగ్గు కార్మికులు ఎక్కువ. నదులు: గోదావరి, ప్రాణహిత ఆలయాలు: ప్రముఖ పుణ్యక్షేత్రం కాలేశ్వరంలోని కాలేశ్వర ముక్తేశ్వర దేవాలయం, మంథనిలో పురాతన ఆలయాలు. పర్యాటకం: కాలేశ్వరం ప్రాజెక్ట్, రామగిరి ఖిల్లా, కాటారం మండలంలోని ప్రతాపగిరి కొండ -
Karimnagar: ఉగాది వేళ.. జాతకాల్లో అదృష్టం వెతుక్కుంటున్న నేతలు
సాక్షి, కరీంనగర్: తెలుగువారి కొత్త సంవత్సరాది ఉగాది. శోభకృత్ నామ సంవత్సరం సందర్భంగా ప్రతీ ఒక్కరూ తమ జాతకాన్ని కొత్త పంచాంగంలో వెతుక్కుంటున్నారు. ఈ ఉగాది సాధారణ ప్రజల కంటే.. రాజకీయ నాయకులకు ఎంతో కీలకమైంది. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, ప్రతిపక్షంలో ఉన్న ప్రత్యర్థులు, ఈసారి ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకునే ఆశావహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో అధికార–ప్రతిపక్ష నేతలంతా నూతన పంచాంగంలో తమ జాతకాలలో ఆదాయ వ్యయాల మాట ఎలా ఉన్నా.. రాజ్యపూజ్యంపైనే కన్నేశారు. అవమానాల మాట పక్కనబెట్టి.. రాజ్యపూజ్యం దక్కుతుందా? లేదా అన్న అంశంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితిని ఒకసారి పరిశీలిస్తే.. కరీంనగర్: బీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ తీగల వంతెన, ఎమ్మారెఫ్, స్మార్ట్ సిటీ పనులతో కరీంనగర్‌పై ఫోకస్ పెట్టారు. హిందుత్వం, మార్పు అన్న ఎజెండాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నుంచి పోటీ ఎదరవనుంది. బీజేపీ నుంచి కొత్త జయపాల్‌రెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి ఎమ్మెస్సార్ మనవడు రోహిత్, నగరాధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. వైస్సార్టీపీ నుంచి డాక్టర్ నగేశ్ బరిలో నిలవనున్నారు. చొప్పదండి: ప్రస్తుతం ఎమ్మెల్యే రవిశంకర్ (బీఆర్ఎస్)కు ఇంటిపోరు తప్పేలా లేదు. అదేపార్టీ నుంచి గజ్జెల కాంతం, కత్తెరపాక కొండయ్య, కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ టికెట్ రేసులో ఉన్నారు. ఈసారి మేడిపల్లి సత్యం (కాంగ్రెస్) నుంచి గట్టి పోటీ ఇవ్వనున్నారు. బీజేపీ నుంచి బొడిగె శోభ, సుద్దాల దేవయ్యల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వైఎస్సార్టీపీ నుంచి అక్కెనపల్లి కుమార్ బరిలో నిలవనున్నారు. మానకొండూరు: ఇక్కడ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రసమయి బాలకిషన్‌కు ఈసారి ఇంటి పోరు తీవ్రంగానే ఉంది. మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, ఇక్కడే నుంచే పోటీ చేసిన ఓరుగంటి ఆనంద్ కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ, బీజేపీ గడ్డం నాగరాజు, దరువు ఎల్లన్న బరిలో నిలవనున్నారు. హుజూరాబాద్: గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఈటల రాజేందర్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. బీఆర్ఎస్ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి ఈసారి బరిలో దిగనున్నారు. కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సిరిసిల్ల: ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్‌కు ప్రత్యర్థులు పెద్దగా లేరు. కాంగ్రెస్ నుంచి కె.కె.మహేందర్‌రెడ్డి మినహా ఇక్కడ ఆయనకు గట్టి వైరిపక్షం కానరావడం లేదు. ఈసారి బీజేపీ మాత్రం సెలబ్రెటీని రంగంలోకి దించుతారన్న ప్రచారం సాగుతోంది. రామగుండం: ప్రస్తుతం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు, ఈసారి కాంగ్రెస్ నేత ఠాకూర్ మక్కాన్ సింగ్ (కాంగ్రెస్) గట్టి పోటీ ఎదురవనుంది. వీరితోపాటు సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ (బీజేపీ) కూడా బరిలో ఉండటంతో పోరు రసవత్తరంగా మారనుంది. వేములవాడ: ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ (బీఆర్ఎస్)కు చిరకాల ప్రత్యర్థి ఈసారి కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ నుంచి చెన్నమనేని విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ పేరు వినిపిస్తుండగా.. తాను స్వతంత్రంగానైనా పోటీచేస్తానని అదే పార్టీ నేత తుల ఉమ ఇప్పటికే ప్రకటించారు. ఎన్నారైలు గోలి మోహన్ (ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు), మరో ఎన్నారై తోట రాంకుమార్ కూడా బరిలో నిలిచేందుకు ఆసక్తిగా ఉన్నారు. జగిత్యాల: డాక్టర్ సంజయ్ ఇప్పటికే వరుసగా గ్రామాల్లో పర్యటిస్తూ.. పల్లె నిద్ర పేరుతో ప్రజలకు చేరవవుతున్నారు. ఇక మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి (కాంగ్రెస్) కూడా పోటాపోటీగా పర్యటనలు చేస్తున్నారు. ఇటీవల భోగశ్రావణి బీజేపీ నుంచి బరిలోకి దిగేందుకు ఆసక్తిగా ఉన్నారు. కోరుట్ల: ప్రస్తుత ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు(బీఆర్ఎస్) వరుసగా అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు అంటూ పర్యటిస్తున్నారు. ఈసారి జువ్వాడి నర్సింగరావు (కాంగ్రెస్) గట్టి పోటీ ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నారు. మార్పులు జరిగితే వీరిద్దరు కుమారులను బరిలో దింపుతారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ధర్మపురి: ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ (బీఆర్ఎస్)కు ఈసారి గట్టి పోటీ ఉంది. ఇక్కడ నుంచి అడ్లూరి లక్ష్మణ్ (కాంగ్రెస్), మాజీ ఎంపీ గడ్డం వివేక్ (బీజేపీ) కూడా బరిలోకి దిగుతారని ప్రచారం సాగుతోంది. పెద్దపల్లి: ప్రస్తుత ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి (బీఆర్ఎస్)కి సొంత పార్టీ నుంచే తీవ్ర పోటీ ఉంది. ఎమ్మెల్యే టికెట్ కోసం.. సొంత పార్టీకే చెందిన ఎన్నారై నల్ల మనోహర్‌రెడ్డి, జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ నేత విజయరమణారావు నుంచి వీరికి గట్టి పోటీ ఎదురవనుంది. బీజేపీ నుంచి గుజ్జుల రామక్రిష్ణారెడ్డి, దుగ్యాల ప్రదీప్‌రావు, గొట్టిముక్కల సురేశ్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. బీఎస్పీ నుంచి దాసరి ఉష బరిలో ఉన్నారు. మంథని: ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు (కాంగ్రెస్)కు, పుట్ట మధు (బీఆర్ఎస్)కు ఈసారి హోరాహోరీ పోరు నడవనుంది. ఇక్కడ వీరిద్దరు మినహా మూడో పార్టీ అభ్యర్థులెవరూ ఇంతవరకూ ఆసక్తి చూపలేదు. -
ఢిల్లీలో పుట్టా మధు.. పార్టీ మార్పుపై కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: సొంత పనుల కోసం ఢిల్లీకి వస్తే, బీజేపీలో చేరేందుకు వచ్చానంటూ తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టా మధు ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ వదిలి బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం చేయడం బాధాకరమని.. తనకు వేరే పార్టీలో చేరాల్సిన అవసరం ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో పుట్టా మధు మీడియాతో మాట్లాడుతూ, కింది స్థాయి నుంచి వచ్చిన తనకు సీఎం కేసీఆర్ గతంలో మంథని ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారని, ఇప్పుడు పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్‌గా అవకాశమిచ్చి పార్టీలో మంచి గౌరవమిస్తున్నారని చెప్పారు. ఇలాంటి సమయంలో దుష్ప్రచారం చేసి తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎవరో కుట్ర పన్నారని ఆరోపించారు. మంథనిలో తనకు ఎలాంటి పోటీ లేదని.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా మంథని నుంచి భారీ మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఏ నాయకుడైనా ఢిల్లీకి వస్తే వారి ప్రతిష్టను దిగజార్చేలా పుకార్లు పుట్టిస్తున్నారని, ఢిల్లీ రావాలంటే భయం వేస్తోందని వ్యాఖ్యానించారు. -
ఐదోసారికి కేటీఆర్ సిద్ధం.. వేములవాడ నుంచి బండి సంజయ్ బరిలోకి?
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా పారిశ్రామిక ప్రాంతం రామగుండంలో రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా మూడు ప్రధాన పార్టీలు అప్పుడే నువ్వా నేనా అన్నట్టు ప్రచారబరిలోకి దిగాయి. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేలా అన్ని పార్టీలు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాయి. కారు జోరుకు బ్రేకులు వేయాలని కాంగ్రెస్, కమలం పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. సింగరేణి కార్మికులే ఇక్కడ గెలుపోటములు డిసైడ్ చేస్తారు. ఎత్తుకు పై ఎత్తులు రామగుండం నియోజకవర్గంలో మళ్లీ గులాబీ జెండా ఎగురవేసేలా టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. మరోవైపు గులాబీ పార్టీ ఎత్తుకు బీజేపీ పై ఎత్తులు వేస్తోంది. కాంగ్రెస్ మాత్రం ఈ సారి ఎలాగైనా సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఓటరు దేవుళ్ళను ప్రసన్నం చేసుకునేందుకు అప్పుడే ఇంటింటికి తిరుగుతూ ప్రచారం మొదలుపెట్టేశారు మూడు పార్టీల నాయకులు. టీఆర్ఎస్లో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బీజేపీలో మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, కాంగ్రెస్‌లో రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్ రానున్న ఎన్నికలు సవాల్తీగాసుకుని తమ పంతం నెగ్గించుకునేలా పావులు కదుపుతున్నారు. సింగరేణి కార్మికులదే రామగుండం నియోజకవర్గంలో గోదావరిఖని పట్టణం, రామగుండం, పాలకుర్తి, అంతర్గాం మండలాలు ఉంటాయి. సింగరేణి కార్మికులు మొత్తం గోదావరిఖని 8 ఇంక్లైన్ కాలనీల్లో ఉంటారు. ఇక్కడ కార్మికుల కుటుంబాలు, మహిళా ఓటర్లు ఎక్కువ. సింగరేణి కార్మికులు యూనియన్ల పరంగా పోటాపోటీగా ఉంటాయి. కారుణ్య నియామకాలు, పేరు మార్పిడి జీఓ, బోనస్ లాంటి అంశాలు ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. పింఛన్లు టీఆర్ఎస్కు అనుకూలమే. అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యే చందర్ అనుచరుల తీరు వల్ల కొంత ఇబ్బంది ఉంటుందనే చర్చ నడుస్తోంది. గతంలో ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ది కలిసి వస్తుందని బీజీపీ నేత సోమారపు భావిస్తున్నారు. చదవండి: పార్టీకి గుడ్‌బై! గులాం నబీ ఆజాద్‌పై కాంగ్రెస్ సీనియర్ నేతల సెటైర్లు ద్విముఖ పోటీనే మంథని నియోజకవర్గం పేరు వినగానే కాళేశ్వరం ప్రాజెక్టు గుర్తుకొస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఈ నియోజక వర్గంలోనిదే. మహాదేవ్ పూర్ ప్రాంతం భూపాలపల్లి జిల్లాలోకి వెళ్లడంతో కాళేశ్వరం ఆలయం, మేడిగడ్డ బ్యారేజ్ లక్ష్మి పంపు హౌజ్ ఉన్న ప్రాంతాలు ఆ జిల్లా పరిధిలోకి వెళ్లాయి. పార్వతీ బ్యారేజ్ సరస్వతీ పంపు హౌజ్ మంథని నియోజక వర్గంలోనే ఉన్నాయి. ఎన్నికలు మరో ఏడాదిలో జరిగే అవకాశాలు కన్పిస్తుడంతో రాజకీయ నాయకులు ఇప్పటినుంచే సిద్ధమవుతున్నారు. అనేక ఏండ్లుగా ఇక్కడ ద్విముఖ పోటీనే ఎక్కువగా జరుగుతోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య గట్టి పోటీ కొసాగుతోంది. కానీ ఈసారి మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో త్రిముఖ పోటీ జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. శ్రీధర్‌బాబుపై అసంతృప్తి మంథని నియోజకవర్గంలో శ్రీధర్ బాబు కాంగ్రెస్ తరపున మూడు సార్లు ఎన్నికయ్యారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుపై శ్రీధర్‌బాబు విజయం సాధించారు. నాటి నుంచి నియోజకవర్గంలో పర్యటిస్తూనే ఉన్నారు. అక్కడక్కడ అయనపై ఇంకా అసంతృప్తి కన్పిస్తోంది. కార్యకర్తల ఫోన్లు లిఫ్ట్ చేయరనే విమర్శలు ఎదుర్కొంటున్నారు శ్రీధర్‌బాబు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా చందుపట్ల సునీల్ రెడ్డి పేరు ఖరారు చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన చందుపట్ల బీజేపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ అధిష్టానం దృష్టిలో వడినట్లు సమాచారం. పుట్టమధుపై ఆరోపణలు న్యాయవాది వామన్ రావు హత్య విషయంలో టీఆర్ఎస్నేత, జడ్పీ చైర్మన్ పుట్ట మధుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. తమ వద్దే ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తమకు ఇబ్బందులే తప్ప ప్రయోజనం లేదని స్థానికులు భావిస్తున్నారు. ఈ రెండు అంశాలు గులాబీ పార్టీకి మైనస్‌అని భావిస్తున్నారు. పుట్ట మధు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు సన్నిహితంగా ఉంటారనే టాక్ ఉంది. గులాబీ పార్టీ టికెట్ రాకపోతే పుట్ట మధు బీజేపీలోకి వెళ్ళవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. రెండుసార్లు పట్టం వరుసగా రెండుసార్లు ఏ పార్టీని ఆదరించని పెద్దపల్లి ప్రజలు ఒక్క టీఆర్ఎస్కు మాత్రమే రెండుసార్లు పట్టం కట్టారు. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి కొంత ఇబ్బందికర వాతావరణం ఉన్నందున ఈసారి అధిష్టానం టికెట్ ఇవ్వదని కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. టిక్కెట్ఇవ్వని పక్షంలో తాను ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటానని మనోహర్ రెడ్డి చెబుతున్నట్లు సమాచారం. బండి సంజయ్ వర్గీయుడికి టికెట్? ఇక కాంగ్రెస్ నుంచి ఒకసారి గెలిచి రెండుసార్లు ఓడిపోయిన చింతకుంట విజయరమణారావు ఈసారయినా గెలిచి తీరాలనే పట్టుదలగా ఉన్నారు. అయితే ఆయనకు జిల్లా అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య, ఓదెల ఎంపిపి గంట రాములు పక్కలో బల్లెంలా తయారయ్యారని టాక్. పెద్దపల్లిలో పోటీలో ఉండే కమలనాధులెవరనే ప్రశ్న వినిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డికి ఈసారి టికెట్ అనుమానమేనంటున్నారు. బండి సంజయ్ వర్గీయుడు ప్రదీప్ రావుకు పెద్దపల్లి టికెట్ ఇవ్వచ్చని సమాచారం. 100 కోట్ల ఆదాయం వస్తున్నా అభివృద్ధి సున్నా దక్షిణ కాశీగా పేరు గాంచిన వేములవాడ రాజ రాజేశ్వర స్వామి కొలువై ఉన్న నియోజక వర్గ కేంద్రం అది. ఏడాదికి 100 కోట్ల ఆదాయం వస్తున్నా రాజన్న ఆలయం అభివృద్ధి కాలేదు. నియోజక వర్గం కూడా ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. స్వయానా సీఎం కేసీఆర్ ప్రకటించిన టెంపుల్ మాస్టర్ ప్లాన్ కూడా అమలుకు నోచుకోవడం లేదు. ఇక్కడ 2009 నుంచి చెన్నమనేని రమేష్ బాబు గెలుస్తూ వస్తున్నారు. రమేష్ బాబుకు జర్మనీ పౌరసత్వం ఉండేది. దీనిపై కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేయడంతో కోర్టులోను, కేంద్ర హోమ్ శాఖ ఆధ్వర్యంలో కూడా విచారణ జరుగుతోంది. పోటీలోకి మాజీ గవర్నర్ కొడుకు! సీనియర్ కాంగ్రెస్ నేత చల్మెడ లక్ష్మీ నరసింహా రావు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో వేములవాడ టీఆర్ఎస్ టికెట్ చల్మెడకే అనే టాక్ వినిపిస్తోంది. మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న కొండ దేవయ్య కూడా టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. ఇక బీజేపీ నుంచి మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన సీహెచ్. విద్యాసాగర్ రావు కొడుకు వికాస్ పోటీకి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పోటీ చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి ఆది శ్రీనివాస్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అవుతున్నారు. సిరిసిల్లలో నేత కార్మికులకు చేతి నిండా పని సిరిసిల్ల అనగానే చేనేత.. సీనియర్ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరావు గుర్తుకు వస్తారు. ఇప్పుడు మంత్రి కేటీఆర్ పేరు వినగానే సిరిసిల్ల గుర్తుకు వచ్చే పరిస్తితి వచ్చింది. చెన్నమనేని రాజేశ్వరావు లాగే కేటీఆర్ కూడా సిరిసిల్లలో నాలుగు సార్లు గెలుపొందారు. ఐదోసారి కూడా విజయకేతనం ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నారు కేటీఆర్. కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్‌తోపాటు మంత్రి కావడం, ముఖ్యమంత్రి కుమారుడు కావడం సిరిసిల్లకు కలిసి వచ్చింది. ఎన్నడూ లేని విధంగా సిరిసిల్లలో నేత కార్మికులకు చేతి నిండా పని దొరుకుతోంది. సిరిసిల్లలో చాలా అభివృద్ధి పనులు కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈసారి కూడా కేకేనే సిరిసిల్ల టీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకుల్లో కుమ్ములాటలు జనాల్లో పార్టీకి చెడ్డపేరు తెస్తోంది.. నాయకుల మధ్య ఐక్యత లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. 2009లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన కకేకే మహేందర్‌రెడ్డి 171 ఓట్ల స్వల్ప తేడాతో కేటీఆర్ చేతిలో ఓడిపోయారు. 2014లో కాంగ్రెస్తరపున పోటీచేసినా ఓడారు. కేకేకు కాంగ్రెస్ నేతల నుంచి సహాయ నిరాకరణ కొనసాగుతూనే ఉంది. ఈసారి కూడా కేకే మహేందర్ రెడ్డినే పోటీకి సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. ఇక సిరిసిల్లలో బీజేపీ పుంజుకుంటోంది. ఈసారి బీజేపీ తరపున మృత్యుంజయం లేదా జిల్లా ఉపాధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పోటీ చేస్తారని తెలుస్తోంది. -
అవినీతి నిరూపిస్తే మంథని చౌరస్తాలో ఉరేసుకుంటా
మంథని: పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గాన్ని ఎక్కువ కాలం పాలించిన బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందుకే తనపై కక్షగట్టి నిరాధారమైన ఆరోపణలతో రాష్ట్ర మీడియా తనపై కుట్రలు చేస్తుందని పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు ఆరోపించారు. మధుకర్ హత్య మొదలు.. చికోటి ప్రవీణ్ హవాలా వ్యవహారం వరకు ఎక్కడా తప్పు చేయలేదని, రాష్ట్ర మీడియా మాత్రం తన ప్రమేయం ఉన్నట్లుగా దుష్ప్రచారం చేస్తోందని, తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే మంథని ప్రధాన చౌరస్తాలో ఉరేసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంథనిలో గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా గెలిచేందుకు నాగరాజును ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరే పించానని కోర్టులో కేసు వేశారని, అది నిలువలే దని, తర్వాత మధూకర్ ఆత్మహత్యకు తానే కారణమంటూ హైదరాబాద్, ఢిల్లీ నుంచి ప్రతినిధులు వచ్చి రాద్దాంతం చేశారని, ఆ కేసు కోర్టులో ఉందని, దానిపై కథనాలు ఎందుకు రాయడం లేదని ప్రశ్నించారు. తాను అక్రమంగా రూ.900 కోట్లు సంపాదించినట్లు మీడియా ప్రచారం చేస్తుందని అందులో వాస్తవం లేదని, చికోటి వ్యవహారంలో మీడియా నిజాలు వెలుగులోకి తీసుకురావాలన్నారు. (క్లిక్: మునుగోడులో బరిలోకి రేవంత్.. కాంగ్రెస్ ప్లాన్ ఫలిస్తుందా..?) -
సంచలన వ్యాఖ్యలు.. డోర్ తెరిస్తే.. ‘దుద్దిళ్ల’ ‘కారు’ ఎక్కడం ఖాయం
సాక్షి, పెద్దపల్లి: సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ తెలుపులు తెరిస్తే మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు గులాబీ కండువా కప్పుకోవడం ఖాయమని పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం పెద్దపల్లి జిల్లా పరిషత్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితబంధు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతోందని, శ్రీధర్‌బాబు అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని సూచించారు. టీఆర్ఎస్లో చేరడానికి శ్రీధర్‌బాబు సిద్ధంగా ఉన్నా.. కేసీఆర్ గేట్లు తెరవడం లేదని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పటికైనా నిజాలను గ్రహించి చెంచాగిరీ చేయడం మానుకోవాలని హితవు పలికారు. దీంతో మధు చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. (చదవండి: ఆయన ఏం డిసైడ్ అయ్యారు, వెళ్తారా.. ఉంటారా?) -
3 నెలలు: అనేక మలుపులు తిరిగిన దంపతుల హత్య కేసు
సాక్షి, మంథని: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, పీవీ నాగమణి హత్య జరిగి నేటికి సరిగ్గా మూడు నెలలు గడిచింది. తాము చేపడుతున్న కార్యక్రమాలకు ఇబ్బంది సృష్టిస్తున్నారనే కోణంలో న్యాయవాద దంపతులను ఫిబ్రవరి 17న పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల సమీపంలోని మంథని–పెద్దపల్లి ప్రధాన రహదారిపై కొందరు పట్టపగలే కత్తులతో నరికి చంపిన సంగతి తెలిసిందే. హత్య జరిగిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకోగలిగారు. గ్రామ కక్షలతోనే తాము హత్యలకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించారు. అయితే ఈ హత్యలను ఖండిస్తూ దేశవ్యాప్తంగా న్యాయవాదులు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టాయి. న్యాయవాదులకు రక్షణ కల్పించాలని ఏకంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుకు విన్నవించింది. హత్య జరిగిన సమయంలో కొందరు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిందితులను కనిపెట్టడం పోలీసులకు సులువుగా మారింది. తనపై కత్తులతో దాడి చేసింది కుంట శ్రీను అని హత్యకు గురైన వామన్‌రావు వెల్లడించిన విషయం కూడా వీడియోలో రికార్డు అయింది. హత్య చేసిన అనంతరం పారిపోయిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చూపించారు. అయితే ఈ జంట హత్యలకు పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను సహకరించాడని పోలీసుల విచారణలో తేలింది. అప్పటినుంచే ఈ హత్యల్లో పుట్ట మధు పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జంట హత్యల వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయాన్ని గుర్తించేందుకు పోలీసులు అనేక కోణాల్లో తీవ్రంగా దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో కేసు పలుమలుపులు తిరుగుతూ వస్తోంది. ఒక దశలో జెడ్పీ చైర్మన్ మధు మెడకు చుట్టుకుంటుందా..? అనే ప్రచారం కూడా జరిగింది. చార్జీషీటు నమోదు గడువు సమీపిస్తున్న సమయంలో వామన్‌రావు తండ్రి కిషన్‌రావు వరంగల్ ఐజీ నాగిరెడ్డికి చేసిన ఫిర్యాదు అప్పట్లో సంచలనం రేపింది. అకస్మాత్తుగా జెడ్పీ చైర్మన్ అదృశ్యం కావడంతో కేసు మరింత జఠిలంగా మారింది. వారంరోజులపాటు మధు తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. పోలీసులు మధును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమవరం వద్ద అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మధుతోపాటు ఆయన భార్య పుట్ట శైలజ, మరికొందరిని కూడా విచారించారు. విచారణపై హైకోర్టు పర్యవేక్షణ న్యాయవాద దంపతుల హత్య కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. నిందితులను కఠినంగా శిక్షించేందుకు కేసును సీబీఐకి అప్పగించాలని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. మరోవైపు ఈ కేసుపై హైకోర్టు ప్రత్యేక దృష్టి సారించింది. జంట హత్యల కేసును తామే ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తామని, విచారణను వేగవంతం చేయాలని పోలీసులను ఆదేశించింది కూడా. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కేసు విచారణ కోసం కరీంనగర్లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని ఇటీవలే హైకోర్టుకు లేఖ రాసింది. చార్జీషీట్ సిద్ధం న్యాయవాద దంపతుల హత్య జరిగిన నేటికి 90 రోజులు కావస్తుండడంతో పోలీసులు కేసుకు సంబంధించిన చార్జీషీట్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. అన్ని కోణాల్లో విచారణ జరిపి పకడ్బందీగా చార్జిషీట్‌ను తయారు చేసినట్లు తెలిసింది. అందులో ఇంకా ఎవరైనా నిందితుల పేర్లను చేర్చుతారా..? లేదా ఇప్పటివరకు ఉన్నవారినే చూపిస్తారా..? అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం హత్యల్లో ఏడుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో రెండు మూడు రోజుల్లో కోర్టులో చార్జీషీట్ సమర్పించే అవకాశం ఉంది. చదవండి: లాయర్ల హత్య కేసు: ఏరోజు ఏం జరిగిందంటే..? -
Putta Madhu: 10 రోజుల అజ్ఞాతంపై నోరు విప్పిన పుట్టా!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హైకోర్టు న్యాయ వాది వామన్‌రావు దంపతుల హత్యతో తనకెలాంటి సంబంధం లేదని ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు పోలీసులకు చెప్పినట్టు సమాచారం. సంబంధం లేనప్పుడు 10 రోజుల పాటు ఎందుకు పారిపోయారని ప్రశ్నించగా.. కేసులకు భయపడి అజ్ఞాతంలోకి వెళ్లానని సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. కుంట శ్రీను, బిట్టు శ్రీను, ఇతరులు వారి వ్యక్తిగత కారణాల వల్లనే వామన్‌రావు దంపతులను హత్య చేసి ఉంటారని పేర్కొ న్నట్టు సమాచారం. దీంతో కేసు పురోగతి దిశగా పోలీసులకు ఆధారాలేమీ లభించలేదని తెలిసింది. మంగళవారం నాలుగో రోజు మధు దంపతులను గంటన్నరపాటు విచారించిన పోలీసులు తిరిగి పంపించేశారు. తామెప్పుడు పిలిచినా హాజరు కావాలని స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు వేర్వేరు వాహనాల్లో వచ్చిన మధు, ఆయన భార్య శైలజను పోలీసులు వేర్వేరుగానే విచారించారు. ఈ కేసులో వీరి ప్రమేయంపై స్పష్టమైన ఆధారాలు లభించలేదని ఓ అధికారి ‘సాక్షి’తో చెప్పారు. 34 ఖాతాల పరిశీలన పూర్తి ఈ కేసుకు సంబంధించి పలువురి బ్యాంకు ఖాతాలను 4 రోజులుగా పరిశీలించిన పోలీసులు.. అనుమానాలకు తావిచ్చే స్థాయిలో లావాదేవీలు లేవని నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. మొత్తం 39 ఖాతాల ను పరిశీలించాల్సి ఉండగా.. ఇంకా 5 ఖాతాల సమాచారం రావలసి ఉందని ఓ అధికారి తెలిపారు. దీంతో మరో 3 రోజుల పాటు విచారణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటికి వెళ్లేందుకు అనుమతి పుట్ట మధును ఈనెల 8న ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం నుంచి రామగుండం తీసుకువచ్చినట్లు ప్రకటించిన పోలీసులు.. సోమవా రం రాత్రి వరకు కమిషనరేట్‌లోనే ఉంచి విచారించారు. తర్వాత ఇంటికి వెళ్లేందుకు అనుమతిచ్చారు. రాత్రి 11 గంటల తర్వాత మంథని వచ్చిన మధుకు నేతలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం జయశంకర్ భూపాలపల్లి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్శిణి, పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్రఘువీర్సింగ్, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఆయన నివాసానికి వచ్చి కలిశారు. చదవండి: Etelaకు చెక్.. టీఆర్ఎస్ భావి నేతగా తెరపైకి కౌశిక్ రెడ్డి! -
పుట్ట మధును విడిచిపెట్టిన పోలీసులు!
-
Putta Madhu: పుట్ట మధును విడిచిపెట్టిన పోలీసులు!
సాక్షి, పెద్దపల్లి: హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు మంథనిలోని తన ఇంటికి చేరుకున్నారు. దీంతో ఆయనను కలిసేందుకు అభిమానులు తరలివచ్చారు. కాగా పది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఆయనను మే 8న రామగుండం పోలీసులు భీమవరంలో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వామనరావు- నాగమణి దంపతుల హత్య కేసులో ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. మధుతో పాటు ఆయన భార్య శైలజను రెండు రోజుల పాటు విచారించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్ కుమారుడు ఆకాశ్‌ను సైతం పోలీసులు విచారించారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల విచారణ అనంతరం సోమవారం రాత్రి మధును వదిలేసిన పోలీసులు.. నేడు బ్యాంక్స్టేట్మెంట్లతో హాజరుకావాలని ఆదేశించారు. కాగా హత్యకేసులో ప్రధాన నిందితులకు సుపారీ కింద రూ.2 కోట్లు ముట్ట జెప్పారని, ఏ 1 కుంట శ్రీను జైల్లో ఉన్నప్పటికీ అతని స్వగ్రామంలో ఇంటి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని ఆరోపిస్తూ వామన్‌రావు తండ్రి కిషన్‌రావు గత నెల 16న ఐజీ నాగిరెడ్డికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మధు, ఆయన కుటుంబసభ్యుల బ్యాంక్ స్టేట్మెంట్లపై పోలీసుల ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఎనిమిది బ్యాంక్ అకౌంట్ల స్టేట్మెంట్లు తీసుకున్నారు. చదవండి: సంచలనం సృష్టించిన పుట్ట మధు అదృశ్యం కేసు -
పుట్ట మధును మూడో రోజు విచారిస్తున్న పోలీసులు
-
Putta Madhu: అదే జరిగితే పెద్దపల్లి జెడ్పీ కుర్చీ ఎవరికో..?!
మంథని: న్యాయవాద దంపతుల హత్య నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధు పాత్రపై విచారణ జరుగుతున్న సమయంలో ఈ పీఠంపై పలువురు కన్ను పడింది. మొదటి జిల్లా పరిషత్ చైర్మన్‌గా తామంటే తాము అవుతామని ఊహల లోకంలో తేలినవారికి స్వయానా సీఎం కేసీఆర్ పుట్ట మధు పేరు ప్రస్తావించడంతో మిన్నకుండిపోయారు. తాజాగా మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మధు పోలీసుల అదుపులో ఉండడంతో ఆయన పదవికి గండం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య కేసులో ప్రస్తుతం పుట్ట మధును పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనను అరెస్టు చేస్తారనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే జరిగితే మధు చైర్మన్ పదవి ఊడుతుందని, ఆ స్థానంలో తాము సిద్ధంగా ఉన్నామని పలువురు జెడ్పీటీసీలు అధిష్టానం ఎదుట బారులు తీరినట్లు సమాచారం. వీరిలో పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి మొదటి నుంచి పార్టీలో చురుకుగా పనిచేస్తున్నారు. అటు మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మద్దతుతో జెడ్పీ పీఠం దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈమెతోపాటు జిల్లాలోని మరో ముగ్గురు జెడ్పీటీసీలు సైతం చైర్మన్‌గిరి కోసం పోటీ పడుతున్నారు. పుట్ట మధును పోలీసులు విచారిస్తున్నా.. ఇప్పటివరకు ఆయనపై పార్టీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అయినా మధు పదవి ఎలాగైనా పోతుందనే ముందస్తు సమాచారంతో జెడ్పీటీసీలు చైర్మన్ గిరి కోసం పోటీ పడుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. చదవండి: Etela, Putta Madhu: వాళ్లందరికీ షాక్..! -
Etela, Putta Madhu: వాళ్లందరికీ షాక్..!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: యుద్ధంలో ఒక్క శత్రువును టార్గెట్ చేస్తే సరిపోదు.. అతని బలానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారణమైన మిగతా శక్తులను కూడా దెబ్బకొట్టడమే రాజనీతి. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్‌లోని హుజూరాబాద్, మంథని నియోజకవర్గాల్లో ఇదే జరుగుతోంది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఈటల రాజేందర్, పుట్ట మధుకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్న అధికారులకు స్థానచలనం తప్పడం లేదు. హుజూరాబాద్‌లో ఇప్పటికే ఏసీపీ, ఆర్డీవో, ఓ తహసీల్దార్‌తోపాటు నలుగురు ఎంపీడీవోలను బదిలీ చేశారు. తాజాగా పోలీస్ ఇన్స్పెక్టర్లను టార్గెట్ చేశారు. నియోజకవర్గం పరిధిలోని హుజురాబాద్‌టౌన్, జమ్మికుంట, జమ్మికుంట రూరల్ సర్కిల్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఇన్స్పెక్టర్లు జి.సదన్‌కుమార్, ఎ.రమేష్, సీహెచ్.విద్యాసాగర్‌కు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా కరీంనగర్ డీఐజీకి అటాచ్డ్ చేస్తూ నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వీరి స్థానంలో హుజూరాబాద్‌కు వి.శ్రీనివాస్ (సీసీఎస్–3), జమ్మికుంటకు కె.రామచంద్రారావు (ధర్మపురి), జమ్మికుంట రూరల్‌కు జె.సురేష్ (సీసీ ఎస్)ను బదిలీ చేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమలులోకి వచ్చేలా ఆదేశాలు జారీ అయ్యాయి. హుజురాబాద్ రూరల్ పోలీస్ సర్కిల్ పరిధి హుస్నాబాద్, మానకొండూరు నియోజకవర్గాలలో ఉండడంతో అక్కడ సీఐ బదిలీ కాలేదు. ఈ నియోజకవర్గంలోని ఎస్సైల బదిలీలు కూడా సోమవారం జరిగే అవకాశం ఉందని సమాచారం. మారుతున్న రాజకీయాలు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో తెగతెంపులు చేసుకున్న రీతిలోనే టీఆర్ఎస్ అధిష్టానం వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు అనుకూలంగా వ్యవహరించిన అధికారులు, నాయకులపై గురిపెట్టారు. ఇప్పటికే వీణవంక మండలం ఇప్పాలపల్లి పీఏసీఎస్‌లో 2015లో చోటు చేసుకున్న రూ.18.86 లక్షల అవకతవకలకు సంబంధించి ఈటల వర్గీయుడైన అప్పటి చైర్మన్ సాదవరెడ్డికి తాజాగా నోటీసులు జారీ చేశారు. అదే సమయంలో నియోజకవర్గంలో ఈటల వర్గీయులుగా ఉన్న టీఆర్ఎస్ నేతలను ఆయన వైపు వెళ్లకుండా చూసే పనిలో పడ్డారు. ఈ మేరకు మంత్రి గంగుల కమలాకర్‌కు హుజూరాబాద్ బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో మంత్రి గంగుల హుజూరాబాద్‌లో మకాం వేసే అవకాశాలున్నాయి. ఇక్కడ ప్రత్యామ్నాయ నేతను తెరపైకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మంథని సర్కిల్లో పోలీసుల బదిలీలు ఈ క్రమంలోనే ఇక్కడి పోలీసులను కూడా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వామన్‌రావు హత్యకు ముందు.. తరువాత జరిగిన పరిణామాల్లో మంథని సర్కిల్ పరిధిలోని పోలీసులు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ విచారణను తిరగతోడడంలో భాగంగా మంథని సీఐ జి.మహేందర్ రెడ్డిని వరంగల్ కమిషనరేట్‌కు అటాచ్డ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఇటీవలే మంథని సర్కిల్‌కు సీఐగా బదిలీపై రావడం గమనార్హం. అంతకుముందు వామన్‌రావు దంపతుల హత్య జరిగినప్పుడు సీఐగా ఉన్న మహేందర్‌ను బదిలీ చేసి మహేందర్‌రెడ్డిని తీసుకొచ్చారు. తాజాగా అదే సమయంలో మంథని సర్కిల్ పరిధిలోని వివిధ పోలీస్స్టేషన్లలో పనిచేస్తున్న ఎస్సైలు అందరిని బదిలీ చేస్తూ రామగుండం కమిషనర్ వి.సత్యనారాయణ ఉత్తర్వులు ఇచ్చారు. జంట హత్యలు జరిగిన రామగిరి పోలీస్‌స్టేషన్ ఎస్సై ఎ.మహేందర్‌ను బసంత్‌నగర్‌కు బదిలీ చేశారు. మహేందర్ పుట్ట మధు వర్గీయులకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలను తీవ్రంగా ఎదుర్కొన్నారు. ఆయన స్థానంలో రామగుండం ఎస్బీకి అటాచ్డ్ అయిన ఎస్సై కె.రవిప్రసాద్‌కు పోస్టింగ్ ఇచ్చారు. ముత్తారం మండల ఎస్సై సి.నరసింహారావును టాస్క్‌ఫోర్స్‌కు బదిలీ చేసి కాసిపేట (మంచిర్యాల జిల్లా) ఎస్సై బి. రాములును ముత్తారానికి పంపించారు. మంథని ఎస్సై ఓంకార్‌ను ములుగుకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో జూలపల్లి ఎస్సై పి.చంద్రకుమార్‌కు పోస్టింగ్ ఇచ్చారు. భూపాలపల్లి జిల్లా పరిధిలోకి వెళ్లిన మహదేవ్పూర్, కాళేశ్వరం పరిధిలో కూడా బదిలీలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ బదిలీలన్నీ పదోన్నతులపై జరగడం గమనార్హం. మహదేవ్పూర్ సీఐ నర్సయ్య డీఎస్పీగా పదోన్నతి పొందడంతో ఆయన స్థానంలో రామగుండం టాస్క్‌ఫోర్స్ సీఐ తిలక్ నియమితులయ్యారు. కాళేశ్వరం, మహదేవ్పూర్ ఎస్సైలు సీఐలుగా పదోన్నతి పొంది బదిలీపై వెళ్లారు. మంథనిలో రాజకీయ మార్పులు తప్పవా..? అలాగే మంథనిలో కూడా రాజకీయ సమీకరణాలు మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్‌కు చెందిన దుద్దిళ్ల శ్రీధర్‌బాబును టీఆర్ఎస్లోకి తీసుకునే ప్రయత్నాలు ఊపందుకున్నట్లు సమాచారం. వామన్‌రావు దంపతుల హత్యలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మధుకు టీఆర్ఎస్లో అవకాశాలు తగ్గినట్టేనన్న ప్రచారం జరుగుతోంది. మంథనిలో మధు కనుసన్నల్లోనే పోస్టింగులు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారుల పోస్టింగ్‌ల విషయంలో ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇన్స్పెక్టర్లు మొదలుకొని నియోజకవర్గంలో పనిచేసే ప్రతి అధికారి ఎమ్మెల్యే ద్వారానే పోస్టింగ్ పొందే పరిస్థితి. అయితే మంథని నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ పోస్టింగ్‌లు, బదిలీలు అన్నీ జెడ్పీ చైర్మన్ పుట్ట మధు కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. శ్రీధర్‌బాబు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత కావడంతో టీఆర్ఎస్ ఇన్చార్జిగా మధు చెప్పిన వారికే పోస్టింగ్‌లు ఇవ్వడం జరుగుతోంది. దీనిపై పలుమార్లు శ్రీధర్‌బాబు, కాంగ్రెస్ నేతలు విమర్శించడం తప్ప అడ్డుకోలేకపోయారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో మధుకు సంబంధం లేకుండా నియామకాలు చోటు చేసుకోవడం గమనార్హం. మంథనిలోనూ బదిలీల పర్వం మాజీ మంత్రి ఈటల రాజేందర్ వర్గీయుడు, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన మంథని నియోజకవర్గంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. హత్యకు గురైన న్యాయవాది గట్టు వామన్‌రావు దంపతులకు సంబంధించి వామన్‌రావు తండ్రి తాజాగా ఐజీకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును రీఓపెన్ చేశారు. ఇందులో భాగంగా పుట్ట మధును విచారణ కోసం రామగుండం కమిషనరేట్‌కు తీసుకొచ్చిన పోలీసులు.. విచారణ జరుపుతున్నారు. తాజాగా ఆయన సతీమణి, మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజను కూడా విచారణ కోసం తీసుకొచ్చారు. ఇక మంథని నియోజకవర్గం పరిధిలో తహసీల్దార్లు, ఎంపీడీవోల బదిలీలపై కూడా దృష్టి పెట్టినట్లు సమాచారం. పుట్ట మధుతోపాటు మున్సిపల్ చైర్పర్సన్ శైలజకు అనుకూలంగా వ్యవహరిస్తారనే ఆరోపణలున్న అధికారులను బదిలీ చేసి, కొత్త వారిని తీసుకొచ్చే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: Putta Madhu: హత్యకు ముందు డ్రా చేసిన 2 కోట్లపై పోలీసుల ఆరా -
TRS Party: ‘గులాబీ’లో గుబులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)లో నిశ్శబ్దంతోపాటు ఉత్కంఠ నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలియడంలేదు. ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ వ్యూహాలు కీలక నేతలకు సైతం అంతుచిక్కడంలేదు. మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు అరెస్టు వంటి వరుస పరిణామాల నేపథ్యంలో ఈ పరిస్థితి నెలకొంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని, అవినీతి, ఇతర ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి ఉద్వాసన తప్పదనే ప్రచారం జరుగుతోంది. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, నేతలపై కూడా కఠిన చర్యలు తప్పవనే సంకేతాలు వెలువడుతున్నాయి. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కీలక నేతలు సహా ఏ ఒక్కరూ నోరువిప్పడంలేదు. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలతోనే అప్రమత్తం గత ఏడాదిలో జరిగిన దుబ్బాక ఉపఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలతో టీఆర్ఎస్ కుదుపునకు లోనైంది. రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా బీజేపీ దూకుడు పెంచడంతో సుమారు రెండు నెలలపాటు పరిస్థితులను మదింపు చేసిన కేసీఆర్ తన వ్యూహానికి పదును పెట్టారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఆయన ఈ ఏడాది ఫిబ్రవరి మొదటివారంలో వ్యూహం అమలుకు శ్రీకారం చుట్టారు. ఫిబ్రవరి 7న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య ప్రజాప్రతినిదులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. తాను సీఎంగా పదేళ్లు కొనసాగుతానని కుండబద్దలు కొట్టడంతోపాటు పార్టీ లైన్ దాటి మాట్లాడేవారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. పార్టీ సంస్థాగత బలోపేతం కోసం సభ్యత్వ నమోదు, కమిటీల ఏర్పాటు షెడ్యూలును ప్రకటించారు. ఎన్నికల అస్త్రంతో బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో దూకుడు పెంచిన బీజేపీకి అడ్డుకట్ట వేసేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ తర్వాత జరిగిన ఇతర ఎన్నికలను అస్త్రంగా ప్రయోగించారు. శాసనమండలి పట్టభద్రుల కోటా ఎన్నికల్లో ‘నల్లగొండ– ఖమ్మం– వరంగల్’స్థానాన్ని నిలబెట్టుకోవడంతోపాటు బీజేపీ సిట్టింగ్ స్థానం ‘హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్’ను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. పట్టభద్రుల కోటా ఎన్నికల ఫలితాల్లో బీజేపీని ఆత్మరక్షణలోకి నెట్టిన కేసీఆర్ సాగర్ ఉప ఎన్నికలో డిపాజిట్ దక్కకుండా చేయడం ద్వారా టీఆర్ఎస్ శిబిరంలో మునుపటి ఆత్మవిశ్వాసాన్ని నింపారు. శాసనసభలో ఇదివరకే కాంగ్రెస్ శాసనసభాపక్షం టీఆర్ఎస్లో విలీనం కాగా, గత నెలలో టీడీపీ లెజిస్లేచర్ పార్టీ కూడా టీఆర్ఎస్లో విలీనమైంది. -
వామన్‌రావు దంపతుల హత్య కేసులో కీలక మలుపు
సాక్షి, కరీంనగర్ : వామన్‌రావు దంపతుల హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. పుట్ట మధు సహా మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండవ రోజు పుట్ట మధును పలు అంశాలపై విచారించారు. హత్యకు ముందు రూ.2 కోట్లు విత్‌డ్రా విషయం సహా.. ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్ ఇంటి నిర్మాణంపైనా ఆరా తీశారు. వామన్‌రావు తండ్రి కిషన్‌రావునూ విచారించారు. హత్యలో పుట్ట మధు, భార్య శైలజ ప్రమేయం ఉందని కిషన్‌రావు చెప్పారు. కాగా, ఈ జంటహత్యల కేసులో ఇప్పటికే ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను కీలకంగా ఉన్నారు. -
Putta Madhu: హత్యకు ముందు డ్రా చేసిన 2 కోట్లపై పోలీసుల ఆరా
-
Putta Madhu: హత్యకు ముందు డ్రా చేసిన 2 కోట్లపై ఆరా
సాక్షి, పెద్దపల్లి: న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధును పోలీసులు రెండో రోజు విచారిస్తున్నారు. లాయర్ల హత్య జరగడానికి ముందు పుట్టా మధు రూ. 2 కోట్లు డ్రా చేసిన వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హత్య కేసు ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్ జైల్లో ఉండగా గుంజపడుగులో నిందితుడి ఇంటి నిర్మాణం శరవేగంగా సాగడంపై కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు. అదేవిధంగా పుట్టా మధు అనుచరులు సత్యనారాయణ, సతీష్ పోలీసుల అదుపులో ఉన్నారు. గతంలో న్యాయవాద దంపతులు పుట్టా మధు దంపతులపై కోర్టులో కేసులు వేసిన విషయం తెలిసిందే. న్యాయవాది దంపతుల హత్య కేసులో పుట్టా శైలజను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక నాలుగు రాష్ట్రాల్లో 4 వాహనాలను మారుస్తూ పట్టా మధు 6 ఫోన్లు మార్చినట్లు పోలీసులు వెల్లడించారు. చదవండి: Putta Madhu: అత్యంత పకడ్బందీగా అజ్ఞాతం చదవండి: సంచలనం సృష్టించిన పుట్ట మధు అదృశ్యం కేసు -
Putta Madhu: భీమవరం ఎపిసోడ్లో నిజమెంత?
సాక్షి, హైదరాబాద్: న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అజ్ఞాతంలోకి వెళ్ళిన పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు.. తన ఆచూకీ పోలీసులకు చిక్కకుండా చాలా పకడ్బందీగా వ్యవహరించాడు. నిన్నమొన్నటి వరకు ఎక్కడా సెల్‌ఫోన్ వాడలేదు, కుటుంబ సభ్యులు, అనుచరులను ఫోన్లో సంప్రదించలేదు. సొంత వాహనం వాడలేదు. హోటళ్లు, లాడ్జిలలో కాకుండా తెలిసిన వారి వద్దే తలదాచుకున్నాడు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌తో పాటు వివిధ రాష్ట్రాల్లో తిరిగాడనే అనుమానాలున్నా, ఎక్కడా సొంత ఏటీఎం కార్డు కూడా వాడలేదంటే ఎంత పకడ్బందీగా వ్యవహరించాడో అర్థమవుతోంది. మధుకు ఆప్తుడైన కర్ణాటకకు చెందిన ఓ మిత్రుడికి ఏపీలోని రావులపాలెంలో ఉన్నవారితో సంబంధాలు ఉన్నాయని, ఆ పరిచయాల ఆధారంగా మధు భీమవరంలో ఆశ్రయం పొందినట్లు పోలీసువర్గాలు చెబుతున్నాయి. మధు ఆచూకీ కనిపెట్టాలని మధుకు దగ్గరగా ఉండే ఓ ఇన్స్పెక్టర్ను ఉన్నతాధికారులు ఆదేశించారని, ఆ అధికారి సూచనల మేరకు ఇటీవల కుటుంబ సభ్యులు మధును సంప్రదించగా.. ఆ సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా భీమవరంలో అతని జాడను కనిపెట్టారని చెబుతున్నారు. సుపారీ టేపులపై రెండున్నరేళ్ల తర్వాత కేసు! వామన్‌రావు దంపతుల హత్య కేసు నిందితుల్లో ఒకరైన కుంట శ్రీను పేరుతో, 2018 ఎన్నికలకు ముందు మధు పేరును ప్రస్తావిస్తూ ఓ హత్యకు సంబంధించి జరిగిన సుపారీ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హత్యకు డీల్ రూ.60 లక్షలకు కుదిరింది. రెండున్నరేళ్ల తర్వాత, వామన్‌రావు హత్య అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు, ఇటీవల వాయిస్ టెస్టుకు అను మతి కోరుతూ మంథని కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఇన్ని రోజులు కుంటశ్రీను ఎవరితో సుపారీ మాట్లాడాడు? అసలు ఆ గొంతు ఎవరిది? అన్న విషయాన్ని తేల్చకపోవడం గమనార్హం. చదవండి: లాయర్ల హత్య: ‘అప్పటి ఆరోగ్య మంత్రిపై అనుమానం’ -
సంచలనం సృష్టించిన పుట్ట మధు అదృశ్యం కేసు
సాక్షి, కరీంనగర్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హైకోర్టు లాయర్ల జంట హత్యల కేసు చివరికి పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు మెడకు చుట్టుకుంటోంది. కేసు చార్జిషీటు దాఖలు చేసే సమయంలో గన్మెన్లను వదిలి వారం రోజులపాటు అదృశ్యం కావడంతో ఆయన ప్రమేయంపై పోలీసులు ఆరా తీసే పరిస్థితి తలెత్తింది. లాయర్ల హత్యకేసులో ప్రధాన నిందితుడైన కుంట శ్రీను జైలులో ఉండగా.. అతని ఇంటి నిర్మాణానికి పుట్ట మధు సహకరిస్తున్నట్లు వామన్‌రావు తండ్రి కిషన్‌రావు ఫిర్యాదు చేశారు. వాటితోపాటు మరిన్ని అనుమానాస్పద అంశాలు జెడ్పీ చైర్మన్ మధుకు తలనొప్పిగా మారుతున్నాయి. వారం రోజుల క్రితం అదృశ్యమైన మధును శుక్రవారం రాత్రి ఏపీలోని భీమవరంలో అదుపులోకి తీసుకున్నట్లు చెప్పిన పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ.. వామన్‌రావు హత్య కేసులో ఆయన ప్రమేయంపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. శనివారం ఉదయం 11 గంటల నుంచి ముగ్గురు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో కేసు దర్యాప్తు సాగిస్తున్నారు. హత్య కేసు విచారణాధికారి అడిషనల్ డీసీపీ అశోక్‌కుమార్, ఓఎస్డీ శరత్‌చంద్రపవర్, రామగుండం పోలీసు కమిషనర్ వి.సత్యనారాయణ వేర్వేరుగా విచారించారు. పుట్ట మధును పోలీసులు అదుపులోకి తీసుకున్న అంశం రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశమైది. రూ, 2 కోట్లు సుపారీ నిజమేనా..? హత్యకేసులో ప్రధాన నిందితులకు సుపారీ కింద రూ.2 కోట్లు ముట్ట జెప్పారని, ఏ 1 కుంట శ్రీను జైల్లో ఉన్నప్పటికీ అతని స్వగ్రామంలో ఇంటి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని ఆరోపిస్తూ వామన్‌రావు తండ్రి కిషన్‌రావు గత నెల 16న ఐజీ నాగిరెడ్డికి లేఖ రాశారు. ఇప్పుడు ఆ లేఖనే పుట్ట మధుపై ఎంక్వైరీకి కారణమైంది. వామన్‌రావు దంపతుల హత్యకు రూ.2 కోట్లు డీల్ మాట్లాడిందెవరు? బిట్టు శ్రీనుకు కొత్త కారు కొనిచ్చింది ఎవరు? కుంట శ్రీను ఇంటికి ఎవరు డబ్బులు స్పాన్సర్ చేస్తున్నారు? అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. కోట్ల రూపాయలను ఏ బ్యాంకు నుంచి తెచ్చారు? విత్‌డ్రా చేసిందెవరు? తదితర కోణాలపై రామగుండం పోలీసులు దృష్టి పెట్టారు. హత్య జరగడానికి ముందు నుంచి తరువాత చోటు చేసుకున్న పరిణామాల వరకు పుట్ట మధు ఎవరెవరితో మాట్లాడారో కాల్‌డేటా కూడా తీసుకుని విచారిస్తున్నారు. చార్జిషీటు దాఖలుకు సమయం ఆసన్నమైన పరిస్థితుల్లో కోర్టుకు సమాధానం చెప్పుకొనేందుకు.. వామన్‌రావును అంతమొందించడం వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుందనే కోణంపై పోలీసులు దృష్టి పెట్టినట్లు సమాచారం. వారం రోజులు ఎందుకు అదృశ్యం..? జెడ్పీ చైర్మన్ పుట్ట మధు వారం రోజులు అదృశ్యం కావడానికి గల కారణాలను కూడా పోలీసులు సేకరించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. రక్షణ కోసం గన్మెన్లుగా వచ్చిన నలుగురు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా.. ప్రభుత్వ కారును వదిలేసి ఎందుకు అదృశ్యం కావలసి వచ్చిందనే కోణంలో విచారణ జరుపుతున్నారని సమాచారం. పోలీసుల కళ్లు కప్పి మహారాష్ట్ర, హైదరాబాద్, భీమవరం ప్రాంతాల్లో ఎవరెవరిని కలిశారనే కోణాన్ని కూడా పరిశీలిస్తున్నారని తెలిసింది. ఈ కేసుతో సంబంధం ఉందన్న కారణంగానే మధు గాయబ్ అయ్యాడా? ఇంకేమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా? అనే కోణంలో కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అదృశ్యంపై గోప్యత ఎందుకు? గత నెల 29న రాత్రి హైదరాబాద్ నుంచి ఓ పోలీస్ అధికారి నుంచి ఫోన్ కాల్ రావడంతో అదేరోజు రాత్రి పుట్ట మధు అదృశ్యమయ్యారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మధు అదృశ్యమైన తరువాత మరుసటి రోజు ఉదయం గన్మెన్లు ఈ విషయాన్ని ఏఆర్ విభాగం చీఫ్‌కు తెలియజేయడం, ఆయన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిపోయాయి. గన్మెన్లు తమ ఆయుధాలను సరెండర్ చేసి, ఏఆర్‌కు అటాచ్డ్ అయ్యారు. ఆ వెంటనే రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. వివిధ వర్గాల నుంచి సేకరించిన సమాచారం, మధు, ఆయన డ్రైవర్ సెల్ టవర్ సిగ్నల్స్ మేరకు మహారాష్ట్ర వెళ్లారు. ఈనెల 1న మహారాష్ట్రలోని వని పట్టణంలో మధు సోదరుని నివాసానికి వెళ్లి విచారణ జరపగా, మధు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తేలింది. అదే సమయంలో ఈటల రాజేందర్ వ్యవహారం తెరపైకి రావడంతో హైదరాబాద్ వెళ్లినట్లు తెలిసింది. మధు కోసం జిల్లాకు చెందిన ఓ మంత్రి పార్టీ పెద్దలతో సంప్రదింపులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మూడు రోజుల క్రితం సదరు మంత్రికి ‘సాక్షి’ ఫోన్ చేయగా, మధు హైదరాబాద్‌లోనే ఉన్నారని చెప్పడం గమనార్హం. సాక్షి కథనాలతో అప్రమత్తమైన పోలీసులు ‘భీమవరం’ నుంచి అదుపులోకి తీసుకోవడం కొసమెరుపు. ‘సాక్షి’ వరుస కథనాల సంచలనం పుట్ట మధు అదృశ్యమైన విషయంపై ఈనెల 6న ‘సాక్షి’ దినపత్రికలో ‘పుట్ట మధు ఎక్కడ..?’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. అప్పటివరకు పుకారుగా ప్రచారంలో ఉన్న ఈ అంశాన్ని ‘సాక్షి’ ఆధారాలతో సహా వెలుగులోకి తేవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మరుసటి రోజు 7న ‘అజ్ఞాతంలోనే మధు’ శీర్షికతో వారం రోజులుగా వీడని సస్పెన్స్‌ను హైలైట్ చేస్తూ కథనం ప్రచురించింది. మధు ఎక్కడికి వెళ్లలేదని, గన్‌మెన్ ఆయనతోనే ఉన్నారని, మిస్సింగ్ ఫిర్యాదులు ఏవీ అందలేదని రామగుండం పోలీస్ కమిషనర్ ఇచ్చిన వివరణతోపాటు జరుగుతున్న పరిణామాలను పూసగుచ్చినట్లు వివరించడం జరిగింది. అదే సమయంలో తన భర్త ఆచూకీ తెలపాలని మధు సతీమణి, మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ మంత్రి ప్రశాంత్‌రెడ్డిని కలిసిన వివరాలను ప్రచురించింది. ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు పుట్ట మధును అదుపులోకి తీసుకున్న విషయాన్ని మీడియాకు వెల్లడించాలని నిర్ణయించారు. అదే సమయంలో శుక్రవారం పుట్ట శైలజ ‘సాక్షి’తో మాట్లాడుతూ పుట్ట మధు హైదరాబాద్‌లోనే ఉన్నట్లు ధ్రువీకరించారు. ఈ మేరకు 8న ‘అజ్ఞాతంలోకి పోలేదట..’ శీర్షికతో మరో కథనం ప్రచురితమైంది. చివరికి పుట్ట తమ అదుపులో ఉన్న విషయాన్ని పోలీసులు వెల్లడించక తప్పలేదు. -
లాయర్ల హత్య: ‘అప్పటి ఆరోగ్య మంత్రిపై అనుమానం’
సాక్షి, మంథని: పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ రాష్ట్రం భీమవరంలో ఓ స్నేహితుడి ఇంట్లో ఉన్న మధును తాము అదుపులోకి తీసుకున్నట్లు రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో విచారణ కోసం శనివారం ఆయనను రామగుండం తీసుకొచ్చారు. వామన్‌రావు తండ్రి గట్టు కిషన్‌రావు గతనెల 16న ఐజీ నాగిరెడ్డికి చేసిన ఫిర్యాదులో పుట్ట మధు ప్రమేయంపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పుట్ట మధును పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ‘నా కొడుకు, కోడల్ని కత్తులతో పొడిచిన తరువాత పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో వారికి సకాలంలో వైద్య సేవలు అందలేదు. దీనికి అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కారణమని నాకు అనుమానం. మొదట ప్రైవేటు అంబులెన్స్ వచ్చినప్పటికీ దాన్ని కాదని 108 వాహనం వచ్చే దాకా కావాలనే ఆలస్యం చేశారు. ఆస్పత్రికి చేరిన తర్వాత తీవ్ర గాయాలతో ఉన్న వామన్‌రావుకు వైద్య సేవలు సకాలంలో అంది ఉంటే కొద్ది రోజులైనా బతికేవాడు’ అని తెలిపారు. ‘పుట్ట మధుకు, ఈటలకు ఉన్న సాన్నిహిత్యం కారణంగానే నా కుమారుడికి వైద్య సేవలు అందలేదు. పంచనామా పోస్టుమార్టం రిపోర్టు విషయంలోనూ అనుమానాలు ఉన్నాయి. పెద్దపల్లి ప్రజాప్రతినిధి కూడా ఆసుపత్రికి వచ్చిన వామన్‌రావుకు మందులు ఇవ్వవద్దని చెప్పారు. నిందితులందరికీ చట్ట పరంగా శిక్షలు పడతాయనే విశ్వాసం ఉంది. మధు, ఆయన భార్య శైలజ, రామగిరికి చెందిన సత్యనారాయణ ప్రమేయం ఉన్నట్లు ఏప్రిల్ 16న ఐజీ నాగిరెడ్డికి రిజిస్టర్ పోస్టు ద్వారా ఫిర్యాదు పంపా. హత్యకు రెక్కీ నిర్వహించడం, అందులో పాల్గొన్న వ్యక్తి పేరును ఇతర వివరాలు తెలియజేశా. వీరందరినీ విచారిస్తే అనేక విషయాలు బయటకు వస్తాయి. న్యాయం జరగకపోతే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలుస్తా’ అని తెలిపారు. చదవండి: వామన్‌రావు దంపతుల హత్య కేసుపై సర్కారు ఫోకస్ -
పోలీసుల అదుపులో పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు
-
పుట్ట మధు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!?
సాక్షి, పెద్దపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసుపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ కేసు విచారణకై స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయాలంటూ హైకోర్టును కోరింది. కరీంనగర్ జిల్లాలోని ఒక కోర్టును కేసు విచారణకు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తెలంగాణ న్యాయ శాఖ కార్యదర్శి హైకోర్టుకు లేఖ రాశారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో పెద్దపల్లికి చెందిన గట్టు వామన్‌రావు-నాగమణి దారుణ హత్యకు గురైన విషయం విదితమే. ఈ కేసులో ఇప్పటికే కుంట శ్రీనివాస్(44), శివందుల చిరంజీవి(35), బిట్టు శ్రీను తదితరులను అరెస్టు చేసి, విచారణ చేపట్టారు. ఇక ఈ కేసులో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను హస్తం ఉన్నట్లు ఆధారాలు లభించిన నేపథ్యంలో, పుట్ట మధు, ఆయన భార్య శైలజ తదితరులకు కూడా ఇందులో ప్రమేయం ఉందని వామన్‌రావు తండ్రి గట్టు కిషన్‌రావు వరంగల్ ఐజీకి ఇదివరకే రాశారు. ఇదిలా ఉండగా.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో.. గత వారం రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిన పుట్ట మధు ఆచూకీ లభించడం, వామనరావు హత్య కేసులో ఆయనను విచారించడం వంటి పరిణామాలు నేడు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సర్కారు సైతం ఈ కేసుపై దృష్టి సారించడం గమనార్హం. దీంతో, పుట్ట మధు చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లే కనిపిస్తోందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. హత్య వెనుక ఉన్నది వాళ్లే: కిషన్‌రావు హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య కేసు నేపథ్యంలో మృతుడు గట్టు వామన్‌రావు తండ్రి కిషన్‌రావు వరంగల్ ఐజీ నాగిరెడ్డికి గతంలో లేఖ రాశారు. పట్టపగలే తన కొడుకు, కోడలును దారుణంగా హతమార్చారని, నిందితులకు ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు.. ‘‘హత్య వెనుక పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు, ఆయన భార్య శైలజ, కమన్ పూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్ ఉన్నారు. ఈ హత్యలకు గ్రామ కక్షలు, దేవాలయ విషయం కారణం కాదు. నిందితులతో ప్రమాదం పొంచి ఉందని జనవరి 28న రామగుండం పోలీస్ కమిషనర్, మంథని పోలీసులకు ఫిర్యాదు చేశాం. పుట్ట మధు ఎమ్మెల్యే గా ఓడిపోయినప్పటి నుంచి నా కొడుకుపై కక్ష పెంచుకున్నాడు. అంతేకాదు, ఈ హత్యలో స్థానిక నేతలు,అధికారుల తో పాటు పెద్ద తలకాయల పాత్ర ఉంది. జైలులో ఉన్న కుంట శ్రీనివాస్ గుంజపడుగులో నిర్మించే నూతన గృహం ఎవరు నిర్మిస్తున్నారు, డబ్బులు ఎవరు ఇస్తున్నారు. జైల్లో ఉన్న నిందితులతో గ్రామానికి చెందిన వారితో పాటు ఇతరులు కలిసిన విషయంలో విచారణ చేయాలి. లక్కేపురం విజయ బాస్కర్, గట్టు విజయ్ కుమార్ ఆయన కుమారుడు వినయ్, ఆటోడ్రైవర్ వేలాది రఘురాం కాల్ డాటా ను పరిశీలించాలి. నా కొడుకు ఆరోజు మంథనికి వస్తున్న విషయం ఎవరికి తెలియదు. కేవలం గ్రామ సర్పంచ్ రాజు మాత్రమే తెలుసు. నా కొడుకు, కోడలు హత్య తర్వాత సర్పంచ్ ఇప్పటి వరకు మమ్మల్ని పరామర్శించలేదు. నిందితుడు కుంట శ్రీను తమ్ముడు కుంట రాజు(సర్పంచ్)తో పాటు హత్య పథకంలో కొందరు అధికారుల పాత్ర కూడా ఉంది. ప్రైవేటు అంబులెన్స్ లో వైద్యం అందించలేదు, హత్యకు కారకులైన వారికి ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి’’అని ఆయన లేఖలో పేర్కొన్నారు. చదవండి: Putta Madhu: పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టా మధు అరెస్ట్!