సాక్షి, హైదరాబాద్ : మంథని టీఆర్‌ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు బాధితుడు రామన్నరెడ్డి సోమవారం తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి తన గోడును వినిపించారు. పుట్ట మధు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని, తనకు రక్షణ కల్పించాలని డీజీపీని అభ్యర్థించారు. 2013లో టీఆర్‌ఎస్ సమావేశంలో కేసీఆర్ ముందు ఆత్మహత్య చేసుకున్న గుండా నాగరాజు కేసులో సాక్ష్యం చెప్పొద్దంటూ పుట్ట మధు తనను బెదిరిస్తున్నారని రామన్నరెడ్డి డీజీపీకి తెలియజేశారు.
2014 ఎన్నికల్లో మంథని ఎమ్మెల్యే టిక్కెట్ పుట్ట మదుకు ఇవ్వాలంటూ గుండా నాగరాజు అనే కార్యకర్త టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, నాగరాజు ఆత్మహత్య చేసుకోవడానికి రూ. 50వేలు ఇచ్చి ప్రేరేపించింది పుట్ట మధునేనని, ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను బాధితుడు డీజీపీకి సమర్పించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన కాల్‌డేటాతో సహా, చనిపోయిన నాగరాజు ఇచ్చిన వాంగ్మూల ప్రతులను డీజీపీకి రామన్న అందజేశారు. నాగరాజు ఆత్మహత్య కేసులో అన్ని ఆధారాలు ఉన్నా పోలీసులు పుట్ట మధును నిందితుడిగా చేర్చకుండా, కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కాపాడుతున్నారని బాధితుడు డీజీపీకి ఫిర్యాదు చేశారు.
Published Mon, Oct 8 2018 7:39 PM | Last Updated on Mon, Oct 8 2018 7:44 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment