TS Peddapalli Assembly Constituency: ఆయన తూర్పు.. ఈయన పడమర..! సెంటిమెంట్‌ కలిసొచ్చేదెవరికో..?
Sakshi News home page

ఆయన తూర్పు.. ఈయన పడమర..! సెంటిమెంట్‌ కలిసొచ్చేదెవరికో..?

Published Sat, Oct 14 2023 1:38 AM | Last Updated on Sat, Oct 14 2023 10:12 AM

- - Sakshi

ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధు

సాక్షి, పెద్దపల్లి: వారిద్దరూ రాజకీయాల్లో తూర్పుపడమరలు. ఒకరు కాంగ్రెస్‌ పార్టీ నేత అయితే.. మరొకరు బీఆర్‌ఎస్‌ నాయకుడు. కానీ వారిద్దరికీ సెంటిమెంట్‌ ముత్తారం కేంద్రంగా ఎన్నికల ప్రచారం షురూ చేయడం. వారే మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధు. ఇటీవల బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఖరారు కావడంతో పుట్ట మధు ముత్తారం కేంద్రంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా పాదయాత్ర ప్రారంభించారు.

తూర్పువైపు ఉన్న మండలాల్లో తన పాదయాత్ర కొనసాగించి నియోజకవర్గం చుట్టివచ్చారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు సైతం ముత్తారం కేంద్రంగా భారీసభ నిర్వహించి పడమర దిశగా తన ప్రచారం మొదలు పెట్టారు. ఈ ఇద్దరు నేతలు ముత్తారం సెంటిమెంట్‌గా ఎన్నికల ప్రచారం ఇక్కడి నుంచే ప్రారంభించినా.. ఎవరికి కలిసివస్తుందోనని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement