కేటీఆర్‌ ట్వీట్‌.. మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్‌ | Minister Sridhar Babu Counter On Ktr Tweet | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌ ట్వీట్‌.. మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్‌

Published Sun, Sep 15 2024 1:52 PM | Last Updated on Sun, Sep 15 2024 1:53 PM

Minister Sridhar Babu Counter On Ktr Tweet

ఎవరు తెలివితేటలు చూపిస్తున్నారో ప్రత్యక్షంగా కనబడుతోందంటూ కేటీఆర్ ఎక్స్‌లో చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు.

సాక్షి, పెద్దపల్లి జిల్లా: ఎవరు తెలివితేటలు చూపిస్తున్నారో ప్రత్యక్షంగా కనబడుతోందంటూ కేటీఆర్ ఎక్స్‌లో చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ‘‘ఎమ్మెల్యే అరికెపూడి గాంధీయే తాను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని వ్యాఖ్యానించారు. మీకు సంబంధించిన అంశాల విషయంలో మీరు తలదూర్చినట్టు మేము తలదూర్చం’’ అని మంత్రి వ్యాఖ్యానించారు.

‘‘మీ పార్టీ అంతర్గత సమస్యల్ని మీరు పరిష్కరించుకోవాలి. మా పార్టీపై నెపం వేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఎవరు తెలివిగలవారో ప్రజలే చెప్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడ ప్రజలందరూ తెలంగాణ ప్రజలే.. వారందరినీ గౌరవిస్తాం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తాం’’ అని శ్రీధర్‌బాబు చెప్పారు.

‘‘రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంచడానికి అందరూ పాలుపంచుకోవాలి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను  కొన్ని ప్రతిపక్షాలు  దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయి. ఎవరు ఏం చేసినా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు ఎలాంటి ఇబ్బందీ లేదు’’ అని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ట్యాంక్‌బండ్‌ వద్ద ఉద్రిక్తత.. గణేశ్‌ ఉత్సవ సమితి Vs పోలీసులు
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement