సాక్షి, హైదరాబాద్: నమ్మి నానబొస్తే పుచ్చులు చేతికొచ్చినట్లు ఉంది రేవంత్ రెడ్డి పాలన’’ అంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘‘60 ఏళ్ల సమైక్య పాలకుల కన్నా పది నెలల్లోనే అధిక రుణం.. ఎవరి కోసం?. పదేళ్లలో సాధించిన ప్రగతి కన్నా పది నెలలో ఏం సాధించిండ్రని ఈ అప్పులు?. మీ ఆరు గ్యారంటీలు అర్ధ గ్యారంటీలుగా మిగిలి పోయాయి! అప్పులు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి’’ అని ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు.
‘‘కట్టింది కన్నా కూల్చిందే ఎక్కువ!. ఇచ్చింది కన్నా లాక్కున్నదే ఎక్కువ!. అర్థం లేని అప్పులు! ఎక్కే దిగే ఢిల్లీ ఫైట్లు!. ఆదాని ముందు పొర్లు దండాలు! ఇదేగా మీ పది నెలల పాలన?. పటిష్టమైన బంగారు రాష్ట్రాన్ని "చేతి"కి అందిస్తే.. భ్రష్టు పట్టిస్తున్నరు’’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
నమ్మి నానబొస్తే పుచ్చులు చేతికొచ్చినట్లు ఉంది రేవంత్ రెడ్డి పాలన
60ఏళ్ల సమైక్య పాలకుల కన్నా పది నెలల్లోనే అధిక రుణం..ఎవరి కోసం?
పదేళ్లలో సాధించిన ప్రగతి కన్నా పది నెలలో ఏం సాధించిండ్రని ఈ అప్పులు?
మీ ఆరు గ్యారంటీలు అర్థ గ్యారంటీలు గా మిగిలి పోయాయి! అప్పులు మాత్రం ఆకాశాన్ని… pic.twitter.com/A0EQOXYYcC— KTR (@KTRBRS) October 30, 2024
Comments
Please login to add a commentAdd a comment