
సాక్షి, పెద్దపల్లి: సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్ పార్టీ తెలుపులు తెరిస్తే మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు గులాబీ కండువా కప్పుకోవడం ఖాయమని పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం పెద్దపల్లి జిల్లా పరిషత్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితబంధు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతోందని, శ్రీధర్‌బాబు అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని సూచించారు. టీఆర్‌ఎస్‌లో చేరడానికి శ్రీధర్‌బాబు సిద్ధంగా ఉన్నా.. కేసీఆర్ గేట్లు తెరవడం లేదని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పటికైనా నిజాలను గ్రహించి చెంచాగిరీ చేయడం మానుకోవాలని హితవు పలికారు. దీంతో మధు చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
(చదవండి: ఆయన ఏం డిసైడ్ అయ్యారు, వెళ్తారా.. ఉంటారా?)
Comments
Please login to add a commentAdd a comment