
సాక్షి, వరంగల్ : ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా మావోయిస్ట్ యాక్షన్ టీమ్స్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ములుగు, మంథని, మణుగూరు ఏరియాల్లో నేతలే టార్గెట్‌గా మావోయిస్ట్ యాక్షన్ టీమ్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ములుగులో మావోయిస్ట్ యాక్షన్ టీమ్ మెంబర్‌ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివిరి సోమపై జరిపిన దాడి తరహాలో మరో దాడికి యాక్షన్ ప్లాన్ రెడీ చేసి, రెక్కీకి టీమ్ వచ్చినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి చందూలాల్, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు, ఇతర టీఆర్‌ఎస్ నేతలే లక్ష్యంగా మూడు యాక్షన్ టీమ్స్ రంగంలోకి దిగినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఒకరు పోలీసులకు చిక్కడంతో మిగతా వారికోసం పోలీసులు విచారణ వేగవంతం చేశారు. యాక్షన్ టీమ్ సభ్యుడు చిక్కడంతో నేతలకు ప్రమాదం తప్పింది. మావోయిస్టుల టార్గెట్స్‌ని పోలీసులు అప్రమత్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో గులాబీ నేతలకు పోలీసులు అదనపు భద్రత కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment