Chandulal Azmeera
-
పాపం.. పల్లవి
సాక్షి, తిరుమలాయపాలెం: రోజువారీగా విధి నిర్వహణకు పయనమైంది. ఉద్యోగ బాధ్యతలను పూర్తి చేసింది. కారులో ఇంటికి బయలుదేరింది. ఇంతలోనే ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండకు చెందిన బానోతు పల్లవి(45) ఖమ్మం జిల్లా డ్రగ్ కంట్రోల్ అడిషనల్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఖమ్మంలో బుధవారం విధులు ముగించుకుని హన్మకొండకు కారులో వెళ్తుండగా.. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు సమీపంలోని క్రాంతి గార్డెన్ వద్ద ఆగి ఉన్న కర్ర లారీని పల్లవి ప్రయాణిస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. కారు వెనుక సీటులో కూర్చున్న ఆమె తల ముందు సీటు రాడ్‌కు గుద్దుకుని.. కారు క్యాబిన్లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతిచెందింది. కారు డ్రైవర్ ఏడుకొండలుకు తీవ్ర గాయాలు కావడంతో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. అతడిని 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పల్లవి మృతదేహాన్ని మెడికల్ అసోసియేషన్ నాయకులు ఖమ్మం ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించేందుకు సహకరిం చారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని హన్మకొండకు తరలించారు. పల్లవి మృతి ఘటనపై ఆమె సోదరుడు కిరణ్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. కాగా పల్లవికి భర్త కోటేశ్వరరావు, కుమారుడు వరుణ్, కుమార్తె ధరణి ఉన్నారు. మృతురాలు పల్లవి తండ్రి సోమ్లానాయక్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. పల్లవికి మాజీ ఎంపీ సీతారాంనాయక్ మేనమామ కాగా, మాజీ మంత్రి చందూలాల్ బాబాయి. విషాదంలో ఉద్యోగులు హన్మకొండకు చెందిన పల్లవి ఉమ్మడి ఖమ్మం జిల్లా డ్రగ్ కంట్రోల్ అడిషనల్ డైరెక్టర్‌గా ఏడాదిన్నర క్రితం విధుల్లో చేరారు. అందరితో కలిసి మెలిసి ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. విధుల పట్ల అంకితభావంతో ఉండే ఆమె మృతి వార్త విని తోటి అధికారులు, ఉద్యోగులు విషాదంలో మునిగిపోయారు. డ్రగ్ కంట్రోల్ కార్యాలయంలో ప్రతీ నెల కిందిస్థాయి అధికారులు, ఉద్యోగులతో సమావేశం నిర్వహిస్తారు. బుధవారం మామిళ్లగూడెంలోని ఏడీ కార్యాలయంలో ఉద్యోగులతో రివ్యూ సమావేశం నిర్వహించి అనంతరం కారులో హన్మకొండ వెళుతుండగా ప్రమాదంలో మృతిచెందింది. ఏడీ మరణవార్త తెలియడంతో డ్రగ్ కంట్రోల్ కార్యాలయంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతదేహాన్ని మార్చురీకి తీసుకురావడంతో డ్రగ్ కంట్రోల్ అధికారులు, ఉద్యోగులు నివాళులర్పించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, తెలంగాణ హోల్‌సేల్, రిటైల్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నాయకులు నివాళులర్పించారు. -
మరి నేనెక్కడికి వెళ్లాలి?
ములుగు/భూపాలపల్లి: ‘ఈ సమావేశం అయిపోయాక మీరంతా మీ ఇళ్లకు వెళ్లిపోతారు.. మరి నేను ఎక్కడికెళ్లాలి.. నాకు కనీసం ఇల్లు కూడా లేదు’అని మాజీ స్పీకర్ మధుసూదనాచారి కంటతడి పెట్టారు. సోమవారం భూపాలపల్లిలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. ‘‘పేదలందరికీ ఇళ్లు కట్టించాకే నేను ఇల్లు కట్టుకుంటా అని ప్రమాణం చేసిన.. మీరంతా ఇళ్లకు వెళ్లిపోతే.. నేను ఎక్కడికెళ్లాలి. అయినా అధైర్యపడను.. నన్ను ఆదరించి ప్రేమ చూపించిన భూపాలపల్లిని విడిచి వెళ్లలేను. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నియోజకవర్గంపై ప్రేమ చూపిస్తా’అంటూ గద్గద స్వరంతో మాట్లాడారు. భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. దీంతో సభ మీద, కింద ఉన్న పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బోరున విలపించారు. అలాగే ములుగులో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి చందూలాల్ మాట్లాడుతూ మీడియా పిచ్చోళ్లు కావాలని తనపై 15 రోజులపాటు పిచ్చిపిచ్చి వార్తలు రాశారని, వార్తలు రాసిన వారు ఖబడ్దార్ అని హెచ్చరించారు. పత్రికలకు తాను చేసిన అభివృద్ధి కనిపించకపోవడం సిగ్గుచేటని పేర్కొంటూ ఆయన కంటతడిపెట్టారు. ఇదే సభలో ఆయన కుమారుడు ప్రహ్లాద్ మాట్లాడుతూ అందరూ తన మనుషులు అనుకుంటే కలసికట్టుగా మోసం చేశారన్నారు. టీఆర్ఎస్లో చేరేందుకు ఎమ్మెల్యేల రాయబారం: బాలమల్లు ములుగు: తమ పార్టీలో చేరడానికి టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాయబారాలు పంపుతున్నారని పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి, టీఎస్ఐఐసీ కార్పొరేషన్ చైర్మన్ గాదరి బాలమల్లు అన్నారు. అయితే.. ఇద్దరు స్వతంత్ర సభ్యులతో కలసి 90 మంది ఎమ్మెల్యేలు ఉండగా మిగతావారి అవసరం లేదని సీఎం కేసీఆర్ తిరస్కరిస్తున్నారని చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగులో ఏర్పాటు చేసిన పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన ఈ విషయం తెలిపారు. -
టీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా.. మావోయిస్ట్ యాక్షన్ టీమ్స్?
సాక్షి, వరంగల్ : ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా మావోయిస్ట్ యాక్షన్ టీమ్స్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ములుగు, మంథని, మణుగూరు ఏరియాల్లో నేతలే టార్గెట్‌గా మావోయిస్ట్ యాక్షన్ టీమ్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ములుగులో మావోయిస్ట్ యాక్షన్ టీమ్ మెంబర్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివిరి సోమపై జరిపిన దాడి తరహాలో మరో దాడికి యాక్షన్ ప్లాన్ రెడీ చేసి, రెక్కీకి టీమ్ వచ్చినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి చందూలాల్, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు, ఇతర టీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా మూడు యాక్షన్ టీమ్స్ రంగంలోకి దిగినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఒకరు పోలీసులకు చిక్కడంతో మిగతా వారికోసం పోలీసులు విచారణ వేగవంతం చేశారు. యాక్షన్ టీమ్ సభ్యుడు చిక్కడంతో నేతలకు ప్రమాదం తప్పింది. మావోయిస్టుల టార్గెట్స్‌ని పోలీసులు అప్రమత్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో గులాబీ నేతలకు పోలీసులు అదనపు భద్రత కల్పించారు. -
కాంగ్రెస్‌ను దూరంగా ఉంచితే మంచిది..
కేసముద్రం(మహబూబాబాద్) : రాష్ట్ర అభివృద్ధి చూసి ఓర్వలేని కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎంత దూరంగా ఉంచితే అంత మంచిదని రాష్ట్ర గిరిజన సంక్షేమ సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అన్నారు. గురువారం మండలంలోని కోరుకొండపల్లిలో ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో తాటివనంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కాంగ్రెస్‌పార్టీ కోర్టులకు వెళ్లినా చుక్కెదురవుతోందని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమాన్ని కోరుకునే మనిషి అన్నారు. ప్రతి ఒక్కరూ నాటిన మొక్క నాది అనేభావంతో, ఒక కొడుకులా, బిడ్డలాగ చూసుకోవాలన్నారు. హాస్టళ్లలో ప్రతి విద్యార్థికి మొక్క ఇచ్చి, ఆ విద్యార్థి పేరు రాసుకుంటే బాధ్యతతో పెంచుతాడని చెప్పారు. పూల మొక్కలు, పండ్ల మొక్కలు పెంచాలని సూచించారు. అందరి ఆరోగ్యం కోసం ఈనెల 15 నుంచి కంటివెలుగు పథకానికి శ్రీకారం చుట్టి ప్రజలకు కంటి పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం మంత్రికి గీతాకార్మికులు ఈత మొక్కలను బహూకరించారు. అయ్యగారిపల్లిలో జీపీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి కేసముద్రం మండలం ఇనుగుర్తి శివారు అయ్యగారిపల్లి కొత్త గ్రామపంచాయతీగా ఏర్పాటుకా గా, గురువారం ఇక్కడికి వచ్చిన మంత్రి అజ్మీరా చందూలాల్ జీపీ భవన్నాన్ని రిబ్బన్ కట్‌చేసి ప్రారంభించారు. మంత్రి సమక్షంలో స్పెషల్ఆఫీసర్గా విద్యాసాగర్, కార్యదర్శిగా అలీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదన్నారు. అన్ని గ్రామాలు, తండాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందడానికి సీఎం కేసీఆర్ నూతనంగా జీపీలను ఏర్పాటు చేశారని అన్నారు. అ నంతరం గ్రామస్తులు మంత్రిని, కలెక్టర్‌ను సన్మానించారు. 96లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం జిల్లాలో నాలుగో విడతలో 96లక్షల మొక్కలను నాటడమే లక్ష్యమని కలెక్టర్ శివలింగయ్య అన్నారు. గురువారం కోరుకొండపల్లిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడో విడత వరకు జిల్లాలో 2కోట్ల 3లక్షల మొక్కలను నాటామన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ హరితహరంలో భాగస్వాములు కావాలని, నాటిన మొక్కలన్నింటినీ బతికించుకోవాలన్నారు. ప్రజలసంక్షేమం కోసం సీఎం కృషి రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ నిరంతరం కృషిచేస్తున్నారని మానుకోట ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. గురువారం ఇక్కడ జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగా జీపీలను ఏర్పాటు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన భాద్యత అందరిపై ఉందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, నాటిన మొక్కను బతికించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీ కోటిరెడ్డి, జేసీ దామోదర్‌రెడ్డి, డీఎఫ్‌వో కిష్టగౌడ్, డీఏవో చత్రునాయక్, జిల్లాఎక్సైజ్ అధికారి దశరథ్, ఎంపీపీ కదిర రాధిక, జెడ్పీటీసీ బండారు పద్మ, ఎంపీడీవో అరుణాదేవి, తహసీల్దార్ యోగేశ్వర్రావు పాల్గొన్నారు. వర్షంతో అంతరాయం ఇనుగుర్తి గ్రామ శివారు అయ్యగారిపల్లి నూతన గ్రామపంచాయతీని మంత్రి అజ్మీరా చందూలాల్ గురువారం ప్రారంభించిన తర్వాత సభాప్రాంగణంలో వేదిక పైనున్న వారు మాట్లాడుతుండగా వర్షం మొదలైంది. దీంతో టెంట్ల నుంచి వర్షపు దారలు జనంపై పడుతుండటంతో కొందరు లేచి పక్కకు వెళ్లగా, మరికొందరు అలాగే కూర్చున్నారు. వేదికపై మంత్రి కూర్చున్న చోట వర్షపునీరు టెంటు నుంచి దారగా పడుతుండటంతో మంత్రి కుర్చిని కాస్త పక్కకు జరిపారు. వర్షపు నీరు పడకుండా గొడుగు పట్టుకోవడంతో మంత్రి సభలో ప్రసంగించారు. సీఎం పదవి కోసం కాంగ్రెస్ కొట్లాట : మంత్రి చందూలాల్ కొత్తగూడ(ములుగు) : ఎన్నికలు రాకముందే సీఎం పదవి కోసం కాంగ్రెస్ నాయకులు కొట్లాడుతున్నారని గిరిజన సంక్షేమ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీర చందూలాల్ అన్నారు. మారుమూల గ్రామాల్లో మంత్రి గురువారం మంత్రి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నూతనంగా ఏర్పడ్డ మొండ్రాయిగూడెం గ్రామ పంచాయతీని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మొద్దని, వారి మాటలు నమ్మితే నెలకో ముఖ్యమంత్రిని మార్చుకుంటారన్నారు. చిన్న గ్రామ పంచాయతీలతో గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని చెప్పారు. రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఏజెన్సీలో చిన్న చిన్న కారణాలతో అందని రైతుబంధు చెక్కులు తొందరలోనే పరిష్కరిస్తామన్నారు. రూ.2.50లక్షలతో గుండంపల్లి నుంచి పాకాల వరకు బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. పాకాల శిఖంను ఆనుకుని ఉన్న రెవెన్యూ పట్టాలను ఫారెస్ట్ అంటూ తొలగించారని గుండంపల్లి గ్రామస్తులు మంత్రికి విన్నవించారు. మంత్రి స్పందిస్తూ విషయాన్ని కలెక్టర్‌తో మాట్లాడి పరిష్కరిస్తామన్నారు. మండలకేంద్రంలో నూతన మండల పరిషత్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనం తరం కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. జెడ్పీ చైర్పర్సన్ పద్మ, జెడ్పీటీసీ సభ్యురాలు దేశిడి అరుణ, వైస్ ఎంపీపీ పూల యాదగిరి, ఎంపీటీసీ సభ్యుడు బంగారి నారాయణ, తహసీల్దార్ తరంగిణి, ఎంపీడీఓ జయరాంనాయక్, టీఆర్ఎస్ నాయకులు నాగమల్లేశ్వర్రావు, ఈసం సమ్మయ్య, కొమ్మనబోయిన వేణు, విశ్వనాథం, సిరిగిరి సురేష్, శ్రీనివాస్‌రెడ్డి, వీరన్న, అజ్మీర్పాషా పాల్గొన్నారు. -
నేటి నుంచి తెలంగాణ కవితా సప్తాహం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మహాకవులు డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య, డాక్టర్ సి.నారాయణరెడ్డిల జయంతిని పురస్కరించుకొని ఆదివారం నుంచి కవితా సప్తాహం కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డి తెలిపారు. ఈ నెల 22న దాశరథి కృష్ణమాచార్య, 29న సి.నా.రె. జయంతి ఉందని, వీరి పేరుతో ఓ మంచి సాహిత్య కార్యక్రమం చేపట్టామని చెప్పారు. శనివారం రవీంద్రభారతిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ కవితా సప్తాహంలో భాగంగా ప్రముఖుల ప్రసంగాలు, కవి సమ్మేళనాలు ఉంటాయని తెలిపారు. దాశరథి, సినారెల మధ్య సోదర సంబంధాలు ఉండేవని, వారిది అన్నాతమ్ముళ్ల అనుబంధమని పేర్కొన్నారు. 7 రోజులు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా రోజూ 40 నిమిషాలు ప్రధాన ప్రసంగం, 11 మంది కవుల కవితాపఠనం ఉంటాయన్నారు. 22న మహాకవి దాశరథి కవితాప్రస్థానంపై డాక్టర్ గురిజాల రామశేషయ్య ప్రసంగముంటుందని తెలిపారు. 23న ‘తెలంగాణ వచన కవితావికాసం’పై డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి, 24న ‘తెలంగాణ పద్య కవితా ప్రాభవం’పై డాక్టర్ అనుమాండ్ల భూమయ్య, 25న ‘తెలంగాణ కవిత్వం – పాట ప్రస్థానం’పై డాక్టర్ పసునూరి రవీందర్, 26న ‘తెలంగాణ కవిత్వం–జీవితం’పై డాక్టర్ ఎస్ రఘు, 27న ‘తెలంగాణ కవిత్వం–అలంకారికత’పై డాక్టర్ లక్ష్మణచక్రవర్తి, 28న ‘తెలంగాణ కవిత్వ విమర్శ’పై డాక్టర్ జి.బాలశ్రీనివాసమూర్తి ప్రసంగాలు ఉంటాయని చెప్పారు. ఈ ఏడురోజుల కార్యక్రమాలకు ముఖ్యఅతిథులుగా డాక్టర్ కేవీ రమణాచారి, బుర్రా వెంకటేశం, దేశపతి శ్రీనివాస్, డాక్టర్ వెలిచాల కొండలరావు, దేవులపల్లి ప్రభాకర్‌రావు, డాక్టర్ ఆయాచితం శ్రీధర్, డాక్టర్ ఎన్ గోపిలు పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమాలు రోజూ సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ కవితా సప్తాహం పోస్టర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో అకాడమీ కార్యదర్శి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి పాల్గొన్నారు. రవీంద్రభారతిలో నేడు దాశరథి జయంతి దాశరథి 94వ జయంతి కార్యక్రమం ఆదివారం రవీంద్రభారతిలో జరగనుంది. ఈ సందర్భంగా దాశరథి సాహితీ పురస్కారాన్ని ప్రముఖకవి వఝల శివకుమార్‌కు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి అజ్మీరా చందులాల్ పాల్గొంటారని ప్రభుత్వ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బి.వెంకటేశం, భాషాసాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. -
వినూత్న పద్ధతిలో బోధించాలి: మంత్రి చందూలాల్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయులు విద్యార్థులకు వినూత్న పద్ధతుల్లో బోధించాలని గిరిజన సంక్షేమ మంత్రి చందూలాల్ సూచించారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో గిరిజన పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అధునాతన విద్యాబోధనపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గురువారం ఈ శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపాధ్యాయు లు విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందించడానికి అవసరమైన నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. పదోతరగతిలో 9.8 జీపీఏ సాధించిన విద్యార్థులకు, వందశాతం ఉత్తీర్ణత సాధించిన గిరిజన పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు నగదు, ప్రశంసా పత్రాలు మంత్రి అందజేశారు. -
మార్కెట్లోకి త్వరలో జీసీసీ ఉత్పత్తులు: చందూలాల్
సాక్షి, హైదరాబాద్: గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ద్వారా వ్యవసాయ, అటవీ ఉత్పత్తు లను త్వరలో అందుబాటులోకి తేనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ చెప్పారు. సోమవారం సచివాలయంలో జీసీసీ వార్షిక ప్రణాళిక విడుదల చేశారు. అనంతరం జీసీసీ కార్యక్రమాలను మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీసీసీ ద్వారా తేనె అమ్మకాలు గణనీయంగా పెరిగాయన్నారు. గిరిజన ప్రాంతాలు ఇచ్చోడ, బేల, నార్నూరు, ఇల్లెందులలో పప్పు శుద్ధి కర్మాగారాల్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. భద్రాచలం, ఉట్నూరు, ఏటూరు నాగారం కేంద్రాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపిస్తామన్నారు. నిర్మ ల్, ఏటూరు నాగారం, భద్రాచలంలో సబ్బు పరి శ్రమ ఏర్పాటు ప్రక్రియ కొలిక్కి వచ్చిందన్నారు. -
గిరిజన వర్సిటీ మరింత ఆలస్యం!
సాక్షి, హైదరాబాద్: గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు మరింత ఆలస్యమవుతోంది. రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా తెలంగాణకు కొత్తగా గిరిజన యూనివర్సిటీని కేంద్రం మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గిరిజన వర్సిటీ ఏర్పాటు కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు మండలం జాకారం రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 837, 53/1లో 285 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ దాన్ని వర్సిటీకి కేటాయించింది. ఇందులో 120 ఎక రాల్లో అధికారులు హద్దురాళ్లు సైతం ఏర్పాటు చేశారు. జాకారం సమీపంలో ఉన్న యూత్ ట్రైనింగ్ సెంటర్(వైటీసీ) భవనాన్ని వర్సిటీ కార్యకలాపాలకు వినియోగించుకోవచ్చని గిరిజన సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆరు నెలల క్రితం భవనాన్ని కేంద్ర బృందం పరిశీలించి వసతులపై సంతృప్తి వ్యక్తం చేసింది. ఆ తర్వాత వర్సిటీ ఏర్పాటు ప్రక్రియ ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు. వాస్తవానికి 2018–19 విద్యా సంవత్సరంలో తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. కేంద్ర మానవ వనరుల శాఖ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి అనుమతులు వచ్చిన వెంటనే కార్యకలాపాలు సాగించే అవకాశం ఉంటుంది. కానీ, కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖలో ఉలుకూపలుకూలేదు. ఒకవేళ అనుమతులు చకచకా వచ్చినా డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్లు ఈపాటికే రావాల్సి ఉంది. ప్రకటనలు వచ్చిన తర్వాతే ప్రవేశ పరీక్షలు, కౌన్సెలింగ్ తదితర కార్యక్రమాలు పూర్తి చేయొచ్చు. ఇందుకు కనిష్టంగా నెలన్నర సమయం పడుతుంది. కానీ, కేంద్రం నుంచి అనుమతులు రాకపోవడంతో ఈ ఏడాది వర్సిటీ ప్రారంభమయ్యే అవకాశం లేదు. ఈ వర్సిటీని 2019–20 విద్యా సంవత్సరంలో ప్రారంభిస్తామని రెండ్రోజుల క్రితం గిరిజన అభివృద్ధి మంత్రి అజ్మీరా చందూలాల్ ప్రకటించారు. దీంతో గిరిజన యూనివర్సిటీ కోసం మరో ఏడాది వేచి చూడాల్సిందే. -
అబద్ధాల ప్రచారం కోసమే కాంగ్రెస్ బస్సుయాత్ర
సాక్షి, హైదరాబాద్: అబద్ధాలను ప్రచారం చేసేందుకే కాంగ్రెస్ పార్టీ బస్సుయాత్ర చేపట్టిందని రాష్ట్ర గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ విమర్శించారు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినంత ప్రాధాన్యత ఇప్పటివరకూ ఏ ప్రభుత్వాలూ ఇవ్వలేదన్నారు. బుధవారం సచివాలయంలోని తన చాంబర్లో మంత్రి మీడియాతో మాట్లాడారు. గిరిజనుల ఓట్లు దండుకునేందుకు కాంగ్రెస్ పార్టీ డ్రామాలా డుతోందన్నారు. సబ్‌ప్లాన్ నిధులు దారితప్పినట్లు ఆరోపణలు చేస్తే సరిపోదని, రుజువు చేయాలన్నారు. గత ప్రభుత్వాల అసమర్ధత వల్లే ఎస్టీల బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ కాలేదన్నారు. మైదాన ప్రాంతాల్లో ఐటీడీఏలు ఏర్పాటు చేస్తామనడం కాంగ్రెస్ నేతల అవగాహనా రాహిత్యమని, ఇప్పటికే మైదానప్రాంతాల అభివృద్ధికి గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. -
అంతర్జాతీయంగా ప్రచారం పొందాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పర్యాటక ప్రాంతాల గురించి ప్రపంచానికి తెలియాల్సి ఉందని పర్యాటక– సాంస్కృతిక మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. తెలంగాణ టూరిజం ప్రమోషన్లో భాగంగా మహిళా బైక్ రైడర్లు చేపట్టిన సాహస ర్యాలీని ఆదివారం బేగంపేట్‌లో మంత్రి ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి మేకాంగ్ వరకు 7 దేశాల్లో 17 వేల కిలోమీటర్ల మేర తెలంగాణ ఆడబిడ్డలు తలపెట్టిన సాహస ర్యాలీ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర పర్యాటకంపై అంతర్జాతీయంగా ప్రచారం పొందాలన్నారు. యునెస్కో గుర్తింపు పొందిన 19 ప్రపంచ హెరిటేజ్ కట్టడాల వద్ద వీరు తెలంగాణ టూరిజం ప్రమోషన్‌తో పాటు, మహిళల భద్రతపై పర్యాటక ప్రదేశాల గురించి ప్రచారం నిర్వహిస్తారని చెప్పారు. టూరిజం కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. నేటి నుంచి 50 రోజుల పాటు సాహస యాత్ర చేస్తున్న తెలంగాణ మహిళా బైక్ రైడర్లను ఆయన అభినందించారు. బైక్ రైడర్స్ జైభారతి, ప్రియా బహదూర్, శిల్ప బాలకృష్ణన్, సుజన్ శాంతిలు మాట్లాడుతూ.. 7 దేశాలను 50 రోజుల్లో చుట్టి వస్తామన్నారు. వీరు మయన్మార్, బంగ్లాదేశ్, లావోస్, కాంబోడియా, వియత్నాం, థాయిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. కార్యక్రమంలో టీఎస్‌టీడీసీ ఈడీ కె.లక్ష్మి, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పురుందర్ తదితరులు పాల్గొన్నారు. మహిళా రైడర్లు చేపట్టిన యాత్ర ఆదివారం సాయంత్రానికి ఆంధ్రప్రదేశ్‌లోని సీతానగరం కృష్ణా తీరంలో ఉన్న ఏపీ టూరిజం ప్రాంతానికి చేరుకుంది. -
మేడారం జాతరకు రండి
సాక్షి, హైదరాబాద్: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఆహ్వానించారు. బుధవారం ప్రగతిభవన్ లో వారు సీఎంను కలసి ఆహ్వానపత్రిక అందించారు. ఈ సందర్భంగా సీఎం మేడా రం జాతర పోస్టర్, సీడీని ఆవిష్కరించారు. ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించాలని సీఎం మంత్రులను కోరారు. ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. మేడారం జాతర కోసం చేసిన ఏర్పాట్లను కడియం ముఖ్యమంత్రికి వివరించారు. ‘‘2016లో మేడారం జాతరకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.140 కోట్లు, ఈ సారి రూ.80 కోట్లు మంజూరు చేశారు. వీటితో భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ సారి పనులు శాశ్వత ప్రాతిపదికన చేపట్టాం. భూపాలపల్లి, పస్రా, తాడ్వాయి నుంచి మేడారం వచ్చే మూడు ప్రధాన రహదారులను డబుల్ లేన్ రోడ్లుగా మార్చాం. టాయిలెట్లు, బట్టలు మార్చుకునే గదులను శాశ్వత ప్రాతిపదికన నిర్మించాం’’అని కడియం వివరించారు. -
ఇదే తొలిసారి
సాక్షి, హైదరాబాద్: రాజధానికి అంతర్జాతీయ ఖ్యాతి లభించేలా ఒకే వేదికపై 1,000 రకాల స్వీట్లను ప్రదర్శించటం ప్రపంచంలోనే తొలిసారని పర్యాటక, సాంస్కృతిక మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. శనివారం నుంచి సోమవారం వరకు మూడ్రోజులపాటు సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగే ఈ ఫెస్టివల్లో స్వీట్ల అమ్మకాల కోసం కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. గురువారం సచివాలయంలో మంత్రి చందూలాల్, పర్యాటక కార్యదర్శి బుర్రా వెంకటేశం కలసి ఇంటర్నేషనల్ కైట్, స్వీట్ ఫెస్టివల్ వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. అందరికీ ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు తెలిపారు. -
‘ఏజెన్సీ’లో ప్రత్యేక అంబులెన్సులు
సాక్షి, హైదరాబాద్: గిరిజన ప్రాంతాల్లో అత్యవసర వైద్యసేవలు అందేలా చర్యలు చేపట్టా లని మంత్రి అజ్మీరా చందూలాల్ అధికారులను ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ ద్వారా ఆస్పత్రులను నిర్వహిస్తున్నప్పటికీ.. అత్యవసర సేవలను గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అందించాలని సూచించారు. ఏజెన్సీ మండలాల్లో ప్రత్యేక అంబులెన్సులు ఏర్పాటు చేయాలని, వాటిని మండల కేంద్రాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అనుసంధా నం చేయాలని ఆదేశించారు. మంగళవారం డీఎస్ఎస్ భవన్లో జరిగిన గిరిజన సలహా మండలి సమావేశంలో చందూలాల్ మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మెడికల్, పారామెడికల్ ఖాళీలన్నీ వీలైనంత త్వరగా భర్తీ చేస్తామన్నారు. భద్రాచలం, ఊట్నూరు, ఏటూరునాగారం, మన్ననూరు ఐటీడీఏలలో గిరిజన బాలికల కోసం ప్రత్యేకం గా నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేయను న్నట్లు తెలిపారు. గిరిజన అనాథలు, నిరాశ్రయ మహిళలను ఆదుకునేందుకు ఏజెన్సీ ప్రాంతాల్లో స్టేట్ హోమ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మహిళల అక్రమ రవాణాపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, త్వరలో అది కార్యరూపం దాల్చుతుందన్నారు. రోడ్లు మెరుగుపరుస్తున్నాం.. రోడ్లు లేని తండాలు, గూడేలకు రవాణా వసతిని మెరుగుపరుస్తున్నామని, ఇందుకోసం రూ.517 కోట్లు కేటాయించామని చందూలాల్ తెలిపారు. ఇప్పటికే టెండర్ల దశ పూర్తయిందని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. చెంచు ప్రాంతాలకు బీటీ రోడ్లు నిర్మించాలని, దీనిపై ప్రతిపాదనలు తయారు చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గిరిజనులకు స్వయం ఉపాధి కింద గొర్రెల పంపిణీ చేపట్టనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ శాఖ ల్లో ఖాళీగా ఉన్న గిరిజన బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గిరిజన గురుకులాల్లో బోధన సమస్యను అధిగమించేందుకు తాత్కాలిక వలంటీర్లను నియమించుకోవాలన్నారు. ఈ సమావేశానికి పలు శాఖల కార్యదర్శులు గైర్హాజరవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఇది పునరావృతం కావొద్దని హెచ్చరించా రు. వచ్చేనెలలో మరోసారి సమీక్ష నిర్వహించి.. అన్ని అంశాలపై చర్చ పూర్తి చేస్తామని మంత్రి వివరించారు. సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి మహేశ్‌దత్ ఎక్కా, కమిషనర్ లక్ష్మణ్, అదనపు సంచాలకులు వి.సర్వేశ్వర్‌రెడ్డి, నవీన్ నికోలస్, ఎంపీ సీతారాంనాయక్ పాల్గొన్నారు. -
మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయండి
సాక్షి, హైదరాబాద్: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను గిరిజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఆదేశించారు. ప్రస్తుతం చేపడుతున్న పనులు కేవలం జాతర కోసమే కాకుండా శాశ్వతంగా ఉండేలా చూడాలని సూచించారు. వచ్చే ఏడాది జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరగనున్న మేడారం జాతర ఏర్పాట్లపై మంత్రి గురువారం తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. జాతరకు రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు కోటి మందికిపైగా భక్తులు హాజరవుతారని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు జిల్లా కలెక్టర్ శ్రద్ధ వహించాలన్నారు. ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో జాతరను పర్యవేక్షించాలని పేర్కొన్నారు. 24 గంటల పాటు వైద్యులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహేశ్‌దత్ ఎక్కా, గిరిజనాభివృద్ధి శాఖ కమిషనర్ లక్ష్మణ్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మురళి, సబ్‌కలెక్టర్ గౌతం, డీఎఫ్‌వో రవికిరణ్, పీవో ఐటీడీఏ చక్రదర్, ములుగు డీఎస్పీ రఘువేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
కుటుంబంలా పనిచేద్దాం..
♦ సమష్టి కృషితోనే సమగ్రాభివృద్ధి ♦ సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి ♦ హరితహారం విజయవంతానికి ♦ గ్రామ హరిత రక్షణ కమిటీలు ♦ ఏ జిల్లాలో కూడా పథకాల అమలు సక్రమంగా లేదు ♦ పోడు విషయంలో పేద వాడితో యుద్ధం చేయొద్దు ♦ ఐదు జిల్లాల స్థాయి సమీక్ష సమావేశంలో ♦ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ♦ హాజరైన మంత్రులు ఈటల రాజేందర్, చందూలాల్ హన్మకొండ: అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల అమలుకు కలెక్టర్లు, అధికారులు ప్రాధాన్యం ఇస్తూ.. సమష్టి కృషితో కుటుంబంలా పనిచేస్తూ అభివృద్ధిని పరుగెత్తించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సూచించారు. హన్మకొండ నక్కలగుట్టలోని నందన గార్డెన్స్‌లో వరంగల్ అర్భన్, వరంగల్ రూరల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల సమీక్ష సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయం, హరితహారం, మత్స్స్యశాఖ, గొర్రెల పంపిణీతో పాటు ఇతర సంక్షేమ పథకాలపై ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆర్థిక శాఖమంత్రి ఈటెల రాజేందర్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ సమీక్షించారు. ఈ సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలు తీరు ఐదు జిల్లాల్లోనూ సరిగ్గా లేద ని, దీనిపై ప్రజాప్రతినిధులు అసంతృప్తితో ఉన్నారన్నారు. ఇక నుంచైనా కలెక్టర్లు సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని.. అప్పుడే వారికీ మంచి పేరు వస్తుందని పేర్కొన్నారు. 2015–2016 సంవత్సరానికి సంక్షేమ పథకాల లబ్దిదారులకు ఇచ్చే రాయితీ విడుదలైందని.. నెలాఖారులోపు లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందేలా చూడాలన్నారు. ఈ విషయమై బ్యాంకు అధికారులతో కలెక్టర్లు స్వయంగా మాట్లాడాలని.. సహకరించని బ్యాంకుల లైసెన్స్ రద్దుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లేఖ రాయాలని సూచించారు. సంక్షేమ పథకాల అమలులో పాత పద్ధతులు ఆటంకంగా కనిపిస్తే.. కొత్తగా ఏం చేయాలో ఆలోచించాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కార్యక్రమాలు నత్తనడకన నడుస్తున్నాయని శ్రీహరి పేర్కొన్నారు. రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుడే భరించేలా మార్పులు చేసి పథకాలు అమలయ్యేలా చూడాల్సిన అవసరముందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఐదు జిల్లాల్లోనూ భూమి కొనుగోలు పథకం నత్తనడకన నడుస్తోందని కడియంశ్రీహరి అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్లు ఉన్నత స్థానంలో ఉండి నిర్ణయాలు తీసుకోకపోవడంతో కాలయాపన జరుగుతుందన్నారు. వెంట వెంట నిర్ణయాలు తీసుకోవాలన్నారు. అలాగే, జిల్లాల్లో రెండు పడుకల గదుల నిర్మాణంలో వెనుకబడి ఉన్నామని కడియం తెలిపారు. కాగా, ఆశించిన మేరకు వర్షాలు కురుస్తుండడంతో రైతులు సాగులో నిమగ్నమయ్యారని.. ఈ మేరకు నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రాకుండా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో మహబూబాబాద్ జిల్లా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. 12 నుంచి ‘హరితహారం’ హరితహారం కార్యక్రమం ఈ నెల 12 నుంచి మొదలుకానుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఆలోపే అన్ని గ్రామాల్లో హరిత రక్షణ కమిటీలు వేయాలన్నారు. ఒక్కో గ్రామానికి ఒక్క అధికారిని ఇన్చార్జిగా నియమించాలని సూచించారు. నాటిని ప్రతీ మొక్క బతకాలన్న లక్ష్యంతో పనిచేస్తేనే హరితహారం విజయవంతమవుతుందన్నారు. ఇక పోడు చేసుకుంటున్న రైతులను ముట్టుకోకుండా.. కొత్తగా అడవులు నరుకకుండా చూస్తే చాలని అటవీ శాఖ అధికారులకు సూచించారు. పేద వాడితో యుద్ధం చేయాల్సి అవసరం లేదని అటవీ అధికారులకు కడియం హితవు పలికారు. వరంగల్ మహానగర పాలక సంస్థ సొంత నర్సరీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కాగా, గొర్రెల పంపిణీలో సమస్యలను అధిగమనించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది 70 కోట్ల చేప పిల్లలను ఐదు జిల్లాలోని చెరువుల్లో విడిచిపెట్టనున్నట్లు కడియం శ్రీహరి చెప్పారు. బ్యాంకర్లకు గట్టిగానే చెప్పాం.. ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలుకు ఆర్థిక సహాయం అందించాలని బ్యాంకర్లకు గట్టిగానే చెప్పామన్నారు. బ్యాంకులకు రుణాలు ఇవ్వాలని సక్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. హరిత హారం కార్యక్రమం మొక్కుబడిగా కాకుండా నాటిన ప్రతి మొక్క బతికేలా చూడాలన్నారు. సంఖ్య కోసం కాకుండా మొక్కను కాపాడే దిశగా ఆలోచించాలన్నారు. 8వ తరగతి పైచదువులు చదువుతున్న విద్యార్థులను హరితహారంలో భాగస్వామలను చేయాలన్నారు. అటవీ ప్రాంతంలో పండ్ల మొక్కలను నాటితే ఈ ప్రాంత ప్రజలకు ఉపాది లబిస్తుందన్నారు. చెరువులను బట్టి చేప పిల్లలను వదలాలని ఈటల సూచించారు. సమీక్ష సమావేశంలో శాసనమండలి విప్ బోడకుంట్ల వెంకటేశ్వర్లు, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్, ‘కుడా’ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కనకయ్య, ఒడితల సతీష్‌కుమార్, రాష్ట్ర సహకార సంస్థల చైర్మన్లు పెద్ది సుదర్శన్‌రెడ్డి, వి.ప్రకాశ్, కన్నెబోయిన రాజయ్య, కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, గుండు సుధారాణి, బొల్లం సంపత్‌కుమార్, యూసఫ్ జావేద్, కిషన్‌రావు, ఎస్సీ కార్పొరేషన్ ఎండీ లచ్చిరాంనాయక్, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య, ఎస్టీ కార్పొరేషన్ ఎండీ లక్ష్మణ్, మైనార్టీ కార్పోరేషన్ జీఎం బారి, కలెక్టర్లు ఆమ్రపాలి కాట, ప్రశాంత్‌జీవన్ పాటిల్, శ్రీదేవసేన, ప్రీతిమీనా, ఆకునూరి మురళి, వరంగల్ మహానగర పాలక సంçస్థ కమిషనర్ శృతి ఓఝా పాల్గొన్నారు. -
రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలి
► వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి చందూలాల్ సాక్షి, యాదాద్రి : తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధం కావాలని రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాలు, టూరి జం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ కోరారు. శుక్రవారం రాష్ట్ర యువజన సర్వీ సులు, సాంస్కృతిక పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారితో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ 2న జరిగే తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలపై సమీక్షించారు. ప్రతి సంవత్స రం మాదిరిగానే ఈసారి కూడా వేడుకలను 31జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలని సూచిం చారు. తెలం గాణ అమరవీరులకు నివాళులర్పించి అవతరణ వేడుకలకు నాంది పలకాలన్నారు. రాష్ట్ర యువజన సర్వీసులు, టూరిజం, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారిని గుర్తించి జిల్లా స్థాయి కమిటీ ద్వారా ఎంపిక చేసి జిల్లా స్థాయిలో సత్కరిం చాలని కోరారు.పది రంగాల్లో జిల్లా స్థాయిలో ఎంపి క చేసిన వారిని రూ.51,116 నగదు పురస్కారం, శాలువా, మెమోంటోలతో సత్కరించాలన్నారు. అ భ్యర్థుల ఎంపిక ప్రక్రియ జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీలో జరుగుతుందన్నారు. జిల్లాలకు గతంలో అవతరణ వేడుకలకు కేటాయించిన నిధులకు సంబంధించి యూసీలను ఈనెల 24లోగా సమర్పించా లని కలెక్టర్లను కోరారు. ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని, కళాకారులతో పెద్ద ఎత్తున సాంస్కృతిక సంబరాలు నిర్వహించాలని పేర్కొన్నా రు. జనవరిలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌కు ప్రతిపాదనలు పంపాలని, అదే విధంగా అక్టోబర్‌లో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభలకు తెలంగాణ రాష్ట్రం అంకుర్పారణ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ అనితారామచంద్రన్, డీఆర్ఓ మహేందర్‌రెడ్డి, ఆర్డీఓ ఎంవీ భూపాల్‌రెడ్డి, పౌర సంబంధాల అధికారి జగదీశ్, అడిషనల్ పీఆర్ఓ పీసీ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. -
అవతరణ అవార్డులకు కత్తెర
- 25 నుంచి 10కి కుదింపు - రైతులు, జర్నలిస్టులకు మొండిచేయి - నిధుల కేటాయింపులోనూ కోత సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అవతరణ వేడుకల్లో ‘భారీతనం’తగ్గనుంది. గత మూడు దఫాలుగా భారీగా నిధులు వెచ్చించి ఉత్సవాలు నిర్వహించిన సర్కారు... తాజా కేటాయింపులో కోత పెట్టింది. గతంలో ఉత్సవాల నిర్వహణ కోసం జిల్లాకు రూ.25 లక్షల చొప్పున నిధులివ్వగా... ప్రస్తుతం రూ.10 లక్షలకు కుదించింది. ఇందులో సాంస్కృతిక కార్యక్రమాలకు రూ.5 లక్షలే ఖర్చు చేయాలని స్పష్టం చేసింది. అవతరణ వేడుకల సందర్భంగా ఇచ్చే అవార్డుల సంఖ్యను సైతం తగ్గించింది. ఇప్పటివరకు ప్రతి జిల్లాలో 25 విభాగాల్లో అత్యుత్తమ సేవలందించిన వారికి అవార్డులు ఇచ్చేవారు. తాజాగా ఈ సంఖ్యను 10కి కుదించింది. దీంతో ఉత్తమ రైతు, జర్నలిస్టు, వైద్యుడు, అడ్వకేట్, మాజీ సైనికోద్యోగి, నృత్యకారుడు, గాయకుడు, ఆధ్యాత్మిక గురువు, సంగీత విద్వాంసుడు తదితర విభాగాలకు కోత పెట్టగా... ఉత్తమ మండలం, గ్రామం, మున్సిపాలిటీ విభాగాల్లో ఒక దానికి మాత్రమే అవార్డు ఇవ్వాలని సూచించింది. అదేవిధంగా వేద పండితులు, అర్చకుల్లో ఒకరికి, సామాజిక కార్యకర్త, ఎన్జీఓలో ఒకరికి, ఉపాధ్యాయుడు, ఉద్యోగి విభాగాల్లో ఒకరికి చొప్పున అవార్డు ఇవ్వనున్నారు. జిల్లాల సంఖ్య పెరగడంతో ప్రభుత్వం నిధుల కేటాయింపునకు కోత పెట్టినట్లు తెలుస్తోంది. జిల్లాకు రూ.10 లక్షలు: చందూలాల్ రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణకు ప్రతి జిల్లాకు రూ.5 లక్షలు ఇవ్వనున్నట్లు మంత్రి అజ్మీరా చందూలాల్ పేర్కొన్నారు. విశిష్ట కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే అదనంగా మరో రూ.5 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అవతరణ వేడుకల ఏర్పాట్లపై శుక్రవారం సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అవతరణ దినోత్సవ కానుకగా వృద్ధ కళాకారులకు అదనంగా రూ.500 పింఛన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు ఈనెల 24లోగా పంపాలన్నారు. అక్టోబర్ 22న ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ మేరకు జిల్లాలో భాషా పండితులు, సాహితీవేత్తలతో సమావేశం నిర్వహించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలని ప్రభుత్వ సలహాదారుడు రమణాచారి కలెక్టర్లకు సూచించారు. -
విహంగంలో పర్యాటక ప్రచారం
- వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టిన పర్యాటక శాఖ - స్పైస్ జెట్ విమానానికి రాష్ట్ర టూరిజం స్టిక్కర్లు - ఆవిష్కరించిన మంత్రి చందూలాల్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పర్యాటక శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ పర్యాటకానికి ప్రపంచ స్థాయి ప్రచారం కల్పించేందుకు విమానాలను సాధనంగా ఎంచుకుంది. ఇందులో భాగంగా కార్పొరేట్ తరహాలో స్పైస్ జెట్ బోయింగ్ 737 0800 విమానానికి రాష్ట్రంలోని చారిత్రక అందాలను అద్దింది. మంగళవారం శంషాబాద్ విమానాశ్రయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, జీఎంఆర్, స్పైస్‌జెట్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విమానంపై అతికించిన రాష్ట్ర టూరిజం ప్రాంతాల చిత్రాలు, శాఖ లోగోను మంత్రి ఆవిష్కరించారు. తెలంగాణలో ఎన్నో చారిత్రక ప్రదేశాలున్నాయని, వాటికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి తెచ్చేందుకే ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చందూలాల్ చెప్పారు. గోవా, కేరళ రాష్ట్రాలకు ఒక్క టూరిజం ద్వారానే 70 శాతం ఆదాయం వస్తోందని, మన రాష్ట్రంలోనూ పర్యాటక, చారిత్రక ప్రాంతాలకు కొదవ లేదన్నారు. ఎన్నెన్నో ‘చిత్రాలు’..: స్పైస్ జెట్ విమా నం బయట ఒకవైపు చౌమొహల్లా, ఫలక్నుమాప్యాలెస్లు మరోవైపు సెవెన్ టూంబ్స్, గోల్కొండ చిత్రాలు ఏర్పాటు చేశారు. విమానంలోని 189 సీట్ల వెనుక రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల చిత్రాలు అంటించారు. వీటిని అమెరికాలో తయారు చేయించారు. లోపల పర్యాటక ప్రాంతాల డిస్ప్లే ఉంటుంది. ఈ ప్రచారం 2 నెలలు సాగుతుంది. విమానం స్టిక్కర్లు అంటించిన తర్వాత మంగళవారం సాయంత్రం 4.45కి వారణాసి వెళ్లింది. 2 నెలలకు అద్దె రూ.50 లక్షలు. ఈ విమానం పర్యాటక ప్రచారం కోసం దేశంలోని ప్రాంతాలు, ఇతర దేశాల్లోనూ తిరుగుతుంది. దేశ, విదేశాల్లోని ప్రజలకు అవగాహన... రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు మాట్లాడుతూ.. దేశ, విదేశాల్లోని ప్రజలకు తెలంగాణ పర్యాటక, చారిత్రక కట్టడాలపై అవగాహన కోసమే ఈ ప్రయత్నమన్నారు. ఇటీవల మిజోరంతోపాటు పలు రాష్ట్రాల్లో రోడ్ షోలు నిర్వహిస్తే, తెలంగాణ అంటే ఎక్కడుందని అక్కడి ప్రజలు ప్రశ్నించారన్నారు. మన టూరిస్టు ప్రాంతాలకు ప్రచారం అవసరమని అప్పుడే భావించామన్నారు. స్పైస్ జెట్ విమానం రోజుకు 10 నుంచి 15 విమానాశ్రయాల్లో ల్యాండ్ అవుతుందని, తద్వారా తెలంగాణ కీర్తి నలు దిశలా వ్యాపిస్తుందని పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం చెప్పారు. శాఖ కమిషనర్ సునీతాభాగవత్, టీఎస్‌టీడీసీ ఎండీ క్రిస్టీనా జెండ్ ఛోంగ్తూ, ఈడీ మనోహర్ పాల్గొన్నారు. -
ఏజన్సీలో ఒక్క గొంతూ ఎండొద్దు
► ఇప్పటి నుంచే అధికారులు శ్రద్ధ పెట్టాలి ► జూనియర్ కళాశాలలుగా రెండ్యాల, మూడు చెక్కలపల్లి, తాడ్వాయి ఆశ్రమ పాఠశాలలు ► గిరిజన సంక్షేమ అభివృద్ధి సమావేశంలో మంత్రి అజ్మీరా ► వచ్చే నెలలో పూర్తి స్థాయి ఐటీడీఏ సమావేశం ఏటూరునాగారం/ఎస్ఎస్ తాడ్వాయి : ఏజన్సీ ప్రజలకు తాగునీటి సమస్యల తలెత్తకుండా చూడాలి.. ఒక్క గొంతూ ఎండొద్దు.. అధికారులు ఇప్పటి నుంచే ప్రత్యే శ్రద్ధ చూపాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ సూచించారు. తాడ్వాయి ఆశ్రమ పాఠశాలలో కలెక్టర్ మురళి అధ్యక్షతన గిరిజన సం క్షేమ అభివృద్ధి సమావేశం గురువారం జరగగా ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి ఐటీడీఏ పరిధిలోని గిరిజన మండలాల ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలను పిలవాలనుకున్నా నూతన జిల్లా, అధికారుల అవగాహన లోపం వల్ల పిలవలేక పోయామన్నారు. ఇది ఐటీడీఏ పాలక మండలి సమావేశం కాదని గిరిజన సంక్షేమ అభివృద్ధి సమావేశం మాత్రమేనన్నారు. వచ్చే నెలలో పూర్తి స్థాయిలో పాలకమండలి సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఏజన్సీ గ్రామాల్లో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. రెడ్యాల, మూడు చెక్కలపల్లి, తాడ్వాయి ఆశ్రమ బాలికల పాఠశాలలను ఈ జూన్ నుంచి జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నందున ఏర్పాట్లుచేయాలని చెప్పారు. విద్య, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్.. మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ హన్మకొండ జులైవాడ హాస్టల్లో గోళాలపై బస్త సంచులు కప్పిన నీటిని తాగున్నారని, నేను నిధులు ఇస్తా వాటర్ ప్లాంట్ పెట్టమని చెప్పినా ఎందుకు పెట్టలేదని ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ కోటిరెడ్డిని ప్రశ్నించారు. గిరిజన పిల్లలకు అవసరమైన డ్యూయల్ బెడ్స్ ఏర్పా టు చేయించడంలో అధికారులు నిర్లక్ష్యం చూపొద్దన్నారు. గిరిజన బాలిక, బాలుర డిగ్రీ విద్యార్థుల కోసం రెసిడెన్షియల్స్ నిర్మించడానికి ప్రణాళికలను తయారు చేయాలన్నారు. జిల్లాకు కేటాయించిన ఈజీఎస్ నిధులను కలెక్టర్ నేరుగా గ్రామపంచాయతీలకు అప్పగించడం వల్ల జెడ్పీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా మిగిలా రని జెడ్పీ ఫ్లోర్ లీడర్ సకినాల శోభన్ అన్నారు. 10 శాతం జెడ్పీ, 15 మండల పరిషత్, 75 గ్రామ పంచాయతీలకు కేటాయించాలని ఈజీఎస్ చెబుతున్నా కలెక్టర్ మాత్రం నిధులను మొత్తం పంచాయతీలకు అప్పగించడం బాధాకరమన్నారు. మంత్రి చందూలాల్ కల్పించుకొని జెడ్పీటీసీలు ఇచ్చిన ప్రతిపాదనల ప్రకారం పనులకు అనుమతులు ఇచ్చి, నిధులు కేటాయించే విధంగా చూడాలన్నారు. వైద్య శాఖ .. జిల్లాలో 25 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నాలు గు సామాజిక ఆస్పత్రులు ఉన్నాయని డీఎంహెచ్ఓ అప్పయ్య వెల్లడించారు. కొత్తగూడ, గూడూరు, మంగపేట, ఏటూరునాగారం మం డలాల్లో సబ్ సెంటర్ల కోసం అనుమతులు వచ్చాయని, వాటి నిర్మాణాలు చేపట్టాలని కోరా రు. ఎనిమిది పీహెచ్‌సీలను 24/7గా అప్‌గ్రేడ్ చేసి నిత్యం వైద్యులు అందుబాటులో ఉంటు న్నారని చెప్పారు. జిల్లాలో మూడు నెలల్లో 256 డెలివరీలు చేశామని, ఐటీడీఏ పరిధి పీహెచ్‌సీలకు ఉన్న 12 అంబులెన్స్‌లకు మూడు నెలలు గా అద్దె చెల్లించడం లేదని, గతంలోనూ చెల్లించకపోతే ఐటీడీఏ నుంచి ఇచ్చామని జేసీ అమయ్‌కుమార్ మంత్రికి వెల్లడించారు. ములుగు, ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి రెండు అంబులెన్స్‌లు ఇప్పించాలని డీఎంహెచ్ఓ మం త్రిని కోరారు. ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రిని 50 పడకల చేర్చినా మందులు 30 పడకల వరకే వస్తున్నాయని జెడ్పీటీసీ వలియా బీ తెలపగా మిగతావి కూడా వచ్చేలా చూస్తామని డీసీహెచ్ఎస్ గోపాల్ వివరించారు. బెల్ట్‌షాపులను రద్దు చేయాలి ఏజన్సీలో గుడుంబాను, బెల్ట్‌షాపులను అరికట్టాలని ఏటూరునాగారం ఎంపీపీ మోహరున్నీసా కోరారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ శశిధర్‌ను మంత్రి పిలిచి బెల్ట్‌షాపులను ఎందుకు నియంత్రించడం లేదని ప్రశ్నించగా రాతపూర్వకంగా ఫిర్యాదులు రావడం లేదన్నారు. అయితే, మీరు చర్యలు తీసుకున్నదెప్పుదని అన్నారు. ఆ తర్వాత అటవీ ఉత్పత్తులు ఎన్ని రకాలు కొంటున్నారు.. గిరిజనులకు ఏ విధమైన ఉత్పత్తుల ఆదాయం కల్పిస్తున్నారో పది రోజుల్లో రిపోర్టు ఇవ్వాలని జీసీసీ డీఎం ప్రతాప్‌రెడ్డిని ఎంపీ ఆదేశించారు. జిల్లాలో 1.57 లక్షల కుటుంబాలుండగా కేవలం 30వేల కుటుంబా లకు మాత్రమే మరుగుదొడ్లు ఉన్నాయని ఈఈ నిర్మల చెప్పగా.. అందరికీ ఎప్పుడు కట్టిస్తారని ఎంపీ ప్రశ్నించారు. 2017 సెప్టెంబర్ వరకు 395 గ్రామాలకు మిషన్ భగీరథ కింద నీటిని అందిస్తామని ఈఈ తెలిపారు. రామప్ప కింద ఉన్న గ్రామాలకు నీటిని ఎందుకు అందించడం లేదని ఈఈని ప్రశ్నించిన మంత్రి పది, పదిహేను రోజుల్లో అందించాలని ఆదేశించారు. సమావేశంలో ములుగు సబ్‌కలెక్టర్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. -
తొలి ‘ఎమ్మెల్యే భవనం’ సిద్ధం
⇒ పరకాలలో ముస్తాబైన తొలి భవన సముదాయం ⇒ రేపు ప్రారంభించనున్న మంత్రులు తుమ్మల, చందూలాల్ సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎక్కడా లేనివిధంగా నిర్మించతలపెట్టిన నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యేలకు కార్యాలయం, నివాస వసతితో కూడిన భవన సముదాయాల పనులు ఊపందుకున్నాయి. వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గం కేంద్రంలో రూ.69 లక్షల వ్యయంతో భవన సముదాయం సిద్ధమైంది. మార్చి 2వ తేదీన ఈ భవనాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, చందూలాల్ ప్రారంభించనున్నారు. క్యాంపు కార్యాలయం, నివాసం ఒకే చోట ఉండేలా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యేలకు ప్రభుత్వం భవనాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దీనివల్ల ఎమ్మెల్యే నియోజకవర్గ కేంద్రంలో ప్రజలకు అందుబాటులో ఉండట మే కాకుండా, ప్రజలతో తరచూ మమేకమ వడానికి అవకాశం కలుగుతుందని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ప్రస్తుతం చాలామంది ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోనే మకాం పెడు తుండటంతో ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు. ఎమ్మెల్యేను కలవాలంటే ప్రజలు వ్యయ ప్రయాసలకోర్చి రాజధానికి రావాల్సి వస్తోంది. దీన్ని నివారించటంతో పాటు, ఎమ్మెల్యేకు కూడా వసతిగా ఉండేలా ఈ భవనాల ప్రణాళిక రూపొందించారు. అడ్డంకుల నడుమ ముందుకు.. పేదల కోసం ఉద్దేశించిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో కాంట్రాక్టర్లు ముందుకు రాకపో వడంతో ఆ పనులు పడకేసి ఇప్పుడిప్పుడే తిరిగి మొదలవుతున్నాయి. ఎమ్మెల్యేల ఇళ్ల విషయంలో కూడా ప్రారంభంలో స్థలాల కొరత, అనువైన భూములు లేకపోవటం తదితర కారణాలతో కొంత జాప్యం జరిగినా తర్వాత కొన్ని చోట్ల పనులు మొదలయ్యాయి. పరకాలలో గతేడాది ఆగస్టులో ప్రారంభమైన భవన నిర్మాణం యుద్ధప్రాతిపదికన పూర్తయింది. ప్రస్తుతం ఈ ఒక్క భవనం మాత్రమే సిద్ధం కావటంతో దాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలకు భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ భారీ వ్యయంతో కొత్త ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మిస్తున్నందున ప్రత్యేకంగా వారికి భవనాలు కట్టడమంటే దుబారా చేయటమేనన్న విమర్శలు రావటంతో వెనక్కు తగ్గింది. హైదరాబాద్ పరిధిలోని 15 నియోజకవర్గాలు పోను మిగిలిన 104 నియోజవకవర్గాల్లో భవనాలు నిర్మించాలని నిర్ణయించినా 65 చోట్ల మాత్రమే పనులు మొదలయ్యాయి. ‘పరకాల’భవనం ప్రత్యేకతలివీ.. భవనం వైశాల్యం: 4,533 చదరపు అడుగులు నిర్మాణ వ్యయం: రూ.68.92 లక్షలు మొదటి అంతస్తు: సమావేశ మందిరం, ఎమ్మెల్యే కార్యాలయం, వీపీపీ లాంజ్, అతిథులు వేచి ఉండే గదులు, సిబ్బంది గదులు రెండో అంతస్తు: మూడు పడక గదులు, డైనింగ్ హాల్, స్టోర్స్ గది, పూజ గది, వంటగది, డ్రాయింగ్ రూమ్, వరండా. -
నృత్యం విశ్వవ్యాప్త భాష
అంతర్జాతీయ నృత్యోత్సవాలను ప్రారంభించిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు హైదరాబాద్: ‘‘నృత్యమనేది విశ్వవ్యాప్త భాష, ఇది మానసికోల్లాసాన్ని ప్రసాదిస్తుంది. మనస్సు, శరీరాల సమ్మేళనమే నాట్యం. సంస్కృతికి ప్రతీక అయిన నాట్యా న్ని, విభిన్న నాట్య రీతుల వారసత్వాన్ని పరిరక్షించు కొంటూ ముందుకు సాగవలసిన అవసరం ఉందని’’ కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. ఆదివారం హైదరాబాద్ మాదాపూర్‌లోని శిల్పకళావేదిక ప్రాంగణంలో ప్రథమ ఏషియన్ బ్రాడ్ కాస్టింగ్ యూనియన్ (ఏబీయూ) ఇంటర్ నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్‌ను ఆయన జ్యోతి వెలిగించి అట్టహా సంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడు కోవడం మన కర్తవ్యం అన్నారు. ఉత్సవ నిర్వహణకు చక్కటి ఏర్పాట్లను చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి అభినం దనలు తెలిపారు. సర్వేజనా సుఖినోభవంతు.. అందరూ బాగుండాలంటూ నూతన సంవత్సర, మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర సాంస్కృతిక మంత్రి అజ్మీరా చందూ లాల్, ప్రసార భారతి చైర్మన్ డాక్టర్ ఎ.సూర్య ప్రకాశ్, ప్రసార భారతి ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సిఇఒ) ఎస్.సి.పాండా, ఏబీయూ సెక్రటరీ జనరల్ జవాద్ మొతాగి, దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ సుప్రియ సాహు, రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల కమిషనర్ నవీన్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ డ్యాన్స్ ఫెస్టివల్లో సుమారు పది దేశాలకు చెందిన 47 మంది కళాకారులు పాల్గొన్నారు. -
కళాకారులపై వరాల జల్లు
►డిమాండ్ల పరిష్కారానికి మంత్రి చందూలాల్ హామీ ►మళ్లీ ప్రజా కళారూపాలే బెటర్ అనే రోజొస్తుంది: ఈటల సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కళాకా రులపై సాంస్కృతిక, పర్యాటక మంత్రి అజ్మీరా చందూలాల్ వరాల జల్లు కురిపిం చారు. సోమవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధుల అవగాహన సదస్సు నిర్వహిం చారు. ఈ సదస్సుకు హాజరైన మంత్రి మాట్లాడుతూ... ఈ ఏడాది రాష్ట్రంలోని కళాకారులందరికి గుర్తింపు కార్డులు అందజేస్తామని.. ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పి స్తామని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిం చేందుకు కన్ సెషన్ బస్‌పాస్ లతో పాటు అన్ని పథకాల్లో భాగస్వామ్యం కల్పి స్తామని హామీ ఇచ్చారు. జానపద కళాకారుల సంఘం కోర్కెలను సీఎం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కార మయ్యేందుకు కృషి చేస్తామనని చెప్పారు. సభను ప్రారంభించిన ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లా డుతూ.. తెలంగాణ గడ్డపై జరిగిన అనేక కార్యక్రమాలకు ఆట – పాటనే స్ఫూర్తి అన్నారు. ఎప్పటికైనా మళ్లీ ఓ రోజు ఈ సినిమాలు, సీరియల్స్ చూడలే మురా బాబు.. ప్రజాకళారూపాలే బెటర్ అని ప్రజలు ఆలోచించే రోజు వస్తుందన్నారు. వృత్తి కళాకారులకు ఉపాధి చూపించాల్సిన అవసరం ఎం తైనా ఉందని సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ అన్నారు. కళాకారులందరికి ఉద్యోగాలు సాధ్యం కాదని.. ఉపాధి కల్పించే బాధ్యత భుజాన వేసుకుంటామ న్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహా దారు డాక్టర్ కేవీ రమణాచారి, టూరిజం, సాంస్కృతిక శాఖల కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడారు. సదస్సులో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకు న్నాయి. ఈ కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, నరసింహారెడ్డి, తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగా శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగయ్య తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటకానికి జిల్లాకో ప్రణాళిక
► భారీగా పర్యాటకులను ఆకర్షించాలని ప్రభుత్వం నిర్ణయం ► ప్రత్యేక ప్రణాళికల రూపకల్పనకు కసరత్తు ప్రారంభం ► జిల్లాల యంత్రాంగంతో మంత్రి, కార్యదర్శి, అధికారుల భేటీలు ► తొలి రోజున నాలుగు జిల్లాల్లో సమావేశాలు ► వారం తర్వాత మరిన్ని జిల్లాల అధికారులతో భేటీలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి, పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించింది. ఆయా ప్రాంతాలకు వేర్వేరు ప్రత్యేకతలు ఉన్న నేపథ్యంలో.. జిల్లాల వారీగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిం చనుంది. ప్రపంచవ్యాప్తంగా ముమ్మర ప్రచారం చేయడం ద్వారా పర్యాటకులను ఆకట్టుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయా జిల్లాల వారీగా పర్యాటక ప్రణాళికలు ఎలా ఉండాలనే దిశగా కసరత్తు ప్రారంభించింది. పర్యాటక, పురావస్తుశాఖల అధికారులు ఆయా జిల్లాలకు వెళ్లి కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశమై సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నారు. ఇందులో భాగంగా పర్యాటక మంత్రి చందూ లాల్, ఆ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ క్రిస్టీనా, పురావస్తు శాఖ డెరైక్టర్ విశాలాక్షి, ఇతర అధికారులు సోమవారం తొలి విడత సమా వేశాలకు శ్రీకారం చుట్టారు. తొలిరోజున ఉదయం నుంచి రాత్రి వరకు యాదాద్రి, జనగామ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల యంత్రాంగంతో జిల్లా కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించారు. యాదాద్రి దేవాలయం, చిట్టకోడూరు రిజర్వాయర్, ఖిలాషాపూర్ ప్రాంతాలలో పర్యటించారు కూడా. వారం తర్వాత రెండో విడతగా మరిన్ని జిల్లాల్లో పర్యటనలు చేయను న్నామని.. మొత్తం 31 జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తామని పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ఏం చేస్తారు..? ► పర్యాటకులను ఆకర్షించేలా తీసుకునే చర్యలకు లక్ష్యాలు నిర్ధారించారు. 2020, 2022, 2027.. ఇలా సంవత్సరాల వారీగా పర్యాటకుల సంఖ్యను లక్ష్యంగా పెట్టుకున్నారు. ► ‘అతిథి దేవోభవ’ పేరుతో ప్రత్యేక ప్రణాళిక ఉంటుంది. ముఖ్యంగా పర్యాటకులను ఆహ్వానించే క్రమంలో ప్రజల్లో కూడా అవగాహన కల్పించనున్నారు. ఆటోవాలాలు, హోటల్ నిర్వాహకులు, ఉద్యోగులు.. ఇలా అంతా పర్యాటకులను నవ్వుతూ స్వాగతించేలా చైతన్యం తీసుకువస్తారు. ►ఒక్కో జిల్లాకు ఒక్కో ప్రత్యేకత ఉంది. స్థానిక పరా్యాటక కేంద్రాలు, ప్రకృతి సిద్ధ వనరులు, ఆచార వ్యవహారాలు వంటి వాటి ఆధారంగా ప్రణాళికలు రూపొందిస్తారు. ►యాదాద్రి జిల్లాలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంతోపాటు భువనగిరి కోట తదితరాలను పర్యాటకులకు అనుకూలంగా మార్చాలని నిర్ణరుుంచారు. జాతీయ రహదారి నుంచి నేరుగా భువనగిరి కోటకు ప్రత్యేక రహదారి నిర్మాణంతోపాటు బారికేడ్లు ఏర్పాటు చేసి, అక్కడ అన్ని వసతులతో కూడిన స్నాక్ బార్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ►ఘన చరిత్ర ఉన్న వరంగల్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించారు. ఈ సంవత్సరం వరంగల్‌లో అంతర్జాతీయ పతంగుల ఉత్స వం నిర్వహించనుండగా... హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకలను వచ్చే సంవత్సరం వరంగల్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. ►పాకాల, లక్నవరం, రామప్ప లాంటి జలాశయాల్లో లేక్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. అలాగే పాతకాలం నాటి పూటకూళ్ల ఇళ్ల తరహాలో ఇంటి విడిదుల ఏర్పాటును ప్రోత్సహిస్తారు. -
పౌరసేవల అమలులో మార్పు రావాలి
మంత్రి చందూలాల్ ఆకాంక్ష సాక్షి, హైదరాబాద్: పౌరసేవలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న తీరులో మార్పు రావాలని రాష్ర్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఆకాంక్షించారు. మంగళవారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో ఎస్టీ, బీసీ శాఖల అధికారుల శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో మం త్రులు చందూలాల్, జోగు రామన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు ట్యాబ్ లు అందజేశారు. చందూలాల్ మాట్లాడుతూ గతంలో జిల్లాల విస్తీర్ణం, జనాభా అధికంగా ఉండడం వల్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై నిఘా, పర్యవేక్షణ కొరవడిందన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ద్వారా ప్రభుత్వ లక్ష్యాలు ఆశించిన స్థాయిలో విజయవంతం అవుతాయని భావిస్తున్నామన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అందించే బాధ్యత అధికారులదేనని బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న చెప్పారు. కొత్తగా నియమితులైన జిల్లా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ,బీసీ శాఖల ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్, ఎస్టీశాఖ కమిషనర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
కుమ్రం భీం పురిటిగడ్డ.. ఇక పర్యాటక కేంద్రం
భీం 76వ వర్ధంతి సభలో మంత్రుల వెల్లడి సాక్షి, ఆసిఫాబాద్: జల్, జంగిల్, జమీన్ కోసం నిజాంకు వ్యతిరేకంగా పోరాడి అమరుడైన కుమ్రం భీం పురిటిగడ్డను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందులాల్, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న అన్నారు.గత ప్రభుత్వాలు తెలంగాణ పోరాటవీరులను గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం భీం జిల్లాలోని జోడేఘాట్‌లో గిరిజన పోరాట యోధుడు, ఆదివాసీల ఆరాధ్య దైవం కుమ్రం భీం 76వ జయంతి కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. తొలుత భీం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భీం స్మృతివనం, మ్యూజియంను మంత్రులు ప్రారంభిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక వీరులను భవిష్యత్తరాలు గుర్తుంచుకునేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని వివరించారు. భీమ్ వారసులను గుర్తించి ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. జిల్లాలోనే అపారమైన అటవీసంపదను కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని.. దుర్వినియోగం కాకుండా తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. చిన్న జిల్లాగా ఏర్పడిన నేపథ్యంలో పాలన పరుగులు పెడుతుందని, విద్య, వైద్యం, వ్యవసాయం, రవాణా రంగాల్లో జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీ నగేష్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీ సతీష్‌కుమార్ పాల్గొన్నారు. కాగా, కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు రాకపోవడంతో ఆదివాసీలు నిరుత్సాహానికి గురయ్యారు. -
దేవాదుల జలాలతో లోకం చెరువు నింపాలి
ములుగు : నీరు లేక ఎండిపోయే దశకు చేరిన తమ పంటలను కాపాడాలని కోరుతూ మండలంలోని లోకం చెరువు ఆయకట్టు రైతులు మంగళవారం మంత్రి చందూలాల్‌తో కలిసి నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును హైదరాబాద్‌లో కలిశారు. లోకం చెరువులో నీళ్లు సరిపడా లేని కారణంగా 1500 ఎకరాల పంట చేతికందని పరిస్థితులు నెలకొన్నాయని హరీశ్‌రావుకు వివరించారు. దేవాదుల పైప్‌లైన్ ద్వారా లోకం చెరువుకు నీటిని అందించాలని కోరారు. ఇంచెం చెర్వుపల్లి వద్ద ఉన్న ఇన్‌టెక్ వెల్ నుంచి నీటిని మళ్లిస్తే రబీ సాగు అనుకూలంగా ఉంటుందని తెలిపారు. దీనిపై స్పందించిన హరీశ్‌రావు ఆ శాఖ ఎస్ఈతో ఫోన్లో మాట్లాడారు. సాధ్యాసాధ్యాలకు అనుగుణంగా లోకం చెరువుకు నీటిని మళ్లించే ప్రయత్నం చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు రైతులు తెలిపారు. సర్పంచ్ గుగ్గిళ్ల సాగర్, టీఆర్ఎస్ మండల అ««దl్యక్షుడు గట్టు మహేందర్, శ్రీనివాస్‌రెడ్డి, రైతులు అక్కల రవి, అజ్మీరా లక్ష్మణ్‌నాయక్, ఇమ్మడి బక్క ఓదెలు, గొర్రె అంకూస్, గంధం విజేందర్, కుమార్, సమ్మిరెడ్డి, ఇమ్మడి రాజయ్య, చంద్రగిరి కుమార్ ఉన్నారు. -
చందూలాల్ కాన్వాయ్ అడ్డగింత
* జనగాంలో ఆందోళనకారుల్ని చెదరగొట్టిన పోలీసులు * జిల్లా సాధన కోసం పోరు తీవ్రం జనగామ: ఉద్యమాల ఖిల్లా అయిన జనగామ జిల్లా సాధన కోసం తలపెట్టిన ఉద్యమం రోజురోజుకూ తీవ్రమవుతోంది. జిల్లా సాధన సమితి, జేఏసీ ఆధ్వర్యంలో గురువారం హన్మకొండ-హైదరాబాద్ జాతీయ రహదారిని దిగ్బంధించారు. మంత్రి చందూలాల్ హైదరాబాద్ నుంచి వస్తున్నారనే సమాచారం మేరకు ఉద్యమకారులు హైవేపైకి రాకుండా పోలీ సులు నియంత్రించే ప్రయత్నం చేశారు. ఉద యం 11 గంటలకు మంత్రి కాన్వాయ్ జనగా మ చౌరస్తాకు చేరుకోగానే ఆందోళనకారులు అడ్డుకున్నారు. జనగామను జిల్లా చేయూలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యూదగిరిరెడ్డి ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. -
పర్యాటక అభివృద్ధికి సీఎం కేసీఆర్ చర్యలు
హైదరాబాద్ : సమైక్య పాలనలో తెలంగాణ టూరిజం గుర్తింపునకు నొచుకోలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో రసమయి బాలకృష్ణ మాట్లాడుతూ... ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునేలా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో కట్టడాలు ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీనిపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఎ.చందూలాల్ మాట్లాడుతూ... రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారని వివరించారు. అందులోభాగంగా హెలీ టూరిజం ఏర్పాటు చేసిన విషయాన్ని చందూలాల్ గుర్తు చేశారు. -
దెబ్బతిన్న పంటల్ని పరిశీలించిన మంత్రి
ములుగు మండలం పందికుంట గ్రామంలో అకాల వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను బుధవారం మంత్రి చందూలాల్ పరిశీలించారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, పంట నష్టపోయిన వారికి ప్రభుత్వ తరఫున ఆర్థిక సాయం అంద జేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మిర్చి, మొక్కజొన్న, అరటి తోటలను పరిశీలించారు. -
వన దేవత.. జన జాతర
మేడారానికి పోటెత్తిన భక్తజనం ♦ ఒక్కరోజే 40 లక్షల మంది రాక ♦ గత రెండు నెలలుగా కోటి మంది సందర్శన ♦ నేటితో ముగియనున్న మహా జాతర సాక్షి ప్రతినిధి, వరంగల్: మేడారం జనసంద్రమైంది.. వన దేవతలకు మొక్కుల కోసం వచ్చిన భక్తులతో కిక్కిరిసింది. ‘సమ్మక్క కో.. సారక్క కో’ అంటూ భక్తుల జయజయధ్వానాలు.. శివసత్తుల పూనకాలతో దద్దరిల్లింది. చీరలు, రవిక ముక్కలు, ఎత్తు బంగారం(బెల్లం), ఎదురు కోళ్లు, ఒడి బియ్యం, కొబ్బరి కాయలు.. ఇలా తీరొక్క రూపాల్లో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మ ప్రసాదం(బెల్లం) కోసం పోటీపడ్డారు. భక్తుల రద్దీ దృష్ట్యా దేవాదాయ శాఖ బంగారం ప్రసాదాన్ని భక్తులకు అందించలేదు. వన దేవతలు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపై కొలువు దీరి ఉండడం.. పవిత్ర మాఘ శుద్ధ శుక్రవారం కావడంతో ఈ ఒక్కరోజే 40 లక్షల మంది మొక్కులు చెల్లించుకున్నట్లు అధికారులు ప్రకటించారు. గత 2 నెలలుగా మేడారానికి ఇప్పటి వరకు కోటి మంది భక్తులు వచ్చినట్లు తెలిపారు. నేటితో జాతర ముగింపు ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ ఉత్సవంగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతరకు 1.10 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. కానీ గత జాతర కంటే ఈసారి భక్తుల సంఖ్య బాగా పెరిగింది. జాతరకు 2 నెలల ముందు నుంచే మొక్కులు చెల్లించుకున్నారు. జాతర మొదలైన 17 నుంచి భక్తుల రాక బాగా పెరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఛత్తీస్‌గఢ్, మహా రాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి నుంచి భక్తులు తరలివచ్చారు. గిరిజను లు సంప్రదాయ పద్ధతుల్లో డప్పుల మోతలు, బాకాలు, బూరల నాదాలతో వన దేవతలకు మొక్కులు చెల్లించారు. నేటి(శనివారం) సాయంత్రం జాతర ముగియనుంది. చివరి రోజు కావడంతో భక్తులు పెద్దఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. వీఐపీల రాక.. భక్తులకు ఇబ్బందులు! వన దేవతలకు మొక్కులు సమర్పించేందుకు భక్తులు గురువారం అర్ధరాత్రి నుంచే క్యూలైన్లలో నిల్చున్నారు. శుక్రవారం ఉదయం వరకు భక్తులకు ఇబ్బందులు లేకుండానే దర్శనం జరిగింది. గరిష్టంగా గంట సమయంలో దర్శనం ముగించుకున్నారు. అయితే శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి వీఐపీల రాక ప్రారంభం కావడంతో భక్తులకు ఇబ్బందులు మొదలయ్యాయి. సీఎం కేసీఆర్ వస్తున్నారనే సమాచారంతో పలువురు మం త్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు మేడారం చేరుకున్నారు. అయితే ఆయన పర్యటన రద్దయినట్లు సమాచారం తెలియగానే వీరంతా మేడారం గద్దెల వద్ద దర్శనానికి క్యూ కట్టారు. పోలీసులు, అధికారులు వీరికే ప్రాధాన్యం ఇవ్వడంతో భక్తులు రెండు గంటలపాటు ఇబ్బందులు పడ్డారు. పలువురు ప్రజాప్రతినిధులు రెండుమూడు కార్లలో అనుచరులను వెంట బెట్టుకుని గద్దెల వద్దకు వెళ్లడంతో సాధారణ భక్తుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం కార్యాలయ స్టిక్కర్‌తో వచ్చిన కారు గద్దెల ముందే గంటలపాటు ఉన్నా పోలీసులు పట్టించుకోలేదు. శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎ. చందూలాల్, పి.మహేందర్‌రెడ్డి, ఎంపీలు ఎ.సీతారాంనాయక్, పసునూరి దయాకర్, గరికపాటి మోహన్‌రావు, గుండు సుధారాణి, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్, కల్వకుంట విద్యాసాగర్‌రావు, పుట్టా మధు, బి.శంకర్‌నాయక్, హన్మంత్ షిండే, హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, ఎమ్మెల్యే బాబూమోహన్, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, డీజీపీ అనురాగ్‌శర్మ, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్ తదితరులు శుక్రవారం మొక్కులు సమర్పిం చుకున్నారు. అమ్మల దీవెనతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తా: మేయర్ రామ్మోహన్ మేడారం సమ్మక్క-సారలమ్మల దీవెనలతో హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేస్తానని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. శుక్రవారం ఆయన మేడారంలోని సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని నిలువెత్తు బంగారం(92కిలోలు) సమర్పించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా బిడ్డనైన తాను హైదరాబాద్ నగర మేయర్‌గా ఎంపిక కావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అశీర్వాదంతో పాటు మేడారం తల్లుల దీవెనలే కారణమన్నారు. సీఎం మేడారం పర్యటన రద్దు సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మేడారం పర్యటన రద్దయింది. శుక్రవారం ఉదయం ఆయన ప్రత్యేక హెలి కాప్టర్లో మేడారం వెళ్లి సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకోవాల్సి ఉంది. సీఎం పర్యటనకు అధికార యం త్రాంగం అన్ని ఏర్పాట్లూ చేసింది. మేడారం పర్యటన తర్వాత వరంగల్‌లోని ఇంక్యుబేషన్ టవర్స్‌లో ఐటీ కాంప్లెక్స్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయాల్సి ఉంది. కానీ జ్వరం కారణంగా సీఎం ఈ పర్యటనకు వెళ్లలేకపోయినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. తల్లుల నీడలో ప్రసవం మహాజాతరలో జన్మించిన మరో సమ్మక్క మేడారం బృందం: మేడారంలో సమ్మక్క-సారలమ్మ గద్దెలపై కొలువుదీరిన వేళ.. తల్లుల నీడలోనే ప్రసవించాలన్న ఓ మహిళ కల నెరవేరింది. ఖమ్మం జిల్లా మణుగూరుకు చెందిన కందుకూరి జ్యోతి తొమ్మిది నెలల గర్భంతో మేడారం వచ్చింది. అక్కడే ప్రసవిస్తే బాగుండు అనుకుంది. ఆమెకు శుక్రవారం పురిటి నొప్పులు రాగా, కుటుంబ సభ్యులు సమీపంలోని మెగా వైద్యశిబిరానికి తీసుకొచ్చారు. అక్కడ వైద్యులు దీప్తి, కీర్తి, సిబ్బంది సుందరి, మనోహరరాణి పర్యవేక్షణలో జ్యోతి ఆడపిల్లకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని డీఎంహెచ్‌వో సాంబశివరావు, ఆర్డీ నాగేశ్వర్రావు తెలిపారు. అమ్మల దర్శనం అదృష్టం తెలుగు రాష్ట్రాల ప్రజలు చల్లగా ఉండాలి: బాలకృష్ణ ములుగు: సమ్మక్క, సారలమ్మను దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. శుక్రవారం తన కుటుంబ సభ్యులతో కలసి ఆయన మేడారానికి వచ్చారు. దేవతలకు నిలువెత్తు బంగారం(బెల్లం)తో పాటు పసుపు-కుంకుమలు, కొబ్బరికాయ మొక్కులు సమర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. కోటి మంది హాజరయ్యే జాతరలో తాను ఓ భక్తుడిని కావడం సంతోషకరమని అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు చల్లగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్టు చెప్పారు. అనంతరం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం కేసీఆర్ తరపున చందూలాల్ మొక్కులు అమ్మవారికి 56 కిలోల బంగారం సమర్పణ ములుగు: ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారం పర్యటన రద్దవడంతో ఆయ న తరఫున గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీర చందూలాల్ శుక్రవారం మొక్కు సమర్పించారు. 56 కిలోల బంగారం(బెల్లం) తులాభారం వేసి సమ్మక్క, సారలమ్మ తల్లులకు సమర్పించారు. అనంతరం అమ్మల గద్దెల నుంచి బంగారం తీసుకున్నారు. రెండు, మూడ్రోజుల్లో అమ్మవారి ప్రసాదాన్ని ముఖ్యమంత్రికి అందిస్తానని చందూలాల్ తెలిపారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దేవతలను కోరుకున్నట్లు తెలిపారు. (ఫొటోల కోసం క్లిక్ చేయండి) -
మంత్రి చందూలాల్ కు బాలకృష్ణ ఆహ్వానం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో జరుగనున్న లేపాక్షి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మంగళవారం తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్‌ను కలిశారు. సచివాలయంలోని మంత్రి చాంబర్‌కు విచ్చేసిన ఆయన ఈ సందర్భంగా చందూలాల్‌ను లేపాక్షి ఉత్సవాలకు హాజరవ్వాలంటూ స్వయంగా అధికారిక ఆహ్వాన పత్రాన్నిఅందజేశారు. ఈ మేరకు బాలకృష్ణ మాట్లాడుతూ ... రాష్ట్రాలు వేరైనా తెలుగు ప్రజలంతా ఒక్కటే. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న లేపాక్షి ఉత్సవాలకు పర్యాటక శాఖ మంత్రిని ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది. లేపాక్షిని అతి పెద్ద పర్యాటక ప్రాంతంగా మార్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ నెల 27,28 తేదీల్లో రెండు రోజుల పాటు జరుగనున్న లేపాక్షి ఉత్సవాలను ఘనంగా నిర్వహించబోతున్నం. అందుకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఉత్సవానికి పొరుగు రాష్ట్రాల మంత్రులు కూడా హాజరువుతున్నారు అని పేర్కొన్నారు. బాలకృష్ణ ఆహ్వానాన్ని అందుకున్న చందూలాల్ స్పందిస్తూ.... బాలకృష్ణ స్వయంగా వచ్చి ఆహ్వానించడం చాలా సంతోషం. తప్పకుండా లేపాక్షి ఉత్సవాలకు హాజరవుతానని హామీ ఇచ్చారు. అనంతరం అరగంట పాటు ఉత్సవాలకు సంబంధించిన పలు విషయాలను చర్చించుకున్నారు. హిందూపురం నియోజకవర్గం లోని చిన్నగ్రామమైన లేపాక్షిలో జరిగే ఈ ఉత్సవానికి తనతో పాటు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కూడా హాజరవుతారని చందూలాల్ తెలిపారు. -
సేవాలాల్ మహరాజ్ అందరికీ ఆరాధ్యనీయుడు
గురు సేవాలాల్ మహరాజ్ తండా వాసులు, లంబాడా లకే కాకుండా ప్రజలందరికీ ఆరాధ్యనీయుడని గిరిజనసంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అన్నారు. లంబాడలకు జాతిపిత అయిన సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలకు సంబంధించి ఇంకా ప్రచారం, ప్రాధాన్యం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం తొలి ఏడాది నుంచే ఈ ఉత్సవాలను ఘనంగా జరుపుకునేందుకు జిల్లాకు రూ.పదిలక్షల చొప్పున విడుదల చేస్తోందన్నారు. ఈ ఏడాది కూడా త్వరలోనే నిధుల విడుదల ఉంటుందన్నారు. ఫిబ్రవరి 15న సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకునిగురువారం మంత్రి చందూలాల్ నివాసంలో సంత్‌సేవాలాల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాల పోస్టర్, కరపత్రాలను ఆవిష్కరించారు. కర్ణాటక, రాయలసీమ, తెలంగాణలలో విస్తృతంగా పర్యటించి,సుస్థిర సమాజం లేక చెట్టుకొకరు, పుట్టకొకరుగా సంచారజీవనం గడుపుతున్న లంబాడ లను ఏకతాటిపైకి తెచ్చిన మహనీయుడు సేవాలాల్ మహరాజ్ అని కొనియాడారు. గ్రామ సమీప ప్రాంతాల్లో తండాలుగా నివాసమేర్పరచుకుని సుస్థిర జీవనం గడపాలని సేవాలాల్ గురూజీ ఉద్భోదించారన్నారు. తన సొంత ఖర్చుతో సేవాలాల్ ఆలయాన్ని నిర్మించి ఏటా జయంతి వేడుకలను నిర్వహిస్తున్న ఇస్లావత్ నామానాయక్ను మంత్రి అభినందించారు. ప్రభుత్వపరంగా అవసరమైన సహకారం ఉంటుందని చెప్పారు. -
చిన్న చిత్రాలకు ప్రోత్సాహం
తొలి అంతర్జాతీయ లఘుచిత్రోత్సవ ప్రారంభంలో మంత్రి చందూలాల్ సాక్షి, హన్మకొండ: చిన్న చిత్రాలు, లఘు చిత్రాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నదని రాష్ట్ర గిరిజన పర్యాటకశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అన్నారు. తెలంగాణలో తొలిసారిగా జరుగుతున్న అంతర్జాతీయ లఘు చిత్రోత్సవం (షార్ట్‌ఫిల్మ్ ఫెస్టివల్)ను శుక్రవారం వరంగల్‌లో మంత్రి ప్రారంభించారు. చందూలాల్ మాట్లాడుతూ వరంగల్‌లో ఇంటర్నేషన్ షార్ట్ ఫిలిమ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నం దుకు సంతోషంగా ఉందన్నారు. చిన్న చిత్రాల ప్రోత్సాహంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి త్వరలోనే నిర్ణయాలు వెల్లడిస్తామని ప్రకటించారు. కాకతీయ వీరనారి రుద్రమదేవి చిత్రాన్ని నిర్మించినందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా రుద్రమదేవి నిర్మించానని, ఈ సినిమా తర్వాత గూగుల్‌లో రుద్రమదేవి, వరంగల్ నగరం గురించి రోజు సెర్చ్ చేసే వారి సంఖ్య పెరిగిందన్నారు. గూగుల్ సెర్చ్ రికార్డుల్లో దేశవ్యాప్తంగా రుద్రమదేవి పేరు మూడో స్థానంలో నిలిచిందన్నారు. 20 దేశాలు.. 144 షార్ట్ ఫిలిమ్స్ ఇరాన్, ఇరాక్, అఫ్ఘానిస్తాన్, ఫ్రాన్స్, బెల్జియం, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, థాయ్‌లాండ్, జపాన్ తదితర ఇరవై దేశాలకు చెం దిన 144 షార్ట్‌ఫిల్మ్‌లను శని, ఆదివారం ప్రదర్శిం చనున్నారు. ఇందులో 70 విదేశీ చిత్రాలు ఉండగా, మిగిలినవి మన దేశానికి చెందిన లఘు చిత్రాలు. ప్రతీ చిత్రానికి సబ్‌టైటిల్స్ ఉంటాయి. ఈ చిత్రోత్సవంలో తెలంగాణ చరిత్ర, కోటలకు సంబంధించి మూడు లఘు చిత్రాలున్నాయి. ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు చిత్రాలను ప్రదర్శిస్తారు. తొలిరోజు ప్రారంభ చిత్రంగా ప్రొఫెసర్ జయశంకర్ జీవిత చరిత్రపై తీసిని లఘుచిత్రాన్ని ప్రదర్శించారు. జనవరి 8, 9, 10 తేదీల్లో కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. -
పనితీరు బాగుంటేనే ‘క్రమబద్ధీకరణ’
♦ కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో కొత్త మలుపు ♦ పర్యాటకాభివృద్ధి సంస్థపై ప్రత్యేక దృష్టి ♦ ఈ విభాగాన్ని శాసిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు ♦ అవినీతి ఆరోపణలున్న సిబ్బందిపై ప్రభుత్వం సీరియస్ సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ అంశం కొత్త మలుపు తిరిగింది. మొత్తం ఉద్యోగుల సర్వీసులు క్రమబద్ధీకరించే విషయంలో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. పనితీరు ఆధారంగా కాంట్రాక్టు సిబ్బంది సర్వీసులను క్రమబద్ధీకరించే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. దీనికి సంబంధించి వారి పనితీరు నివేదికలను ఆయా విభాగాధిపతుల నుంచి సేకరిస్తోంది. ముఖ్యంగా పర్యాటక శాఖలాంటి చోట్ల దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ శాఖ పూర్తిగా కాంట్రాక్టు ఉద్యోగుల ఆధ్వర్యలోనే నడుస్తోంది. ముఖ్యంగా ఈ శాఖ పరిధిలోకి వచ్చే పర్యాటకాభివృద్ధి సంస్థ పూర్తిగా వారి చెప్పుచేతల్లో నడుస్తోంది. గతంలో అడ్డదిడ్డంగా ఉద్యోగాలు పొందిన పలువురు కాంట్రాక్టు ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సంస్థ కార్యకలాపాలను నిర్వీర్యం చేశారు. కిందిస్థాయి సిబ్బంది మాత్రమే కాకుండా ఉన్నతాధికారుల పోస్టుల్లో కూడా కాంట్రాక్టు సిబ్బందే పనిచేస్తున్నారు. వీరిలో కొందరు కేవలం జేబులు నింపుకొనేందుకే పరిమితం కావటంతో కొంతకాలంగా పర్యాటకాభివృద్ధి సంస్థ పనితీరు దిగదుడుపుగా మారింది. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడంతో అలాంటి వారి పనితీరుపై నివేదికలు సేకరిస్తున్న ప్రభుత్వం... సిబ్బంది పనితీరును పరిగణనలోకి తీసుకునే వారి సర్వీసుల క్రమబద్ధీకరణపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. పనితీరు సరిగా లేని వారిని విధుల నుంచి తొలగించటంతోపాటు అవినీతి ఆరోపణలు తీవ్రంగా ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించటం విశేషం. దీన్ని కేవలం పర్యాటక శాఖకే పరిమితం చేయకుండా ఇతర విభాగాలలో కూడా అమలు చేయాలని భావిస్తోంది. తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థలో ప్రభుత్వ ఉద్యోగులు 97 మంది ఉంటే కాంట్రాక్టు ఉద్యోగులు దాదాపు మూడొందల మంది ఉన్నారు. అంతే సంఖ్యలో ఔట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. తమ సర్వీసులను రెగ్యులరైజ్ చేయాల్సిందిగా చాలాకాలంగా కాంట్రాక్టు ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే సంఘం పేరుతో కొందరు సిబ్బంది నుంచి భారీగా వసూళ్లకు పాల్పడ్డారనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. దీన్ని కూడా ప్రభుత్వం తీవ్రంగా పరిగణించినట్టు సమాచారం. ఇక తమకు అనుకూలంగా ఉండే కాంట్రాక్టు సిబ్బందికి ఎడాపెడా పోస్టులు కేటాయిస్తూ కొందరు ఉన్నతాధికారులు కార్పొరేషన్‌ను అస్తవ్యస్తంగా మార్చారు. కార్పొరేషన్లో తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ కాంట్రాక్టు ఉద్యోగికి గతంలో ప్రతిష్టాత్మక డాక్టర్ వైఎస్సార్ నిథిమ్ బాధ్యతలు అప్పగించారు. అది కాకుండా ఆ అధికారికి మరో మూడు పోస్టులు ఇన్చార్జి హోదాలో ఉన్నాయి. వాటిని అడ్డుపెట్టుకుని నిధులు స్వాహా చేశారని తీవ్ర ఆరోపణలున్నాయి. మరోవైపు నిథిమ్ పూర్తి అస్తవ్యస్తంగా మారింది. అక్కడి పరిస్థితులు నచ్చక కొందరు విద్యార్థులు మధ్యలోనే చదువు మానేశారని, వేరే రాష్ట్రాల విద్యార్థులు, విదేశీ విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయిందనే ఆరోపణలున్నాయి. ఇప్పుడా కాంట్రాక్టు ఉద్యోగి ఆ సంస్థ డైరక్టర్ పోస్టుకోసం పైరవీలో ఉన్నారని సమాచారం. తాజాగా ప్రభుత్వం వారి సర్వీసు క్రమబద్ధీకరణలో పనితీరును కొలబద్ధగా తీసుకోవటంతో అవినీతి సిబ్బందిలో ఆందోళన మొదలైంది. క్రమబద్ధీకరణ జాబితాలో తమ పేరుండేలా రాజకీయ పార్టీ నేతలతో ఒత్తిళ్లు ప్రారంభించారని తెలుస్తోంది. తెలంగాణేతరులపై ఆరా... పర్యాటకశాఖలో పనిచేస్తున్న తెలంగాణేతరుల పనితీరుపై కూడా ప్రభుత్వం ఆరా తీస్తోంది. కొద్ది రోజుల క్రితం జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో ఆ శాఖ మంత్రి చందూలాల్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. పర్యాటక శాఖ, పర్యాటకాభివృద్ధి సంస్థలో పనిచేస్తున్న తెలంగాణేతరుల పనితీరుపై నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించారు. తెలంగాణేతరుల సంఖ్య అధికంగా ఉన్నందున వారి పనితీరును సమీక్షించి.. కొనసాగించాలా వద్దా అన్న విషయంలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. -
'హైదరాబాద్‌లో హెలీ టూరిజం'
హైదరాబాద్‌లో త్వరలో హెలీ టూరిజాన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పర్యాటక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందులాల్ తెలిపారు. దీని ద్వారా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలను హెలికాప్టర్ నుండి వీక్షించే అవకాశం కలుగనుందన్నారు. పర్యాటకుల కోసం హాట్ ఎయిర్ బెలూన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్రంలోని నల్లమల, వరంగల్ అటవీ ప్రాంతాల్లో ట్రైబల్ టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నారు. -
మంత్రి చందూలాల్‌ను అడ్డుకున్న ఆశ వర్కర్లు
కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే జీతాలివ్వాలని డిమాండ్ ములుగు : వరంగల్ జిల్లా ములుగు డివిజన్ కేంద్రంలో గురువారం ఆశ కార్యకర్తలు రాష్ట్ర మంత్రి చందూలాల్‌ను అడ్డుకున్నారు. 85 రోజులుగా సమ్మె చేస్తున్నా సమస్యల పరిష్కారంపై స్పందించడం లేదని మంత్రి ఎదుట నిరసన తెలిపారు. హైదరాబాద్ నుంచి వచ్చిన మంత్రి గురువారం ములుగులో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం తన స్వగ్రామమైన జగ్గన్నపేట గ్రామపంచాయతీ పరిధిలోని సారంగపల్లికి బయలుదేరారు. అప్పటికే డివిజన్లోని 13 మండలాల ఆశ కార్యకర్తలు ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్నారు. మంత్రి వచ్చిన విషయం తెలుసుకున్న వారు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఆశ కార్యకర్తలకు జీతాలివ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయూన్ని గమనించిన పోలీసులు.. సీఐటీయూ, ఆశ కార్యకర్తలను అడ్డుకునేందుకు యత్నించగా తోపులాట జరిగింది. అనంతరం స్పందించిన మంత్రి చందూలాల్ మాట్లాడుతూ ఆశ కార్యకర్తల సమస్య కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్ దృష్టికి సమస్యను తీసుకెళ్తానని అన్నారు. ఆశ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి తనవంతు సహకరిస్తానని తెలిపారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలే తప్ప ప్రభుత్వంపై బురద జల్లడానికి ప్రయత్నిస్తున్న వారి మాటలు విని ఆగం కావద్దని సూచించారు. ఈ నిరసన కార్యక్రమంలో సీఐటీయూ డివిజన్ కార్యదర్శి రత్నం రాజేందర్, సీపీఎం డివిజన్ కార్యదర్శి అమ్జద్‌పాషా, ఆశ కార్యకర్తలు పాల్కొన్నారు. -
ఆర్అండ్బీ ఎస్ఈ ఆఫీసులో ఏసీబీ సోదాలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఆదాయం కంటే ఎక్కువ మొత్తంలో ఆస్తులు ఉన్నాయని మహబూబ్‌నగర్ ఆర్అండ్బీ ఎస్ఈ బి.చందూలాల్‌పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు మంగళవారం స్థానిక ఆర్అండ్బీ ఎస్ఈ క్యాంపు కార్యాలయంలో దాడులు కొనసాగించారు. ఖమ్మం జిల్లాలో ఇచ్చిన ఫిర్యాదుమేరకు వారు రంగంలోకి దిగారు. ఎస్ఈ బి.చందులాల్ ఖమ్మం జిల్లా కొత్తగూడెం వాసి. ఆయనపై ఆరోపణలు వచ్చిన క్రమంలో విచారణలో భాగంగా వరంగల్ రేంజ్ నుంచి వచ్చిన ఏసీబీ బృందంలో సీఐ శ్రీనివాసరాజు, మరో ఏడుగురు సిబ్బంది, స్థానిక ఏసీబీ సీఐ రమేష్‌రెడ్డితోపాటు మరో నలుగురు సిబ్బంది ఐదుగంటల పాటు సోదాలు నిర్వహించారు. కార్యాలయంలో సోదాలు చేసి కొన్ని విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఈ చందులాల్ ఎక్కడ పనిచేశారు.. ఏ జిల్లాలో ఎన్ని ఆస్తులు ఉన్నాయనే విషయాన్ని ఆరా తీశారు. మహబూబ్‌నగర్ జిల్లాకు ఆర్అండ్బీ ఎస్ఈగా వచ్చి కేవలం నెలరోజులు మాత్రమే కావడంతో జిల్లాలో ఎలాంటి ఆస్తులు లేవని గుర్తించినట్లు ఏసీబీ సీఐ శ్రీనివాసరాజు మీడియాకు వెల్లడించారు. ఏకకాలంలో వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్, మహబూబ్‌నగర్‌లో దాడులు కొనసాగించినట్లు వివరించారు. ఈ సోదాలో కొన్ని కోట్ల విలువైన పత్రాలతో పాటు పలు ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రాథమిక విచారణ కోసం హైదరాబాద్‌కు ఎస్ఈ బి.చందూలాల్‌ను ఏసీబీ అధికారులు తీసుకువెళ్లారు.అలాగే, చందూలాల్ స్వగ్రామమైన ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం చుంచుపల్లిలోని ఇంటితోపాటు సీతంపేటలోని బంధువుల ఇళ్లపై ఏక కాలంలో ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు చేశారు. కొత్తగూడెంలో చందులాల్‌కు చెందిన మూడంతస్తుల భవనం, ఏడున్నర ఎకరాల వ్యవసాయ భూమితోపాటు పలు దస్త్రాలు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సాయిబాబు మాట్లాడుతూ వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, హైదరాబాద్‌లలో రూ.12 నుంచి రూ.13 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు పేర్కొన్నారు. కరీంనగర్లోనూ తనిఖీలు.. కరీంనగర్ క్రైం : ఎస్ఈ చందులాల్ ఆక్రమాస్తులపై ఏసీబీ తనిఖీల్లో భాగంగా కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లి రోడ్ నంబర్ 2లోని కైలాస్ రెసిడెన్సీలో ఉన్న 305, 306 ఫ్లాట్లలో కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో బృందం తనిఖీలు చేపట్టింది. గతంలో జిల్లాలో సుదీర్ఘకాలం పని చేసిన చందులాల్ భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టాడనే ఆరోపణలున్నాయి. కరీంనగర్‌లోని అతని బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. అర కేజీ బంగారం, ఒక కేజీ వెండి, రూ.3.80 లక్షల నగదు, వరంగల్ జిల్లాలో 6 ఓపెన్ ప్లాట్లు, రెండు జీప్లస్ 2 ఇళ్లు, హన్మకొండలో ఒక ఇళ్లు, హైదరాబాద్‌లో ఒక అపార్ట్‌మెంట్‌కు సంబంధించిన పత్రాలు, ఒక డస్టర్, ఒక క్రేటా కార్ కరీంనగర్లో గుర్తించారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.5 కోట్ల వరకు ఉంటుం దని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. -
2,544 టీచర్ పోస్టుల భర్తీ
* గిరిజన విద్యాసంస్థల్లో ఖాళీలపై ప్రభుత్వం నిర్ణయం * మంత్రి చందూలాల్ వెల్లడి * విద్యా సంస్థల్లో వసతులకు రూ.200 కోట్లు కేటాయింపు * రూ.40 కోట్లతో స్కాలర్షిప్లు సాక్షి, హైదరాబాద్: గిరిజన విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న 2,544 ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు గిరిజనసంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. ఈ విద్యాసంస్థల్లో విద్యా ప్రమాణాలు, సౌకర్యాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో రూ.200 కోట్లు వెచ్చించి బయోమెట్రిక్ పరికరాలు, సీసీ కెమెరాల ఏర్పాటు, విద్యార్థులకు మౌలిక వసతులు, క్రీడాపరికరాలు అందించనున్నట్లు మంత్రి తెలిపారు. సోమవారం సంక్షేమ భవన్లో గిరిజన విద్యాసంస్థల్లో నూతన విద్యావిధానంపై ఆయన రాష్ర్టస్థాయి ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల్లో డ్రాపవుట్స్ లేకుండా చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలకోసం రూ.7.45 కోట్లు విడుదల చేస్తున్నామన్నారు. 5-8 తరగతుల మధ్య చదువుతున్న విద్యార్థుల శాతాన్ని పెంచేందుకు రూ.40 కోట్ల మేర స్కాలర్‌షిప్‌ల రూపంలో అందించాలని నిర్ణయించామన్నారు. ఈ విద్యాసంస్థల్లోని విద్యార్థులకు స్వచ్ఛమైన నీటిని సరఫరా చేసేందుకు మంచినీటి శుద్ధి యంత్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సున్నా ఫలితాలు వచ్చే పాఠశాలల టీచర్లపై చర్యలు... కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా గిరిజన విద్యాసంస్థల్లో సౌకర్యాలను కల్పిస్తున్నామని, అందుకు అనుగుణంగా అత్యుత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. బోధనలో మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులకూ పునశ్చరణ తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో సున్నాశాతం ఫలితాలు వచ్చే పాఠశాలల ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలోని ఫలితాలను దృష్టిలో పెట్టుకుని గణితం, సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి చందూలాల్ వెల్లడించారు. ఈ సమావేశంలో ఎస్టీ సంక్షేమశాఖ కమిషనర్ మహేశ్‌దత్ ఎక్కా, ఐటీడీఏ పీఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. నూతన విద్యావిధానంపై నిపుణుల సూచనలు కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ ప్రతిపాదిస్తున్న నూతన విద్యావిధానంపై పాఠశాల విద్యకు సంబంధించిన 13 అంశాలు, ఉన్నతవిద్యకు సంబంధించిన 20 అంశాలపై సోమవారం సంక్షేమ భవన్లో వర్క్‌షాపును నిర్వహించారు. ఆయా విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, సెస్ డెరైక్టర్, సర్వశిక్ష అభియాన్ అధికారులు, మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, గిరిజనసంఘాల నాయకులు ఇందులో పాల్గొని పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సంద ర్భంగా మంత్రి చందూలాల్ మాట్లాడుతూ ప్రతి గిరిజన విద్యార్థి సమగ్రాభివృద్ధికి ఉపయోగపడేలా సూచనలు చేయాలని నిపుణులను కోరారు. ఈ వర్క్‌షాపులో నిపుణులు ఇచ్చే సూచనలు,సలహాలను కేంద్రప్రభుత్వపరిశీలనకు పంపిస్తామని గిరిజనసంక్షేమశాఖ కమిషనర్ మహేశ్‌దత్ ఎక్కా తెలిపారు. -
‘కల్యాణ లక్ష్మి’లో
స్వల్ప మార్పులు మంత్రి అజ్మీరా చందూలాల్ ములుగు: నిరుపేద యువతుల పెళ్లికి ఉద్దేశించిన కల్యాణలక్ష్మి పథకంలో స్వల్పమార్పులు చేసినట్లు గిరిజన సంక్షేమ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లారు. చదువుకోని యువతల పుట్టిన తేదీ, వయసు నిర్ధారిత సర్టిఫికెట్లు పొందడంలో ఉన్న ఇబ్బందులను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి స్వల్ప మార్పులు చేసినట్లు వివరించారు చదువుకోని యువతులకు వారి తల్లిదండ్రులు ఇచ్చే అఫిడవిట్లే ప్రామాణికంగా నిర్ణయించి నట్లు పేర్కొన్నారు. సదరు అఫిడవిట్లను సం బంధిత ఏటీడట్ల్యూవోలు ధ్రువీకరించాల్సి ఉంటుందన్నారు. త్వరలో ఈ మేరకు నూతన మార్పుల ప్రకారం పథకం అమలు చేస్తామన్నారు. పథకం అమలులో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే నేరుగా తనను సంప్రదించవచ్చుని సూచించారు. అధికారులు నిర్లక్ష్యం వహించకుండా, వివాహానికి మూడు రోజుల ముందు కల్యాణ లక్ష్మి పథకం డబ్బులు లబ్ధిదారుకు అందేలా చూడాలని ఆదేశించారు. -
మంత్రిగారూ.. మాటియ్యరూ...
కనీస వసతులు కరువు కాలగర్భంలో పంచకూటాలయం మోక్షం లేని మల్లూరు రోడ్డు మంత్రి చొరవ చూపాలని కోరుతున్న ప్రజలు పర్యాటక కేంద్రాలు అనగానే జిల్లాలో మొదటగా గుర్తుకొచ్చేవి ములుగు పరిధిలోని లక్నవరం సరస్సు, రామప్ప, మల్లూరు ఆలయాలు. ఏళ్ల తరబడి ఇవి నిరాద రణకు గురవుతున్నాయి. ఈ ప్రాంతం నుంచే మంత్రిగా ఎదిగిన చందూలాల్ నేడు జిల్లాకు రానున్నారు. ఈ నేపథ్యం లో పర్యాటక ప్రాంతాల దుస్థితిపై కథనం.. ములుగు : నియోజకవర్గంలోని పర్యాటక ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. దీంతో సందర్శకులు, విదేశాల నుంచి వచ్చే యాత్రికులు ఇబ్బంది పడుతున్నారు. సుమారు 12వ శతాబ్దంలో నిర్మించిన రామప్ప ఆలయం, చెరువు ప్రసిద్ధి గాంచాయి. ప్రతీ ఏడాది లక్షలాది మంది పర్యాటకులు రామప్ప కు వస్తుంటారు. దేశవిదేశాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. అయితే ఇక్కడ పర్యాటకులు, భక్తులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. కనీ సం మంచినీరు, మరుగుదొడ్లు ఏర్పా టు చేయకపోవడం బాధాకరం. ఆల యం నుంచి చెరువు ప్రాంతానికి సింగి ల్ రోడ్డు మాత్రమే ఉంది. అది కూడా శిథిలావస్థకు చేరింది. ఆలయానికి వెళ్లే దారిని నాలుగు లేన్లుగా మార్చి, చెరువు కట్టపై, ఆలయం లో పర్యాటకుల కోసం కనీస వసతులు కల్పిస్తే బాగుంటుంది. వెంకటాపురం మండలం రామాం జపూర్ శివారులోని పంచకూటాలయం పిచ్చిమొక్కల మధ్య దర్శనమిస్తోంది. 2012 కాకతీయ శతాబ్ది ఉత్సవాల ముందు సందడి చేసిన ప్రభుత్వం ఆలయ పునర్నిర్మాణాన్ని పట్టించుకోలేదు. పునర్నిర్మాణం కోసం శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని తొలగించారు. లక్నవరం బుస్సాపూర్ సమీపంలో ఉన్న లక్నవరం చెరువు ప్రత్యేకతను చాటుకుంటోం ది. ఓ వైపు దట్టమైన అడవి, మరో వైపు లోయ వీటి మధ్య ప్రయాణం కాస్త ఇబ్బంది పెడుతుంది. రామప్ప తరహాలో ఇక్కడ కూడా మహిళలు, చిన్నారులకు కనీస వసతు లు కరువయ్యాయి. చెరువులో ఉన్న ఏడు ఐలాండ్లను ఒక్కో విధంగా తీర్చిదిద్దితే పర్యాటకులు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఉయ్యాల వంతెన, కాటేజీలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. కాకరకాయల దీవికి మరో వంతెన నిర్మించాలని ప్రతిపాదనలు ఉన్నా.. మోక్షం లభించలేదు. రోడ్డు సౌకర్యం లేని మల్లూరు మంగపేట మండలం మల్లూరు మహా క్షేత్రం ఆధ్యాత్మికంగా.. పర్యాటకంగా పేరు గాంచింది. ఆలయానికి భక్తులు, పర్యాటకులు ప్రతి శని, ఆది, గురువారాల్లో పెద్ద సంఖ్యలో వస్తుంటారు. హేమాచల నర్సింహస్వామి మహిమ గల వాడని ప్రజల నమ్మకం. గుట్టపై ఉన్న ఆలయానికి వెళ్లాలంటే సుమారు 5 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. క్షేత్రానికి వెళ్లడానికి కనీసం రోడ్డు లేకపోవడం నాయకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. భక్తులు విడిది చేసేందుకు కాటేజీలు నిర్మించాల్సి ఉంది. ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి నిత్యం వందలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఏటా సుమారు రూ.40లక్షలకుపైగా ఆదాయం సమకూరుతుంది. ఇక్కడ రోడ్డు, మంచి నీరు, మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉంది. ప్రచారం లేని హరిత వనాలు రామప్ప, లక్నవరం, ములుగు మండలం ఇంచర్ల పరిధిలో ఎకో టురిజం అధికారులు పచ్చటి వనాల మధ్య హరిత హోటళ్లను నిర్మించారు. కానీ వీటిపై ప్రచారం చేయడంలో విఫలమయ్యారు. కేవలం డబ్బున్న వారికే హరిత హోటళ్లు పరిమితమవుతున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు. కాగా, నియోజకవర్గంపై పూర్తి పట్టున్న మంత్రి చందూలాల్ పర్యాటక అభివృద్ధిపై దృష్టి సారిస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు. నేడు మంత్రి చందూలాల్ రాక హన్మకొండ/ములుగు : రాష్ట్ర గిరిజన సంక్షేమ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీర చందూలాల్ మంగళవారం జిల్లా పర్యటనకు వస్తున్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా వస్తున్న చందూలాల్‌కు 11.15 గ ంటలకు మడికొండలో టీఆర్ఎస్ శ్రేణులు భారీ స్వాగతం పలకనున్నాయి. 11.30కు అమరవీరుల స్థూపం వద్ద ఆయన నివాళులర్పిస్తా రు. 11.40 కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి, మధ్యాహ్నం 12 గంటలకు ములుగుకు బయలుదేరుతారు. 12.45కు మహ్మద్‌గౌస్‌పల్లికి చేరుకుం టారు. బైక్ ర్యాలీతో మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రేమ్‌నగర్ గట్టమ్మ ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. 1.20కు డీఎల్ఆర్ గార్డెన్స్‌లో జరిగే సభకు హాజరవుతారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు. కార్యక్రమంలో భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు తెలిపారు. -
చాంబర్ కోసం మంత్రుల మధ్య పేచీ..!
ఒకే చాంబర్ కోసం పట్టుబడుతున్న ఇద్దరు కార్యాలయం చూస్తామని తాళంచెవి తీసుకున్న మంత్రి బంధువులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని ‘డీ’ బ్లాక్‌లోని ఒక చాంబర్ కోసం ఇద్దరు మంత్రులు పోటీపడుతున్నారు. ఈ వ్యవహారం అధికారులకు తలనొప్పి కలిగిస్తోంది. చాంబర్ల కేటాయింపు అధికారం ముఖ్యమంత్రిదే అయినా, ఒక మంత్రి అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. చాంబర్ చూడడం కోసం తాళాలు తీసుకున్న మంత్రి సంబంధీకులు ఆ తాళాలు ఇవ్వడానికి ససేమిరా అన్నారు. దీంతో కార్యాలయం అధికారికంగా కేటాయించకుండా అందులో కూర్చోవడానికి వీల్లేదని, అలా చేయడం సరికాదని ఆ అధికారి స్పష్టం చేయడంతో సదరుమంత్రి సంబంధీకులు ఆ తాళం చెవులు తిరిగి ఇచ్చినా..అర్ధరాత్రి సమయంలో ఫోన్‌చేసి నానా గొడవ చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణ మంత్రులకు సచివాలయంలోని‘డీ’ బ్లాక్‌లో చాంబర్లను కేటాయిస్తున్నారు. ఈనెల 16 న జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆరుగురు మంత్రులుగా పదవీస్వీకార ప్రమాణం చేసిన సంగతి విదితమే. అయితే ఇందులో ఇద్దరు మంత్రులు ‘డీ’ బ్లాక్‌లోని రెండో అంతస్తులోని రూమ్ నంబర్ 260ని తమకు కేటాయించాలంటూ పట్టుబడుతున్నారు. గిరిజన సంక్షేమం, పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అదే చాంబర్‌ను కోరుతున్నట్టు తెలిసింది. కాగా, ఈ చాంబర్‌ను పరిశీలిస్తామంటూ గిరిజన సంక్షేమశాఖ మంత్రి బంధువులు తాళం చెవులు తీసుకుని వెళ్లారు. ఆ చాంబర్‌ను తమకే కేటాయించాలంటూ పట్టుబట్టడంతో సదరు అధికారి.. చాంబర్ల కేటాయింపు తమ పరిధిలో లేదని, ముఖ్యమంత్రే ఆమోద ముద్రవేయాల్సి ఉంటుందని, ముఖ్యమంత్రితో మాట్లాడి మీకు కావాల్సిన చాంబర్ తీసుకోవచ్చని సూచించినప్పటికీ వినకుండా సదరు మంత్రి కుమారుడు శుక్రవారం రాత్రి ఫోన్లోనే తిట్లదండకం అందుకున్నట్టు తెలిసింది. ‘నీవు తుమ్మలకు తొత్తుగా వ్యవహరిస్తున్నావు.. ఏమనుకున్నావో సస్పెండ్ చేయిస్తా...మీ కార్యాలయం ముందు ధర్నా చేస్తాం’ అంటూ హెచ్చరించినట్టు తెలిసింది. కుమారునితోపాటు మంత్రి కూడా ఆ అధికారిపై మండిపడ్డట్టు తెలిసింది. ఈ విషయాన్ని సంబంధిత అధికారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినట్టు తెలిసింది. చాంబర్ కోరింది వాస్తవం: చందూలాల్ సచివాలయం ‘డీ’ బ్లాక్‌లోని చాంబర్ నంబర్ 260ను కోరిన మాట వాస్తవమేనని గిరిజన, పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ చెప్పారు. అనువుగా ఉంటుందని ఆ చాంబర్ కోరానని, తనతోపాటు మరో ముగ్గురు మంత్రులు కూడా అదే చాంబర్ కోరినట్టు ఆయన తెలిపారు. అయితే దీనిపై ఎలాంటి వివాదం చేయలేదని ఆయన పేర్కొన్నారు. -
విద్యా, వైద్య పరంగా గిరిజనులను పరిపుష్టం చేస్తా
‘సాక్షి’తో గిరిజన సంక్షేమశాఖ మంత్రి చందూలాల్ సాక్షి, హైదరాబాద్: ఏజెన్సీ, ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులకు వాటర్‌గ్రిడ్, ఇతర కార్యక్రమాల ద్వారా స్వచ్ఛమైన మంచి నీటిని అందించడం తమ ప్రథమ ప్రాధాన్యమని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. ప్రస్తుతం చెరువులు, కుంటలు, వాగుల నుంచి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితులను సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో మార్పు చేసేందుకు కృషి చేస్తామన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా గిరిపుత్రులను విద్యాపరంగా పరిపుష్టం చేయడంతో పాటు వారి ఆరోగ్యాల పరిరక్షణకు కచ్చితమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేబినెట్ విస్తరణలో భాగంగా గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా నియమితుడైన ఆయన బుధవారం ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. రోడ్లు, విద్యుత్ సరఫరా, స్కూళ్ల ఏర్పాటు, కమ్యూనికేషన్ల వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావడం వంటి చర్యలను చేపడతామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో, అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు, చేసిన వాగ్దానాలను పూర్తిస్థాయిలో అమలుచేస్తామని మంత్రి చెప్పారు. తండాల అభివృద్ధి, వాటిని గ్రామపంచాయతీలుగా మార్చడం, గిరిజనులకు మూడెకరాల భూమి పంపిణీ, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు వంటి వాటిని ప్రణాళికాబద్ధంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సమైక్యరాష్ట్రంలో గిరిజనుల బడ్జెట్, ఉప ప్రణాళిక నిధులను ఏ మాత్రం సంబంధంలేని అంశాలకు ఖర్చు చేసిన పరిస్థితి ఉందన్నారు. ప్రస్తుతం సబ్‌ప్లాన్ నిధులను పకడ్బందీగా ఖర్చు చేసేందుకు, ఆయా పథకాలు,కార్యక్రమాలను కచ్చితంగా అమలు చేసేందుకు అవకాశం ఉందని మంత్రి చందూలాల్ తెలిపారు. -
మినిస్టర్ చందూలాల్
25 ఏళ్ల తర్వాత మంత్రి పదవి కలిసొచ్చిన సామాజికవర్గం టీఆర్ఎస్లో కొత్త సమీకరణలు నామినేటెడ్ పోస్టులపై అందరి దృష్టి వరంగల్ : ములుగు ఎమ్మెల్యే అజ్మీరా చందూలాల్ గిరిజన సంక్షేమశాఖ మంత్రి అయ్యారు. పర్యాటక, సాంస్కృతిక శాఖలు ఆయనకే దక్కాయి. మంగళవారం ఉదయం రాష్ట్ర మంత్రిగా ఆయన ప్రమాణస్వీకారం చేశారు. చందూలాల్‌కు మంత్రి పదవి రావడం ఇది రెండోసారి. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1989లో ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా పని చేశారు. 25 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అదే శాఖ దక్కింది. మంత్రుల సంఖ్యపై పరిమితి నేపథ్యంలో మరో రెండు శాఖలను కేసీఆర్ చందూలాల్‌కే కేటారుుంచారు. వివాదరహితుడిగా పేరుంది. టీఆర్ఎస్ తరఫున గెలిచిన గిరిజన సామాజికవర్గం ఎమ్మెల్యేలలో ఆయనే సీనియర్. కీలకమైన శాఖలకు మంత్రిగా నియమితుడైన చందూలాల్‌పై జిల్లా ప్రజలు ఎంతో ఆశతో ఉన్నారు. తెలంగాణలో గిరిజన జనాభా అధికంగా ఉన్న జిల్లా కావడంతో ఈ వర్గం వారు భారీగా ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో ప్రాచీన కట్టడాలు ఎన్నో ఉన్నాయి. పర్యాటక, సాంస్కృతిక శాఖలు చందూలాల్‌కే దక్కడంతో జిల్లాకు ప్రాచీన వైభవం వస్తుందని జిల్లా ప్రజలు భావిస్తున్నారు. వరంగల్‌కు ప్రాధాన్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తొలి ప్రభుత్వంలో వరంగల్ జిల్లాకు రాజకీయంగా మంచి ప్రాధాన్యత దక్కింది. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్యకు రాష్ట్రంలో కీలకమైన ఉపముఖ్యమంత్రి పదవి దక్కింది. భూపాలపల్లి ఎమ్మెల్యే ఎస్.మధుసూదనాచారిని స్పీకర్ పదవి వరించింది. జిల్లాకు చెందిన ఇద్దరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులకు నామినేటెడ్ పదవులు వచ్చాయి. బి.రామచంద్రుడుకు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి పదవి, బి.వి.పాపారావుకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవులు దక్కాయి. తాజాగా చందూలాల్‌కు మంత్రి పదవి దక్కింది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌కు సహాయ మంత్రి హోదా కలిగిన పార్లమెంటరీ కార్యదర్శి పదవి వచ్చింది. వినయ్‌కు ఏ శాఖ బాధ్యతలు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్ పదవుల్లోనూ జిల్లాకు ప్రాధాన్యత దక్కుతుందని టీఆర్ఎస్ శ్రేణులు ఆశాభావంతో ఉన్నాయి. ఈ నెలాఖరులోనే జిల్లాలోని మరో ఇద్దరు, ముగ్గురు నేతలకు నామినేటెడ్ పదవులు దక్కనున్నట్లు గులాబీ వర్గాలు చెబుతున్నాయి. -
కొత్త మంత్రులొచ్చారు
* మంత్రివర్గంలో చేరిన తుమ్మల, తలసాని, జూపల్లి, లక్ష్మారెడ్డి, చందూలాల్, ఇంద్రకరణ్‌రెడ్డి * రాజ్‌భవన్‌లో గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం * సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు, ఉన్నతాధికారుల హాజరు * కొత్త వారికి శాఖలు కేటాయించిన ముఖ్యమంత్రి * తుమ్మలకు రోడ్లు, భవనాలు, తలసానికి వాణిజ్య పన్నులు * ఇంద్రకరణ్‌రెడ్డికి గృహ నిర్మాణం, లక్ష్మారెడ్డికి విద్యుత్ * జూపల్లికి పరిశ్రమలు, చందూలాల్‌కు గిరిజన సంక్షేమం * ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకాని అసంతృప్తులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలోకి సీఎం కె. చంద్రశేఖర్‌రావు కొత్తగా ఆరుగురిని తీసుకున్నారు. తుమ్మల నాగేశ్వర్రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, ఆజ్మీరా చందూలాల్, సి. లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావుకు కేబినెట్లో చోటు కల్పించారు. రాజ్‌భవన్‌లో మంగళవారం ఉదయం 11 గంటలకు నిరాడంబరంగా జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వీరితో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మంత్రులుగా ప్రమాణం చేయించారు. కేసీఆర్‌తో పాటు రాష్ర్ట మంత్రులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత గవర్నర్, సీఎంతో కలిసి మంత్రులంతా గ్రూప్ ఫొటో దిగారు. అనంతరం గవర్నర్ తేనీటి విందు ఇచ్చారు. మంత్రులతో పాటు శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు తదితరులు ఇందులో పాల్గొన్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. దుబాయ్ పర్యటన ముగించుకుని మంగళవారమే హైదరాబాద్ చేరుకున్న మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. కాగా, టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన హైదరాబాద్ నేత తలసాని శ్రీనివాస్‌యాదవ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. సాంకేతికంగా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకే ఈ పని చేశారు. ఉప ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ తరఫున మళ్లీ పోటీ చేయనున్నారు. ఇక మంత్రివర్గ విస్తరణ కార్యక్రమానికి పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. మంత్రి పదవులను ఆశించి భంగపడిన చాలామంది ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనలేదు. చీఫ్ విప్ పదవితోనే సరిపెట్టుకున్న కొప్పుల ఈశ్వర్‌తోపాటు ఎమ్మెల్యేలు కొండా సురేఖ, ఏనుగు రవీందర్ రెడ్డి, గంప గోవర్ధన్, జలగం వెంకట్రావు, వి.శ్రీనివాస్‌గౌడ్ తదితరులు ఈ కార్యక్రమానికి దూరంగానే ఉన్నారు. సాయంత్రానికి శాఖల కేటాయింపు కొత్త మంత్రులకు సాయంత్రానికల్లా శాఖలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీని విడిచి అధికారపార్టీలో చేరిన ఖమ్మం జిల్లా నేత తుమ్మల నాగేశ్వరరావుకు రోడ్లు భవనాల శాఖ, తలసానికి వాణిజ్య పన్నుల శాఖ దక్కింది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులకు కూడా కీలక శాఖలను సీఎం కేటాయించారు. జూపల్లి కృష్ణారావుకు పరిశ్రమలు, లక్ష్మారెడ్డికి విద్యుత్ శాఖను అప్పగించారు. ఆదిలాబాద్ జిల్లాలో బీఎస్పీ తరఫున గెలిచి, తర్వాత టీఆర్ఎస్లో చేరిన ఇంద్రకరణ్ రెడ్డికి గృహనిర్మాణం, వరంగల్ జిల్లాకు చెందిన అజ్మీరా చందూలాల్‌కు గిరిజనసంక్షేమ శాఖను కేటాయించారు. కొత్త మంత్రులకు కేటాయించిన శాఖలన్నీ ఇప్పటిదాకా ముఖ్యమంత్రి వద్ద ఉన్నవే . కాగా, ఎకై్సజ్ మంత్రి టి.పద్మారావుకు అదనంగా క్రీడలు, యువజన సర్వీసులను, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్నకు అదనంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ బాధ్యతలను కూడా కట్టబెట్టారు. కొత్తగా చేరిన ఆరుగురు మంత్రులతో రాష్ర్ట కేబినెట్ పరిమాణం సీఎం సహా 18కి చేరింది. కొత్త మంత్రుల శాఖలు తుమ్మల నాగేశ్వర్రావు: రోడ్లు, భవనాలు, మహిళా, శిశుసంక్షేమం అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి: గృహ నిర్మాణం, న్యాయ, దేవాదాయ తలసాని శ్రీనివాస్‌యాదవ్: వాణిజ్య పన్నులు, సినిమాటోగ్రఫీ సి.లక్ష్మారెడ్డి: విద్యుత్ శాఖ జూపల్లి కృష్ణారావు: పరిశ్రమలు అజ్మీరా చందూలాల్: గిరిజన సంక్షేమం -
కేసీఆర్‌తో దోస్తానా ఉంది...చందూలాల్
-
కేసీఆర్‌తో దోస్తానా ఉంది...చందూలాల్
హైదరాబాద్ : తెలంగాణ గిరజనుల స్థితిగతులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంచి అవగాహన ఉందని మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న ఎమ్మెల్యే అజ్మీరా చందూలాల్ తెలిపారు. గిరిజనుడైన తనకు మంత్రి వర్గంలో చోటు కల్పించినందుకు కేసీఆర్‌కు ఈసందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బంగారు తెలంగాణ సాధన దిశలో తెలంగాణ తన వంతు కృషి చేస్తానన్నారు. గతంలో కేసీఆర్‌తో దోస్తానా ఉంది.. కలిసి పని చేసిన అనుభవం ఉందన్నారు. -
కరువు పొంచి ఉంది: టీఆర్ఎస్ జిల్లా నేతలు
సీఎంకు విన్నవించిన టీఆర్ఎస్ జిల్లా నేతలు వరంగల్ : వర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లాలో కరువు నెలకొనే ప్రమాదం పొంచి ఉన్నదని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జిల్లా టీఆర్ఎస్ నేతలు విన్నవించారు. సింగపూర్ పర్యటన ముగించుకొని వచ్చిన సీఎంను హైదరాబాద్‌లో సోమవారం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్ళపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, చందూలాల్, పార్టీ నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో నెలకొన్న పరిస్థితిని వివరించారు. జిల్లాలో కరెంట్ సమస్య తీవ్రంగా ఉందని, దీని వల్ల రైతాంగం ఇబ్బందులపాలవుతున్నారని వివరించారు. వర్షాలు లేక ఎండుతున్నాయని, తాగునీటి సమస్య ఏర్పడుతున్నదని తెలిపారు. ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు చేపట్టాలని వారు కోరారు.