సేవాలాల్ మహరాజ్ అందరికీ ఆరాధ్యనీయుడు | sevalal Maharaj Jayanti celebrations on February 15 | Sakshi
Sakshi News home page

సేవాలాల్ మహరాజ్ అందరికీ ఆరాధ్యనీయుడు

Published Thu, Jan 28 2016 8:32 PM | Last Updated on Sat, Jul 28 2018 6:24 PM

sevalal Maharaj Jayanti celebrations on February 15

గురు సేవాలాల్ మహరాజ్ తండా వాసులు, లంబాడా లకే కాకుండా ప్రజలందరికీ ఆరాధ్యనీయుడని గిరిజనసంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అన్నారు. లంబాడలకు జాతిపిత అయిన సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలకు సంబంధించి ఇంకా ప్రచారం, ప్రాధాన్యం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం తొలి ఏడాది నుంచే ఈ ఉత్సవాలను ఘనంగా జరుపుకునేందుకు జిల్లాకు రూ.పదిలక్షల చొప్పున విడుదల చేస్తోందన్నారు.


ఈ ఏడాది కూడా త్వరలోనే నిధుల విడుదల ఉంటుందన్నారు. ఫిబ్రవరి 15న సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకునిగురువారం మంత్రి చందూలాల్ నివాసంలో సంత్‌సేవాలాల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాల పోస్టర్, కరపత్రాలను ఆవిష్కరించారు.

కర్ణాటక, రాయలసీమ, తెలంగాణలలో విస్తృతంగా పర్యటించి,సుస్థిర సమాజం లేక చెట్టుకొకరు, పుట్టకొకరుగా సంచారజీవనం గడుపుతున్న లంబాడ లను ఏకతాటిపైకి తెచ్చిన మహనీయుడు సేవాలాల్ మహరాజ్ అని కొనియాడారు.
గ్రామ సమీప ప్రాంతాల్లో తండాలుగా నివాసమేర్పరచుకుని సుస్థిర జీవనం గడపాలని సేవాలాల్ గురూజీ ఉద్భోదించారన్నారు. తన సొంత ఖర్చుతో సేవాలాల్ ఆలయాన్ని నిర్మించి ఏటా జయంతి వేడుకలను నిర్వహిస్తున్న ఇస్లావత్ నామానాయక్‌ను మంత్రి అభినందించారు. ప్రభుత్వపరంగా అవసరమైన సహకారం ఉంటుందని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement