
సాక్షి, హైదరాబాద్: అబద్ధాలను ప్రచారం చేసేందుకే కాంగ్రెస్ పార్టీ బస్సుయాత్ర చేపట్టిందని రాష్ట్ర గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ విమర్శించారు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చినంత ప్రాధాన్యత ఇప్పటివరకూ ఏ ప్రభుత్వాలూ ఇవ్వలేదన్నారు. బుధవారం సచివాలయంలోని తన చాంబర్లో మంత్రి మీడియాతో మాట్లాడారు.
గిరిజనుల ఓట్లు దండుకునేందుకు కాంగ్రెస్ పార్టీ డ్రామాలా డుతోందన్నారు. సబ్‌ప్లాన్ నిధులు దారితప్పినట్లు ఆరోపణలు చేస్తే సరిపోదని, రుజువు చేయాలన్నారు. గత ప్రభుత్వాల అసమర్ధత వల్లే ఎస్టీల బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ కాలేదన్నారు. మైదాన ప్రాంతాల్లో ఐటీడీఏలు ఏర్పాటు చేస్తామనడం కాంగ్రెస్ నేతల అవగాహనా రాహిత్యమని, ఇప్పటికే మైదానప్రాంతాల అభివృద్ధికి గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు.