దేవాదుల జలాలతో లోకం చెరువు నింపాలి
ములుగు : నీరు లేక ఎండిపోయే దశకు చేరిన తమ పంటలను కాపాడాలని కోరుతూ మండలంలోని లోకం చెరువు ఆయకట్టు రైతులు మంగళవారం మంత్రి చందూలాల్‌తో కలిసి నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును హైదరాబాద్‌లో కలిశారు. లోకం చెరువులో నీళ్లు సరిపడా లేని కారణంగా 1500 ఎకరాల పంట చేతికందని పరిస్థితులు నెలకొన్నాయని హరీశ్‌రావుకు వివరించారు. దేవాదుల పైప్‌లైన్ ద్వారా లోకం చెరువుకు నీటిని అందించాలని కోరారు. ఇంచెం చెర్వుపల్లి వద్ద ఉన్న ఇన్‌టెక్ వెల్ నుంచి నీటిని మళ్లిస్తే రబీ సాగు అనుకూలంగా ఉంటుందని తెలిపారు. దీనిపై స్పందించిన హరీశ్‌రావు ఆ శాఖ ఎస్‌ఈతో ఫోన్‌లో మాట్లాడారు. సాధ్యాసాధ్యాలకు అనుగుణంగా లోకం చెరువుకు నీటిని మళ్లించే ప్రయత్నం చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు రైతులు తెలిపారు. సర్పంచ్ గుగ్గిళ్ల సాగర్, టీఆర్‌ఎస్ మండల అ««దl్యక్షుడు గట్టు మహేందర్, శ్రీనివాస్‌రెడ్డి, రైతులు అక్కల రవి, అజ్మీరా లక్ష్మణ్‌నాయక్, ఇమ్మడి బక్క ఓదెలు, గొర్రె అంకూస్, గంధం విజేందర్, కుమార్, సమ్మిరెడ్డి, ఇమ్మడి రాజయ్య, చంద్రగిరి కుమార్ ఉన్నారు.