
‘కల్యాణ లక్ష్మి’లో
- స్వల్ప మార్పులు మంత్రి అజ్మీరా చందూలాల్
ములుగు: నిరుపేద యువతుల పెళ్లికి ఉద్దేశించిన కల్యాణలక్ష్మి పథకంలో స్వల్పమార్పులు చేసినట్లు గిరిజన సంక్షేమ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లారు. చదువుకోని యువతల పుట్టిన తేదీ, వయసు నిర్ధారిత సర్టిఫికెట్లు పొందడంలో ఉన్న ఇబ్బందులను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి స్వల్ప మార్పులు చేసినట్లు వివరించారు
చదువుకోని యువతులకు వారి తల్లిదండ్రులు ఇచ్చే అఫిడవిట్లే ప్రామాణికంగా నిర్ణయించి నట్లు పేర్కొన్నారు. సదరు అఫిడవిట్లను సం బంధిత ఏటీడట్ల్యూవోలు ధ్రువీకరించాల్సి ఉంటుందన్నారు. త్వరలో ఈ మేరకు నూతన మార్పుల ప్రకారం పథకం అమలు చేస్తామన్నారు. పథకం అమలులో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే నేరుగా తనను సంప్రదించవచ్చుని సూచించారు. అధికారులు నిర్లక్ష్యం వహించకుండా, వివాహానికి మూడు రోజుల ముందు కల్యాణ లక్ష్మి పథకం డబ్బులు లబ్ధిదారుకు అందేలా చూడాలని ఆదేశించారు.