
చందూలాల్ కాన్వాయ్ అడ్డగింత
* జనగాంలో ఆందోళనకారుల్ని చెదరగొట్టిన పోలీసులు
* జిల్లా సాధన కోసం పోరు తీవ్రం
జనగామ: ఉద్యమాల ఖిల్లా అయిన జనగామ జిల్లా సాధన కోసం తలపెట్టిన ఉద్యమం రోజురోజుకూ తీవ్రమవుతోంది. జిల్లా సాధన సమితి, జేఏసీ ఆధ్వర్యంలో గురువారం హన్మకొండ-హైదరాబాద్ జాతీయ రహదారిని దిగ్బంధించారు. మంత్రి చందూలాల్ హైదరాబాద్ నుంచి వస్తున్నారనే సమాచారం మేరకు ఉద్యమకారులు హైవేపైకి రాకుండా పోలీ సులు నియంత్రించే ప్రయత్నం చేశారు. ఉద యం 11 గంటలకు మంత్రి కాన్వాయ్ జనగా మ చౌరస్తాకు చేరుకోగానే ఆందోళనకారులు అడ్డుకున్నారు. జనగామను జిల్లా చేయూలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యూదగిరిరెడ్డి ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.