ఖాతాలో రూ.142 మిగిల్చిన సైబర్ నేరగాళ్లు
సైబర్ క్రైంలో ఫిర్యాదు చేసిన బాధితుడు
జనగామ: ఇంటి నిర్మాణానికి మూడేళ్లుగా బ్యాంకులో పొదుపు చేసుకుంటున్న సొమ్మును సైబర్ మాయగాళ్లు ఏపీకే లింక్ పంపి దాన్ని డౌన్‌లోడ్ చేయగానే క్షణాల్లో నగదును మాయం చేశారు. ఫోన్ ఔట్ గోయింగ్ పని చేయడం లేదని.. అనుమానం వచ్చి బ్యాంకు వెళ్లి ఆరా తీయగా ఖాతాలో సొమ్ము లేదని చెప్పడంతో ఖంగుతిన్నాడు సదరు ఖాతాదారుడు. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ పట్టణం హౌజింగ్‌బోర్డు కాలనీకి చెందిన పోలోజు రామేశ్వర్ ఆర్టీసీ కండక్టర్‌గా పని చేస్తున్నాడు. సొంతింటి కళను సాకారం చేసుకునేందుకు మూడేళ్ల క్రితం పునాది వేశాడు. అప్పటి నుంచి ఇంటి నిర్మాణానికి సంపాదనలో కొంత సొమ్మును పొదుపు చేస్తూ స్థానిక యూనియన్ బ్యాంకులో రూ.11లక్షల వరకు జమ చేశాడు.
ఇంటి నిర్మాణ పనులకు అవసరమైనప్పుడు బ్యాంకు నుంచి కొంత నగదును డ్రా చేసుకుంటున్నాడు. కాగా ఈ నెల 8వ తేదీన వ్యక్తిగత పని నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లిన రామేశ్వర్.. తిరుగు ప్రయాణంలో తన ఫోన్‌కు యూనియన్ బ్యాంకుకు సంబంధించిన ఏపీకే యాప్ లింక్‌తో ఫేక్ మెసేజ్ వచ్చింది. బ్యాంకు ఖాతా సేఫ్టీ కోసం యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సైబర్ మోసగాడు పంపించిన యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నాడు.
సైబర్ నేరస్తుడు సదరు వ్యక్తికి ఎటువంటి అనుమానం కలుగకుండా తన ఫోన్ ఔట్ గోయింగ్ కాల్ వెళ్లకుండా చేశాడు. అదే రోజు రాత్రి రామేశ్వర్ యూనియన్ బ్యాంకు ఖాతా నుంచి రూ.7 లక్షలు, శుక్రవారం రూ.4.21 లక్షలు, మొత్తంగా 16 లావాదేవీల ద్వారా రూ.11.21 లక్షల నగదును డ్రా చేసుకుని, రూ.142 మాత్రమే మి గిల్చారు. ఫోన్ కలవడం లేదని అనుమానం వచ్చిన బాధితుడు రి పేరు సెంటర్‌కు వెళ్లి సరి చేయగా, డబ్బులు డ్రా అయినట్లు మెసేజ్ రా వడంతో అక్కడ నుంచి హుటాహుటిన బ్యాంకుకు వెళ్లారు.
బ్యాంకు అ ధికారులు ఖాతా నంబర్‌ను పరిశీలించిన తర్వాత పెద్ద మొత్తంలో డ బ్బులు డ్రా అయినట్లు తెలిపారు. ఇందులో రూ.9.21 లక్షల నగదు అ నుమానం కలుగకుండా డ్రా చేయగా, రూ.2లక్షలు మాత్రం చెన్నైలో ని సిద్దపుడూర్ సెంట్రల్ బ్యాంకు నుంచి రాహుల్ అనే వ్యక్తికి నెఫ్ట్ చేసిన ట్లు గుర్తించినట్లు బాధితుడు రామేశ్వర్ తెలిపారు. బాధితుడు పో లీ సులను ఆశ్రయించగా 1930కు ఫోన్ చేసి సైబర్ క్రైంలో ఫిర్యాదు చే యించారు. వెంటనే కేసును విచారించిన పోలీసులు, రూ.1.37 లక్షల ను హోల్డ్ చేసినట్లు మెసేజ్ వచ్చినట్లు రామేశ్వర్ తెలిపారు. పోలీసులు విచారణ చేసి న్యాయం చేయాలని బాధితుడు విజ్ఞప్తి చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment