సాక్షి, సంగారెడ్డి: పార్ట్ టైం జాబ్ పేరుతో వచ్చిన మెసేజ్ కు స్పందించి ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగులు సైబర్ వలలో చిక్కుకున్నారు. ఒకరు రూ.3 లక్షల 55 వేలు, మరొకరు రూ.7 లక్షల 48 వేలు మోసపోయిన సంఘటన అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు. అమీన్‌పూర్ పరిధిలోని బంధన్ కొమ్ము కృష్ణ బృందావన్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి పార్ట్‌టైం జాబ్ పేరుతో నవంబర్ 2న మెసేజ్‌కు వచ్చింది.
దీనికి స్పందించిన అతను తన వివరాలను నమోదు చేసి నగదు పెడుతూ అపరిచిత వ్యక్తి ఇచ్చిన టాస్క్‌లు పూర్తి చేశాడు. మొత్తం మూడు లక్షల 55 వేలు పెట్టాడు. తాను పెట్టిన నగదుతో పాటు కమిషన్ ఇవ్వాలని అడగడంతో అపరిచిత వ్యక్తి స్పందించలేదు. దీంతో బాధితుడు మోసపోయినట్లు గుర్తించి ముందుగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి సోమవారం అమీన్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఘటనలో..
అమీన్‌పూర్ పరిధిలోని బీరంగూడ జయలక్ష్మి నగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి పార్ట్‌టైం ఉద్యోగం పేరిట నవంబర్ 4వ తేదీన మెసేజ్ వచ్చింది. దానికి స్పందించి తన వివరాలను నమోదు చేశాడు. అపరిచిత వ్యక్తి చెప్పిన విధంగా ముందుగా రూ.2000 చెల్లించి, టాస్కులు చేస్తూ వచ్చాడు. అయితే అపరిచిత వ్యక్తి పెట్టిన నగదును, వచ్చిన కమిషన్లు క్రియేట్ చేసిన వాలెట్‌లో చూపిస్తూ వచ్చాడు.
చివరికి దీంతో తాను పెట్టిన రూ.ఏడు లక్షల 48 వేలతో పాటు కమిషన్ ఇవ్వాలని అడగడంతో అపరిచిత వ్యక్తి స్పందించలేదు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు.. ముందుగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి, అనంతరం సోమవారం అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి చదవండి: నొప్పిని భరించలేక.. యువకుడి తీవ్ర నిర్ణయం!
Comments
Please login to add a commentAdd a comment