విష్ణు వర్ధన్ (పైల్)
సాక్షి, సంగారెడ్డి: కలెక్టరేట్ ఉద్యోగి అనుమా నాస్పదంగా మృతిచెందాడు. ఎస్సై వినయ్ కథనం ప్రకారం.. మల్కాపూర్‌లో ఉన్న తెలంగాణ టౌన్ షిప్‌లో విష్ణు వర్ధన్ (45) నివాసం ఉంటున్నాడు. అడిషనల్ కలెక్టర్ మాధురి వద్ద సీసీగా అతను విధులు నిర్వర్తిస్తున్నాడు. మూడు నెలల క్రితం అతడి గుండెకు స్టంట్ వేయగా సెలవులో ఉన్నాడు. ఈనెల 28న మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఆదివారం ఉదయం మల్కాపూర్ శివారులో అనుమానాస్పదంగా పూర్తిగా కాలిపోయి శవమై కనిపించాడని వినయ్ వివరించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment