సాక్షి, సంగారెడ్డి: బాలికపై బాలుడు అత్యాచారం చేసిన ఘటన దూళ్మిట్ట మండల పరిధిలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లో వెళ్తే.. దూళ్మిట్ట మండల పరిధిలోని ఓ గ్రామంలో ఈ నెల 16న బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో గ్రామానికి చెందిన బాలుడు అత్యాచారం చేశాడు. కొద్ది రోజులుగా అనారోగ్యంగా ఉంటున్న బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లగా అత్యాచారం జరిగినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం పై పోలీసులను వివరణ కోరగా సదరు బాలుడిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment