cyber cases
-
చనిపోయిన వారిపై కేసు పెట్టి విచారణకు రమ్మని నోటీసు
-
కాంబోడియా సైబర్ కేసులో కీలక అరెస్టు
సాక్షి, హైదరాబాద్: కాంబోడియాలో అత్యధిక వేతనాలతో కొలువులు ఆశగాచూపి.. అక్కడకు వచి్చన యువకులను సైబర్ నేర ముఠాలకు అప్పగిస్తున్న ఓ కీలక వ్యక్తిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. ముంబైలోని చెంబూర్ ప్రాంతానికి చెందిన నిందితురాలు ప్రియాంక శివకుమార్ సిద్దును అరెస్టు చేసినట్టు టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయల్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వివరాలు.. అత్యధిక వేతనాలు వచ్చే ఉద్యోగాలు ఇప్పిస్తామని హైదరాబాద్‌కు చెందిన వంశీకృష్ణ, సాయి ప్రసాద్‌ల నుంచి ముంబైకి చెందిన ప్రియాంక ఒక్కొక్కరి నుంచి రూ.30 వేల చొప్పున కమీషన్ తీసుకుని కాంబోడియా పంపింది. అక్కడ చైనా సైబర్ ముఠాలు తమతో బలవంతంగా సైబర్ నేరాలు చేయించారని, మానసికంగా, శారీరకంగానూ హింసించినట్టు భారత్‌కు తిరిగి వచి్చన ఇద్దరు బాధితులు టీజీసీఎస్బీకి ఫిర్యాదు చేశారు. దీనిపై టీజీసీఎస్బీ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాంబోడియాకు అమాయకులను తరలించడంలో కీలకంగా వ్యవహరిస్తున్న 30 ఏళ్ల ప్రియాంకను అరెస్టు చేశారు. సైబర్ ముఠాల నుంచి కమీషన్.. ప్రియాంక తొలుత మాక్స్వెల్ అనే ఓవర్సీస్ జాబ్ ప్రాసెసింగ్ ఏజెన్సీలో కొన్నాళ్లు ఉద్యోగం చేసింది. తర్వాత ఆ ఏజెన్సీ మూతపడడంతో ఎలాంటి అనుమతులు లేకుండా తానే స్వయంగా ఓ ఏజెన్సీని ప్రారంభించింది. విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసాలకు తెరతీసింది. ముంబైలో ఇదే విధంగా ఏజెన్సీ నడుపుతున్న నారాయణ అనే వ్యక్తి ఇచి్చన సమాచారంతో ప్రియాంక కాంబోడియాకు వెళ్లి అక్కడ చైనా కంపెనీ ఝాన్జీ ఎండీ జితేందర్‌సింగ్‌ను కలిసింది. సైబర్ నేరాలు చేసేందుకు మనుషులను తనకు అప్పగిస్తే ఒక్కొక్కరికి 500 యూఎస్ డాలర్లు కమీషన్ ఇచ్చేలా వారితో ఒప్పందం చేసుకుంది. తొలుత ఇద్దరినికాంబోడియాకు పంపింది. అది విజయవంతం కావడంతో సోషల్ మీడియా, న్యూస్ పేపర్లలో కాంబోడియాలో ఉద్యోగావకాశాలు ఉన్నాయని పెద్దఎత్తున ప్రకటనలు ఇచి్చంది. అవి నమ్మిన అమాయకులను కాంబోడియా చైనా సైబర్ క్రైం ముఠాల వద్దకు ప్రియాంక పంపినట్టు టీజీసీఎస్బీ అధికారులు గుర్తించారు. ఇలా కాంబోడియాకు వెళ్లిన అమాయకులను అక్కడి చైనా సైబర్ క్రైం ముఠాలకు అప్పగిస్తున్నారు. సైబర్ నేరాలు చేసేలా బాధితులను సదరు ముఠాలు మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెడుతున్నాయి. ఈ ముఠా నుంచి అతికష్టం మీద తప్పించుకుని తిరిగి వచి్చన ఇద్దరు బాధితుల ఫిర్యాదుతో టీజీసీఎస్బీ దర్యాప్తు ముమ్మరం చేసింది. విదేశాల్లో ఉద్యోగాల పేరిట ఇచ్చే ప్రకటనలు నమ్మి మోసపోవద్దని టీజీ సీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయల్ సూచించారు. -
‘కామ్’గా నెట్టేసి.. కోట్లు కొట్టేసి
సాక్షి, హైదరాబాద్: ఒక వెబ్సైట్ అడ్రస్‌కు సంబంధించి చివరలో ఉండే .కామ్‌కు బదులు .నెట్ ఎంటర్ చేస్తే ఏమవుతుంది? ఆ సైట్ తెరుచుకోకపోవడమో లేదా మరో సైట్‌కు కనెక్ట్ కావడమో జరుగుతుంది. అయితే అకౌంట్ టేకోవర్ ఫ్రాడ్స్‌లో ఇలా జరిగితే మాత్రం భారీగా ఆర్థిక నష్టం వస్తుంది. నగరానికి చెందిన వ్యాపారవేత్తలు, సంస్థలు తరచూ ఈ నేరాల బారినపడుతున్నాయి.ఇలాంటి ఓ ఈ–మెయిల్‌ను నమ్మిన రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఇటీవల ఏకంగా రూ.11.4 కోట్లు సైబర్ నేరగాళ్ల ఖాతాకు బదిలీ చేసింది. అమెరికాకు చెందిన బ్యాంకు అప్రమత్తతతో ఈ మొత్తం సేఫ్‌గా ఉన్నా, రాజధాని కేంద్రంగా తరచూ ఈ అకౌంట్ టేకోవర్ ఫ్రాడ్స్ జరుగుతున్నట్టు చెబుతున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ కేవీఎం.ప్రసాద్ ఆన్లైన్ లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు.బాధితులుగా మారేది వ్యాపారులు, సంస్థలే..అకౌంట్ టేకోవర్‌గా పిలిచే ఈ సైబర్ నేరాల్లో ఒకప్పుడు బాధితులంతా ఉత్తరాదిలో ఉన్న వ్యాపారులే ఉండేవారు. ఆపై హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఈ తరహా నేరాలు జరుగుతున్నాయి. ఈ సైబర్ నేరం చేయడానికి తొలుత నైజీరియన్లు గ్రూపులుగా ఏర్పడి వ్యాపార/ఆర్థిక లావాదేవీలతో కూడిన ఈ–మెయిల్ ఐడీలను గుర్తించి హ్యాక్ చేస్తారు. అందులో ఉండే లావాదేవీలతోపాటు వారి భాషాశైలి, చెల్లింపులు/వసూళ్ల విధానాన్ని కొంతకాలం పాటు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ప్రధానంగా ఇంపోర్ట్–ఎక్స్పోర్ట్ వ్యాపారం చేసే వారే ఎక్కువగా టార్గెట్ అవుతున్నారు. హ్యకింగ్ చేసిన తర్వాత ఏ దశలోనూ సదరు వ్యాపారికి అనుమానం రాకుండా జాగ్రత్త పడతారు. చిక్కకుండా ఉండేందుకు జాగ్రత్తలుఅకౌంట్ టేకోవర్ స్కామ్స్‌లో టార్గెట్ చేసిన సంస్థ నుంచి డబ్బు డిపాజిట్ చేయించుకోవడానికి బ్యాంకు ఖాతాలు ఎంతో కీలకం. వీటిని వారే నేరుగా తెరిస్తే పోలీసులకు దొరికే అవకాశాలు ఉంటాయి. ఇలా కాకుండా ఉండేందుకు ఇక్కడివే, బోగస్ చిరునామాలతో ఉండేవి తప్పనిసరి. దీనికోసం నైజీరియన్లు భారీ పథక రచన చేస్తున్నారు. నకిలీ పత్రాలతో వీటిని తెరుస్తున్నారు. రాయదుర్గంలోని ఫార్మా స్యూటికల్ సంస్థ నుంచి రూ.11.4 కోట్లు కాజేయడానికి ప్రయతి్నంచిన నేరగాళ్లూ ఇలానే చేశారు.అయితే నగదు రిసీవ్ చేసుకునే సంస్థ పేరుతోనే బ్యాంకు ఖాతా తెరవడం సాధ్యం కాలేదు. కొద్దిగా మార్పులతో కూడిన పేరుతో సంస్థను ఏర్పాటు చేసి ఆ పేరుతో ఖాతా తెరిచారు. రాయదుర్గం సంస్థ నుంచి వెళ్లిన నగదును అమెరికాలోని బ్యాంకు నేరుగా ఈ ఖాతాలోకి బదిలీ చేయాల్సి ఉండగా, కంపెనీ పేరుతో ఉన్న మార్పును గమనించి ఆ మొత్తాన్ని హోల్డ్‌లో పెట్టింది. దీంతో రూ.11.4 కోట్లు నేరగాళ్ల పాలు కాకుండా ఆగాయి. చిన్నచిన్న మార్పులతో మెయిల్ ఐడీలు...సైబర్ నేరగాళ్లు ఇలా హ్యాక్ చేసిన ఈ–మెయిల్‌ను నిరంతరం అధ్యయనం చేయడం ద్వారా వారికి డబ్బు రావాల్సి, చెల్లించాల్సిన సమయం వచ్చే వరకు వేచి చూస్తున్నారు. సరైన టైమ్‌లో నగదు రిసీవ్ చేసుకునే సంస్థ పేరును పోలిన, అదే యూజర్ నేమ్‌తో కూడిన, ఆఖరులో ఉండే .కామ్, .నెట్ తదితరాలను మార్చి ఈ–మెయిల్ ఐడీలు క్రియేట్ చేస్తున్నారు. వీటిని వినియోగించి నగదు పంపాల్సిన సంస్థకు నగదు రిసీవ్ చేసుకునే సంస్థ నుంచి వచి్చనట్టే ఈ–మెయిల్ పంపుతున్నారు. అందులో ఆడిటింగ్, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లతోపాటు సాంకేతిక కారణాలను వివరిస్తూ..నిత్యం నగదు బదిలీ చేసే బ్యాంక్ ఖాతాకు కాకుండా మరో దానికి పంపాల్సిందిగా కోరుతున్నారు. రాయదుర్గంలోని ఫార్మా స్యూటికల్ సంస్థ విషయంలో ఇలానే జరిగింది. ఈ సంస్థకు ముడిసరుకు సరఫరా చేసే అమెరికన్ సంస్థను పోలిన ఈ–మెయిల్ ఐడీ సృష్టించారు. అసలు దానికి చివరలో .కామ్ ఉంటుంది. అయితే సైబర్ నేరగాళ్లు .నెట్‌తో ముగిసేలా మరోటి సృష్టించారు. దీని ఆధారంగా మెయిల్ పంపి రూ.11.4 కోట్లకు సమానమైన అమెరికన్ డాలర్లు తమ ఖాతాల్లో వేయించుకున్నారు. సరిచూసుకోకుంటే నష్టపోవాల్సిందే అకౌంట్ టేకోవర్ నేరాల్లో ప్రతి ఏడాది నగరానికి చెందిన వ్యాపారులు, వ్యాపార సంస్థలు రూ.లక్షలు, కోట్లల్లో నష్టపోతున్నారు. ఈ–మెయిల్స్ విషయంలో చాలామంది దాన్ని పంపిన యూజర్ నేమ్ చూసి ఎదుటివారు తమ వారే అని భావిస్తారు. అనేక ఈ–మెయిల్ ఖాతాలకు ఒకే యూజర్ నేమ్ ఉండవచ్చు. అందులో ప్రధానంగా యూజర్ ఐడీని చూడాలి. ఈ–మెయిల్స్ అవి పంపిన సంస్థల నుంచి వచి్చనట్టు ఉన్నా.. ఆఖరులో .కామ్ ఉందా? .నెట్ ఉందా? అనేది క్షుణ్ణంగా గమనించాలి. సైబర్ నేరగాళ్లు ఎక్కువగా ఇంటర్ నెట్లో ఫ్రీగా దొరికే ‘.ఓఆర్జీ’తో కూడినవి తయారు చేసి వాడతారు. ఈ తరహా నేరాల్లో నిందితులు చిక్కడం, నగదు రికవరీ కావడం కష్టసాధ్యం. - కేవీఎం.ప్రసాద్, డీఎస్పీ,తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోఅకౌంట్ టేకోవర్ నేరాల్లో నష్టపోయిన కొన్ని సంస్థలు...* 2020 జూలై కేపీసీ ఇన్ఫ్రా, హైదరాబాద్ రూ.9.9లక్షలు* 2020 అక్టోబర్ పోకర్ణ ఇంజనీరింగ్ స్టోన్ లిమిటెడ్ రూ.2.09లక్షలు* 2021 ఫిబ్రవరి హేమా ఎల్రక్టానిక్స్, సికింద్రాబాద్ రూ.లక్ష* 2021 జూన్ నిర్మా సిన గ్లాస్ కంపెనీ, మాసబ్‌ట్యాంక్ రూ.55లక్షల స్వాహాకు యత్నం * 2022 ఏప్రిల్ అమీర్‌పేటకు చెందిన ఓ సంస్థ రూ.1.19కోట్లు* 2022 జూలై నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ రూ.64లక్షలు* 2023 ఫిబ్రవరి హెచ్‌బీఎల్ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్ సంస్థ, బంజారాహిల్స్ రూ.1.16కోట్లు* 2023 మార్చి ఏబీఆర్ ఆర్గానిక్స్ లిమిటెడ్ సంస్థ, బాగ్‌అంబర్‌పేట రూ.7లక్షలు -
సందట్లో సైబర్ వల
సాక్షి, అమరావతి: ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న తరుణంలో సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారు. ఎగ్జిట్ పోల్ రిజల్ట్ పేరుతో ఫోన్లకు లింక్ పంపిస్తున్నారు. ఎవరైనా ఆతృతతో ఆ లింక్‌ను ఓపెన్ చేస్తే ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాల వేదికగా జరుగుతున్న ఎన్నికల ఫలితాల చర్చల ఆధారంగా ఆయా సోషల్ మీడియా గ్రూపులను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. నకిలీ సర్వేలతో కూడిన లింకులను అందులో పోస్ట్ చేస్తున్నారు. ఏ పారీ్టకి ఎన్ని సీట్లు వస్తాయి.. ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనే సమాచారాన్ని తెలుసుకోవాలనుకునే వారు వెంటనే వాటిని తెరుస్తున్నారు. ఇంకేముంది వెంటనే వారి ఫోన్ హ్యాక్ అవుతోంది. ఆపై పర్సనల్ డేటా, బ్యాంక్ అకౌంట్ వివరాలను హ్యాక్ చేసి.. ఆయా వ్యక్తుల బ్యాంక్ ఖాతాల్లోని సొమ్ముల్ని కాజేస్తున్నారు. ముఖ్యంగా బెట్టింగులకు పాల్పడుతున్న వారు ఈ తరహా మోసాలకు గురవుతున్నారు. తాము బెట్టింగ్ వేసిన పార్టీ, అభ్యర్థి గెలుపోటముల గురించి పదేపదే తెలుసుకోవడంలో భాగంగా వారు తమకు కనిపించే ప్రతి ఎగ్జిట్ పోల్ లింకును తెరిచి చూస్తున్నారు. అదే వారి కొంప ముంచుతోంది. అయితే.. మోసపోయిన వారు ఆ విషయాన్ని బయటకు చెప్పలేకపోవడం కూడా సైబర్ నేరగాళ్లకు కలిసివస్తోంది. తాము మోసపోయామని చెబితే బెట్టింగ్ వేసిన విషయం కూడా బయటకు వస్తుందనే భయంతో బాధితులు మిన్నకుండిపోతున్నారు. అఅప్రమత్తం చేస్తున్న బాధితులుఇలా మోసపోయిన వారిలో కొందరు మరొకరికి ఇలా జరగకూడదని భావించి.. సోషల్ మీడియా గ్రూపుల్లో వచ్చే అలాంటి లింకులను చూసి మోసపోవద్దని, వాటిని ఎవరూ తెరవద్దని పోస్టులు పెడుతూ అప్రమత్తం చేస్తున్నారు. సోమవారం సోషల్ మీడియాలో ఈ విషయంపై రాష్ట్రవ్యాప్తంగా విపరీతంగా ప్రచారం జరిగింది. కాగా.. మంగళవారం ఫలితాలు వెలువడే వరకూ ఇలాంటి ఫేక్ లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
ట్రేడింగ్ స్కామ్.. రూ.1.07 కోట్లు మాయం - ఎక్కడంటే?
టెక్నాలజీ పెరుగుతున్న వేళ సైబర్ మోసాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇటీవల నవీ ముంబైలోని ఖార్ఘర్ టౌన్‌షిప్‌కు చెందిన 48 ఏళ్ల వ్యక్తి షేర్ ట్రేడింగ్ స్కామ్‌లో రూ.1.07 కోట్లు మోసపోయారు. విచారణలో భాగంగా ఓ యాప్, వెబ్సైట్ యజమానులతో సహా 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.సైబర్ మోసాలు కొత్తేమీ కాదు. అమాయక ప్రజలనే లక్ష్యంగా చేసుకుని నేరగాళ్లు విజృంభిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు నమోదైన వివిధ సైబర్‌క్రైమ్ కేసుల్లో ఇన్వెస్టర్లు రూ.1,762 కోట్లు నష్టపోయినట్టు ఇండియన్ సైబర్‌క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (14సీ) వివరాలు చెబుతున్నాయి. ఇందులో ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ మోసాలు మాత్రమే కాకుండా.. గేమింగ్ యాప్స్, చట్ట విరుద్ధమైన లోన్ యాప్స్, ఓటీపీలను ఇతరులకు షేర్ చేయడం వంటివి ఉన్నాయి.ఇటీవల నవీ ముంబైలో సైబర్ మోసానికి ఎరగా చిక్కిన వ్యక్తిని మోసగాళ్లు ఫిబ్రవరి 13 నుంచి మే 5 వరకు పలుమార్పు కలిసి షేర్ ట్రేడింగ్ నుంచి లాభాలను ఇప్పిస్తామని నమ్మించారు. ఆ తరువాత వివిధ బ్యాంక్ అకౌంట్లలో రూ. 10709000 డిపాజిట్ చేయించుకున్నారు. డబ్బు డిపాజిట్ చేయించుకున్న తరువాత ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయారు. దీంతో మోసపోయామని గ్రహించిన ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.సమాచార సాంకేతిక చట్టంలోని నిబంధనలతో పాటు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 419 (వ్యక్తిగతంగా మోసం చేయడం), 420 (చీటింగ్) వంటి వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మొత్తం కేసులుఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ( I4C ) ప్రకారం.. 2023లో 1 లక్షకు పైగా ఇన్వెస్ట్మెంట్ స్కామ్ కేసులు నమోదయ్యాయి. ట్రేడింగ్ స్కామ్‌ల ద్వారా మోసపోయిన వారు 20,043 కంటే ఎక్కువ ఉన్నట్లు సమాచారం. డేటింగ్ యాప్‌ల వల్ల మోసపోయిన వారి సంఖ్య 1725గా నమోదైంది. ఇలా వివిధ రూపాల్లో సైబర్ నేరగాళ్లు ప్రజలను మాయ చేస్తూ.. మోసం చేస్తున్నారు.మోసగాళ్ల కొత్త అవతారాలు..మోసగాళ్లు తమ ఫోన్ నంబర్లను చట్టబద్ధంగా కనిపించేలా చేయడానికి తరచుగా కాల్ స్పూఫింగ్ ఉపయోగిస్తారు. స్కామర్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA), డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ (ED), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వంటి ఏజెన్సీల అధికారులుగా నటిస్తారు. ఇది నిజమని నమ్మి ప్రజలు మోసపోతున్నారు. -
ఒక్కో వ్యక్తికి వందల్లో సిమ్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు..!
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు అధికమవుతున్నాయి. సైబర్ నేరాల నియంత్రణకు పోలీసులు కృత్రిమ మేధను వాడుతున్నారు. దీని ద్వారా అనుమానిత సిమ్‌కార్డులు, బ్యాంకు ఖాతాలను గుర్తించి బ్లాక్ చేయించి.. సైబర్ నేరగాళ్ల ఆగడాలను అడ్డుకోవాలనేది వారి ఆలోచన. టెలికాం, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లతో ఇటీవల నిర్వహించిన సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. సాంకేతిక పరిజ్ఞానం అండతో నేరాలకు పాల్పడుతున్నవారికి అదే ఆయుధంతో చెక్ పెట్టనున్నారు. ప్రత్యేక ముఠాలు ఏర్పాటు సైబర్ నేరాలు ఇటీవలి కాలంలో అడ్డూఅదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. ఇవి సామాన్యులనే కాదు పోలీసులనూ ఇబ్బంది పెడుతున్నాయి. ఈ మోసాల బారిన పడకుండా ప్రజలను ఎన్ని రకాలుగా చైతన్యపరుస్తున్నా.. నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో దోపిడీకి పాల్పడుతూనే ఉన్నారు. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉండి మరీ.. ఇక్కడి వారి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఫోన్ కాల్‌తో బురిడీ కొట్టించి.. ఖాతాలో ఉన్న సొత్తు అంతా ఊడ్చేస్తున్నారు. తప్పుడు చిరునామాలతో సిమ్‌కార్డులు తీసుకొని, బోగస్ ఖాతాల్లోకి డబ్బు మళ్లించి.. కొల్లగొడుతున్నారు. ఒక్కో నేరగాడు వందల సంఖ్యలో సిమ్‌కార్డులు సమకూర్చుకుంటున్నాడు. సిమ్‌కార్డులు, బ్యాంకు ఖాతాలు సమకూర్చేందుకు ప్రత్యేకంగా ముఠాలే ఉన్నాయి. నిరక్షరాస్యులు, నిరుద్యోగులను నమ్మించి.. బ్యాంకు ఖాతా వాడుకునేందుకు అనుమతి ఇస్తే మంచి కమీషన్ ఇస్తామని ఆశపెడుతున్నారు. బాధితుల నుంచి కొల్లగొట్టిన డబ్బును ఈ ఖాతాల్లోకి, వాటిలో నుంచి వేరే ఖాతాలోకి మార్చి.. డ్రా చేసుకుంటున్నారు. కష్టమ్మీద ఆచూకీ కనిపెట్టినా.. నేరగాళ్ల ఆచూకీని పోలీసులు అతికష్టమ్మీద కనిపెట్టినా ఇతర రాష్ట్రాలకు వెళ్లి.. వారిని పట్టుకోవడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో నేరగాళ్లు వాడుతున్న సిమ్‌కార్డులు, బ్యాంకు ఖాతాలను గుర్తించి.. వాటిని రద్దు చేయించగలిగితే వారిని కట్టడి చేయచ్చని అధికారులు భావిస్తున్నారు. సిమ్‌కార్డు లేకపోతే మోసం చేసేందుకు కాల్ చేయలేరు. బ్యాంకు ఖాతా లేకపోతే మళ్లించిన డబ్బు దోచుకోలేరు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా నేరగాళ్ల సిమ్‌కార్డులను అధికారులు గుర్తిస్తున్నారు. ఇప్పటివరకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు 28,610 సిమ్‌కార్డులను బ్లాక్ చేయించగలిగారు. వాటిని వాడిన ఫోన్ల ఐఎంఈఐ నంబర్‌ను గుర్తించి, వాటిని కూడా బ్లాక్ చేయిస్తున్నారు. దాదాపు 2 వేల బ్యాంకు ఖాతాలనూ రద్దు చేయించారు. తమకు వస్తున్న ఫిర్యాదుల ఆధారంగానే ఇవన్నీ చేయించారు. ప్రక్షాళన షురూ.. సిమ్‌కార్డులు, బ్యాంకు ఖాతాలను ముందుగానే గుర్తించేందుకు కృత్రిమ మేధను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ)కు పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తుంటాయి. బాధితులకు వచ్చిన ఫోన్ కాల్స్, డబ్బు మళ్లించిన బ్యాంకు ఖాతాల వివరాలన్నీ ఇక్కడ నమోదవుతుంటాయి. ఈ సమాచారంతోపాటు బ్యాంకింగ్ డేటా ఆధారంగా అనుమానాస్పద ఖాతాలను గుర్తించాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం కృత్రిమమేధ సాయం తీసుకోనున్నారు. ఇదీ చదవండి: బెంట్లీ కార్లను ఎలా టెస్ట్ చేస్తారో తెలుసా..? చాలాకాలంగా పనిచేయని బ్యాంకు ఖాతాలోకి ఒకేసారి ఎక్కువ మొత్తంలో డబ్బు జమ అయినా, ఒక ఖాతాలోకి దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల నుంచి డబ్బు జమ అవుతున్నా అటువంటి వాటిని గుర్తించి, ఆయా బ్యాంకులను అప్రమత్తం చేయనున్నారు. అలాగే సిమ్‌కార్డుల విషయంలో సర్వీస్ ప్రొవైడర్లను ఇప్పటికే అప్రమత్తం చేశారు. -
రోజూ రూ.3 కోట్లు మాయం! ఎలా మోసం చేస్తున్నారంటే..
సైబర్ యుగంలో ఆన్లైన్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు తెలుసుకుని మన ప్రమేయమేమీ లేకుండానే నేరగాళ్లు షాపింగ్ చేస్తున్నారు. రుణయాప్‌ల పేరుతో తోచినంత లాగేస్తున్నారు. కొన్ని టాస్క్‌లు ఇచ్చి అవిపూర్తి చేసిన తర్వాత ఆన్లైన్ పెట్టుబడి పెట్టాలంటూ మోసాలకు పాల్పడుతున్నారు. పిన్ నంబరు కొట్టేసి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు కాజేస్తున్నారు. సిమ్ స్వాప్ చేసి మన ఫోన్‌కు అందాల్సిన మెసేజ్‌లను మళ్లించి, డబ్బు లాగేస్తున్నారు. ఇలా నిత్యం జరుగుతున్న మోసాల ద్వారా కేవలం తెలంగాణలోనే ఏకంగా దాదాపు 8 నెలల్లో రూ.707 కోట్లమేర సొమ్ము గుంజినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2023లో జరిగిన 16,339 సైబర్ నేరాల్లో 15 వేల వరకు ఆర్థిక మోసాలే నమోదయ్యాయి. ముఖ్యంగా అయిదు నేరవిధానాల ద్వారా ఆన్లైన్లో ఆర్థికమోసాలు జరుగుతున్నట్లు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీఎస్‌సీఎస్‌బీ) నిపుణులు గుర్తించారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ నేరాల్లో ఒక్క తెలంగాణలోనే 40 శాతానికిపైగా ఉండటాన్ని బట్టి రాష్ట్రంపై సైబర్ నేరస్థులు ఎలా పంజా విసురుతున్నారో అర్థమవుతోంది. తెలంగాణలో సైబర్ నేరస్థులు ఎనిమిది నెలల్లో రూ.707.25 కోట్లు మోసానికి పాల్పడినట్లు నిపుణులు చెబుతున్నారు. అంటే రోజూ రూ.3 కోట్లు మోసం చేస్తున్నారు. అలాంటి సైబర్ మోసాలపై అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. ఎలా మోసం చేస్తున్నారంటే.. వస్తువులు విక్రయిస్తామంటూ.. ఏదైనా వాహనం లేదా వస్తువును అమ్మకానికి పెట్టినట్లు వెబ్సైట్లలో ప్రకటనలిస్తారు. కొనుగోలుకు ఆసక్తిచూపే వారితో వాహనం విమానాశ్రయం పార్కింగ్ స్థలంలో ఉందని.. రవాణా ఛార్జీలు పంపిస్తే చాలు మీరు కోరిన ప్రదేశానికి పంపిస్తామని మాటలు చెబుతున్నారు. అలా రూ.వందలతో మొదలుపెట్టి వీలైనంత వరకు కొట్టేస్తున్నారు. పెట్టుబడి పెట్టాలంటూ.. మోసగాళ్లు పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరిట సందేశాలు పంపి స్పందించిన వారిని టాస్క్‌లు పూర్తి చేయాలని కోరుతున్నారు. తాము సూచించే వెబ్సైట్లో వీడియోలు పరిశీలించి రేటింగ్ ఇస్తే చాలు భారీగా డబ్బులొస్తాయని చెబుతున్నారు. ముందు కొంత డబ్బు పెట్టుబడిగా పెట్టించి టాస్క్‌ను పూర్తి చేస్తే భారీ లాభం ఇస్తున్నారు. దీంతో వారు మరింత పెట్టుబడి పెడుతున్నారు. లక్షలు పెట్టాక మోసం చేస్తున్నారు. పార్సిళ్ల పేరుతో.. సైబర్ నేరస్థులు కొరియర్ ఉద్యోగుల మాదిరిగా నటిస్తున్నారు. ఫోన్ చేసి విదేశాల నుంచి మీకో పార్సిల్ వచ్చిందని అందులో డ్రగ్స్ ఉన్నాయంటూ కస్టమ్స్ అధికారులకు అప్పగించామని చెబుతున్నారు. కొద్దిసేపటికే కస్టమ్స్ అంటూ మరొకరు ఫోన్ చేసి అరెస్ట్ వారంట్ జారీ అయిందని చెబుతున్నారు. న్యాయపరమైన చిక్కులు తప్పిస్తామంటూ రూ.లక్ష నుంచి వీలైనంత మేరకు వసూలు చేస్తున్నారు. ఇదీ చదవండి: భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే టెక్నాలజీ ఇదే.. కానీ.. అప్‌గ్రేడ్ చేస్తామంటూ.. క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను అప్‌గ్రేడ్ చేస్తామని బ్యాంకు ప్రతినిధుల ముసుగులో ఫోన్లు చేస్తున్నారు. లేదంటే కార్డు బ్లాక్ అవుతుందని భయపెడుతున్నారు. తాము పంపే ఆ లింక్ ద్వారా సమాచారం నింపాలని మాల్వేర్ను పంపించి కార్డుల ఎక్స్పైరీ తేదీ, సీవీవీ నంబరుతోపాటు ఆన్లైన్ బ్యాంకింగ్ వివరాలను తీసుకొని ఖాతా ఖాళీ చేస్తున్నారు. -
24% పెరిగిన సైబర్ నేరాలు
సాక్షి, హైదరాబాద్: దేశంలో సైబర్ నేరాల నమోదు ఏటా పెరుగుతోంది. 2021తో పోలిస్తే దేశవ్యాప్తంగా సైబర్ నేరాల నమోదు 2022లో 24.4 శాతం పెరిగినట్లు జాతీయ నేర గణాంకాల బ్యూరో (ఎన్సీఆర్బీ)–2022 నివేదిక వెల్లడించింది. సైబర్ నేరాల నమోదులో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో నిలిచిందని పేర్కొంది. 2021తో పోలిస్తే 2022లో సైబర్ నేరాల నమోదు తెలంగాణలో 40 శాతం పెరిగిందని వివరించింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా అన్ని రకాల నేరాల నమోదు 4.5 శాతం తగ్గినట్లు నివేదిక తెలిపింది. ఎన్సీఆర్బీ–2022 వార్షిక నివేదికను కేంద్ర హోంశాఖ సోమవారం విడుదల చేసింది. ఏటా జూలై లేదా ఆగస్టు వరకు ఈ నివేదిక విడుదల చేస్తుండగా ఈసారి ఎన్సీఆర్బీ నివేదిక విడుదలలో దాదాపు 5 నెలలపాటు జాప్యమైంది. 58.24 లక్షల కేసులు... ఎన్సీఆర్బీ తాజా నివేదిక ప్రకారం ఐపీసీ, స్పెషల్ లోకల్ లా (ఎస్ఎల్ఎల్) సెక్షన్ల కింద కలిపి 2021లో మొత్తం 60,96,310 కేసులు నమోదవగా 2022లో అన్ని రకాల నేరాలు కలిపి 4.5 శాతం తగ్గుదలతో 58,24,946 కేసులు నమోదయ్యాయి. ప్రతి లక్ష మందికి నేరాల నమోదు పరిశీలిస్తే 2021లో 445.9 నేరాలు నమోదుకాగా 2022లో ఆ సంఖ్య 422.2కు తగ్గింది. దేశవ్యాప్తంగా మహిళలపై నేరాల్లో 4 శాతం, చిన్నారులపై నేరాల్లో 8.7 శాతం, వృద్ధులపై నేరాల్లో 9.3 శాతం, ఎస్సీలపై నేరాల్లో 13.1 శాతం, ఎస్టీలపై నేరాల్లో 14.3 శాతం, ఆర్థిక నేరాల్లో 11.1 శాతం పెరుగుదల నమోదైంది. అదే సమయంలో తెలంగాణలో ఐపీసీ, ఎస్ఎల్ఎల్ చట్టాల కింద నమోదైన అన్ని రకాల కేసుల నమోదు చూస్తే కేసుల నమోదు సంఖ్య పెరిగింది. 2021లో 1,58,809 కేసులు నమోదవగా 2022లో రాష్ట్రవ్యాప్తంగా 1,65,830 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 2022లో నమోదైన కేసుల్లో 79.7 శాతం కేసులలో చార్జిషిట్లు దాఖలయ్యాయి. రాష్ట్రంలో సైబర్ క్రైం పైపైకి... తెలంగాణలో 2022లో మొత్తం 15,272 సైబర్ నేరాలు నమోదవగా 2021లో మొత్తం 10,303 కేసులు నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. 2021తో పోలిస్తే తెలంగాణలో 2022లో 40 శాతం మేర సైబర్ కేసులు నమోదు పెరిగినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా 2022లో మొత్తం 65,893 సైబర్ నేరాలు నమోదుకాగా, 2021లో 52,974 కేసులు నమోదయ్యాయని ఎన్సీఆర్బీ నివేదిక తెలిపింది. 2021తో పోలిస్తే 2022లో సైబర్ నేరాలపై కేసుల నమోదు 24.4% పెరుగుదల ఉంది. 2022లో నమోదైన సైబర్ నేరాలను పరిశీలిస్తే 64.8 శాతం (42,710 కేసులు) సైబర్ నేరాలకు కారణం మోసం చేసే ఉద్దేశమని నివేదిక తేల్చింది. ఆ తర్వాతి స్థానంలో 5.5 శాతం (3,648 కేసులు) బెదిరింపులకు సంబంధించినవి, లైంగిక దోపిడీ కారణమైన సైబర్‌నేరాలు 5.2 శాతం (3,434 కేసులు) ఉన్నట్లు వెల్లడించింది. సైబర్ నేరాల నమోదులో తెలంగాణ తర్వాత స్థానంలో కర్ణాటక (18.6 శాతం), మహారాష్ట్ర (6.6 శాతం) ఉన్నాయి. ఇతర నేరాలు ఇలా... రాష్ట్రంలో మహిళలపై నేరాల సంఖ్య పెరిగింది. 2021లో 20,865 కేసులు నమోదవగా 2022లో అవి 22,066కు పెరిగాయి. మానవ అక్రమ రవాణా కేసులు 2022లో దేశవ్యాప్తంగా 2,250 కేసులు నమోదవగా 391 కేసుల నమోదుతో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఆ తర్వాత స్థానంలో మహారాష్ట్ర (295), బిహార్ (260) నిలిచాయి. హత్య కేసుల సంఖ్య 2022లో తెలంగాణలో తగ్గింది. 2021లో 1,026 హత్య కేసులు నమోదవగా 2022లో ఆ సంఖ్య 337కు తగ్గింది. వాటిలో వివాహేతర సంబంధాల కారణంగా 116 హత్యలు జరిగినట్లు నివేదిక వెల్లడించింది. -
'పార్ట్ టైం జాబ్' కోసం ఈ లింక్ క్లిక్ చేస్తున్నారా.. జర జాగ్రత్త! లేదంటే..
సాక్షి, సంగారెడ్డి: పార్ట్ టైం జాబ్ పేరుతో వచ్చిన మెసేజ్ కు స్పందించి ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగులు సైబర్ వలలో చిక్కుకున్నారు. ఒకరు రూ.3 లక్షల 55 వేలు, మరొకరు రూ.7 లక్షల 48 వేలు మోసపోయిన సంఘటన అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు. అమీన్పూర్ పరిధిలోని బంధన్ కొమ్ము కృష్ణ బృందావన్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి పార్ట్‌టైం జాబ్ పేరుతో నవంబర్ 2న మెసేజ్‌కు వచ్చింది. దీనికి స్పందించిన అతను తన వివరాలను నమోదు చేసి నగదు పెడుతూ అపరిచిత వ్యక్తి ఇచ్చిన టాస్క్‌లు పూర్తి చేశాడు. మొత్తం మూడు లక్షల 55 వేలు పెట్టాడు. తాను పెట్టిన నగదుతో పాటు కమిషన్ ఇవ్వాలని అడగడంతో అపరిచిత వ్యక్తి స్పందించలేదు. దీంతో బాధితుడు మోసపోయినట్లు గుర్తించి ముందుగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి సోమవారం అమీన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటనలో.. అమీన్పూర్ పరిధిలోని బీరంగూడ జయలక్ష్మి నగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి పార్ట్‌టైం ఉద్యోగం పేరిట నవంబర్ 4వ తేదీన మెసేజ్ వచ్చింది. దానికి స్పందించి తన వివరాలను నమోదు చేశాడు. అపరిచిత వ్యక్తి చెప్పిన విధంగా ముందుగా రూ.2000 చెల్లించి, టాస్కులు చేస్తూ వచ్చాడు. అయితే అపరిచిత వ్యక్తి పెట్టిన నగదును, వచ్చిన కమిషన్లు క్రియేట్ చేసిన వాలెట్లో చూపిస్తూ వచ్చాడు. చివరికి దీంతో తాను పెట్టిన రూ.ఏడు లక్షల 48 వేలతో పాటు కమిషన్ ఇవ్వాలని అడగడంతో అపరిచిత వ్యక్తి స్పందించలేదు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు.. ముందుగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి, అనంతరం సోమవారం అమీన్పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇవి చదవండి: నొప్పిని భరించలేక.. యువకుడి తీవ్ర నిర్ణయం! -
వారానికి జరిగే సైబర్ అటాక్‌లు ఎన్నంటే..
భారతదేశంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి వేగంగా పురోగమిస్తుంది. అయితే అందుకు అనువుగా డేటా భద్రత, సైబర్ సెక్యూరిటీ వంటి అంశాల నిర్వహణ సవాలుగా మారుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. పొరుగు దేశాల్లోని శత్రువులు, స్కామర్లు పెరుగుతున్న నేపథ్యంలో వీటి నిర్వహణ మరింత క్లిష్టంగా మారుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని సర్వేలు, ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం..ఇండియాలోని సంస్థలపై సగటున గత ఆరు నెలల్లో వారానికి 2,157 సార్లు సైబర్ దాడులు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక్కో సంస్థపై సగటున 1,139 దాడులు జరిగాయి. ఇటీవల జరిగిన సింగపూర్ సైబర్ వీక్-2023 సమావేశంలో నిపుణులు మాట్లాడారు. భారతీయ సాంకేతిక నిపుణులు, వ్యాపార కార్యనిర్వాహకులు పరస్పరం సహకారం అందించుకుంటూ డేటా భద్రతపరంగా సమగ్ర వ్యవస్థను రూపొందించాలన్నారు. దేశ పురోగతికి ప్రధాన అంశాలైన ఐటీ పరిశ్రమలతోపాటు ఆరోగ్య సంరక్షణ, విద్య/ పరిశోధన, రిటైల్, హాస్పిటాలిటీ, మాన్యుఫ్యాక్చరింగ్, రవాణా వంటి రంగాలు సైబర్ సెక్యూరిటీ సవాళ్లకు అనువుగా చర్యలు తీసుకోవాలని నిపుణులు తెలిపారు. రోజురోజూ సైబర్ సెక్యూరిటీ చాలా క్లిష్టంగా మారుతుందని ఏపీఏసీ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ వివేక్ గుల్లపల్లి చెప్పారు. కంపెనీల్లోని ఐటీ విభాగం తరచు సైబర్ సెక్యూరిటీని నిర్వహించాలని ఆయన సూచించారు. సంస్థలో సైబర్ సెక్యూరిటీ వ్యూహాన్ని అమలు చేయడానికి బోర్డులు, మేనేజ్మెంట్ సభ్యులతో కలిసి పని చేయాలన్నారు. -
యాప్ డౌన్లోడ్ చేయగానే.. తగిలిన బిగ్‌షాక్..!
హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు వైద్యురాలికి 95 వేల రూపాయలు టోకరా వేశారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 3 శ్రీనికేతన కాలనీలో నివసించే లక్ష్మి వైద్యురాలు. గత నెల 15న ఆమెకు ఓ వ్యక్తి ఫోన్ చేసి తాను ఎస్బీఐ క్రెడిట్ కార్డు విభాగం నుంచి ఫోన్ చేస్తున్నట్టు చెప్పాడు. ఏదైనా ఫిర్యాదు ఉందా అని అడిగాడు. తాను చేసిన 41,955 రూపాయలకు సంబంధించి ఆన్లైన్ షాపింగ్‌పై అనుమానాలు ఉన్నాయని ఆమె తెలిపారు. దీంతో ఫోన్ చేసిన వ్యక్తి కొన్ని వివరాలు అడగగా ఫోన్లో ఇవ్వలేనని నిరాకరించారు. అయితే ఓ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో వివరాలు పొందుపరిస్తే సమస్య పరిష్కరిస్తామని చెప్పాడు. ఈ మేరకు లక్ష్మి యాప్ డౌన్లోడ్ చేసి సమాచారం నమోదు చేసిన వెంటనే ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.95వేలు డ్రా అయినట్టు మెస్సేజ్ వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఏకంగా ఎమ్మెల్యే పేరుతోనే.. ఇన్‌స్ట్రాగాంలో.. చివరికి..
నిజామాబాద్: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏకంగా ఎమ్మెల్యే పేరుతో ఇన్‌స్ట్రాగాంలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిన ఘటన వెలుగు చూసింది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిన దుండగులు.. డబ్బులు అడుగుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనుచరులు మిగతావారిని అప్రమత్తం చేశారు. దుండగులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే పేరుతో ఫేక్ ఇన్స్టాగ్రాం ఖాతా తెరిచారని, డబ్బులు అడుగుతున్నారని ఎమ్మెల్యే పీఏ తెలిపారు. దానికి ఎవరూ స్పందించవద్దని, ఫేక్ అకౌంట్‌ను అందరూ బ్లాక్ చేయాలని కోరారు. -
అతివలకు భరోసా.. హైదరాబాద్‌లో సైబర్ షీ–టీమ్స్ ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు, యువతులకు మరింత భరోసా ఇవ్వడానికి హైదరాబాద్ నగర పోలీసు విభాగం చర్యలు చేపట్టింది. ఈ మేరకు కొత్తగా సైబర్ షీ–టీమ్స్‌ను ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నిర్ణయించారు. ఈ బృందాల్లో సాంకేతిక నిపుణులతోపాటు ఎథికల్ హ్యాకర్లు కూడా ఉండనున్నారు. ఈవ్‌టీజింగ్ సహా వివిధ రకాల వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు, యువతులు, బాలికల కోసం షీ–టీమ్స్ పని చేస్తున్నాయి. ఈవ్‌టీజర్లపై కన్నేసి రెడ్çహ్యాండెడ్‌గా పట్టుకోవడం దగ్గరి నుంచి కుటుంబ సమస్యల పరిష్కారం వరకు అనేక విధాలుగా అండగా నిలుస్తున్నాయి. కానీ ఇటీవల కాలంలో వేధింపుల తీరు మారింది. స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ‘ఈ–పోకిరీ’లు పెరిగిపోయారు. వారు బాహ్య ప్రపంచంలో కాకుండా సోషల్ మీడియా ద్వారా రెచి్చపోతున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్.. ఇలా వివిధ రకాల ప్లాట్‌ఫామ్స్ కేంద్రంగా వేధింపులకు పాల్పడుతున్నారు. వారికి చెక్ చెప్పడానికే సైబర్ షీ–టీమ్స్ ఏర్పాటు చేయనున్నారు. బయటికి చెప్పుకోలేక భరిస్తూ.. ఆన్లైన్ వేధింపుల బారినపడుతున్న అతివల్లో అనేక మంది తమకు ఎదురైన ఇబ్బందులను బయటికి చెప్పుకోలేకపోతున్నారు. వేధింపులకు పాల్పడుతున్నవారి నుంచి వస్తున్న బెదిరింపులకు తోడు పరువు పోతుందనే ఉద్దేశంతో మిన్నకుండిపోతున్నారు. ఈ పరిస్థితిని అలుసుగా తీసుకుంటున్న మోసగాళ్లు మరింతగా రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ షీ–టీమ్స్‌కు వస్తున్న ఫిర్యాదుల్లో 60శాతం దాకా ఆన్లైన్ వేధింపులకు సంబంధించినవే ఉంటున్నాయి. శాంతిభద్రతల విభాగం, సైబర్ క్రైమ్ ఠాణాలకు వస్తున్న సైబర్ కేసుల్లోనూ వేధింపులకు సంబంధించినవే అధికంగా ఉంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే.. 2022లో సైబర్ నేరాల కేసులు 9,815 నమోదుకాగా.. వీటిలో సైబర్ వేధింపులకు సంబంధించినవి 1,118, అశ్లీల సందేశాలు పంపడానికి సంబంధించినవి 141 ఉన్నాయి. ఈ వేధింపులు, అశ్లీల సందేశాల కేసుల్లో బాధితులు మహిళలు, యువతులే. దీనికితోడు ఇటీవలి కాలంలో ప్రేమ ముసుగులో జరిగే ‘ఈ–నేరాలు’ పెరిగిపోయాయి. వాటితో యువతులు, మహిళలు వ్యక్తిగతంగా, మానసికంగా, ఆర్థికంగా నష్టపోతున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో.. సైబర్ వేధింపులు ఎదురైన బాధితులు నేరుగా షీ–టీమ్స్ వద్దకు రావాల్సిన అవసరం లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఫోన్, వాట్సాప్, ఫేస్బుక్.. ఇలాంటి మార్గాల్లోనూ ఫిర్యాదు చేయవచ్చని చెప్తున్నారు. బాధితుల వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సైబర్ షీ–టీమ్స్‌కు వచ్చే ఫిర్యాదులకు సంబంధించిన అంశాలను దర్యాప్తు చేయడం, నిందితులను గుర్తించి పట్టుకోవడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతోపాటు ప్రత్యేక టూల్స్ వినియోగించనున్నారు. ఆయా అంశాల్లో నిష్ణాతులైన వారిని బృందాల్లో నియమించనున్నారు. అవసరమైతే డార్క్‌నెట్‌ను కూడా ఛేదించే నైపుణ్యమున్న ఎథికల్ హ్యాకర్ల సేవలను వినియోగించుకుంటారు. ఇప్పటికే సిటీ పోలీసు విభాగం మహేశ్ బ్యాంకు కేసు సహా పలు సైబర్ నేరాల దర్యాప్తు కోసం ఎథికల్ హ్యాకర్ల సేవలు వినియోగించుకుంది. స్మార్ట్‌ఫోన్ కూడా చేటుకు కారణం! ఒకప్పుడు ఫోన్ విలాసవస్తువు. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ నిత్యావసరంగా మారిపోయింది. ఇవి వచ్చాక ఎవరికి వారికి ‘స్వేచ్ఛ’ పెరిగింది. ఆకర్షణను ప్రేమగా భావిస్తున్న యువతులు అపరిచితులతోనూ హద్దులు దాటుతున్నారు. కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత అంశాలను రికార్డు చేయడాన్నీ పట్టించుకోవడం లేదు. ఓ దశలో ఇవే వారి పాలిట శాపంగా మారుతున్నాయి. ఏటా నమోదవుతున్న సైబర్ నేరాల్లో ఈ తరహాకు చెందినవి పెద్ద సంఖ్యలో ఉంటున్నాయి. సైబర్ షీ–టీమ్స్ ఏర్పాటుతో పరిస్థితులు మారే అవకాశం ఉంది. – సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవల షీ–టీమ్స్‌కు వచ్చిన ‘ఈ–కేసు’ల్లో కొన్ని... ► బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొంతకాలం హైదరాబాద్‌లోని ఓ మలీ్టనేషనల్ కంపెనీలో పనిచేశాడు. అప్పట్లో తన సహోద్యోగిని అయిన యువతిపై ఆన్లైన్లో వేధింపులకు పాల్పడ్డాడు. ఈ–మెయిల్స్, సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ద్వారా అభ్యంతరకర ప్రచారానికి దిగాడు. పోలీసులు సదరు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను అరెస్టు చేశారు. ► హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లికి చెందిన ఓ మరుగుజ్జు యువకుడు ఫేజ్‌బుక్‌లో తనదేనంటూ ఓ అందమైన యువకుడి ఫొటో పెట్టాడు. ఓ యువతి ‘ఫ్రెండ్’గా పరిచయం కావడంతో చాటింగ్ ప్రారంభించాడు. ప్రేమ పేరుతో వలవేసి.. అనేక కారణాలు చెప్పి ఆమె నుంచి రూ.3 లక్షల నగదు, 50 తులాల బంగారం స్వాహా చేశాడు. ► ఓ వ్యక్తి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. గతంలో ప్రాజెక్టు వర్క్ నేపథ్యంలో పరిచయమైన యువతిని ప్రేమించాడు. ఆమె తిరస్కరించడంతో కక్షగట్టాడు. ఓ ల్యాప్‌టాప్, డేటాకార్డ్ కొనుగోలు చేసి.. సదరు యువతి మెయిల్ ఐడీని హ్యాక్ చేశాడు. ఆమె బంధువులు, స్నేహితులకు ఆమే పంపిస్తున్నట్టుగా అసభ్య చిత్రాలు, సందేశాలు పంపాడు. చదవండి: Telangana: గ్రూప్–4లో 8,039 పోస్టులే! -
గతం కంటే తగ్గాయి.. అయినా సైబర్ క్రైం నేరాల్లో ఆ నగరమే టాప్!
అత్యధిక సైబర్ నేరాల కేసులతో దేశంలోని మహానగరాల్లో బెంగళూరు మొదటిస్థానంలో నిలిచింది. 2021లో రోజుకు సరాసరి 18 కేసులు నమోదయ్యాయి. 2021 సంవత్సరపు నేరాలపై జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన నివేదికలో ఈ చేదు వాస్తవం వెల్లడైంది. 20 లక్షలకంటే ఎక్కువ జనాభా కలిగిన 19 మహానగరాల్లో నమోదైన సైబర్ నేరాలను పరిశీలించగా బెంగళూరు టాప్‌లో నిలిచింది. బెంగళూరు ఐటీ, బీటీ, ఇతర ప్రముఖ ప్రైవేటు కంపెనీలకు నిలయం. ఆర్థిక లావాదేవీలు అత్యధికంగా జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో సైబర్ కేటుగాళ్లు నగరంపై గురిపెట్టి ప్రజల సొమ్మును కాజేస్తున్నారు. వరుసగా బెంగళూరు, హైదరాబాద్, ముంబై సిలికాన్ సిటీ 6,423 కేసులతో దేశంలో మొదటిస్థానం, 3,303 కేసులతో తెలంగాణ రాజధాని హైదరాబాద్ రెండవ స్థానం, ఇక 2,883 సైబర్ నేరాలతో ముంబయి నగరం మూడవ స్థానంలో నిలిచింది. గతం కంటే తగ్గాయి అయితే గతం కంటే బెంగళూరు నగరంలో 2021లో సైబర్ నేరాలు తగ్గుముఖం పట్టడం శుభసూచకమనే చెప్పాలి. 2019లో 10,555 కేసులు, 2020లో 8,982 కేసులు నమోదైనట్లు నివేదికలో ప్రస్తావించారు. సైబర్‌నేరాల్లో బాధితులకు న్యాయం దొరికేది చాలా తక్కువ. ఇలా ఉండగా మెజారిటీ కేసుల్లో వంచకులను అరెస్ట్ చేయడం పోలీసులకు సాధ్యం కావడం లేదని బెంగళూరువాసులు విచారం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: మరో బాదుడు.. కెనరా బ్యాంక్ రుణ రేటు పెంపు -
లాభం పేరిట లూటీ! నాలుగు నెలల్లో 48 కేసులు
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాలపై పోలీసులు ఎంత ప్రచారం చేసినా కొందరిలో మార్పు రావటం లేదు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశ, చిన్న మొత్తంలో పొదుపు చేస్తే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని వాట్సాప్‌లలో లింకులు పంపిస్తూ సైబర్ నేరస్తులు అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. సైబర్ నేరస్తుల చేతిలో చిక్కి డబ్బు పోగొట్టుకుంటున్న వాటిలో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులే అధికంగా ఉంటున్నాయి. 48 కేసులు.. రూ.2.75 కోట్ల మోసం.. సాధారణ నేరాలతో పోలిస్తే సైబర్ నేరాలు 200 శాతం మేర పెరిగాయి. వృద్ధులు, మహిళలు, పిల్లలు కూడా సైబర్ నేరస్తుల బారిన పడుతున్నారు. మన వ్యక్తిగత సమాచారాన్ని గుర్తు తెలియని వ్యక్తులకు ఇవ్వటమే సైబర్ నేరాలకు ప్రధాన కారణం. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 48 ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో బాధితులు రూ.2,75,05,919 సొమ్మును పోగొట్టుకున్నారు. ఈ బాధితుల్లో అత్యధికంగా కొత్తగా ఉద్యోగంలో చేరిన ఉద్యోగులే ఉన్నారని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. వర్చువల్‌గా లాభాలు వచ్చినట్లు చూపించి, రూ.5 లక్షల నుంచి కోటి వరకు పెట్టుబడి పెట్టిస్తున్నారు. ఆ తర్వాత కాంటాక్ట్ కట్ చేస్తున్నారు. నేరస్తులు ఇతర రాష్ట్రీయులే.. బహుళ జాతి కంపెనీలలో పనిచేస్తున్న ఐటీ నిపుణులు, బ్యాంకింగ్ రంగం ఉద్యోగులు రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో పదో తరగతి కూడా పాస్‌కాని సైబర్ మాయగాళ్ల వలలో పడి మోసపోతున్నారు. ఇప్పుడు పెట్టుబడితో వారంలో డబుల్, త్రిబుల్ అవుతుందని చెప్పగానే నమ్మి మోసపోతున్నారు. సైబర్ బాధితుల్లో 60 శాతానికి పైగా ఐటీ ఉద్యోగులు ఉండటమే ఇందుకు ఉదాహరణ. 24 గంటల్లోపు ఫిర్యాదు చేయండి యాప్‌లలో పెట్టుబడితో లక్షల లాభం వచ్చినట్లు ఫోన్లో కనిపించినా అవి బ్యాంక్ ఖాతాలో జమ కావు. సైబర్ నేరాలకు గురైన 24 గంటల్లోపు ఫిర్యాదు చేస్తే సొమ్ము తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. డయల్ 100కు లేదా 1930 నంబర్లలో ఫిర్యాదు చేయాలి. – డాక్టర్ లావణ్య, డీసీపీ, సైబర్ క్రైమ్స్, సైబరాబాద్ (చదవండి: భూ బకాసురులు! రూ.50 కోట్ల స్థలం పై కన్ను) -
చైనా సైబర్‌స్పేస్ చివరి యుద్ధం!...ఇంటర్నెట్ క్లీన్ అప్!!
Cyberspace Administration of China: ఇంటర్నెట్ను "క్లీన్ అప్" చేయడానికి చైనా ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లను లక్ష్యంగా చేసుకుంది. ఇంటర్నెట్ను "క్లీన్ అప్" చేసే డ్రైవ్‌లో భాగంగా నకిలీ ఖాతాల సమాచారాన్ని అరికట్టడానికి సోషల్ మీడియా నెట్‌వర్క్‌లు, వీడియో-షేరింగ్ సైట్ల వంటి ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లను చైనా పరిశీలిస్తుందని ఆ దేశ సైబర్ రెగ్యులేటర్ తెలిపింది. చైనాలోని సైబర్‌స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (సీఏసీ) మోసపూరిత ఆన్లైన్లను లక్ష్యంగా చేసుకోని రెండు నెలల ప్రత్యేక ఆపరేషన్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపింది. (చదవండి: అవిభక్త కవలలు ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించారు!!) నకిలీ అకౌంట్లు, సాంకేతికత, రియల్ ఎస్టేట్, గేమింగ్, విద్య, క్రిప్టోకరెన్సీలు వంటి వాటికి సంబంధించిన ఫైనాన్స్‌లో కంపెనీల పర్యవేక్షణను అధికారులు కఠినతరం చేయనున్నారు. ఈ మేరకు సైబర్‌స్పేస్ అడ్మినిస్ట్రేషన్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ, మున్సిపల్ బాడీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. అంతేకాదు ఈ సమావేశంలో సీఏసీ ఆన్లైన్ ట్రాఫిక్, హానికరమైన పబ్లిక్ రిలేషన్స్, కామెంట్లు, నగదు కోసం రూపొందించే వెబ్‌లు వంటివి... నెటిజన్ల చట్టబద్ధమైన హక్కుల ప్రయోజనాలకు హాని కలిగిస్తుందని పేర్కొంది. పైగా చైనా సీఏసీ "చివరి యుద్ధం" గా అభివర్ణించిది. అంతేకాదు ఇంటర్నెట్ను "క్లీన్ అప్" డ్రైవ్ చేయండి అని పిలుపినిచ్చింది. (చదవండి: ఒక్క అంకె తప్పుగా ఇవ్వడంతో ఆ మహిళకు ఏకంగా 4,500 మిస్డ్ కాల్స్ వచ్చాయి!!) -
సైబర్ మోసాలకు చెక్ పెట్టే మొబైల్ యాప్! ఇక సైబర్ కేటుగాళ్ల ఆటకట్టు..
KL Deemed University Student: ఇటీవలకాలంలో చాలా సైబర్ మోసాలను చూసే ఉంటాం. ఆఖరికి బ్యాంక్ ఉద్యోగులను సైతం బురిడీ కొట్టంచే కేటుగాళ్లను సైతం చూస్తూనే ఉన్నాం. పైగా ఫిర్యాదు చేద్దాం అంటే ఈ సైబర్ కేసులను సంబంధించిన ఫిర్యాదులు ఎలా చేయాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఇక అటువంటి సమస్య ఉండదంటా. ఎవ్వరూ సైబర్ మోసానికి గురకాకుండా ఉండేలానే కాకుండా సైబర్ చట్టాలకు సంబంధించిన పూర్తి సమాచారంతో కూడిన సరికొత్త యూప్ వచ్చింది. (చదవండి: కారు డ్రైవింగ్ చేస్తూ.. స్పృహ తప్పి పడిపోయింది! అతని సాహసానికి హ్యాట్సాఫ్) అసలు విషయంలోకెళ్లితే...కేఎల్ డీమ్డ్ యూనివర్శిటీలో లా ఫైనలియర్ చదువుతున్న డీ శశాంక్ డిజిట్ భద్రతకు సంబంధించిన సైబర్ అలర్ట్ అనే మొబైల్ అప్లికేషన్ని అభివృద్ధి చేశారు. అయితే ఈ సరికొత్త యాప్ వినియోగదారులను సైబర్ మోసానికి గురికాకముందే హెచ్చరించడమే కాక సైబర్ ఫిర్యాదులను ఫైల్ చేసేలా అనుమతి ఇస్తుంది. పైగా ఫిర్యాదులను ట్రాక్ చేయడమే కాక సైబర్ భద్రత, చట్టాలకు సంబంధించిన పూర్తి సమాచారంతోపాటు జీపీఎస్‌తో కూడిన స్టేషన్ల జాబితాను కూడా తెలియజేస్తుంది. అంతేకాదు వినయోగదారులు సత్వరమే న్యాయ సహాయం పొందేలా మార్గనిర్దేశం చేస్తుంది. ఈ మేరకు సైబర్ అలర్ట్ వ్యసస్థాపకుడు డీ రాహుల్ శశాంక్ మాట్లాడుతూ..."కరోనా మహమ్మారి సమయంలో పెరిగిన సైబర్-దాడుల సంఖ్య మమ్మల్ని ఈ యాప్‌ను ప్రారంభించేలా చేసింది. మా యూనివర్సిటీ ప్రోఫెసర్లు నేను తయారు చేసిన యాప్ పై చాలా విశ్వాసం ఉంచడమే కాక మా ప్రయత్నానికి పూర్తి సహాయసహకారాలను అందించారు." అని అన్నారు. అంతేకాదు యూనివర్సిటీ వీసీ డాక్టర్ జి. పార్ధ సారధి వర్మ ప్రిన్సిపాల్ ఎన్ రంగయ్య శశాంక్ని అభినందించారు. (చదవండి: దెయ్యంతో ఆటలాడిన భౌ.. భౌ..!! వైరల్...) -
అసదుద్దీన్ ఓవైసీ ట్విటర్ అకౌంట్ మరోసారి హ్యక్..
హైదరాబాద్: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ట్విటర్ అకౌంట్‌ను సైబర్ నేరగాళ్లు మరోసారి హ్యక్ చేశారు. కాగా, ఒక నెలలో ఆయన ట్విటర్ అకౌంట్ హ్యక్ అవడం ఇది రెండోసారి. అయితే, 9 రోజుల క్రితం అసదుద్దీన్ ట్విటర్ ఖాతా హ్యకింగ్‌కు పాల్పడగా .. ఆ తర్వాత పోలీసులు తిరిగి పునరుద్ధరించారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు మరోసారి సైబర్ నేరగాళ్లు ఆయన ట్విటర్ అకౌంట్‌ను హ్యక్ చేసి.. ఆయన ప్రొఫైల్ ఫోటో స్థానంలో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఫోటోను అప్లోడ్ చేశారు. దీంతో మరోసారి ఆయన ఖాతా హ్యకింగ్‌కి గురయినట్లు పార్టీ వర్గాలు గుర్తించాయి. అసదుద్దీన్ ట్విటర్ అకౌంట్‌కు 6.78 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కాగా, ఎంఐఎం పార్టీ వర్గాలు సోమవారం హైదరాబాద్ సైబర్ పోలీసులను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు ఒక ప్రకటనలో తెలియజేశారు. -
కంప్యూటర్ ఆపరేటర్లపై సైబర్ కేసులు
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఓటర్ల జాబితాల్లో చోటు చేసుకున్న అక్రమాల గుట్టును జిల్లా యంత్రాంగం ఎట్టకేలకు నిర్ధారించింది. ముఖ్యంగా ఒంగోలు, చీరాల, పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అడ్డగోలుగా అర్హులైన ఓటర్లను జాబితా నుంచి తొలగించిన విషయాన్ని ధ్రువీకరించింది. అదే సమయంలో అక్రమంగా చేర్చిన ఓటర్ల లెక్కను తేల్చింది. చీరాల నియోజకవర్గంలో 3976 మంది వాస్తవ ఓటర్లను, పర్చూరు నియోజకవర్గంలో 1610 మందిని, ఒంగోలు నియోజకవర్గంలో 37 మంది వాస్తవ ఓటర్లను జాబితాలో నుంచి తొలగించినట్లు నిర్ధారించింది. అదేవిధంగా పర్చూరు నియోజకవర్గంలో 340 ఓట్లు, ఒంగోలు నియోజకవర్గంలో 257 ఓట్లు అక్రమంగా చేర్చినట్లు గుర్తించింది. సంబంధిత కంప్యూటర్ ఆపరేటర్లపై సైబర్ నేరాల కింద కేసులు నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. అంతేగాకుండా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. వైఎస్ఆర్సీపీ లక్ష్యంగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని ఓటర్ల జాబితాలో కొంతమంది అక్రమాలకు పాల్పడ్డారు. ఆ పార్టీని దెబ్బతీయాలన్న ఉద్దేశంతో ఓటర్ల నమోదు ప్రక్రియ జరుగుతున్న సమయంలో గుట్టుచప్పుడు కాకుండా తమ పని కానిచ్చారు. వాస్తవానికి ఓటర్ల నమోదు ప్రక్రియ అత్యంత పకడ్బందీగా జరగాల్సి ఉంటుంది. ఓటర్ల జాబితా బయటకు వచ్చేవరకు అందులోని వివరాలు బయటకు పొక్కకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. అయితే తాజాగా జరుగుతున్న ఓటర్ల నమోదులో వైఎస్ఆర్ కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు ప్రత్యర్థులు కొంతమంది కంప్యూటర్ ఆపరేటర్లను ప్రలోభపెట్టి తమదారిలోకి తెచ్చుకున్నారు. పర్యవసానమే కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా అక్రమాల చిట్టాగా మారింది. ఈ నేపథ్యంలో ఒంగోలు శాసనసభ్యుడు, వైఎస్ఆర్సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి, పర్చూరు నియోజకవర్గ పార్టీ నాయకుడు గొట్టిపాటి భరత్, చీరాల నియోజకవర్గ నాయకులు పలుమార్లు కలెక్టర్ విజయకుమార్‌ను కలిసి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. దాంతో విచారణ చేపట్టడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పర్చూరు నియోజకవర్గ పరిధిలోని ఇంకొల్లు మండలంలో 624 ఓట్లు అక్రమంగా తొలగించారు. మార్టూరు మండలంలో 495 ఓట్లు అక్రమంగా తొలగించగా, 20 అక్రమంగా ఓట్లు చేర్చారు. చినగంజాంలో 231 ఓట్లు తొలగించగా, 163 ఓట్లు చేర్చారు. పర్చూరు మండలంలో 180 ఓట్లు తొలగించ గా, 87 ఓట్లు చేర్చారు. కారంచేడు మండలంలో 50 ఓట్లు తొలగించి, 40 ఓట్లు చేర్చారు. యద్దనపూడి మండలంలో 30 ఓట్లు తొలగించ గా, 30 ఓట్లు చేర్చారు. చీరాల నియోజకవర్గ పరిధిలోని చీరాల మండలంలో 3299 ఓట్లు, వేటపాలెం మండలంలో 337 ఓట్లు అక్రమంగా తొలగించారు. ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని ఒంగోలు లో 37 ఓట్లు అక్రమంగా తొలగిం చారు. ఈ మేరకు జిల్లా యంత్రాం గం వీటిని నిర్ధారించడం గమనార్హం. పోలీసు విచారణకు ఆదేశం... ఓటర్ల నమోదులో చోటు చేసుకున్న అక్రమాలపై జిల్లా యంత్రాంగం పోలీసు విచారణకు ఆదేశించింది. పర్చూరు, చీరాల, ఒంగోలు నియోజకవర్గాల్లోని అక్రమాలపై విచారించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయకుమార్ ఎస్పీకి సూచించా రు. సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని అధికారులంతా ఎన్నికల నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడైనా అవకతవకలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటు హక్కు కల్పిస్తాం ఓటు హక్కు కోల్పోయిన వారికి ఓటరుగా చేరేందుకు అవకాశం కల్పిస్తామని కలెక్టర్ విజయకుమార్ స్పష్టం చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, సెక్షన్ 22 ప్రకారం సుమోటో కింద రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనుమతితో నమోదు ప్రక్రియ చేపట్టవచ్చన్నారు. సంబంధిత నియోజకవర్గాల రిటర్నింగ్ ఆఫీసర్లు ఫారం-6 తీసుకొని ఓటర్లుగా చేర్చాలని కలెక్టర్ ఆదేశించారు.