హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు వైద్యురాలికి 95 వేల రూపాయలు టోకరా వేశారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 3 శ్రీనికేతన కాలనీలో నివసించే లక్ష్మి వైద్యురాలు. గత నెల 15న ఆమెకు ఓ వ్యక్తి ఫోన్ చేసి తాను ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు విభాగం నుంచి ఫోన్ చేస్తున్నట్టు చెప్పాడు.
ఏదైనా ఫిర్యాదు ఉందా అని అడిగాడు. తాను చేసిన 41,955 రూపాయలకు సంబంధించి ఆన్‌లైన్ షాపింగ్‌పై అనుమానాలు ఉన్నాయని ఆమె తెలిపారు. దీంతో ఫోన్ చేసిన వ్యక్తి కొన్ని వివరాలు అడగగా ఫోన్‌లో ఇవ్వలేనని నిరాకరించారు. అయితే ఓ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని అందులో వివరాలు పొందుపరిస్తే సమస్య పరిష్కరిస్తామని చెప్పాడు.
ఈ మేరకు లక్ష్మి యాప్ డౌన్‌లోడ్ చేసి సమాచారం నమోదు చేసిన వెంటనే ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.95వేలు డ్రా అయినట్టు మెస్సేజ్ వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment