fake application
-
అక్రమ రుణయాప్‌లు.. యమపాశాలు! ఎలా మోసం చేస్తున్నారో తెలుసా..
రుణాల కోసం బ్యాంక్‌లను ఆశ్రయించడం ఆనవాయితీగా మారింది. మారుతున్న టెక్నాలజీతో అప్పు కావాలనుకుంటున్నవారు బ్యాంకులకు బదులుగా రుణ యాప్‌లను వినియోగిస్తున్నారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా ధ్రువపత్రాలు, గుర్తింపు వివరాలు తెలియజేయకుండా వెంటనే అప్పులిస్తామంటూ ప్రకటించడంతో వాటి వలలో పడుతున్నారు. అధిక మొత్తం వడ్డీలు లాగుతున్న రుణయాప్‌ల మూసుగులోని నేరముఠాలు గడువు ముగిసి వసూళ్ల పర్వం ప్రారంభించాక వేధింపులకు దిగుతున్నాయి. అక్రమ రుణయాప్‌లు నిరుద్యోగులు, చిరుద్యోగులు, పేద విద్యార్థులు, వ్యాపారుల ఉసురుతీస్తున్నాయి. ఆ రుణయాప్‌లపై చర్యలు తీసుకునేందుకు రిజర్వ్ బ్యాంకుతో కలిసి కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ చేపడుతుందని గడచిన సెప్టెంబరులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అక్రమ రుణయాప్‌లను అరికట్టడానికి ఆర్బీఐ, సెబీలతోపాటు రెగ్యులేటరీ సంస్థలు చర్యలు చేపట్టాల్సిందిగా కేంద్రమంత్రి చెప్పారు. దేశంలో నేడు రుణయాప్‌లు వేల సంఖ్యలో విస్తరించాయి. అందులో మోసపూరితమైనవేమిటో తెలియజేయాల్సిన బాధ్యతను, వాటన్నింటినీ నియంత్రించే కార్యాన్ని కేంద్రం రాష్ట్రప్రభుత్వాలకు, పోలీసు విభాగాలకు, రిజర్వ్‌బ్యాంకుకు వదిలేస్తే ఎలా అనే విమర్శలు వస్తున్నాయి. కేంద్ర మంత్రిత్వశాఖలు, టెలికాం సంస్థలు, సెబీ, రాష్ట్రాలు... అన్నీ కలిసికట్టుగా పని చేయాలని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వేలల్లో రూపాయలు ఎరగా చూపి వాటిని రుణాలిచ్చి లక్షల్లో వసూళ్లకు పాల్పడుతున్న అక్రమ ఆన్లైన్ రుణదాతలు భారీ మోసాలకు తెరతీస్తున్నట్లు సమాచారం. గతంలో దాదాపు రూ.170 కోట్ల పెట్టుబడితో ఏడాదిలోనే చైనాకు చెందిన ఓ రుణయాప్ సంస్థ ఏకంగా రూ.11,700 కోట్లు దండుకున్న ఘటనలు వెలుగుచూశాయి. ఒక్క హైదరాబాద్‌లోనే ఆన్లైన్ రుణయాప్‌లతో సుమారు రూ.32 వేలకోట్ల లావాదేవీలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ ఆన్లైన్ రుణాల్లో వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజు ముందుగానే అప్పులో దాదాపు 35శాతం మేర మినహాయించుకుంటారు. గడువు తీరిన వెంటనే అధిక వడ్డీతో బాకీలు వసూళు చేస్తారు. ఇదీ చదవండి: 20 దేశాలను టార్గెట్ చేసిన చైనా హ్యాకర్లు..? కీలక పత్రాలు లీక్.. డిమాండ్ చేసినమేరకు చెల్లించకపోతే రుణ తీసుకున్నపుడు మొబైల్లో అన్ని అనుమతులు ఇస్తారు కాబట్టి అప్పు తీసుకున్నవారి కాంటాక్ట్ వివరాలు, గ్యాలరీ, హిస్టరీ అన్ని రికార్డవుతాయి. దాంతో మార్ఫింగ్ చేసిన కుటుంబ సభ్యుల ఫొటోలు పంపి బ్లాక్మెయిల్ చేస్తారు. దాంతో బాధితులు తట్టుకోలేక అడిగినంత ముట్టజెపుతారు. ఆన్లైన్ రుణయాప్‌ల నియంత్రణకు పటిష్ఠ చట్టాలు, చర్యలు తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు. -
యాప్‌ల కొనుగోళ్లకు కంపెనీల పన్నాగం.. ఎలా మోసం చేస్తున్నారంటే..
మొబైల్ అప్లికేషన్ స్టోర్స్ నుంచి యాప్‌లు లేదా ఇతరత్రా సాఫ్ట్వేర్లను కొనుగోలు చేస్తున్న వారిలో చాలా మంది సబ్‌స్కిప్షన్ వలలో చిక్కుకుంటున్నారు. ముందుగా చెప్పకుండా తర్వాత వడ్డించే ఛార్జీలతో (హిడెన్ చార్జీలు) నానా తంటాలు పడుతున్నారు. ఆన్లైన్ రీసెర్చ్ సంస్థ లోకల్‌సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో సగం మంది పైగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు. ఉచిత యాప్‌ను లేదా వన్–టైమ్ సర్వీస్‌ను ఎంచుకున్న వినియోగదారులు ఆ తర్వాత సబ్‌స్కిప్షన్ ఉచ్చులో పడుతున్న సందర్భాలు పెరుగుతున్న నేపథ్యంలో లోకల్‌సర్కిల్స్ సర్వే ప్రాధాన్యం సంతరించుకుంది. డార్క్ ప్యాటర్న్‌లను (మోసపూరితంగా కస్టమర్లను ఆకర్షించడం) నిషేధిస్తూ కేంద్రీయ వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) నవంబర్ 30న ఒక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 13 రకాల డార్క్ ప్యాటర్న్‌లను ప్రస్తావించింది. అప్పటికప్పుడు వెంటనే చర్యలు తీసుకునేలా తొందరపెట్టడం, సబ్‌స్కిప్షన్ వల వేయడం, విసిగించడం మొదలైనవి వీటిలో ఉన్నాయి. తాజాగా లోకల్‌సర్కిల్స్ సర్వేలో వెల్లడైన మరిన్ని విషయాలను చూస్తే.. యాప్ ప్లాట్‌ఫాంలు, ఎస్ఏఏఎస్ ప్లాట్‌ఫాంల ద్వారా వన్–టైమ్ సాఫ్ట్వేర్ లేదా సర్వీస్ అంటూ తమకు అంటగట్టిన వాటిల్లో చాలా మటుకు సబ్స్క్రిప్షన్ కోసం పన్నిన పన్నాగాలేనని సర్వేలో పాల్గొన్న వారిలో 67 శాతం మంది వినియోగదారులు తెలిపారు. కొనుగోలుకు సంబంధించి చెల్లింపులు జరిపేటప్పుడు ముందుగా చెప్పని బోలెడన్ని హిడెన్ చార్జీలు తెరపైకి వచ్చినట్లు 71 శాతం మంది పేర్కొన్నారు. యాప్ ప్లాట్‌ఫాంలు, ఎస్ఏఏఎస్ ప్లాట్‌ఫాంల ద్వారా తాము కొన్నది ఒకటైతే తమకు అందినది మరొకటని 50 శాతం మంది వినియోగదారులు తెలిపారు. యాప్ ప్లాట్‌ఫాంల ద్వారా తాము డౌన్లోడ్ చేసుకున్న కొన్ని యాప్‌లలో మాల్వేర్ ఉందని, ఫలితంగా తమ డివైజ్‌ల నుంచి ప్రైవేట్ సమాచారం చోరీకి గురైందని 25 శాతం మంది వినియోగదారులు వివరించారు. ఇదీ చదవండి: ఆన్లైన్ గేమ్‌ల కోసం ప్రభుత్వంతో ఒప్పందం.. ఎందుకంటే.. యాప్‌లు లేదా సాఫ్ట్వేర్ సర్వీసుల యూజర్లపై 2023 డిసెంబర్ 1 నుంచి 2024 జనవరి 30 వరకు 331 జిల్లాల్లో నిర్వహించిన ఈ సర్వేకు 44,000 పైచిలుకు సమాధానాలు వచ్చాయి. -
‘దొంగ’ నాటకం!
సాక్షి, అమరావతి: ఎన్నికల యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిరక్షించడంతో విపక్షం దొంగ నాటకానికి తెర పడింది! వచ్చే ఎన్నికల్లోనూ 2019కి మించి ఘోర పరాజయం తప్పదని గుర్తించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఓటర్ల జాబితాలో అక్రమాలకు తెగబడుతున్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసిన ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్ కడప, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో లక్షల సంఖ్యలో వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నారు. ఈ నాలుగు జిల్లాల్లో లక్షలాది మంది అధికార పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు టీడీపీ ఎన్నికల సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ కోనేరు సురేష్ తప్పుడు సమాచారంతో గంపగుత్తగా ఫారం 7 దరఖాస్తులను ఎన్నికల సంఘానికి సమర్పించడం గమనార్హం. మిగతా తొమ్మిది ఉమ్మడి జిల్లాలతో పోలిస్తే ఈ నాలుగు జిల్లాల్లో దాదాపు మూడింతలు అధికంగా నకిలీ దరఖాస్తులు అందాయి. దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన జిల్లా కలెక్టర్లు వీటిల్లో 80 నుంచి 90 శాతం వరకు బోగస్ దరఖాస్తులేనని ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చారు. తప్పుడు సమాచారం ఇచ్చిన కోనేరు సురేష్ పై ఐపీసీ సెక్షన్ 182, ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 సెక్షన్ 31 మేరకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందానికి మరోసారి ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. నాడు సేవామిత్ర.. నేడు మైపార్టీ డ్యాష్ బోర్డ్ గతంలో సేవామిత్ర యాప్ తరహాలోనే తాజాగా మైపార్టీ డ్యాష్ బోర్డ్ డాట్‌కామ్ వెబ్సైట్ ద్వారా ఓటర్ల వ్యక్తిగత వివరాలను సేకరించిన టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా పది లక్షల మందికిపైగా ఓటర్లను తొలగించేందుకు ఫారం 7 దరఖాస్తులను గంపగుత్తగా సమర్పించింది. వైఎస్సార్సీపీకి మద్దతు ఇస్తున్న వారిని బతికున్నా చనిపోయినట్లుగా చిత్రీకరించడంతోపాటు అర్హులైన ఓటర్లను నకిలీలుగా, స్థానికంగా నివాసం ఉంటున్నా శాశ్వతంగా వలస వెళ్లినట్లు పేర్కొంటూ వీటిని దాఖలు చేసింది. మరికొందరిని రెండు ప్రదేశాల్లో రెండు ఓట్లు ఉన్నట్లు తప్పుడు సమాచారం సమర్పించి జాబితా నుంచి తొలగించే వ్యూహం రచించింది. కుప్పలు తెప్పలుగా అందిన ఫారం 7 దరఖాస్తుల్లో 70 నుంచి 80 శాతం తప్పుడువేనని తేల్చుతూ ఎన్నికల సంఘానికి కలెక్టర్లు నివేదిక ఇచ్చారు. గత ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్, నెల్లూరు, విజయనగరం జిల్లాల పరిధిలో శాసనసభ, లోక్‌సభ స్థానాలను వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీ అక్కడ కనీసం ఉనికి కూడా చాటుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ నాలుగు జిల్లాలపై ప్రత్యేకంగా గురి పెట్టి అధికార పార్టీ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు టీడీపీ బోగస్ దరఖాస్తులను సమర్పిస్తోంది. నెల్లూరులో సింహభాగం నకిలీ ♦ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో 11,291 ఓట్లు తొలగించాలంటూ నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కోనేరు సురే‹Ùతో కలిసి ఫారం 7 దరఖాస్తులు సమర్పించారు. వాటిలో 85 శాతానికి పైగా బోగస్ అని అధికారుల విచారణలో వెల్లడైంది. జిల్లాలోని మిగతా ఆరు నియోజకవర్గాల్లోనూ ఇదే కథ. విజయనగరం 4 నియోజకవర్గాల్లో ♦విజయనగరం జిల్లాలో రాజాం, చీపురుపల్లి, నెల్లిమర్ల, శృంగవరపుకోట నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులైన 19,407 మంది ఓట్లు తొలగించాలని కోనేరు సురేష్ గంపగుత్తగా ఫారం 7లను ఎన్నికల సంఘానికి సమర్పించాడు. ♦ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన విజయనగరం జిల్లా కలెక్టర్ 8,318 ఫారం 7లు తప్పుడువని తేల్చుతూ నివేదిక ఇచ్చారు. కర్నూలులో 88 శాతం బోగస్ ♦కర్నూలు, పాణ్యం, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు నియోజక వర్గాల్లో 67,370 ఓట్లు తొలగించాలంటూ గంపగుత్తగా ఫారం 7 దరఖాస్తులను టీడీపీ ఎన్నికల సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ కోనేరు సురేష్ ఎన్నికల సంఘానికి అందజేశాడు. వీటిలో అత్యధికంగా కోడుమూరులో 17,576, ఆదోనిలో 13,968, ఆలూరులో 11,581 బోగస్ దరఖాస్తులున్నాయి. ♦ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా కలెక్టర్ వీటిపై బీఎల్వోలు, డిప్యూటీ తహసిల్దార్లు, తహసిల్దార్లతో క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించగా 59,054 ఫారం 7లు బోగస్ అని తేలింది. అంటే 88 శాతం తప్పుడు ఫారం 7లు సమర్పించినట్లు స్పష్టమవుతోంది. 11,935 మంది బతికే ఉన్నా వారు చనిపోయినట్లుగా చిత్రీకరించి వారి ఓటు హక్కును కాలరాసేందుకు టీడీపీ కుట్ర పన్నినట్లు విచారణలో వెల్లడైంది. అన్నమయ్య.. అక్రమ మార్గంలో ♦ అన్నమయ్య జిల్లాలో రాయచోటి, రాజంపేట, కోడూరు, పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులైన 40,358 మంది ఓట్లు తొలగించాలంటూ కోనేరు సురేష్ గంపగుత్తగా ఫారం 7 దరఖాస్తులను ఎన్నికల సంఘానికి అందచేశాడు. ♦ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ 25,097 దరఖాస్తులు నకిలీవని నిర్థారించారు. అక్కడ ఆరు నియోజకవర్గాల్లో 8,355 మంది బతికే ఉన్నా చనిపోయినట్లుగా చిత్రీకరించి టీడీపీ తప్పుడు దరఖాస్తులు సమర్పించినట్లు బహిర్గతమైంది. -
యాప్ డౌన్లోడ్ చేయగానే.. తగిలిన బిగ్‌షాక్..!
హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు వైద్యురాలికి 95 వేల రూపాయలు టోకరా వేశారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 3 శ్రీనికేతన కాలనీలో నివసించే లక్ష్మి వైద్యురాలు. గత నెల 15న ఆమెకు ఓ వ్యక్తి ఫోన్ చేసి తాను ఎస్బీఐ క్రెడిట్ కార్డు విభాగం నుంచి ఫోన్ చేస్తున్నట్టు చెప్పాడు. ఏదైనా ఫిర్యాదు ఉందా అని అడిగాడు. తాను చేసిన 41,955 రూపాయలకు సంబంధించి ఆన్లైన్ షాపింగ్‌పై అనుమానాలు ఉన్నాయని ఆమె తెలిపారు. దీంతో ఫోన్ చేసిన వ్యక్తి కొన్ని వివరాలు అడగగా ఫోన్లో ఇవ్వలేనని నిరాకరించారు. అయితే ఓ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో వివరాలు పొందుపరిస్తే సమస్య పరిష్కరిస్తామని చెప్పాడు. ఈ మేరకు లక్ష్మి యాప్ డౌన్లోడ్ చేసి సమాచారం నమోదు చేసిన వెంటనే ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.95వేలు డ్రా అయినట్టు మెస్సేజ్ వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఫేక్ లోన్‌యాప్‌లపై నిఘా
సాక్షి, అమరావతి: లోన్‌యాప్‌ల వేధింపులు, మోసాలను కట్టడి చేసేందుకు పోలీసుశాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఉమ్మడి కార్యాచరణకు ఉపక్రమించాయి. అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న లోన్‌యాప్‌లపై నిఘా పెట్టాయి. ప్రధానంగా చైనాలోని లోన్‌యాప్ కంపెనీలు మన దేశంలో అనధికారికంగా ఏజెంట్లను పెట్టుకుని సాగిస్తున్న దందాకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా రంగంలోకి దిగాయి. ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఈడీ) దేశంలోని వివిధ ప్రాంతాల్లో లోన్‌యాప్ కంపెనీల కార్యాలయాలపై విస్తృతంగా దాడులు నిర్వహించింది. యూపీఐ ఖాతాల ద్వారా చైనాకు భారీగా నిధులు తరలిస్తున్న వివిధ కంపెనీలను గుర్తించింది. ఆ కంపెనీల కార్యాలయాల్లోని కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్‌లను పరిశీలించగా లోన్‌యాప్ దందా మొత్తం బట్టబయలైంది. దీంతో ఆ ఫేక్ లోన్‌యాప్ కంపెనీల జాబితాలను అన్ని జిల్లాలకు పంపించి వాటి కార్యకలాపాలు అడ్డుకునేందుకు పోలీసుశాఖ ఉద్యుక్తమైంది. ఆకర్షణీయమైన పేర్లతో బురిడీ చైనాకు చెందిన లోన్‌యాప్ కంపెనీలు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, లక్నో తదితర నగరాల్లో అనధికారికంగా బీపీవో కేంద్రాలను ఏర్పాటుచేసి ఈ దందా సాగిస్తున్నాయి. హైదరాబాద్, చెన్నైల్లోని కేంద్రాల నుంచే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ కంపెనీలు వ్యవహారం నడుపుతున్నట్లు గుర్తించారు. ఇవి ఆకర్షణీయమైన ఇంగ్లిష్ పేర్లతో ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నాయి. వాటిలో చాలా కంపెనీలు వివిధ అనుబంధ లోన్‌యాప్ కంపెనీలుగా ఒకే అడ్రస్‌తో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఇంగ్లిష్ స్పెల్లింగ్‌లో కొద్దిపాటి మార్పులతో ఒకేలా అనిపించే వివిధ పేర్లతో ఈ కంపెనీలు బురిడీ కొట్టిస్తున్నాయి. దేశంలో నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న 271 ఫేక్ లోన్‌యాప్ కంపెనీలను ఆర్బీఐ గుర్తించింది. వాటి కార్యకలాపాలు నిషేధించింది. వాటిపై పర్యవేక్షణను పటిష్టం చేయాలని అన్ని రాష్ట్రాల పోలీసు శాఖలకు సమాచారమిచ్చింది. ఆ కంపెనీలు ఇవే.. క్యాష్ అడ్వాన్స్ అటాచ్, ధన్ పల్, క్యాష్ హోస్ట్, రుపీక్, క్యాష్ మేనేజర్, ఫ్రీ లోన్, క్యాష్ అడ్వాన్స్ టీ1, క్యాష్కామ్, వాలెట్ ప్రో, వెల్ క్రెడిట్ గోల్డ్, హనీ లోన్, యూలవ్ట్ యాప్, హనీ లోన్‌యాప్, హ్యాండీ లోన్, క్యాష్ అడ్వాన్స్, లక్కీ లోన్‌యాప్, ర్యాపిడ్ పైసా, మనీ వ్యూ యాప్, డోవా క్యాష్ లోన్‌యాప్, కాయిన్ ట్రాక్, అవైల్ ఫైనాన్స్, హెల్ప్ మనీ అప్లికేషన్, క్రెడిట్బాక్స్ ఆల్ఫా లోన్ యాప్, ఫ్యూచర్ వాలెట్, హర్మనీ లోన్, నీడీ లోన్, సుగర్ మనీ, క్రెడిట్ కాయిన్ యాప్, అరేకో, క్రెడిట్ పెర్ల్, మే లోన్, ఫోర్ర్టెస్ లోన్‌యాప్, క్యాష్ క్రెడిట్, అరియకో లోన్, వాలెట్ ప్రో, కర్టెల్ లోన్, లక్కీ క్యాష్ లోన్, ఓకే రుపీ లోన్ అప్లికేషన్, హై క్రెడిట్ యాప్, సపోర్ట్ లోన్, క్విక్ మనీ యాప్, టాప్ క్యాష్ లోన్, ఈజీ బారో లోన్ యాప్, కార్ప్ వాలెట్, రూపీ బాక్స్, క్రెడిట్ మార్వెలెక్స్, రుపీరెడీ లోన్ యాప్, మెనీ లోన్, రుపీ పాకెట్, పే రుపీక్, క్రెడిట్ మార్వెల్, వాల్కనో లోన్, మోర్ లోన్, మేజిక్ లోన్, ఇన్స్టంట్ లోన్, ఎస్ క్యాష్, మేజిక్ మనీ, రుపీ పాపా, క్యాష్ ఎక్స్పీ, రుపీ ఓకే 1, క్యాష్ ఓకే, సన్‌షైన్ లోన్, క్రెడిట్ ఇట్ యాప్, పామ్రుపీ, ఈజీ ఆర్పీ, మనీ ల్యాడర్, ఎలిఫెంట్ క్యాష్, మ్యాజిక్ లోన్, క్యాష్ లోన్, పిళ్లై లోన్, క్రెడిట్ లోన్, రుపీ హాల్, ఇన్‌కం లోన్ యాప్, టాప్ క్యాష్, ఫ్లాష్ రుపీ, క్యాష్ స్టేషన్, రుపీ స్టార్, లింక్ మనీ, లోన్ హోమ్, రుఫిలో, మనీ స్టాండ్ క్రెడిట్ లోన్, బెలోన్ లోన్ యాప్, క్రెడిట్ మాంగో యాప్, పాపా మనీ లోన్‌యాప్, యోజన లోన్‌యాప్, లోన్ బ్రో లోన్‌యాప్, రుపీ హోమ్, క్రెజిబెన్, ఆ క్యాష్, క్రిస్టల్ లోన్, గోల్డ్ సీ, మనీ ట్యాంక్, యస్ రుపీస్, ఫ్లాష్ లోన్ యాప్, నీడ్ రుపీ, మామా లోన్‌యాప్, ధనీ, రెయిన్బో లోన్, క్విక్ క్యాష్, మనీ స్టాండ్, మనీ హౌస్, స్టే రుపీ, క్రెడిట్ రుపీ, క్యాష్ సమోసా, ఇన్ఫినిటీ క్యాష్, మే క్రెడిట్, లక్కీ లోన్, కిష్హ్ట్, రుఫిలో, మే లోన్‌యాప్, ఫ్లెక్స్లీ లోన్, మార్వెల్ లోన్, బాబా నాయక్ లోన్ ఫైనాన్స్, మినిట్స్ ఇన్ క్యాష్, బ్రో క్యాష్, గెట్ క్యాష్, డిస్కవర్ లోన్‌యాప్, క్యాష్ కౌ, ఈ–పైసా, షటిల్ లోన్, ఈఎస్ లోన్, ఆల్ఫా లోన్, హనీ లోనిన్, క్యాష్ లైట్, టాప్ క్యాష్, మాన్తా క్యాష్, ఓ క్యాష్, హలో బాక్స్, వల్లబై యాప్, జాస్మిన్ లోన్‌యాప్, అరాక్ లోన్, ఫాస్ట్ క్యాష్, ఓన్లీ లోన్, రుపియా బస్, లింక్ మనీ, లెండ్మాల్, క్రెడిట్ కింగ్, హై క్యాష్, యూపీఏ లోన్, గోల్డ్ మ్యాన్ పేబ్యాక్, హ్యాండీ లోన్, రుపీ కింగ్, మీ రుపీ, వన్ లోన్, క్యాష్ ఎనీ టైమ్, ఎక్స్‌ప్రెస్ లోన్, లోన్ డ్రీమ్, రుపీ లోన్, ఫ్లాష్ లోన్ మొబైల్, రుపీ స్టార్, వావ్ రుపీ, క్యాష్ పార్క్ లోన్, హూ క్యాష్, ఫస్ట్ క్యాష్, క్లియర్ లోన్, రుపీ బాక్స్, స్మాల్ లోన్, రిచ్, లోన్ గో, ఆసాన్ లోన్, లైవ్ క్యాష్, ఫాస్ట్ రుపీ, లోన్ ఫార్యూ్చన్, క్యాష్ పాకెట్, ఇన్‌స్టా లోన్, అప్పా పైసా, కోయిన్ రుపీ, క్యాష్ పాపా, లోన్ క్లబ్, హ్యాండ్ క్యాష్, లోన్ హోమ్ స్మాల్, ఐ క్రెడిట్, వెన్ క్రెడిట్, సమయ్ రుపీ, లెండ్ మాల్, సిల్వర్ పాకెట్, భారత్క్యాష్, మనీ మాస్టర్, ఈజీ లోన్, వార్న్ రుపీ, స్మార్ట్ కాయిన్, లక్కీ వాలెట్, యూపీవో లోన్.కామ్, బడ్డీ లోన్, క్యాష్ మైనే, టైటో క్యాష్, మై క్యాష్ లోన్, సింపుల్ లోన్, క్యాష్ మెషిన్ లోన్, ఫర్ పే, మినిట్ క్యాష్, ఫాస్ట్ పైసా, మోర్ క్యాష్, క్యాష్ బుక్, హ్యాండ్ క్యాష్ ఫ్రెండ్లీలోన్, రిలయబుల్ రుపీ క్యాష్, ఎర్లీ క్రెడిట్ యాప్, ఈగల్ క్యాష్‌లోన్ యాప్, క్యాష్ క్యారీ యాప్, క్యాష్ పార్క్, రిచ్ క్యాష్, ఫ్రెష్ లోన్, బెట్విన్నర్ బెట్టింగ్, రుపీ మాల్, సన్ క్యాష్, మినిట్ క్యాష్, బస్ రుపీ, ఓబ్ క్యాష్ లోన్, ఆన్ స్ట్రీమ్, క్యాష్‌లోన్, స్మాల్ లోన్, రుపయ బస్, ఇన్‌స్టా మనీ, స్లైస్ పే, లోన్ క్యూబ్, ఇకర్జా, మనీ స్టాండ్ ప్రో, పోక్ మనీ, క్వాలిటీ క్యాష్, లోన్ లోజీ, ఫర్‌పే యాప్, రుపీ ప్లస్, డ్రీమ్ లోన్, క్యాష్ స్టార్ మినిసో రుపీ, క్యాష్‌పాల్, ఫార్యూ్చన్ నౌ, క్రెడిట్ వాలెట్, పాకెట్ బ్యాంక్, లోన్‌జోన్, ఫాస్ట్ కాయిన్, స్టార్ లోన్, ఈజీ క్రెడిట్, ఏటీడీ లోన్, ట్రీ లోన్, బ్యాలన్స్ లోన్, క్యాష్ బౌల్, క్యాష్ కర్రీ, క్యాష్ మెషిన్, క్యాష్ పాకెట్ లైవ్ క్యాష్, క్యాష్ కోలా, 66 క్యాష్, కోకో లోన్, క్యాష్ హోల్, ఈజీ బారో క్యాష్ లోన్, ఐఎన్డీ క్యాష్ లోన్, వాలెట్ పేయి, క్యాష్ గురూ యాప్, గోల్డ్ క్యాష్, ఆరెంజ్ లోన్, ఏంజిల్ లోన్, లోన్ శాంతి, షార్ప్ లోన్, డెయిలీ లోన్, స్కై లోన్, మో క్యాష్, జో క్యాష్, బెస్ట్ పైసా, హెలో రూపీ, హాలిడే మొబైల్ లోన్, ఫోన్ పే లోన్, ప్లంప్ వాలెట్, క్యాష్ క్యారీ లోన్‌యాప్, క్రేజీ క్యాష్, క్విక్ లోన్‌యాప్, రాకెట్ లోన్, రుపీ మ్యాజిక్, రుష్ లోన్, బెలోనో లోన్‌యాప్, ఏజిల్ లోన్‌యాప్, క్యాష్ అడ్వాన్స్ 1, ఇన్కమ్ ఓకే. -
వాట్సాప్ వార్నింగ్.. ఈ యాప్ వాడితే మీ అకౌంట్ బ్లాక్
ప్రపంచ వ్యాప్తంగా మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి ఫోన్ లో వాట్సాప్ యాప్ ఉండాల్సిందే. దీనికి పెరుగుతున్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకొని చాలా ఫేక్ యాప్స్ పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా వాట్సాప్ లో లేని కొన్ని ఫీచర్స్ అందిస్తూ జీబీ వాట్సాప్ వేగంగా ముందుకు వచ్చింది. దీనిలో వాట్సాప్ యాప్ లో లేని అనేక ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. వాట్సాప్ ఈ ఏడాది ప్రారంభంలో తీసుకొచ్చిన ప్రైవసీ రూల్స్ కారణంగా జీబీ వాట్సాప్ విపరీతంగా పెరగిపోయింది. సులభంగా వాట్సాప్ స్టేటస్ డౌన్ లోడ్ చేసుకోవడం వంటివి. మీరు కనుక ఈ థర్డ్ పార్టీ యాప్ ఇన్స్టాల్ చేస్తే అన్ఇన్స్టాల్ చేయమన్న చేయలేరు. వాట్సాప్ యాప్ లో లేని అద్భుతమైన అనేక ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వారిని వాట్సాప్ హెచ్చరించింది. ఈ యాప్ వల్ల సెక్యూరిటీ పరంగా అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ జీబీ వాట్సాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో గానీ, ఇతర ఆండ్రాయిడ్ యాప్ స్టోర్లలోగానీ దొరకదు. అందువల్ల, ఈ యాప్ ద్వారా మీ డేటాకు సెక్యూరిటీ ఉండదని మీ వాట్సాప్ ఖాతా హ్యాక్ అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ యాప్ ను ఇన్స్టాల్ చేసుకున్న వారి ఒరిజినల్ వాట్సాప్ ఖాతాను బ్లాక్ చేసే అవకాశం ఉంది. అందువల్ల, మీ మొబైల్లో జీబీ వాట్సాప్ యాప్ ఉంటే వెంటనే దాన్ని అన్ఇన్స్టాల్ చేసుకోండి. చదవండి: జూలై 1 నుంచి అమలులోకి రానున్న కొత్త రూల్స్ ఇవే! -
గూగుల్ క్రోమ్ యాప్‌తో జర జాగ్రత్త!
కరోనా మహమ్మారి కాలంలో సైబర్ దాడులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు మెయిళ్లు, లింక్‌లు, మెసేజ్‌లతో హ్యాకింగ్ చేస్తే ఇప్పుడు ఏకంగా గూగుల్ క్రోమ్ యాప్‌నే సైబర్ నేరగాళ్లు మోసాల కోసం వాడుకుంటున్నారు. గూగుల్ క్రోమ్ యాప్ లాంటి ఒక కొత్త నకిలీ గూగుల్ క్రోమ్ మాల్వేర్ యాప్ ను సృష్టిస్తున్నారు. ఇప్పటికే కొన్ని లక్షల మొబైల్స్ కి మాల్వేర్ సోకినట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ ప్రెడియో పరిశోధకులు తెలిపారు. స్మిషింగ్ ట్రోజాన్ ను నకిలీ గూగుల్ క్రోమ్ ద్వారా ఫోన్లోకి పంపించి మొబైల్‌నే ఏకంగా మాల్వేర్ సూపర్ స్ప్రెడర్గా మార్చేస్తున్నట్లు సైబర్ పరిశోధకులు వెల్లడిస్తున్నారు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. నకిలీ గూగుల్ క్రోమ్ యాప్ అనేది మొబైల్ పై దాడి చేయడంలో ఒక భాగం మాత్రమే. ఈ నకిలీ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక మీ క్రెడిట్ కార్డ్ వివరాలను దొంగలించడంతో పాటు ఇతరులకు మెసేజ్‌ల ద్వారా స్పామ్, ఫిషింగ్ లింక్‌లను పంపించి మొబైల్స్‌ను హ్యాక్ చేయడానికి వెక్టర్‌గా ఉపయోగిస్తుంది. గత వారాల్లో లక్షలాది మంది దీని భారీనా పడినట్లు అంచనా వేస్తున్నాము అని ప్రెడియో పరిశోధకులు తమ వెబ్‌సైట్‌లోని ‘సెక్యూరిటీ అలర్ట్ ’పోస్ట్‌లో చెప్పారు. నకిలీ గూగుల్ క్రోమ్ యాప్ మీ ఫోన్లోకి ఎలా ప్రవేశిస్తుంది? మీకు విదేశాల నుంచి ఏదో పార్సిల్ వచ్చిందని, అది కావాలంటే కొంత డబ్బు కట్టాలని మోసగాళ్లు ఒక మెసేజ్ పంపిస్తారు. ఆ మెసేజ్ లో ఉన్న లింక్‌ను క్లిక్ చేసిన తర్వాత క్రోమ్ యాప్ అప్డేట్ చేయమని కోరుతుంది. ఒకవేళ మీరు క్రోమ్ యాప్ అప్డేట్ చేస్తే ఇక అంతే సంగతులు. అప్డేట్ తర్వాత మీ గూగుల్ క్రోమ్ మాల్వేర్ యాప్ లాగా మారిపోతుంది. తర్వాత ప్యాకేజీని డెలివరీ చేయడానికి క్రెడిట్ కార్డుల ద్వారా ఒకటి లేదా రెండు డాలర్లు చెల్లించాలి అని పేర్కొంటుంది. మీరు కనుక క్రెడిట్ కార్డ్ ద్వారా డబ్బులు చెల్లిస్తే మీ వివరాలన్నీ సైబర్ క్రైమినల్ చేతికి చిక్కుతాయి. దీంతో ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. దీన్నే స్మిషింగ్ ట్రోజాన్ అంటున్నారు. మీ ఫోన్ మాల్వేర్ ‘సూపర్ స్ప్రెడర్’ గా ఎలా మారుతుంది? ఇది ఇక్కడితో ఆగదు. నకిలీ గూగుల్ క్రోమ్ యాప్ బాధితుడి ఫోన్లోకి ఇన్స్టాల్ అయిన తర్వాత. బాధితుల మొబైల్ నుంచి వారానికి 2000 కంటే ఎక్కువ మెసేజ్ లను, ప్రతిరోజూ 2 లేదా 3 గంటలలో ఒకరినొకరు అనుసరిస్తున్నట్లు అనిపించే యాదృచ్ఛిక ఫోన్ నంబర్లకు పంపుతుంది. ఇలా ఒకరి మొబైల్ నుంచి మరొక మొబైల్ కి పంపించి దాడి చేస్తారు. ఈ నకిలీ గూగుల్ క్రోమ్ యాప్ చూడటానికి అధికారిక క్రోమ్ యాప్ లాగే ఏమాత్రం అనుమానం రాకుండా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. యాప్ ఇన్ఫోలో ప్యాకేజీ పేరు లాంటి వివరాలు చూసి నిజమైనది కానిది గుర్తుపట్టొచ్చు. మొబైల్లోని యాంటీ వైరస్లు సైతం దీన్ని గుర్తించనంత పకడ్బందీగా హ్యాకర్లు ఈ ఫేక్ గూగుల్ క్రోమ్ యాప్‌ను సిద్ధం చేశారు. ప్రస్తుతానికి, పరిశోధకులు రెండు నకిలీ క్రోమ్ యాప్ లు కనుగొన్నారు. ఇలాంటి సైబర్ నెరగాళ్ల చేతిలో చిక్కుకుండా ఉండటానికి ఎలాంటి లింక్స్ క్లిక్ చేయకపోవడం మంచిది అని పరిశోధకులు చెబుతున్నారు. ఎక్కడ కూడా డెబిట్/ క్రెడిట్ కార్డు వివరాలను నమోదు చేయవద్దు అని సూచిస్తున్నారు. మొబైల్ వినియోగదారులు ఎల్లప్పడు అధికారిక గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసి అప్డేట్ చేసుకోవాలని కోరారు. చదవండి: మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్! -
ఒక్క మెసేజ్‌తో రూ. 41.98 లక్షలు కొట్టేశాడు
సాక్షి, నాగోలు: ఆన్లైన్లో నకిలీ యాప్ సృష్టించి మోసాలకు పాల్పడుతున్న మధ్యప్రదేశ్‌కి చెందిన ఆదిత్య నారాయణ్ గాడ్బోలే (37)ను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి రూ.11.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన మేరకు.. నాగోలుకు చెందిన ఓ వ్యక్తి ఫేస్బుక్లో వచ్చిన నోటిఫికేషన్‌ను క్లిక్ చేశాడు. పెట్టుబడులు పెడితే అంతకు మించి ఆదాయం చూపిస్తామని ఓ యువతి ఫోన్లో చెప్పడంతో గత డిసెంబర్ 1వ తేదీ నుంచి 17వరకు 17 రోజుల్లోనే రూ. 41.98 లక్షల నగదును అకౌంట్ ద్వారా ట్రాన్స్ ఫర్ చేశాడు. ఆ తర్వాత అవతలి వైపు నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో బాధితుడు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడు మధ్యప్రదేశ్ ఇండోర్‌కు చెందిన ఆదిత్య నారాయణ్ గోడ్బోలేగా గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించారు. ఆన్లైన్లో ఫారెక్స్ ట్రేడింగ్ యాప్‌ను చైనాకు చెందిన మౌజిబిన్ అనే వ్యక్తి తయారు చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఆదిత్య నారాయణ్ గతంలో చైనాలో ఎంబీబీఎస్ చదివాడు. -
నకిలీ హాల్ టికెట్‌తో సివిల్స్ పరీక్షకు..
సాక్షి, హైదరాబాద్: యూపీఎస్సీ సివిల్‌సర్వీసెస్(మెయిన్స్) పరీక్షలకు శుక్రవారం ఓ యువతి నకిలీ హాల్‌టికెట్‌తో రావడాన్ని అధికారులు గుర్తించారు. కర్నూల్ జిల్లాకు చెందిన యువతి బజార్‌ఘాట్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ పరీక్షా కేంద్రంలో హాల్‌టికెట్(నెంబర్ 7601738) పరీక్షకు హాజరయ్యింది. హాల్ టికెట్‌ను పరిశీలించిన చీఫ్ అబ్జర్వర్ నకిలీదిగా గుర్తించారు. దీనిపై విచారణ జరిపిన అధికారులు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు హైదరాబాద్ జిల్లా పౌరసంబంధాల అధికారి పేర్కొన్నారు. -
‘తెలంగాణ ధరణి’ పేరుతో నకిలీ యాప్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన ధరణి వెబ్‌సైట్‌కు లింక్ చేస్తూ నకిలీ యాప్ సృష్టించిన ఇద్దరు కర్ణాటక వాసులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరు ఆ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ ద్వారానే పోస్ట్ చేసినట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ శనివారం తెలిపారు. ప్రభుత్వం రూపొందించిన ధరణి వెబ్సైట్లో భూ రికార్డులు, పహాణీ, ఫామ్ బీ–1, తదితరాలు పొందుపరిచింది. సర్కారు ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి మొబైల్ యాప్‌ను రూపొందించలేదు. దీన్ని గమనించిన కర్ణాటకలోని బసవకల్యాణం ప్రాంతానికి చెందిన ప్రేమ్ మూలే, మహేశ్ కుమార్ ధండోటే ఓ మొబైల్ యాప్ రూపొందించారు. దీనికి ‘ధరణి తెలంగాణ ల్యాండ్ రికార్డ్స్’అనే పేరు పెట్టారు. గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్‌ను చూసిన అనేక మంది దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. నిందితులు యూట్యూబ్ ద్వారా యాప్ తయారీ నేర్చుకుని, దానిని క్లిక్ చేస్తే తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ధరణి వెబ్‌సైట్‌కు లింకు అయ్యేలా మాత్రమే డిజైన్ చేయగలిగారు. అంతకు మించి ఇందులో ఏ వివరాలూ పొందుపరచలేదు. ఈ యాప్ విషయం ఇటీవల తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ దృష్టికి వచ్చింది. దీంతో సంబంధిత అధికారులు సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ భద్రంరాజు రమేశ్, ఎస్సై వెంకటేశం దర్యాప్తు చేశారు. గూగుల్ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ప్రేమ్, మహేశ్ ఈ యాప్‌ను రూపొందించినట్లు గుర్తించారు. దీంతో అక్కడకు వెళ్ళిన ప్రత్యేక బృందం నిందితులను అరెస్టు చేసి తీసుకువచ్చింది. ఇద్దరినీ కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
మోసపూరిత యాప్‌లకు పేటీఎం చెక్
న్యూఢిల్లీ: అనుమానాస్పద కార్యకలాపాలను కొనసాగించే మొబైల్ అప్లికేషన్లను గుర్తించి వాటికి చెక్ పెట్టే అధునాతన ఫీచర్‌ను పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘రోగ్’ పేరిట ఈ ఫీచర్‌ను అందిస్తోంది. మోసపూరిత లావాదేవీలను పసిగట్టి.. ఏ యాప్ ద్వారా సమాచారం చేరిందో తెలుసుకుని, అటువంటి యాప్‌లను గుర్తించి వాటిని అన్ఇన్స్టాల్ చేయమని వినియోగదారులకు సూచిస్తుంది. -
ఓటు గల్లంతుపై వైఎస్ వివేకా సీరియస్
సాక్షి, పులివెందుల: తన ఓటు తొలగించాలని దాఖలైన నకిలీ దరఖాస్తుపై దివంగత ముఖ్యమంతి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి సీరియస్ అయ్యారు. ఓట్ల తొలగింపు అక్రమాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని సోమవారం పులివెందుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తనకు తెలియకుండా.. తన పేరు మీదే ఓటు తొలగించాలని దరఖాస్తు చేయడంపై విస్మయం వ్యక్తం చేశారు. ఏడాదిన్నర నుంచే ఓట్ల తొలగింపునకు వ్యుహరచన జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50లక్షల ఓట్లు తొలగించేందుకు అధికార టీడీపీ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. ఇది ప్రజల హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు. ఈ అంశంలో ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. తన ఓటు గల్లంతుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. కాగా, వైఎస్ వివేకానందరెడ్డికి ఓటు తొలగించాలని గుర్తు తెలియని వ్యక్తులు శనివారం తహశీల్దార్ కార్యాలయానికి ఆన్లైన్లో దరఖాస్తు పంపారు. అయితే ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా అధికార టీడీపీ.. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల ఓట్లను దొంగ సర్వేల ద్వారా గుర్తించి వాటిని తొలగించే కార్యక్రమాన్ని చేపట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ వివేకానందరెడ్డితోపాటు పులివెందుల నియోజకవర్గంలోని చాలా మంది వైఎస్సార్ సీపీ సానుభనూతిపరుల ఓట్ల తొలగింపుకు ఆన్లైన్లో భారీగా దరఖాస్తులు రావడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉంది. ఇటువంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడేవారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రజాస్వామ్యవాదులు డిమాండ్ చేస్తున్నారు. -
వాట్సాప్ యాప్‌ను డౌన్లోడ్ చేయకండి!
న్యూఢిల్లీ : వాట్సాప్.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన మెసేజింగ్ మాధ్యమం. ఈ పాపులారిటీని క్యాష్ చేసుకునే, కొందరు దీని డూప్లికేట్‌ను రూపొందించి. థర్డ్ పార్టీ కంపెనీలకు మీ వ్యక్తిగత వివరాలను చేరవేస్తున్నారు. నకిలీ వాట్సాప్ యాప్ ఆన్లైన్లో స్పాట్ అయింది. వాట్సాప్ ప్లస్ పేరుతో ఆన్లైన్ ఉన్న ఈ యాప్, మీ వ్యక్తిగత సమాచారాన్ని పొందుతుందని మాల్వేర్బైట్స్ ల్యాబ్ రిపోర్టు చేసింది. ఇది చాలా ప్రమాదకరమైన యాప్ అని రిపోర్టు హెచ్చరించింది. Android/PUP.Riskware.Wtaspin.GB కి ఇది వేరియంట్ అని తెలిపింది. లింక్‌ల ద్వారా షేర్ అయే ఈ నకిలీ వాట్సాప్ ప్లస్ యాప్, ఏపీకే ఫైల్లో డౌన్లోడ్ అవుతుందని పేర్కొంది. ఒక్కసారి ఇది డౌన్లోడ్ అయి, ఇన్స్టాల్ అయితే, మధ్యలో యూఆర్ఎల్తో గోల్డ్ రంగులో వాట్సాప్ లోగో యూజర్లకు కనిపిస్తుందని రిపోర్టు తెలిపింది. ‘అగ్రి అండ్ కంటిన్యూ’ బటన్‌పై క్లిక్ చేస్తే, ప్రస్తుతం ఈ యాప్ అవుట్ డేట్ అయిందని, గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి లేటెస్ట్ వెర్షన్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆ యాప్‌పై కనిస్తోంది. ఎవరైతే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటారో వారికి ‘వాట్స్ ప్లస్ ప్లస్ వాట్సాప్’ అనే యాప్ డౌన్లోడ్ అయి, ఎప్పడికప్పుడూ అది అప్డేట్ అవుతూ యూజర్ల డేటాను దొంగలిస్తుందని మాల్వేర్బైట్స్ నివేదించింది. ఈ యాప్‌లో హైడింగ్ రిసీవ్ టెక్ట్స్, టైపింగ్ మెసేజ్, రీడింగ్ టెక్ట్స్, వాయిస్ క్లిప్‌ను హైడ్ చేయడం వంటి ఫీచర్లున్నాయని రిపోర్టు పేర్కొంది. అయితే ఈ యాప్ ఎలా పనిచేస్తుందో మాత్రం మాల్వేర్బైట్స్ రివీల్ చేయలేదు. ఈ నకిలీ వాట్సాప్ వ్యవస్థాపకుడు ఎవరో కూడా ఇంకా తెలియలేదు. గూగుల్ ప్లేలో ఉన్న నిజమైన వాట్సాప్ వైపే యూజర్లు మొగ్గుచూపాలని వెబ్సైట్ సూచిస్తోంది. ప్రస్తుతమైతే గూగుల్ తన ప్లే స్టోర్ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న హానికరమైన యాప్స్‌ను తొలగించడానికి ప్రయత్నిస్తోంది. -
సినీ నటుడు రామ్ చరణ్ పేరుతో ఓటర్ దరఖాస్తు
ధర్మవరం : ఆన్లైన్ ద్వారా ఓటరు నమోదుకు ప్రభుత్వం కల్పించిన సౌకర్యాన్ని ధర్మవరానికి చెందిన కొందరు ఆకతాయిలు దుర్వినియోగం చేశారు. కేంద్రమంత్రి చిరంజీవి తనయుడు, సినీనటుడు రాంచరణ్ తేజను ధర్మవరం ఓటరుగా నమోదు చేయాలంటూ 27939854 ఐడీ నెంబర్‌తో చేసిన దరఖాస్తులో పేరు చరణ్, ఇంటిపేరు బండి, వయసు 53 ఏళ్లు, పుట్టిన తేదీ 8-6-1960, తండ్రి పేరు చిరు అని, పట్టణంలోని రాంనగర్‌లోని డోర్‌నెంబర్ 8-168ఎ ఇంట్లో నివసిస్తున్నట్లు పేర్కొన్నారు. రాంచరణ్ నటించిన మగధీర సినిమాలోని ఫొటోను జత చేశారు. అధికారులు ఈ విషయాన్ని ఆర్డీఓ నాగరాజు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన శుక్రవారం తహసీల్దార్ల సమావేశం నిర్వహించి ఓటరు నమోదు ప్రక్రియ సక్రమంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. ఆన్లైన్ ద్వారా అందే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే అనుమతించాలని సూచించారు.