న్యూఢిల్లీ : వాట్సాప్.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన మెసేజింగ్ మాధ్యమం. ఈ పాపులారిటీని క్యాష్ చేసుకునే, కొందరు దీని డూప్లికేట్‌ను రూపొందించి. థర్డ్ పార్టీ కంపెనీలకు మీ వ్యక్తిగత వివరాలను చేరవేస్తున్నారు. నకిలీ వాట్సాప్ యాప్ ఆన్‌లైన్‌లో స్పాట్ అయింది. వాట్సాప్ ప్లస్ పేరుతో ఆన్‌లైన్ ఉన్న ఈ యాప్, మీ వ్యక్తిగత సమాచారాన్ని పొందుతుందని మాల్‌వేర్‌బైట్స్ ల్యాబ్ రిపోర్టు చేసింది. ఇది చాలా ప్రమాదకరమైన యాప్ అని రిపోర్టు హెచ్చరించింది. Android/PUP.Riskware.Wtaspin.GB కి ఇది వేరియంట్ అని తెలిపింది. లింక్‌ల ద్వారా షేర్ అయే ఈ నకిలీ వాట్సాప్ ప్లస్ యాప్, ఏపీకే ఫైల్‌లో డౌన్‌లోడ్ అవుతుందని పేర్కొంది. ఒక్కసారి ఇది డౌన్‌లోడ్ అయి, ఇన్‌స్టాల్ అయితే, మధ్యలో యూఆర్‌ఎల్‌తో గోల్డ్ రంగులో వాట్సాప్ లోగో యూజర్లకు కనిపిస్తుందని రిపోర్టు తెలిపింది.
‘అగ్రి అండ్ కంటిన్యూ’ బటన్‌పై క్లిక్ చేస్తే, ప్రస్తుతం ఈ యాప్ అవుట్ డేట్ అయిందని, గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి లేటెస్ట్ వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆ యాప్‌పై కనిస్తోంది. ఎవరైతే డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటారో వారికి ‘వాట్స్ ప్లస్ ప్లస్ వాట్సాప్’ అనే యాప్ డౌన్‌లోడ్ అయి, ఎప్పడికప్పుడూ అది అప్‌డేట్ అవుతూ యూజర్ల డేటాను దొంగలిస్తుందని మాల్‌వేర్‌బైట్స్ నివేదించింది. ఈ యాప్‌లో హైడింగ్ రిసీవ్ టెక్ట్స్, టైపింగ్ మెసేజ్, రీడింగ్ టెక్ట్స్, వాయిస్ క్లిప్‌ను హైడ్ చేయడం వంటి ఫీచర్లున్నాయని రిపోర్టు పేర్కొంది. అయితే ఈ యాప్ ఎలా పనిచేస్తుందో మాత్రం మాల్‌వేర్‌బైట్స్ రివీల్ చేయలేదు. ఈ నకిలీ వాట్సాప్ వ్యవస్థాపకుడు ఎవరో కూడా ఇంకా తెలియలేదు. గూగుల్ ప్లేలో ఉన్న నిజమైన వాట్సాప్ వైపే యూజర్లు మొగ్గుచూపాలని వెబ్‌సైట్ సూచిస్తోంది. ప్రస్తుతమైతే గూగుల్ తన ప్లే స్టోర్ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న హానికరమైన యాప్స్‌ను తొలగించడానికి ప్రయత్నిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment