ప్రపంచ వ్యాప్తంగా మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి ఫోన్ లో వాట్సాప్ యాప్ ఉండాల్సిందే. దీనికి పెరుగుతున్న క్రేజ్ని దృష్టిలో పెట్టుకొని చాలా ఫేక్ యాప్స్ పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా వాట్సాప్ లో లేని కొన్ని ఫీచర్స్ అందిస్తూ జీబీ వాట్సాప్ వేగంగా ముందుకు వచ్చింది. దీనిలో వాట్సాప్ యాప్ లో లేని అనేక ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. వాట్సాప్ ఈ ఏడాది ప్రారంభంలో తీసుకొచ్చిన ప్రైవసీ రూల్స్ కారణంగా జీబీ వాట్సాప్ విపరీతంగా పెరగిపోయింది. సులభంగా వాట్సాప్ స్టేటస్ డౌన్ లోడ్ చేసుకోవడం వంటివి.
మీరు కనుక ఈ థర్డ్ పార్టీ యాప్ ఇన్స్టాల్ చేస్తే అన్ఇన్స్టాల్ చేయమన్న చేయలేరు. వాట్సాప్ యాప్ లో లేని అద్భుతమైన అనేక ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వారిని వాట్సాప్ హెచ్చరించింది. ఈ యాప్ వల్ల సెక్యూరిటీ పరంగా అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ జీబీ వాట్సాప్ గూగుల్ ప్లే స్టోర్లో గానీ, ఇతర ఆండ్రాయిడ్ యాప్ స్టోర్లలోగానీ దొరకదు. అందువల్ల, ఈ యాప్ ద్వారా మీ డేటాకు సెక్యూరిటీ ఉండదని మీ వాట్సాప్ ఖాతా హ్యాక్ అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ యాప్ ను ఇన్స్టాల్ చేసుకున్న వారి ఒరిజినల్ వాట్సాప్ ఖాతాను బ్లాక్ చేసే అవకాశం ఉంది. అందువల్ల, మీ మొబైల్లో జీబీ వాట్సాప్ యాప్ ఉంటే వెంటనే దాన్ని అన్ఇన్స్టాల్ చేసుకోండి.
Comments
Please login to add a commentAdd a comment