ప్రమాదంలో వాట్సాప్ యూజర్లు (ఫైల్ ఫోటో)
మెసేజింగ్ మాధ్యమంగా ఎక్కువగా పాపులర్ అయిన వాట్సాప్ యూజర్లు ప్రమాదంలో పడబోతున్నారు. వాట్సాప్ యూజర్లను టార్గెట్ చేసిన ఒక కొత్త యాప్, యూజర్లు ఎప్పుడు ఆన్‌లైన్‌లో ఉంటున్నారు, ఎవరితో ఛాటింగ్ చేస్తున్నారు వంటి వివరాలను బహిర్గతం చేస్తుంది. ఈ యాప్ పేరు ఛాట్‌వాచ్‌గా తెలుస్తోంది. ఛాట్‌డబ్ల్యూగా ఇది అందుబాటులో ఉందట. ఈ యాప్ ద్వారా మీ వాట్సాప్ కాంటాక్ట్‌లు ఎప్పుడు ఆన్‌లైన్‌లో ఉంటున్నారు? ఎప్పుడు ఇద్దరు వ్యక్తులు ఛాటింగ్ చేసుకుంటున్నారు? వంటివి రాబట్టవచ్చని తెలుస్తోంది. ‘లాస్ట్ సీన్’ తీసేసినప్పటికీ, వాట్సాప్ కాంటాక్ట్‌ల యాక్టివిటీని ఇది కనిపెట్టేస్తుందట. అయితే ఈ యాప్ ఉచితంగా కాకుండా.. వారానికి రూ.140 చెల్లించి దీన్ని వాడుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. గత కొన్ని రోజుల వరకు గూగుల్ ప్లే స్టోర్, ఐఫోన్ ఐఓఎస్ యాప్ స్టోర్లలో అందుబాటులో ఉన్న ఈ ఛాట్‌డబ్ల్యూ యాప్, ఒక్కసారిగా రిపోర్టులు వాట్సాప్ యూజర్లను అలర్ట్ చేయడం ప్రారంభించిన తర్వాత, డిలీట్ చేసినట్టు తెలుస్తోంది.
అయితే పలు వెబ్‌సైట్లలో దీని ఏపీకే అందుబాటులో ఉందని, దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవడానికి వీలుంటుందని, వాట్సాప్ యూజర్లు జాగ్రత్తగా ఉండాలని రిపోర్టులు హెచ్చరిస్తున్నాయి. వాట్సాప్‌లో ఛాట్‌లో ఉన్నప్పుడు మీ గురించి ఎవరైనా అన్ని వివరాలు తెలిసినట్టు చెబితే, అనుమానించాల్సి ఉందని రిపోర్టులు వార్నింగ్ ఇస్తున్నాయి. మీరు ఛాట్‌వాచ్‌లో బారిని పడినట్టు గుర్తించాలని పేర్కొంటున్నాయి. ఏ సమయంలో మీ వాట్సాప్ స్నేహితులు నిద్రపోతున్నారు, ఏ సమయంలో లేస్తున్నారు, ఏ సమయంలో ఛాటింగ్ చేస్తున్నారు, ఎవరితో ఎక్కువగా ఛాట్ చేస్తున్నారు వంటి వివరాలను ఈ యాప్ బహిర్గతం చేస్తోందని తెలుస్తోంది. ఈ యాప్‌తో మీ స్నేహితుల, కుటుంబ సభ్యుల, ఉద్యోగుల వాట్సాప్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ యాక్టివిటీ ఇట్టే పట్టేయొచ్చట. అయితే వాట్సాప్ యాప్ ఫుల్ ఎండ్‌టూఎండ్ సబ్‌స్క్రిప్షన్‌ను కలిగి ఉందని, మూడో వ్యక్తులు వాట్సాప్ యూజర్ల గోప్యతను దొంగలించడానికి కుదరదని ఓ వైపు ఆ కంపెనీ చెబుతున్నప్పటికీ, ఇలాంటి యాప్‌ల ద్వారా వాట్సాప్ యూజర్ల వివరాలు బయటికి వస్తుండటం ఆందోళన కలిగిస్తోందని టెక్ వర్గాలంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment