మెసేంజర్ యాప్ వాట్సాప్‌ను వాడుతున్న వాళ్ల సంఖ్య భారత్‌తో పాటు ప్రపంచం మొత్తంలో కోట్లలో ఉంది. యూజర్ భద్రత విషయంలో ఆందోళన వ్యక్తం అయినప్పుడల్లా.. ‘ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిష్షన్’ను చూపిస్తూ.. ఆల్ ఈజ్ వెల్ ప్రకటనలు చేస్తోంది వాట్సాప్. ఈ తరుణంలో వాట్సాప్ ద్వారా పంపించే ఫొటోల ద్వారా కూడా ఫోన్ డాటా హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందనే ఆసక్తికరమైన కథనం ఒకటి ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.
సాధారణంగా వాట్సాప్‌ను ఉపయోగించేవాళ్లు.. గ్యాలరీ ఫైల్స్ పంపించుకోవడం సహజం. అయితే వాట్సాప్‌కు ఫొటోను ఎటాచ్ చేశాక.. అక్కడే (వాట్సాప్ డిఫాల్ట్) ఉన్న ఫిల్టర్‌లను ఉపయోగించి ఎడిట్ చేసి పంపిస్తుంటారు కొందరు. ఇంకొందరు స్టేటస్‌లను కూడా అక్కడే ఎడిట్ చేసి అప్‌లోడ్ చేస్తుంటారు. ఇది హ్యాకర్ల పనిని సులువు చేస్తోందనేది టెక్ నిపుణుల వాదన. అంతేకాదు జిఫ్ ఫైల్స్ పంపే సమయంలోనే ఫోన్ డాటా హ్యాక్‌కు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు.
గుర్తుపట్టడం ఎలాగంటే..
ఫోటో ఫిల్టర్‌ను మార్చడం అంటే పిక్సెల్‌ను మార్చడం, లేదంటే షార్ప్‌నెస్ పెంచడం లాంటివి చేస్తుంటారు చాలామంది. ఇదంతా వాట్సాప్ ఆన్‌లోనే (ఆన్‌లైన్‌లోనే) జరిగే ప్రక్రియ. ఈ మెథడ్‌లో హ్యాకర్లు మాల్‌వేర్‌ను ఫోన్‌లోకి ప్రవేశపెట్టి.. తమ పనిని సులువుగా కానిచ్చేస్తుంటారు. ఇక జిఫ్ ఫైల్స్ పంపే టైంలో వాళ్లకు ఫోన్లను హ్యాక్ చేయడం చాలా తేలికైన పని. వాట్సాప్ ఫొటోలు, లేదంటే జిఫ్ ఫైల్స్ పంపే టైంలో ఫోన్ హ్యాకింగ్‌కు గురైందనే విషయాన్ని తేలికగానే గుర్తు పట్టొచ్చని చెప్తున్నారు. ఆ టైంలో ఫోన్ హ్యాంగ్ కావడం లేదంటే పూర్తి ఫంక్షనింగ్ ఆగిపోతుంద’ని పలువురు టెక్ ఎక్స్‌పర్ట్స్ అభిపప్రాయాలతో కూడిన కథనం ఓ ‘చెక్ పాయింట్ రీసెర్చ్’ బ్లాగ్‌లో పబ్లిష్ అయ్యింది.
అంత సీన్ లేదు
అయితే వాట్సాప్ మాతృక సంస్థ ఫేస్‌బుక్ మాత్రం ఈ కథనాల్ని తోసిపుచ్చుతోంది. జిఫ్ ఫైల్స్ లేదంటే ఎడిటెడ్ ఫోటోలు పంపిన టైంలో ఒక్కోసారి క్రాష్ కావడం సహజమని, అప్పుడు ఫోన్ హ్యాంగ్ అవుతుందని ఓ ప్రకటన విడుదల చేసింది. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిష్షన్ ద్వారా వాట్సాప్ యాప్ ఎప్పుడు సురక్షితమైన సేవలు అందిస్తోందని తెలిపింది. అసలు ఈ తరహా పద్దతిలో హ్యాక్ చేయడం అంత సులువైన విషయం కాదని, కాబట్టి అలాంటి ప్రచారాన్ని నమ్మొద్దని యూజర్లను కోరుతోంది.
Comments
Please login to add a commentAdd a comment