ప్రముఖ మెసేజింగ్ మాధ్యమం వాట్సాప్ యూజర్లు కూడా ప్రమాదంలో పడుతున్నారు. ఫేస్‌బుక్‌కు చెందిన 5 కోట్ల మంది యూజర్ల డేటాను గుర్తుతెలియన హ్యాకర్లు దొంగలించారని తెలియగానే.. వాట్సాప్ డేటా లీక్ కూడా వెలుగులోకి వచ్చింది. వాట్సాప్ ప్రైవేట్ చాట్లు, కీలక డేటా లీకవుతున్నట్టు వెల్లడైంది. ‘ఓన్‌మి’ అనే ఆండ్రాయిడ్ స్పైవేర్, వాట్సాప్ మెసేజ్‌లను, కాంటాక్ట్‌లను, కాల్ లాగ్స్‌ను, బ్రౌజింగ్ హిస్టరీని లీక్ చేస్తున్నట్టు తాజా రిపోర్టులు పేర్కొన్నాయి.
ఈఎస్‌ఈటీ సెక్యురిటీ రీసెర్చర్ లుకాస్ స్టెఫాంకో ఈ విషయాన్ని కనుగొన్నారు. గిట్‌హబ్‌లో ‘ఓన్‌మి’ అనే కోడ్ నేమ్‌తో ఈ ఆండ్రాయిడ్ స్పైవేర్ ఉందని లుకాస్ స్టెఫాంకో కనుగొన్నట్టు జీడేటా రిపోర్టు చేసింది. కేవలం వాట్సాప్ మెసేజ్‌లను హ్యాక్ చేయడమే కాకుండా, పలు ప్రామాణికమైన నిఘా ఫీచర్లను ఇది కలిగి ఉందని పేర్కొంది. డీ డేటా సెక్యురిటీ ల్యాబ్స్ ఈ కొత్త స్పైవేర్‌పై విచారణ ప్రారంభించింది. ‘సర్వీస్ స్టార్ట్’ అనే టెక్ట్స్ ఆండ్రాయిడ్ యూజర్లకు పాప్-అప్ మెసేజ్‌లో చూపిస్తే, అప్పటికే మాల్‌వేర్ ఆ డివైజ్‌ను అటాక్ చేసిందని రిపోర్టు వెల్లడించింది.
వాట్సాప్ యూజర్లు జాగ్రత్తగా ఉండాలని, గత కొన్నేళ్లుగా మొబైల్ మాల్‌వేర్ కేసులు పెరుగుతున్నాయని రిపోర్టు తెలిపింది. కాగా, నిన్ననే వాట్సాప్ యాజమాన్య కంపెనీ ఫేస్‌బుక్ కూడా తన యూజర్లపై భారీ దాడి జరిగినట్టు వెల్లడించింది. 5 కోట్ల మంది ఖాతాదారుల డేటాను హ్యాకర్లు దొంగలించినట్టు పేర్కొంది. వెంటనే వాట్సాప్ కూడా యూజర్ల మెసేజ్‌లను, కీలక డేటాను, ఫోటోలను మాల్‌వేర్ స్పైవేర్ లీక్ చేస్తుందని రిపోర్టులు వెలువడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment