new mallware
-
మార్కెట్ లోకి స్పిన్ ఒకే అనే ఆండ్రాయిడ్ మాల్వార్
-
వార్నింగ్ : వాట్సాప్ చాట్స్, మెసేజ్‌లు లీక్
ప్రముఖ మెసేజింగ్ మాధ్యమం వాట్సాప్ యూజర్లు కూడా ప్రమాదంలో పడుతున్నారు. ఫేస్‌బుక్‌కు చెందిన 5 కోట్ల మంది యూజర్ల డేటాను గుర్తుతెలియన హ్యాకర్లు దొంగలించారని తెలియగానే.. వాట్సాప్ డేటా లీక్ కూడా వెలుగులోకి వచ్చింది. వాట్సాప్ ప్రైవేట్ చాట్లు, కీలక డేటా లీకవుతున్నట్టు వెల్లడైంది. ‘ఓన్మి’ అనే ఆండ్రాయిడ్ స్పైవేర్, వాట్సాప్ మెసేజ్‌లను, కాంటాక్ట్‌లను, కాల్ లాగ్స్‌ను, బ్రౌజింగ్ హిస్టరీని లీక్ చేస్తున్నట్టు తాజా రిపోర్టులు పేర్కొన్నాయి. ఈఎస్ఈటీ సెక్యురిటీ రీసెర్చర్ లుకాస్ స్టెఫాంకో ఈ విషయాన్ని కనుగొన్నారు. గిట్‌హబ్‌లో ‘ఓన్మి’ అనే కోడ్ నేమ్‌తో ఈ ఆండ్రాయిడ్ స్పైవేర్ ఉందని లుకాస్ స్టెఫాంకో కనుగొన్నట్టు జీడేటా రిపోర్టు చేసింది. కేవలం వాట్సాప్ మెసేజ్‌లను హ్యాక్ చేయడమే కాకుండా, పలు ప్రామాణికమైన నిఘా ఫీచర్లను ఇది కలిగి ఉందని పేర్కొంది. డీ డేటా సెక్యురిటీ ల్యాబ్స్ ఈ కొత్త స్పైవేర్‌పై విచారణ ప్రారంభించింది. ‘సర్వీస్ స్టార్ట్’ అనే టెక్ట్స్ ఆండ్రాయిడ్ యూజర్లకు పాప్-అప్ మెసేజ్‌లో చూపిస్తే, అప్పటికే మాల్వేర్ ఆ డివైజ్‌ను అటాక్ చేసిందని రిపోర్టు వెల్లడించింది. వాట్సాప్ యూజర్లు జాగ్రత్తగా ఉండాలని, గత కొన్నేళ్లుగా మొబైల్ మాల్వేర్ కేసులు పెరుగుతున్నాయని రిపోర్టు తెలిపింది. కాగా, నిన్ననే వాట్సాప్ యాజమాన్య కంపెనీ ఫేస్బుక్ కూడా తన యూజర్లపై భారీ దాడి జరిగినట్టు వెల్లడించింది. 5 కోట్ల మంది ఖాతాదారుల డేటాను హ్యాకర్లు దొంగలించినట్టు పేర్కొంది. వెంటనే వాట్సాప్ కూడా యూజర్ల మెసేజ్‌లను, కీలక డేటాను, ఫోటోలను మాల్వేర్ స్పైవేర్ లీక్ చేస్తుందని రిపోర్టులు వెలువడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
కస్టమర్లకు బ్యాంకులు వార్నింగ్
ముంబై : బ్యాంకులు తమ కస్టమర్లకు హెచ్చరికలు జారీచేస్తున్నాయి. తమ మొబైల్ బ్యాంకింగ్ ఆధారాలు కొత్త మాల్వేర్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందంటూ... జాగ్రత్తగా ఉండాలంటూ ఈ హెచ్చరికలు పంపుతున్నాయి. ఫ్లాష్ ప్లేయర్ ద్వారా బ్యాంకింగ్ యాప్స్‌పై మాల్వేర్ అటాక్ చేస్తుందని పేర్కొంటున్నాయి. పలు భారతీయ బ్యాంకింగ్ యాప్స్‌తో సహా 232 బ్యాంకింగ్ యాప్స్‌ను 'ఆండ్రాయిడ్.బ్యాంకర్.ఏ9480' అనే ట్రోజన్ మాల్వేర్ టార్గెట్ చేసిందని హీల్ సెక్యురిటీ ల్యాబ్స్ ఇటీవల రిపోర్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ రిపోర్టుల అనంతరం బ్యాంకులు వార్నింగ్‌లు జారీచేస్తున్నాయి. ప్రస్తుతం ఈ మాల్వేర్ను 'ఆండ్రాయిడ్.బ్యాంకర్.ఏ2ఎఫ్8ఏ' గా బ్యాంకులు పేర్కొంటున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ మాల్వేర్ పనిచేస్తుందని, ఫేక్ నోటిఫికేషన్లను పంపుతుందని, బ్యాంకింగ్ అప్లికేషన్లను ఇవి పోలి ఉంటాయని చెప్పాయి. ఒకవేళ వాటిని యూజర్లు ఓపెన్ చేస్తే, ఫేక్ లాగిన్ స్క్రీన్లలోకి మరలి, అటాకర్లు దాడి చేయడానికి, రహస్య సమాచారాన్ని దొంగలించడానికి సహకరిస్తాయని పేర్కొన్నాయి. బ్యాంకులు పంపిన మాదిరి ఎస్ఎంఎస్లు పంపడం, వన్-టైమ్ పాస్వర్డ్లు అడగడం వంటివి చేస్తున్నాయని తెలిపాయి. ఐడీబీఐ బ్యాంకు ఇప్పటికే తన కస్టమర్లందర్ని జాగ్రత్తగా ఉండాలంటూ సూచించింది. మొబైల్ బ్యాంకింగ్ వాడేటప్పుడు మంచి విధానాలను పాటించాలని పేర్కొంది. నమ్మకం లేని వర్గాల నుంచి ఏమైనా అప్లికేషన్ల వస్తే వాటిని ఇన్స్టాల్ చేయొద్దని కూడా సూచిస్తోంది. బ్యాంకింగ్ లావాదేవీల కోసం జైల్బ్రోకెన్, రూటెడ్ మొబైల్స్ వాడే వారిని కూడా ఈ బ్యాంకు హెచ్చరిస్తోంది. జైల్బ్రోకెన్ ఐఫోన్లు అధికారిక యాప్‌స్టోర్ ద్వారా కాకుండా.. ఈ యాప్స్ ఇన్స్టాల్ అవడానికి అనుమతి ఇస్తున్నాయని తెలిపింది. మరో ప్రైవేట్ బ్యాంకు కరూర్ వైశ్యా బ్యాంకు కూడా ఇదే మాదిరి సూచనను కస్టమర్లకు జారీచేస్తోంది. మాల్వేర్ టార్గెట్ చేసిన దేశీయ బ్యాంకింగ్ యాప్స్ జాబితాలో యాక్సిస్ మొబైల్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు మొబైల్ బ్యాంకింగ్, ఎస్బీఐ ఎనీవేర్ పర్సనల్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు మొబైల్‌బ్యాంకింగ్ లైఫ్, ఐసీఐసీఐ బ్యాంకు ఐమొబైల్, ఐడీబీఐ బ్యాంకు గో మొబైల్+, ఐడీబీఐ బ్యాంకు లిమిటెడ్‌కు చెందిన అభయ్, ఐడీబీఐ బ్యాంకు గో మొబైల్, ఐడీబీఐ బ్యాంకు ఎంపాస్‌బుక్, బరోడా ఎంపాస్‌బుక్, యూనియన్ బ్యాంకు మొబైల్ బ్యాంకింగ్, యూనియన్ బ్యాంకు కమర్షియల్ క్లయింట్స్ ఉన్నట్టు తెలిసింది. ఈ బ్యాంకింగ్ యాప్స్ వాడుతున్న కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచించారు. -
మరింత భయపెడుతున్న కొత్త మాల్వేర్!!
నిన్న మొన్నటి వరకు ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించిన 'వాన్న క్రై' రాన్సమ్వేర్ కథ ముగిసిందో లేదో.. అంతలోనే మరో సరికొత్త మాల్వేర్ వచ్చింది. దానిపేరు ఇటర్నల్ రాక్స్. ఇది వాన్న క్రై కంటే మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని ఎదుర్కోవడం ఇంకా కష్టం అవుతుందంటున్నారు. ఇది ఇటర్నల్ బ్లూ అనే ఎన్ఎస్ఏ టూల్‌ను ఉపయోగించుకుని ఒక కంప్యూటర్ నుంచి మరోదానికి విండోస్ ద్వారా వ్యాపిస్తుంది. దాంతోపాటు ఇటర్నల్ చాంపియన్, ఇటర్నల్ రొమాన్స్, డబుల్ పల్సర్ అనే మరికొన్ని ఎన్ఎస్ఏ టూల్స్‌ను కూడా ఇది ఉపయోగించుకుంటుందని ఫార్చూన్ పత్రిక తెలిపింది. ప్రస్తుతానికి ఇటర్నల్ రాక్స్‌లో ఎలాంటి ప్రమాదకరమైన అంశాలు లేవని, అది ఫైళ్లను లాక్ చేయడం లేదా కరప్ట్ చేయడం లాంటివి జరగడం లేదని అంటున్నారు. అయితే, ఇటర్నల్ బ్లూ మాత్రం ఒకసారి ఇన్ఫెక్ట్ అయిన కంప్యూటర్ను ఉపయోగించుకుని రిమోట్ కమాండ్ల ద్వారా ఇతర కంప్యూటర్లను కూడా ఏ సమయంలోనైనా నాశనం చేస్తుంది. భారతదేశంతో సహా దాదాపు 150 దేశాల మీద దాడి చేసిన వాన్న క్రై రాన్సమ్వేర్ దాదాపు 2.40 లక్షల కంప్యూటర్లలోకి వ్యాపించింది. ఇది ప్రధానంగా విండోస్ 7 అప్డేటెడ్ వెర్షన్లున్న కంప్యూటర్లకే ఇది అంటుకుంది. ఒకసారి ఈ రాన్సమ్వేర్ కంప్యూటర్లోకి ప్రవేశించిందంటే మొత్తం ఫైళ్లన్నీ ఎన్‌క్రిప్ట్ అయిపోతాయి. వాటిని అన్‌లాక్ చేయడానికి వాళ్లు చెప్పిన మొత్తం చెల్లించుకోవాల్సి వచ్చేది. దానికంటే ఇటర్నల్ రాక్స్ అనేది మరింత బలమైనదని చెబుతున్నారు. వాన్న క్రైని అడ్డుకోడానికి ఒక కిల్ స్విచ్ ఉంది గానీ, దీనికి అది కూడా లేదు. ఇప్పటివరకు ఇది ఎంతవరకు వ్యాపించిందో ఇంకా తెలియదు గానీ, ఎన్ఎస్ఏ ఆధారిత మాల్వేర్లో ఇది కొత్త తరహా అని అంటున్నారు. గడిచిన పది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా పలు రకాల సైబర్ దాడులు జరుగుతున్నాయి.