WhatsApp User Data
-
47 లక్షల ఇండియన్ వాట్సాప్ అకౌంట్స్ బ్యాన్ - కారణం ఇదే?
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ 2023 మార్చి నెల యూజర్ సేఫ్టీ రిపోర్టును విడుదల చేసింది. ఈ నివేదికలో ప్లాట్‌ఫారమ్ నుంచి తొలగించిన ఇండియన్ అకౌంట్స్ ఎన్ని, వినియోగారుల నుంచి వచ్చిన కంప్లైంట్స్ వంటి వాటిని గురించి వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సంస్థ నుంచి వెలువడిన తాజా నివేదికల ప్రకారం, 2023 మార్చిలో మొత్తం 4,715,906 మంది ఇండియన్స్ అకౌంట్స్ బ్యాన్ చేసింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైంటిస్ట్, టెక్నికల్ విభాగం అందించిన రిపోర్టుల ఆధారంగా సుమారు 16 లక్షల కంటే ఎక్కువ అకౌంట్స్ బ్యాన్ చేసినట్లు కంపెనీ వెల్లడిందింది. ఇందులో మరి కొన్ని అకౌంట్స్ మీద యూజర్లు కంప్లైంట్ చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. 2023 మార్చి 01 నుంచి 31 మధ్యలో వాట్సాప్ సేఫ్టీ రిపోర్ట్ ప్రకారం, 4720 అకౌంట్స్ మీద కంప్లైంట్స్ రాగా.. అందులో 4316 అకౌంట్స్ నిషేదించాలని యూజర్స్ కోరినట్లు సంస్థ వెల్లడించింది. అయితే వీటన్నింటిని కంపెనీ పరిశీలించి 533 ఖాతాలను నిషేదించింది. మిగిలి అకౌంట్స్ మీద కంప్లైంట్స్ వచ్చినప్పటికీ వారికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలను చూపలేకపోయారు. కావున వీటిపైనా చర్యలు తీసుకోలేదు. (ఇదీ చదవండి: నిండా పాతికేళ్లు కాలేదు రూ. 100 కోట్లు సంపాదన - అతనేం చేస్తున్నాడో తెలుసా?) ఇక మీద వాట్సాప్ నుంచి ఎటువంటి అసభ్యకర సమాచారం వ్యాప్తి చెందకుండా ఉండటానికి సంస్థ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకుంటోంది. ఈటెక్నాలజీని భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తామని కంపెనీ వెల్లడించింది. అంతే కాకుండా వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని AI, లేటెస్ట్ టెక్నాలజీ, డేటా సైంటిస్ట్ నిపుణుల కోసం కంపెనీ చాలా ఖర్చు చేస్తోంది. ఇక రానున్న రోజుల్లో వాట్సాప్ భద్రతకు ఎటువంటి డోకా లేదని కంపెనీ వెల్లడించింది. -
WhatsApp: ఎడిట్ ఫొటోల్ని, జిఫ్ ఫైల్స్‌ను పంపుతున్నారా?
మెసేంజర్ యాప్ వాట్సాప్‌ను వాడుతున్న వాళ్ల సంఖ్య భారత్‌తో పాటు ప్రపంచం మొత్తంలో కోట్లలో ఉంది. యూజర్ భద్రత విషయంలో ఆందోళన వ్యక్తం అయినప్పుడల్లా.. ‘ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిష్షన్’ను చూపిస్తూ.. ఆల్ ఈజ్ వెల్ ప్రకటనలు చేస్తోంది వాట్సాప్. ఈ తరుణంలో వాట్సాప్ ద్వారా పంపించే ఫొటోల ద్వారా కూడా ఫోన్ డాటా హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందనే ఆసక్తికరమైన కథనం ఒకటి ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. సాధారణంగా వాట్సాప్‌ను ఉపయోగించేవాళ్లు.. గ్యాలరీ ఫైల్స్ పంపించుకోవడం సహజం. అయితే వాట్సాప్‌కు ఫొటోను ఎటాచ్ చేశాక.. అక్కడే (వాట్సాప్ డిఫాల్ట్) ఉన్న ఫిల్టర్లను ఉపయోగించి ఎడిట్ చేసి పంపిస్తుంటారు కొందరు. ఇంకొందరు స్టేటస్‌లను కూడా అక్కడే ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తుంటారు. ఇది హ్యాకర్ల పనిని సులువు చేస్తోందనేది టెక్ నిపుణుల వాదన. అంతేకాదు జిఫ్ ఫైల్స్ పంపే సమయంలోనే ఫోన్ డాటా హ్యాక్‌కు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. గుర్తుపట్టడం ఎలాగంటే.. ఫోటో ఫిల్టర్‌ను మార్చడం అంటే పిక్సెల్‌ను మార్చడం, లేదంటే షార్ప్‌నెస్ పెంచడం లాంటివి చేస్తుంటారు చాలామంది. ఇదంతా వాట్సాప్ ఆన్‌లోనే (ఆన్లైన్లోనే) జరిగే ప్రక్రియ. ఈ మెథడ్‌లో హ్యాకర్లు మాల్వేర్ను ఫోన్లోకి ప్రవేశపెట్టి.. తమ పనిని సులువుగా కానిచ్చేస్తుంటారు. ఇక జిఫ్ ఫైల్స్ పంపే టైంలో వాళ్లకు ఫోన్లను హ్యాక్ చేయడం చాలా తేలికైన పని. వాట్సాప్ ఫొటోలు, లేదంటే జిఫ్ ఫైల్స్ పంపే టైంలో ఫోన్ హ్యాకింగ్‌కు గురైందనే విషయాన్ని తేలికగానే గుర్తు పట్టొచ్చని చెప్తున్నారు. ఆ టైంలో ఫోన్ హ్యాంగ్ కావడం లేదంటే పూర్తి ఫంక్షనింగ్ ఆగిపోతుంద’ని పలువురు టెక్ ఎక్స్పర్ట్స్ అభిపప్రాయాలతో కూడిన కథనం ఓ ‘చెక్ పాయింట్ రీసెర్చ్’ బ్లాగ్‌లో పబ్లిష్ అయ్యింది. అంత సీన్ లేదు అయితే వాట్సాప్ మాతృక సంస్థ ఫేస్బుక్ మాత్రం ఈ కథనాల్ని తోసిపుచ్చుతోంది. జిఫ్ ఫైల్స్ లేదంటే ఎడిటెడ్ ఫోటోలు పంపిన టైంలో ఒక్కోసారి క్రాష్ కావడం సహజమని, అప్పుడు ఫోన్ హ్యాంగ్ అవుతుందని ఓ ప్రకటన విడుదల చేసింది. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిష్షన్ ద్వారా వాట్సాప్ యాప్ ఎప్పుడు సురక్షితమైన సేవలు అందిస్తోందని తెలిపింది. అసలు ఈ తరహా పద్దతిలో హ్యాక్ చేయడం అంత సులువైన విషయం కాదని, కాబట్టి అలాంటి ప్రచారాన్ని నమ్మొద్దని యూజర్లను కోరుతోంది. చదవండి: ఫేస్బుక్లో హింస- ఏ రేంజ్లో అంటే.. -
వాట్సాప్‌లో మరో ఫీచర్, ఇకపై ఐపాడ్లో కూడా
ఐపాడ్ యూజర్లకు వాట్సాప్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు పరిమితంగా ఉన్న వాట్సాప్ మల్టీ డివైజ్ ఆప్షన్‌ను ఐపాడ్ యూజర్లు వినియోగించేలా డిజైన్ చేస్తున్నట్లు వెల్లడించింది. 2019 నుంచి మల్టీ డివైజ్ 2.0 పేరుతో మల్టీ డివైజ్ ఆప్షన్‌పై వర్క్ చేస్తున్న వాట్సాప్..ఈ ఏడాదిలో ఊహించని విధంగా ఈ ఫీచర్‌ను పరిమిత సంఖ్యలో యూజర్లకు అందించింది. అయితే తాజాగా ఈ మల్టీ డివైజ్ ఆప్షన్‌ను ఐపాడ్లలో కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది.వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ 'వాట్సాప్ బీటా' వివరాల ఆధారంగా.. యూజర్లు వాట్సాప్‌ను ఫోన్‌తో పాటు వాట్సాప్ వెబ్, పోర్టల్, డెస్క్ ట్యాప్, ఫోన్ లో వినియోగించుకోవచ్చు. ఇప్పుడు ఐపాడ్ లో కూడా అందుబాటులోకి రానుంది. Very excited to be launching a beta of our new multi-device capability for @WhatsApp. Now you can use our desktop or web experiences even when your phone isn't active and connected to the internet. All secured with end-to-end encryption. Learn more: https://t.co/AnFu4Qh6Hd — Will Cathcart (@wcathcart) July 14, 2021 అంతేకాదు వాట్సాప్ వినియోగంలో ఉన్నప్పుడు ఒక్కోసారి ఫోన్ ఛార్జింగ్ దిగిపోయి డెడ్ అయినా మిగిలిన నాలుగు డివైజ్‌లలో వాట్సాప్ ఆన్‌లోనే ఉంటుంది. ఇది పూర్తి ఎండ్ టూ ఎండ్ స్క్రిప్ట్ తో సెక్యూరిటీ, ప్రైవసీని కలిగి ఉంటున్నట్లు పేర్కొంది. కాగా భవిష్యత్‌లో ఐపాడ్ కాకుండా ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లలో మల్టీ డివైజ్ ఆప్షన్ ను అందించనుంది. -
మీకు ఈ మెసేజ్ వస్తుందా! మరేం పర్లేదు
వాట్సాప్ యూజర్ల ఆందోళనపై ఆ సంస్థ ప్రతినిధులు స్పందించారు. ఇటీవల వాట్సాప్ వినియోగదారులకు వింత సమస్య ఎదురైంది. ఆన్‌లో ఉన్న వాట్సాప్ ఒక్కసారిగా లాగ్ అవుట్ అవుతుంది. వెంటనే మీరు ఉపయోగిస్తున్న ఫోన్లో ఈ నెంబర్ వాట్సాప్ లేదు. బహుశా వేరే ఫోన్లో ఈ నెంబర్ వాట్సాప్ ఉంటుందేమో.. ఒక్కసారి చెక్ చేయండి లేదంటే మీ ఫోన్ నెంబర్ ను వెరిఫై చేసుకోండంటూ ఓ మెసేజ్ వచ్చింది. If you have been recently logged out from WhatsApp, on WhatsApp for Android, don't worry: it's a bug. You can log into WhatsApp again. pic.twitter.com/SnhFzUd5jP — WABetaInfo (@WABetaInfo) August 8, 2021 దీంతో ఆ మెసేజ్‌పై వాట్సాప్ వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు.వాట్సాప్ హ్యాక్ అయ్యిందేమో? ఎవరన్నాహ్యాక్ చేశారేమో చెక్ చేయండి అంటూ వాట్సాప్‌కు రిక్వెస్ట్‌లు పెట్టారు. దీంతో యూజర్ల రిక్వెస్ట్ వాట్సాప్ రియాక్ట్ అయ్యింది. మీ ఫోన్ ను ఎవరూ హ్యాక్ చేయలేదు. బ్యాక్ ఎండ్ కోడ్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ సమస్య గురించి యూజర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తిరిగి వాట్సాప్‌లోకి లాగిన్ అవ్వొచ్చని డబ్ల్యూఏబీటా ఇన్ఫో ట్విట్టర్ వేదికగా తెలిపింది. దీంతో యూజర్లు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. -
వార్నింగ్ : వాట్సాప్ చాట్స్, మెసేజ్‌లు లీక్
ప్రముఖ మెసేజింగ్ మాధ్యమం వాట్సాప్ యూజర్లు కూడా ప్రమాదంలో పడుతున్నారు. ఫేస్‌బుక్‌కు చెందిన 5 కోట్ల మంది యూజర్ల డేటాను గుర్తుతెలియన హ్యాకర్లు దొంగలించారని తెలియగానే.. వాట్సాప్ డేటా లీక్ కూడా వెలుగులోకి వచ్చింది. వాట్సాప్ ప్రైవేట్ చాట్లు, కీలక డేటా లీకవుతున్నట్టు వెల్లడైంది. ‘ఓన్మి’ అనే ఆండ్రాయిడ్ స్పైవేర్, వాట్సాప్ మెసేజ్‌లను, కాంటాక్ట్‌లను, కాల్ లాగ్స్‌ను, బ్రౌజింగ్ హిస్టరీని లీక్ చేస్తున్నట్టు తాజా రిపోర్టులు పేర్కొన్నాయి. ఈఎస్ఈటీ సెక్యురిటీ రీసెర్చర్ లుకాస్ స్టెఫాంకో ఈ విషయాన్ని కనుగొన్నారు. గిట్‌హబ్‌లో ‘ఓన్మి’ అనే కోడ్ నేమ్‌తో ఈ ఆండ్రాయిడ్ స్పైవేర్ ఉందని లుకాస్ స్టెఫాంకో కనుగొన్నట్టు జీడేటా రిపోర్టు చేసింది. కేవలం వాట్సాప్ మెసేజ్‌లను హ్యాక్ చేయడమే కాకుండా, పలు ప్రామాణికమైన నిఘా ఫీచర్లను ఇది కలిగి ఉందని పేర్కొంది. డీ డేటా సెక్యురిటీ ల్యాబ్స్ ఈ కొత్త స్పైవేర్‌పై విచారణ ప్రారంభించింది. ‘సర్వీస్ స్టార్ట్’ అనే టెక్ట్స్ ఆండ్రాయిడ్ యూజర్లకు పాప్-అప్ మెసేజ్‌లో చూపిస్తే, అప్పటికే మాల్వేర్ ఆ డివైజ్‌ను అటాక్ చేసిందని రిపోర్టు వెల్లడించింది. వాట్సాప్ యూజర్లు జాగ్రత్తగా ఉండాలని, గత కొన్నేళ్లుగా మొబైల్ మాల్వేర్ కేసులు పెరుగుతున్నాయని రిపోర్టు తెలిపింది. కాగా, నిన్ననే వాట్సాప్ యాజమాన్య కంపెనీ ఫేస్బుక్ కూడా తన యూజర్లపై భారీ దాడి జరిగినట్టు వెల్లడించింది. 5 కోట్ల మంది ఖాతాదారుల డేటాను హ్యాకర్లు దొంగలించినట్టు పేర్కొంది. వెంటనే వాట్సాప్ కూడా యూజర్ల మెసేజ్‌లను, కీలక డేటాను, ఫోటోలను మాల్వేర్ స్పైవేర్ లీక్ చేస్తుందని రిపోర్టులు వెలువడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
మీ బాయ్‌ఫ్రెండ్‌లకు పంపిన మెసేజ్‌లు స్కాన్..!
ఫేస్బుక్ డేటా చోరి వ్యవహారంతో సంచలనం కలిగించే పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫేస్బుక్ డేటాను కేంబ్రిడ్జ్ అనలిటికాతో పంచుకున్నామని ఒప్పుకున్న జుకర్‌బర్గ్, రెండు రోజుల పాటు అమెరికన్ సెనేట్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సెనేట్ సభ్యుల జరిపిన విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫేస్బుక్ ప్రధాన వ్యాపారం ప్రకటనలనేనని, ప్రకటనల ద్వారా ఫేస్బుక్ నగదు సంపాదిస్తుందని, యూజర్లు నగదు చెల్లించకుండా తామెలా సర్వీసులను అందించగలమని మార్క్ జుకర్‌బర్గ్ ప్రశ్నించడంతో, వాట్సాప్ యూజర్లు ఆందోళన పడ్డారు. ఫేస్బుక్ సొంతమైన వాట్సాప్ ఇప్పటి వరకు ఉచితంగానే సర్వీసులు అందిస్తోంది. అంటే ఇప్పటి వరకైతే వాట్సాప్‌కు ఎలాంటి యాడ్స్ లేవు. కానీ భవిష్యత్తులో వాట్సాప్‌కు కూడా వ్యాపార ప్రకటనలే తమ ప్రధాన రెవెన్యూలు అని మార్క్ జుకర్‌బర్గ్ చెప్పకనే చెప్పేశారు. దీంతో ఇక ఫేస్బుక్ సొంతమైన వాట్సాప్‌ను ఎంతో కాలం ఉచితంగా అందించరు అని అర్థమౌతోందని టెక్ విశ్లేషకులంటున్నారు. వాట్సాప్ నుంచి కూడా లాభాలు ఆర్జించడానికి, దీనిని కూడా యాడ్స్ వైపు మరలిస్తారని తెలుస్తోంది. ఒకవేళ వాట్సాప్‌లోకి యాడ్స్ రావడం మొదలు పెడితే, మీ బాయ్‌ఫ్రెండ్‌లకు పంపిన మెసేజ్‌లతో సహా మొత్తం డేటాన్నంతటినీ లోతుగా స్కాన్ చేయడం ఫేస్బుక్ ప్రారంభిస్తుందట. వాట్సాప్ చాట్‌లన్నీ ఎన్క్రిప్టెడ్ అని ఓ వైపు కంపెనీ చెబుతున్నప్పటికీ, ఫేస్బుక్ యూజర్ల డేటా అంతటిన్నీ స్కాన్ చేస్తూ అడ్వర్టైజింగ్ సర్వీసులను ఫేస్బుక్ అందిస్తుందని వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో వాట్సాప్ యూజర్లు కాస్త జాగ్రత్తతో వ్యవహరించాలని హెచ్చరికలు వస్తున్నాయి. ఈ జనవరి నుంచే ఫేస్బుక్ తన ప్లాట్‌ఫామ్‌పై వాట్సాప్ బటన్‌ను అందించడం ప్రారంభించింది. బిజినెస్ సర్వీసులను అందించడానికి ఈ వాట్సాప్ బటన్‌ను తన ప్లాట్‌ఫామ్‌పై యాడ్‌చేసింది. వాట్సాప్ ఫర్ బిజినెసెస్ అనే ఫీచర్‌ను కూడా వాట్సాప్ తీసుకొచ్చింది. మరోవైపు వ్యాపార ప్రకటనలు ఇవ్వడం కోసం ఫేస్‌బుక్‌తో వాట్సాప్ యూజర్ల డేటాను షేర్ చేస్తున్నామని అంతకముందే ఈ కంపెనీ ప్రకటించింది. దీనిపై పలు దేశాల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఇప్పటికీ పలు దేశాల్లో దీనిని నిరాకరిస్తూనే ఉన్నారు. వాట్సాప్ దీని కోసం తన ప్రైవసీ పాలసీని కూడా మార్చేసింది. ఈ పరిణామాలన్నింటిన్నీ చూసుకుంటూ.. జుకర్‌బర్గ్ చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకుంటే, త్వరలోనే వాట్సాప్‌లోకి కూడా యాడ్స్ వచ్చేసి, యూజర్ల డేటా స్కాన్ చేయడం తథ్యమని వెల్లడవుతోంది. -
ప్రమాదంలో వాట్సాప్ యూజర్లు
-
అలర్ట్ : ప్రమాదంలో వాట్సాప్ యూజర్లు
మెసేజింగ్ మాధ్యమంగా ఎక్కువగా పాపులర్ అయిన వాట్సాప్ యూజర్లు ప్రమాదంలో పడబోతున్నారు. వాట్సాప్ యూజర్లను టార్గెట్ చేసిన ఒక కొత్త యాప్, యూజర్లు ఎప్పుడు ఆన్లైన్లో ఉంటున్నారు, ఎవరితో ఛాటింగ్ చేస్తున్నారు వంటి వివరాలను బహిర్గతం చేస్తుంది. ఈ యాప్ పేరు ఛాట్వాచ్గా తెలుస్తోంది. ఛాట్డబ్ల్యూగా ఇది అందుబాటులో ఉందట. ఈ యాప్ ద్వారా మీ వాట్సాప్ కాంటాక్ట్‌లు ఎప్పుడు ఆన్లైన్లో ఉంటున్నారు? ఎప్పుడు ఇద్దరు వ్యక్తులు ఛాటింగ్ చేసుకుంటున్నారు? వంటివి రాబట్టవచ్చని తెలుస్తోంది. ‘లాస్ట్ సీన్’ తీసేసినప్పటికీ, వాట్సాప్ కాంటాక్ట్‌ల యాక్టివిటీని ఇది కనిపెట్టేస్తుందట. అయితే ఈ యాప్ ఉచితంగా కాకుండా.. వారానికి రూ.140 చెల్లించి దీన్ని వాడుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. గత కొన్ని రోజుల వరకు గూగుల్ ప్లే స్టోర్, ఐఫోన్ ఐఓఎస్ యాప్ స్టోర్లలో అందుబాటులో ఉన్న ఈ ఛాట్డబ్ల్యూ యాప్, ఒక్కసారిగా రిపోర్టులు వాట్సాప్ యూజర్లను అలర్ట్ చేయడం ప్రారంభించిన తర్వాత, డిలీట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే పలు వెబ్సైట్లలో దీని ఏపీకే అందుబాటులో ఉందని, దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి వీలుంటుందని, వాట్సాప్ యూజర్లు జాగ్రత్తగా ఉండాలని రిపోర్టులు హెచ్చరిస్తున్నాయి. వాట్సాప్‌లో ఛాట్‌లో ఉన్నప్పుడు మీ గురించి ఎవరైనా అన్ని వివరాలు తెలిసినట్టు చెబితే, అనుమానించాల్సి ఉందని రిపోర్టులు వార్నింగ్ ఇస్తున్నాయి. మీరు ఛాట్వాచ్లో బారిని పడినట్టు గుర్తించాలని పేర్కొంటున్నాయి. ఏ సమయంలో మీ వాట్సాప్ స్నేహితులు నిద్రపోతున్నారు, ఏ సమయంలో లేస్తున్నారు, ఏ సమయంలో ఛాటింగ్ చేస్తున్నారు, ఎవరితో ఎక్కువగా ఛాట్ చేస్తున్నారు వంటి వివరాలను ఈ యాప్ బహిర్గతం చేస్తోందని తెలుస్తోంది. ఈ యాప్‌తో మీ స్నేహితుల, కుటుంబ సభ్యుల, ఉద్యోగుల వాట్సాప్ ఆన్లైన్, ఆఫ్‌లైన్ యాక్టివిటీ ఇట్టే పట్టేయొచ్చట. అయితే వాట్సాప్ యాప్ ఫుల్ ఎండ్‌టూఎండ్ సబ్‌స్క్రిప్షన్‌ను కలిగి ఉందని, మూడో వ్యక్తులు వాట్సాప్ యూజర్ల గోప్యతను దొంగలించడానికి కుదరదని ఓ వైపు ఆ కంపెనీ చెబుతున్నప్పటికీ, ఇలాంటి యాప్‌ల ద్వారా వాట్సాప్ యూజర్ల వివరాలు బయటికి వస్తుండటం ఆందోళన కలిగిస్తోందని టెక్ వర్గాలంటున్నాయి. -
ఆ రోజు వాట్సాప్‌లో ఎన్ని మెసేజ్‌లు పంపుకున్నారో తెలుసా.?
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యధిక మంది యూజర్లు వాడుతున్న ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్‌గా వాట్సాప్. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 7500 కోట్లు మెస్సేజ్‌లు. గత నెల 31న మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11.59 గంటల వరకు న్యూ ఇయర్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా వాట్సప్ యూజర్లు పంపిన సందేశాల సంఖ్య ఇది. ఈ విషయాన్ని వాట్సప్ తాజాగా వెల్లడించింది. ప్రపంచంలో అత్యధిక మంది యూజర్లు వాడుతున్న ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్‌గా వాట్సప్ నిలిచిన విషయం తెలిసిందే. అంతేకాదు మెస్సేజ్‌లకు తోడు 1,300 కోట్ల ఇమేజ్‌లు, 500 కోట్ల వీడియోలను న్యూ ఇయర్ సందర్భంగా వాట్సప్ యూజర్లు పంపుకున్నారు. అయితే డిసెంబర్ 31 అర్ధరాత్రి తరువాత వాట్సప్ కొంత సేపు పనిచేయలేదు. ఆ యాప్‌ను పెద్ద ఎత్తున యూజర్లు వాడడంతో క్రాష్ అయింది. కానీ సమస్యను త్వరగా చక్కదిద్దారు. దీంతో మళ్లీ వాట్సప్ సేవలు యదావిధిగా నడిచాయి. ఇందులో ప్రస్తుతం రోజుకు 100 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉంటున్నారు. -
కోర్టుకెక్కనున్న ఫేస్బుక్
జర్మన్ యూజర్ల వాట్సాప్ డేటాను ఫేస్బుక్ సేకరించడానికి, స్టోర్ చేయడానికి వీలులేదని ఆ దేశ ప్రైవసీ రెగ్యులేటరీ చేసిన ఆదేశాలపై సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కోర్టెక్కనుంది. జర్మన్ రెగ్యులేటరీ ఆదేశాలను వ్యతిరేకిస్తూ, దీనిపై అప్పీల్‌కు వెళ్లనున్నట్టు ఫేస్బుక్ ప్రకటించింది. దీంతో ప్రైవసీ రెగ్యులేటర్లకు, ఫేస్‌బుక్‌కు మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఫేస్బుక్ జర్మన్ వాట్సాప్ యూజర్ల డేటాను సేకరించడం వెంటనే ఆపేయాలని, ఇప్పటికే సేకరించిన సమాచారాన్ని తొలగించాలని జర్మన్ ప్రైవసీ రెగ్యులేటరీ ఆదేశాలు జారీచేసింది. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల డేటాను ఫేస్‌బుక్‌ను షేర్ చేసుకుంటోంది. ఈ విషయంపై వాట్సాప్ కొత్త పాలసీ విధానాలను కూడా ప్రవేశపెట్టింది. ఒకవేళ తమ డేటా ఫేస్‌బుక్‌కు షేర్ చేయడం ఇష్టలేని వారు, వాట్సాప్ వాడకాన్ని నిలిపివేసుకోవచ్చంటూ అవకాశం కూడా కల్పించింది. డేటా సంరక్షణ చట్టాన్ని ఫేస్బుక్ అతిక్రమిస్తుందని డేటా ప్రొటెక్షన్, ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ హాంబర్గ్ కమిషనర్ మండిపడ్డారు. 35 మిలియన్ వాట్సాప్ యూజర్లున్న జర్మనీలో ఫేస్బుక్ దీనికోసం సరియైన అనుమతులు పొందలేదని పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం ఫేస్బుక్, వాట్సాప్‌ను సొంతంచేసుకున్నప్పుడు, రెండు కంపెనీల మధ్య ఎలాంటి డేటా మార్పిడి జరగదని వాగ్దానం చేసినట్టు కమిషన్ జోహాన్నెస్ కాస్పర్ తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ నెట్వర్క్ ఫేస్బుక్, వాట్సాప్‌ను 19 బిలియన్ డాలర్లకు(సుమారు రూ.1,26,322 కోట్లకు) కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ రెండు సంస్థలు చేస్తున్న పని, ఇటు ప్రజలను అటు యూజర్లను తప్పుదోవ పట్టించడమే కాకుండా, డేటా సంరక్షణ చట్టాలకు తూట్లు పొడుస్తున్నట్టు విమర్శించారు. కాగ జర్మన్ రెగ్యులేటరీ చేసిన ఆదేశాలపై తాము అప్పీలుకు వెళ్తామని, హాంబర్గ్ డీపీఏతో తాము కలిసి పనిచేస్తామని, ఆయన సందేహాలను నివృతి చేస్తామని ఫేస్బుక్ ప్రకటించింది. జర్మనీలో ఫేస్బుక్ ప్రధాన కార్యాలయం హాంబర్గ్‌లో ఉంది. ఈ ప్రాంతమంతా కాస్పర్ పరిధిలో నడుస్తోంది. -
వాట్స్‌యాప్‌తో పెరుగుతున్న విడాకులు!
వాట్స్‌యాప్ కారణంగా విడాకులు తీసుకుంటున్న జంటల శాతం గణనీయంగా పెరుగుతోందట. వాట్స్‌యాప్‌లో కొత్తవారికి మెసేజీలు పంపడంలాంటి చర్యల వల్ల ఇటలీలో జీవిత భాగస్వాముల పట్ల అపనమ్మకం పెరిగి విడాకులకు దారి తీస్తోందట. విడిపోతున్న జంటల్లో సుమారు 40 శాతం మంది వాట్స్‌యాప్ కారణంగానే తెగదెంపులు చేసుకుంటున్నారని ‘ఇటాలియన్ అసోసియేషన్ ఆఫ్ మాట్రిమోనియల్ లాయర్స్’ను ఉటంకిస్తూ ‘టైమ్స్ ఆఫ్ లండన్’ వెల్లడించింది. -
త్వరలో 100 కోట్ల వాట్స్‌యాప్ యూజర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆదాయార్జనకు ప్రధానంగా సబ్స్క్రిప్షన్ విధానంపైనే దృష్టి పెడుతున్నట్లు మొబైల్ మెసెంజర్ సేవల సంస్థ వాట్స్‌యాప్ బిజినెస్ హెడ్ నీరజ్ ఆరోరా చెప్పారు. ప్రకటనల ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలన్న ఆలోచన సంస్థకు ప్రారంభం నుంచే లేదన్నారు. అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఏడాదికి నామమాత్రంగా ఒక్క డాలరు (సుమారు రూ. 60) మాత్రమే సబ్స్క్రిప్షన్ ఫీజు కింద తీసుకుంటున్నట్లు వివరించారు. క్రెడిట్ కార్డులు మొదలైన సాధనాల ద్వారా చెల్లింపులు భారత్‌లో ఇంకా పూర్తిగా ప్రాచుర్యంలోకి రాకపోవడం వల్ల ఈ నామమాత్ర సబ్‌స్క్రిప్షన్‌కు కూడా అవరోధాలు ఏర్పడుతున్నాయని ఆరోరా చెప్పారు. ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) పూర్వ విద్యార్థి అయిన ఆరోరా మంగళవారం ఇక్కడ కళాశాల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాలు తెలిపారు. వివిధ సంస్థలు, ఐఎస్బీ నుంచి వాట్స్‌యాప్ దాకా తన ప్రస్థానం, అనుభవాలను ఐఎస్బీ విద్యార్థులతో పంచుకున్నారు. వాట్స్‌యాప్‌ను ఫేస్బుక్ ఏకంగా 20 బిలియన్ డాలర్ల పైచిలుకు వెచ్చించి కొనుగోలు చేయడంలో ఆరోరా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. వాట్స్‌యాప్- ఫేస్బుక్ డీల్‌ను ప్రస్తావిస్తూ.. సాధారణంగా టెక్నాలజీ రంగంలో తమ వంటి సంస్థలకున్న యాక్టివ్ యూజర్ల సంఖ్యను బట్టి వేల్యుయేషన్లు ఉంటాయని నీరజ్ పేర్కొన్నారు. ప్రస్తుతం తమ యూజర్ల సంఖ్య 60 కోట్ల పైచిలుకు ఉందని, త్వరలో 100 కోట్ల స్థాయికి చేరుకోగలమని ఆయన చెప్పారు. ప్రపంచంలో ఇంతమందికి చేరువైన కంపెనీలు ప్రస్తుతం పది కూడా లేవని వివరించారు. ఈ సామర్ధ్యాన్ని గుర్తించే ఫేస్బుక్ భారీ వేల్యుయేషన్ కట్టినట్లు ఆయన పేర్కొన్నారు. వాట్స్‌యాప్‌ను మరింత మందికి చేరువ చేసేందుకు టెలికం కంపెనీలతో చేతులు కలపడం కూడా లాభిస్తోందని చెప్పారు. భారత్‌లో 5 టెలికం సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వివరించారు. డేటా సేవల ద్వారా ఆదాయాలను ఆర్జించే అవకాశాలు పుష్కలంగా ఉండటంతో టెల్కోలు కూడా ఇందుకు ముందుకు వచ్చినట్లు నీరజ్ పేర్కొన్నారు. ఇక, తమ కంపెనీలో సిబ్బంది సంఖ్య 80 మాత్రమే ఉన్నప్పటికీ.. యూజర్ల సమస్యల పరిష్కారం కోసం 30 మందితో కస్టమర్ కేర్ సేవలు కూడా అందిస్తున్నట్లు వివరించారు. చైనా మార్కెట్.. చైనా, కొరియా వంటి దేశాల్లో భిన్న సంస్కృతి కారణంగా ఆయా మార్కెట్లలో విస్తరించడానికి సమస్యలు ఉంటాయని నీరజ్ చెప్పారు. అందుకే గూగుల్ వంటి దిగ్గజాలు సైతం అక్కడ పెద్ద ఎత్తున విస్తరించలేకపోయాయన్నారు. తాము మెరుగైన ఉత్పత్తిని ప్రపంచ స్థాయిలో రూపొందించడంపైనే దృష్టి కేంద్రీకరించామని, ఇప్పటికిప్పుడు ఒకటి రెండు దేశాల్లో విస్తరించ లేకపోయినా.. ఓపిగ్గా తగిన సమయం కోసం వేచి చూస్తామని నీరజ్ చెప్పారు. వాట్స్‌యాప్ లాంటి భారీ సంస్థను ప్రపంచానికి అందించే సత్తా, సామర్థ్యం భారతీయుల్లో కూడా ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే, అందుకు అనువైన పరిస్థితులు ఇక్కడ కల్పించాల్సి ఉందన్నారు.