ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ 2023 మార్చి నెల యూజర్ సేఫ్టీ రిపోర్టును విడుదల చేసింది. ఈ నివేదికలో ప్లాట్‌ఫారమ్ నుంచి తొలగించిన ఇండియన్ అకౌంట్స్ ఎన్ని, వినియోగారుల నుంచి వచ్చిన కంప్లైంట్స్ వంటి వాటిని గురించి వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
సంస్థ నుంచి వెలువడిన తాజా నివేదికల ప్రకారం, 2023 మార్చిలో మొత్తం 4,715,906 మంది ఇండియన్స్ అకౌంట్స్ బ్యాన్ చేసింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైంటిస్ట్, టెక్నికల్ విభాగం అందించిన రిపోర్టుల ఆధారంగా సుమారు 16 లక్షల కంటే ఎక్కువ అకౌంట్స్ బ్యాన్ చేసినట్లు కంపెనీ వెల్లడిందింది. ఇందులో మరి కొన్ని అకౌంట్స్ మీద యూజర్లు కంప్లైంట్ చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.
2023 మార్చి 01 నుంచి 31 మధ్యలో వాట్సాప్ సేఫ్టీ రిపోర్ట్ ప్రకారం, 4720 అకౌంట్స్ మీద కంప్లైంట్స్ రాగా.. అందులో 4316 అకౌంట్స్ నిషేదించాలని యూజర్స్ కోరినట్లు సంస్థ వెల్లడించింది. అయితే వీటన్నింటిని కంపెనీ పరిశీలించి 533 ఖాతాలను నిషేదించింది. మిగిలి అకౌంట్స్ మీద కంప్లైంట్స్ వచ్చినప్పటికీ వారికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలను చూపలేకపోయారు. కావున వీటిపైనా చర్యలు తీసుకోలేదు.
(ఇదీ చదవండి: నిండా పాతికేళ్లు కాలేదు రూ. 100 కోట్లు సంపాదన - అతనేం చేస్తున్నాడో తెలుసా?)
ఇక మీద వాట్సాప్ నుంచి ఎటువంటి అసభ్యకర సమాచారం వ్యాప్తి చెందకుండా ఉండటానికి సంస్థ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకుంటోంది. ఈటెక్నాలజీని భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తామని కంపెనీ వెల్లడించింది. అంతే కాకుండా వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని AI, లేటెస్ట్ టెక్నాలజీ, డేటా సైంటిస్ట్ నిపుణుల కోసం కంపెనీ చాలా ఖర్చు చేస్తోంది. ఇక రానున్న రోజుల్లో వాట్సాప్ భద్రతకు ఎటువంటి డోకా లేదని కంపెనీ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment