ఇరాన్‌లో ముగ్గురు భారత పౌరులు అదృశ్యమయ్యారు. ఈ ముగ్గురు పౌరులు వ్యాపార ప్రయోజనాల కోసం ఇరాన్‌కు వెళ్లారు. తరువాత అదృశ్యమయ్యారు. ఈ నేపధ్యంలో భారత ప్రభుత్వం ఈ సమస్యను ఇరాన్ ప్రభుత్వం ముందు ఉంచింది. ఈ ఉదంతంలో మరింత సమాచారం కోసం ఇరాన్‌లో అదృశ్యమైన భారత పౌరుల కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
మీడియాకు అందిన వివరాల ప్రకారం గతఏడాది డిసెంబర్ నెలలో ముగ్గురు భారతీయ పౌరులు వ్యాపార ప్రయోజనాల కోసం ఇరాన్‌కు వెళ్లారు. అయితే వారు అక్కడికి చేరుకున్నాక వారికి వారి కుటుంబాలతో సంబంధాలు తెగిపోయాయి. ఈ ఘటన గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖ మీడియాకు తెలిపింది. దీనిపై దర్యాప్తు కోసం భారత్.. ఇరాన్‌పై ఒత్తిడి తీసుకువచ్చిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
ఈ విషయాన్ని ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయంతో పాటు టెహ్రాన్‌లోని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు తెలియజేశామని రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. దీంతో విదేశాంగ మంత్రిత్వ శాఖ, టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం దీనిపై ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాయన్నారు.
ఇది కూడా చదవండి: Mahakumbh-2025: ఈ బావిలో అదృశ్య ‘సరస్వతి’ ప్రవాహం
Comments
Please login to add a commentAdd a comment