హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మూడు ఫీచర్లను యాడ్ చేస్తున్నట్లు వాట్సాప్ మాతృసంస్థ, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. ఏదైనా గ్రూప్ నుంచి నిష్క్రమిస్తే ఇతర సభ్యులకు ఎవరికీ తెలియదు. ఎగ్జిట్ అయిన విషయం అడ్మిన్స్‌కు మాత్రమే తెలుస్తుంది. అలాగే వాట్సాప్‌ను ప్రైవేట్‌గా చూసుకునే వెసులుబాటు రానుంది.
అంటే ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు ఎవరికి కనపడాలి, ఎవరికి కనపడకూడదో నిర్ణయించుకోవచ్చు. ఈ రెండు ఫీచర్లు ఆగస్ట్‌లోనే జతకూడనున్నట్టు కంపెనీ మంగళవారం ప్రకటించింది.
యూజర్ మరో యూజర్‌కు వ్యూ వన్స్ ఫీచర్‌ను ఉపయోగించి ఫోటో, వీడియో పంపినప్పుడు ఒకసారి మాత్రమే చూసుకునే వీలుంది. అయితే వ్యూ వన్స్ ద్వారా వచ్చిన ఫొటోను, వీడియోను స్క్రీన్‌షాట్ తీసుకునే వీలు లేకుండా కొత్త ఫీచర్ కొద్ది రోజుల్లో రానుంది.
చదవండి👉ఎస్‌బీఐ:'హాయ్' చెప్పండి..వాట్సాప్‌లో బ్యాంక్ సేవల్ని పొందండి!
Comments
Please login to add a commentAdd a comment