శాన్‌ఫ్రాన్సిస్కో: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్, గూగుల్ ప్లేస్టోర్‌లో కనిపించకుండా మాయమైంది. ఈ పరిస్థితి వాట్సాప్‌ను కొత్తగా ఇన్‌స్టాల్ చేసుకోవడానికి ప్రయత్నించిన వారికే ఎదురైనట్లు వినియోగదారులు చెప్పారని ఎమ్‌ఎస్‌పవర్ యూజర్ వెబ్‌సైట్ తెలిపింది. ఈ సమస్యకు కారణం తెలియరాలేదు. ఇప్పటికే వాట్సాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న వారు అన్‌ఇన్‌స్టాల్ చేసి ఉంటే, మై యాప్స్ సెక్షన్ ద్వారా తిరిగి డౌన్‌లోడ్ చేసుకోగలిగారని ఆ వెబ్‌సైట్ తెలిపింది. పాత యూజర్లు డౌన్‌లోడ్ చేసుకోగలిగారు కాబట్టి గూగుల్ ప్లేస్టోర్ నుంచి పూర్తిగా మాయం కాలేదని అర్థమవుతోందని విశ్లేషించింది. అయితే గూగుల్ ప్లేస్టోర్‌లో ‘వాట్సాప్ ఫర్ బిజినెస్’ యాప్ ఇప్పటికి ఉన్నట్టు గుర్తించామని డబ్ల్యూఏబీటాఇన్ఫో వెబ్‌సైట్ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment