ఒక్క మెసేజ్‌తో రూ. 41.98 లక్షలు కొట్టేశాడు | Online Fake App: Rachakonda Police Arrested Madhya Pradesh Man | Sakshi
Sakshi News home page

ఒక్క మెసేజ్‌తో రూ. 41.98 లక్షలు కొట్టేశాడు

Published Tue, Jan 26 2021 8:23 AM | Last Updated on Tue, Jan 26 2021 10:24 AM

Online Fake App: Rachakonda Police Arrested Madhya Pradesh Man - Sakshi

నాగోలుకు చెందిన ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో వచ్చిన నోటిఫికేషన్‌ను క్లిక్‌ చేశాడు. పెట్టుబడులు పెడితే అంతకు మించి ఆదాయం చూపిస్తామని ఓ యువతి ఫోన్‌లో చెప్పడంతో గత డిసెంబర్‌ 1వ తేదీ నుంచి 17వరకు 17 రోజుల్లోనే రూ. 41.98 లక్షల నగదును అకౌంట్‌ ద్వారా ట్రాన్స్‌ ఫర్‌ చేశాడు.

సాక్షి, నాగోలు: ఆన్‌లైన్‌లో నకిలీ యాప్‌ సృష్టించి మోసాలకు పాల్పడుతున్న మధ్యప్రదేశ్‌కి చెందిన ఆదిత్య నారాయణ్‌ గాడ్బోలే (37)ను రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడి నుండి రూ.11.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన మేరకు.. నాగోలుకు చెందిన ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో వచ్చిన నోటిఫికేషన్‌ను క్లిక్‌ చేశాడు. పెట్టుబడులు పెడితే అంతకు మించి ఆదాయం చూపిస్తామని ఓ యువతి ఫోన్‌లో చెప్పడంతో గత డిసెంబర్‌ 1వ తేదీ నుంచి 17వరకు 17 రోజుల్లోనే రూ. 41.98 లక్షల నగదును అకౌంట్‌ ద్వారా ట్రాన్స్‌ ఫర్‌ చేశాడు.

ఆ తర్వాత అవతలి వైపు నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో బాధితుడు రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడు మధ్యప్రదేశ్‌ ఇండోర్‌కు చెందిన ఆదిత్య నారాయణ్‌ గోడ్బోలేగా గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించారు. ఆన్‌లైన్‌లో ఫారెక్స్‌ ట్రేడింగ్‌ యాప్‌ను చైనాకు చెందిన మౌజిబిన్‌ అనే వ్యక్తి తయారు చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఆదిత్య నారాయణ్‌ గతంలో చైనాలో ఎంబీబీఎస్‌ చదివాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement