సినీ నటుడు రామ్ చరణ్ పేరుతో ఓటర్ దరఖాస్తు | Fake Voter ID card application in Actor Ram Charan's name | Sakshi

సినీ నటుడు రామ్ చరణ్ పేరుతో ఓటర్ దరఖాస్తు

Nov 30 2013 9:07 AM | Updated on Sep 2 2017 1:08 AM

సినీ నటుడు రామ్ చరణ్ పేరుతో ఓటర్ దరఖాస్తు

సినీ నటుడు రామ్ చరణ్ పేరుతో ఓటర్ దరఖాస్తు

ఆన్‌లైన్ ద్వారా ఓటరు నమోదుకు ప్రభుత్వం కల్పించిన సౌకర్యాన్ని ధర్మవరానికి చెందిన కొందరు ఆకతాయిలు దుర్వినియోగం చేశారు.

 ధర్మవరం : ఆన్‌లైన్ ద్వారా ఓటరు నమోదుకు ప్రభుత్వం కల్పించిన సౌకర్యాన్ని ధర్మవరానికి చెందిన కొందరు ఆకతాయిలు దుర్వినియోగం చేశారు. కేంద్రమంత్రి చిరంజీవి తనయుడు, సినీనటుడు రాంచరణ్ తేజను ధర్మవరం ఓటరుగా నమోదు చేయాలంటూ  27939854 ఐడీ నెంబర్‌తో చేసిన దరఖాస్తులో పేరు చరణ్, ఇంటిపేరు బండి, వయసు 53 ఏళ్లు, పుట్టిన తేదీ 8-6-1960, తండ్రి పేరు చిరు అని, పట్టణంలోని రాంనగర్‌లోని డోర్‌నెంబర్ 8-168ఎ ఇంట్లో నివసిస్తున్నట్లు పేర్కొన్నారు.

రాంచరణ్ నటించిన మగధీర సినిమాలోని ఫొటోను జత చేశారు. అధికారులు ఈ విషయాన్ని ఆర్డీఓ నాగరాజు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన శుక్రవారం తహసీల్దార్ల సమావేశం నిర్వహించి ఓటరు నమోదు ప్రక్రియ సక్రమంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. ఆన్‌లైన్ ద్వారా అందే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే అనుమతించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement