ఊహించని కాంబో.. ఆ దర్శకుడితో చరణ్? | Ram Charan Team Up With Director Trivikram | Sakshi
Sakshi News home page

Ram Charan: అప్పట్లో అనుకుంటే.. ఇప్పుడు సెట్ అవుతుందా?

May 28 2025 1:20 PM | Updated on May 28 2025 3:29 PM

Ram Charan Team Up With Director Trivikram

'ఆర్ఆర్ఆర్' తర్వాత పాన్ ఇండియా క్రేజ్ పెరిగిపోయిందనుకుంటే 'గేమ్ ఛేంజర్'తో రామ్ చరణ్‌కి పెద్ద దెబ్బ పడింది. దీంతో ఫ్యాన్స్ బాగా డీలాపడిపోయారు. అలాంటి టైంలో 'పెద్ది' గ్లింప్స్ రావడంతో ఒక్కసారిగా జోష్ వచ్చింది. ప్రస్తుతానికైతే మెగా అభిమానుల ఆశలన్నీ బుచ్చిబాబు తీస్తున్న ఈ చిత్రంపైనే ఉన్నాయి. మరి దీని తర్వాత చేయబోయే ప్రాజెక్ట్ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్‪‌లోనే ఉంది.

లెక్క ప్రకారం 'పెద్ది' తర్వాత.. సుకుమార్ దర్శకత్వంలో చరణ్ సినిమా చేయాలి. కానీ స్క్రిప్ట్ పరంగా ఇంకా ఆలస్యమయ్యేలా ఉందని టాక్ వినిపిస్తోంది. దీంతో పలువురి పేర్లు వినిపించాయి. ఇప్పుడు త్రివిక్రమ్ పేరు వార్తల్లోకి వచ్చింది. 'గుంటూరు కారం' తర్వాత అల్లు అర్జున్‌తో భారీ మైథలాజికల్ మూవీ చేయడానికి త్రివిక్రమ్ సిద్ధమయ్యాడు. కానీ అట్లీ రావడంతో ఈ దర్శకుడి ప్రాజెక్ట్ కాస్త వెనక్కి వెళ్లింది.

(ఇదీ చదవండి: సందీప్ వంగాకు దీపిక ఇన్ డైరెక్ట్ కౌంటర్?)

ప్రస్తుతం ఖాళీ దొరకడంతో త్రివిక్రమ్.. వెంకటేశ్‌తో ప్రాజెక్ట్ ఓకే చేయించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీని గురించి అధికారిక ప్రకటన రావొచ్చు. ఒకవేళ ఇదే సెట్ అయితే వచ్చే వేసవిలో రిలీజ్ ఉండొచ్చు. ఆ తర్వాత చరణ్‌తో త్రివిక్రమ్ ఉండొచ్చని అంటున్నారు. గతంలో వీళ్లిద్దరి కాంబో గురించి టాక్ నడిచింది గానీ తర్వాత తర్వాత సైడ్ అయిపోయింది.

మళ్లీ ఇన్నాళ్లకు త్రివిక్రమ్ పేరు చరణ్ కోసం తెరపైకి వచ్చింది. ఒకవేళ ఇది నిజమైతే ఎలాంటి స్టోరీతో వస్తారనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడంతా పాన్ ఇండియా, యాక్షన్ మూవీస్ ట్రెండ్ నడుస్తుంది. త్రివిక్రమ్ చిత్రాలన్నీ ఫ్యామిలీ తరహాలో ఉంటాయి. మరి ఎవరి దారిలోకి ఎవరు వెళ్తారు? వీటన్నింటిపై క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

(ఇదీ చదవండి: ఆ పాట తర్వాత.. అభిషేక్-ఐశ్వర్య పెళ్లి చేసుకుంటారనుకోలేదు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement