హైదరాబాద్: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ట్విటర్ అకౌంట్‌ను సైబర్ నేరగాళ్లు మరోసారి హ్యక్ చేశారు. కాగా, ఒక నెలలో ఆయన ట్విటర్ అకౌంట్ హ్యక్ అవడం ఇది రెండోసారి. అయితే, 9 రోజుల క్రితం అసదుద్దీన్ ట్విటర్ ఖాతా హ్యకింగ్‌కు పాల్పడగా .. ఆ తర్వాత పోలీసులు తిరిగి పునరుద్ధరించారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు మరోసారి సైబర్ నేరగాళ్లు ఆయన ట్విటర్ అకౌంట్‌ను హ్యక్ చేసి.. ఆయన ప్రొఫైల్ ఫోటో స్థానంలో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఫోటోను అప్‌లోడ్ చేశారు.
దీంతో మరోసారి ఆయన ఖాతా హ్యకింగ్‌కి గురయినట్లు పార్టీ వర్గాలు గుర్తించాయి. అసదుద్దీన్ ట్విటర్ అకౌంట్‌కు 6.78 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కాగా, ఎంఐఎం పార్టీ వర్గాలు సోమవారం హైదరాబాద్ సైబర్ పోలీసులను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు ఒక ప్రకటనలో తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment