KL Deemed University Student: ఇటీవలకాలంలో చాలా సైబర్ మోసాలను చూసే ఉంటాం. ఆఖరికి బ్యాంక్ ఉద్యోగులను సైతం బురిడీ కొట్టంచే కేటుగాళ్లను సైతం చూస్తూనే ఉన్నాం. పైగా ఫిర్యాదు చేద్దాం అంటే ఈ సైబర్ కేసులను సంబంధించిన ఫిర్యాదులు ఎలా చేయాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఇక అటువంటి సమస్య ఉండదంటా. ఎవ్వరూ సైబర్ మోసానికి గురకాకుండా ఉండేలానే కాకుండా సైబర్ చట్టాలకు సంబంధించిన పూర్తి సమాచారంతో కూడిన సరికొత్త యూప్ వచ్చింది.
(చదవండి: కారు డ్రైవింగ్ చేస్తూ.. స్పృహ తప్పి పడిపోయింది! అతని సాహసానికి హ్యాట్సాఫ్)
అసలు విషయంలోకెళ్లితే...కేఎల్ డీమ్డ్ యూనివర్శిటీలో లా ఫైనలియర్ చదువుతున్న డీ శశాంక్ డిజిట్ భద్రతకు సంబంధించిన సైబర్ అలర్ట్ అనే మొబైల్ అప్లికేషన్‌ని అభివృద్ధి చేశారు. అయితే ఈ సరికొత్త యాప్ వినియోగదారులను సైబర్ మోసానికి గురికాకముందే హెచ్చరించడమే కాక సైబర్ ఫిర్యాదులను ఫైల్ చేసేలా అనుమతి ఇస్తుంది. పైగా ఫిర్యాదులను ట్రాక్ చేయడమే కాక సైబర్ భద్రత, చట్టాలకు సంబంధించిన పూర్తి సమాచారంతోపాటు జీపీఎస్‌తో కూడిన స్టేషన్‌ల జాబితాను కూడా తెలియజేస్తుంది.
అంతేకాదు వినయోగదారులు సత్వరమే న్యాయ సహాయం పొందేలా మార్గనిర్దేశం చేస్తుంది. ఈ మేరకు సైబర్ అలర్ట్ వ్యసస్థాపకుడు డీ రాహుల్ శశాంక్ మాట్లాడుతూ..."కరోనా మహమ్మారి సమయంలో పెరిగిన సైబర్-దాడుల సంఖ్య మమ్మల్ని ఈ యాప్‌ను ప్రారంభించేలా చేసింది. మా యూనివర్సిటీ ప్రోఫెసర్లు నేను తయారు చేసిన యాప్ పై చాలా విశ్వాసం ఉంచడమే కాక మా ప్రయత్నానికి పూర్తి సహాయసహకారాలను అందించారు." అని అన్నారు. అంతేకాదు యూనివర్సిటీ వీసీ డాక్టర్ జి. పార్ధ సారధి వర్మ ప్రిన్సిపాల్ ఎన్ రంగయ్య శశాంక్‌ని అభినందించారు.
(చదవండి: దెయ్యంతో ఆటలాడిన భౌ.. భౌ..!! వైరల్...)
Comments
Please login to add a commentAdd a comment