బెంగళూరు: ‘ మీరు సైబర్ స్కామ్ నేరగాళ్ల(Cyber Scam) నుంచి జాగ్రత్తగా ఉండండి. తాము ప్రభుత్వ అధికారులమని మీ వివరాలు కావాలంటూ ఫోన్ చేసే వారి పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండండి’ అంటూ మనకు ఫోన్‌లో కాలర్ టోన్ రూపంలో తరచు వినిపిస్తున్న మాట. అది పాట అయినా మాట అయినా కానీ ఆ కాలర్ ట్యూన్ ఉద్దేశం మాత్రం.. ఫోన్ చేసే ఎవరైనా మీ వ్యక్తిగత డేటా ఏ రూపంలో అడిగినా ఇవ్వొద్దనేది దాని సారాంశం.
అయితే బెంగళూరు టెకీ(Bengaluru Techie) మాత్రం,, అచ్చం ఇదే తరహాలో మోసం పోయి రూ. 11 కోట్లు పోగొట్టుకున్నాడు. ఓ సంస్థలో టెకీగా ఉద్యోగం చేస్తూ కొంత నగదును ‘మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్’లో పెట్టాడు. రూ. 50 లక్షలు పెడితే దాని విలువ రూ. 12 కోట్లకు చేరింది.
ఈ విషయాన్ని పసిగట్టిన నిందితుడు.. బాధితుడ్ని అత్యంత చాకచక్యంగా వలలో వేసుకున్నాడు. విజయ్ కుమార్ అనే టెకీ నుంచి భారీ మొత్తంలో దోచుకుపోయాడు. తాము ఈడీ అధికారులమని, ప్రభుత్వ అదికారులమని చెబుతూ విజయ్ కుమార్ భయభ్రాంతలకు గురి చేసిందో ఓ ముఠా. మీరు మనీ లాండరింగ్ కేసులో ఉన్నారని, మిమ్ముల్ని అరెస్ట్ చేస్తామని తరచు బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో భయపడిన విజయ్ కుమార్.. వారు చెప్పినట్లు చేశాడు. వారు అడిగిన ఆధార్, పాన్ కార్డువివరాలతో పాటు తన వ్యక్తిగత బ్యాంకింగ్ సమాచారాన్ని కూడా వారికి అందించాడు.
అంతే.. దాంతో సైబర్ నేరగాళ్ల పని ఈజీ అయ్యింది. ఇంకేముంది బాధితుడికి ఉన్న ఏడు బ్యాంక్ అకౌంట్ల నుంచి రూ. 11 కోట్లను స్వాహా చేశారు. సుమారు ఏడు కోట్ల రూపాయలను ఒకే అకౌంట్ సుంచి దొంగిలించడం గమనార్హం.
ముగ్గుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
తాను నష్టపోయిన తర్వాత అసలు విషయం తెలుసుకున్నబాధితుడు విజయ్ కుమార్ లబోదిబో మన్నాడు. పోలీసుల్ని ఆశ్రయించాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఇదే దుబాయ్ కేంద్రంగా జరిగినట్లు తెలుస్తోంది.
ఈ స్కామ్(Cyber Fraud) కు సంబంధించిన ఘటనలో తరుణ్ నటానీ, కరణ్, దవల్ షాలను అరెస్ట్ చేశారు. షా అనే నిందితుడు దుబాయ్ చెందిన సైబర్ స్కామ్‌లో ఆరితేరిన ఓ వ్యక్తి సలహాలు ఇచ్చినట్లు సమాచారం. దీనికి గాను కోటిన్నరకు ఒప్పందం చేసుకున్నాడు సదరు దుబాయ్ చెందిన సైబర్ నేరగాడు.
Comments
Please login to add a commentAdd a comment