టెక్నాలజీ పెరుగుతోంది. ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ వాడకం ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో సైబర్ మోసాలు అధిమవుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో డెబిట్/ క్రెడిట్‌కార్డు - ఇంటర్‌నెట్ బ్యాంకింగ్‌లో జరిగిన సైబర్ మోసాల వల్ల ప్రజలు రూ.177 కోట్లు నష్టపోయినట్లు ప్రభుత్వం తెలిపింది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ నష్టం రూ.69.68 కోట్లుగా ఉందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. 2021-22లో ఇది రూ.80.33 కోట్లు, 2020-21లో రూ.50.10 కోట్లు, 2019-20లో రూ.44.22 కోట్లుగా ఉందని చెప్పారు. అనధికార లావాదేవీలు జరిగినపుడు బ్యాంకులు స్పందించి చర్యలు తీసుకునేంత వరకు కస్లమర్లే దీనికి బాధ్యత వహించాలి. ఈ లావాదేవీల వల్ల కలిగే నష్టాన్ని పరిమితం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మార్గదర్శకాలు జారీ చేసింది. ఏదైనా అనధికార లావాదేవీలు జరిగిన మూడు పనిదినాల్లోగా సంఘటనను రిపోర్ట్ చేయాలి. అలాంటి ట్రాన్సాక్షన్స్‌కు సాంకేతికలోపం కారణమని రుజువైతే దానికి బ్యాంకులే బాధ్యత వహిస్తాయి. ఏదేమైనా అనధికార లావాదేవీలు జరిగినట్లు గుర్తిస్తే వెంటనే బ్యాంకు దృష్టికి తేవాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: మూడు నెలల్లో రూ.60 లక్షల కోట్లు లావాదేవీలు
Comments
Please login to add a commentAdd a comment