భారతదేశంలో ఆన్‌లైన్ మోసాల కారణంగా భారీగా మోసపోతున్న ప్రజల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. వృద్దులు, యువకులు, పారిశ్రామిక వేత్తలు సైతం ఆన్‌లైన్ మోసాలకు బలైపోతున్నారు. తాజాగా ఇలాంటి మరో కేసు హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో బాధితుడు ఏకంగా రూ. 50 లక్షలు పోగొట్టుకున్నట్లు సమాచారం.
హైదరాబాద్‌కు చెందిన 63 ఏళ్ల వ్యక్తి స్టాక్ డిస్కషన్ గ్రూప్ అనే వాట్సాప్ గ్రూప్‌లో చేరడంతో భారీ నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. గ్రూప్ అడ్మినిస్ట్రేటర్, కునాల్ సింగ్ తన మార్గదర్శకత్వంతో కొంతమంది క్లయింట్స్ ఎక్కువ లాభలను పొందినట్లు, తనను తాను ప్రఖ్యాత ఆర్థిక సలహాదారుగా పరిచయం చేసుకున్నాడు.
స్టాక్ మార్కెట్లో గొప్ప లాభాలను పొందాలంటే ఆన్‌లైన్ క్లాసులకు చేరాలని వాట్సాప్ గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ వెల్లడించాడు. క్లాసులకు జాయిన్ అవ్వాలంటే.. వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేసిన లింక్స్ ఓపెన్ చేయాలని పేర్కొనడంతో.. బాధితుడు ఇదంతా నిజమని నమ్మేశాడు. అంతే కాకుండా స్కైరిమ్ క్యాపిటల్ అనే ప్లాట్‌ఫామ్ ద్వారా పెట్టుబడి పెట్టమని స్కామర్లు ఆదేశించడంతో బాధితుడు అలాగే చేసాడు.
ప్రారంభంలో బాధితుని పెట్టుబడికి.. స్కామర్లు మంచి లాభాలను అందించారు. అయితే ఇంకా ఎక్కువ లాభాలు రావాలంటే.. ఎక్కువ పెట్టుబడి పెట్టాలని స్కామర్లు పేర్కొన్నారు. అప్పటికే లాభాల రుచి చూసిన బాధితుడు ఏకంగా రూ. 50 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఆ తరువాత స్కామర్లు చెప్పిన వెబ్‌సైట్ నుంచి లాభాలను తీసుకోవాలని ప్రయత్నించినప్పుడు అది సాధ్యం కాలేదు. చివరకు మోసపోయినట్లు తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
సైబర్ మోసాల భారిన పడకుండా ఉండాలంటే..
టెక్నాలజీ పెరుగుతుండటంతో.. కొందరు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఇలాంటి మోసాలకు గురి కాకుండా ఉండాలంటే ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. స్టాక్ మార్కెట్లో భారీ లాభాలు వస్తాయని ఆశ చూపే సోషల్ మీడియా గ్రూపులతో ఎట్టి పరిస్థితుల్లో జాయిన్ అవ్వకూడదు. అంతగా మార్కెట్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే.. నిపుణులు నిర్వహించే తరగతులకు హాజరవ్వొచ్చు, లేదా తెలిసిన వాళ్ళ దగ్గర నెర్కకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment