Rs 50 lakhs
-
కొంప ముంచిన వాట్సాప్ గ్రూప్: రూ.50 లక్షలు మాయం
భారతదేశంలో ఆన్లైన్ మోసాల కారణంగా భారీగా మోసపోతున్న ప్రజల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. వృద్దులు, యువకులు, పారిశ్రామిక వేత్తలు సైతం ఆన్లైన్ మోసాలకు బలైపోతున్నారు. తాజాగా ఇలాంటి మరో కేసు హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో బాధితుడు ఏకంగా రూ. 50 లక్షలు పోగొట్టుకున్నట్లు సమాచారం.హైదరాబాద్‌కు చెందిన 63 ఏళ్ల వ్యక్తి స్టాక్ డిస్కషన్ గ్రూప్ అనే వాట్సాప్ గ్రూప్‌లో చేరడంతో భారీ నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. గ్రూప్ అడ్మినిస్ట్రేటర్, కునాల్ సింగ్ తన మార్గదర్శకత్వంతో కొంతమంది క్లయింట్స్ ఎక్కువ లాభలను పొందినట్లు, తనను తాను ప్రఖ్యాత ఆర్థిక సలహాదారుగా పరిచయం చేసుకున్నాడు.స్టాక్ మార్కెట్లో గొప్ప లాభాలను పొందాలంటే ఆన్లైన్ క్లాసులకు చేరాలని వాట్సాప్ గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ వెల్లడించాడు. క్లాసులకు జాయిన్ అవ్వాలంటే.. వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేసిన లింక్స్ ఓపెన్ చేయాలని పేర్కొనడంతో.. బాధితుడు ఇదంతా నిజమని నమ్మేశాడు. అంతే కాకుండా స్కైరిమ్ క్యాపిటల్ అనే ప్లాట్‌ఫామ్ ద్వారా పెట్టుబడి పెట్టమని స్కామర్లు ఆదేశించడంతో బాధితుడు అలాగే చేసాడు.ప్రారంభంలో బాధితుని పెట్టుబడికి.. స్కామర్లు మంచి లాభాలను అందించారు. అయితే ఇంకా ఎక్కువ లాభాలు రావాలంటే.. ఎక్కువ పెట్టుబడి పెట్టాలని స్కామర్లు పేర్కొన్నారు. అప్పటికే లాభాల రుచి చూసిన బాధితుడు ఏకంగా రూ. 50 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఆ తరువాత స్కామర్లు చెప్పిన వెబ్సైట్ నుంచి లాభాలను తీసుకోవాలని ప్రయత్నించినప్పుడు అది సాధ్యం కాలేదు. చివరకు మోసపోయినట్లు తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.సైబర్ మోసాల భారిన పడకుండా ఉండాలంటే..టెక్నాలజీ పెరుగుతుండటంతో.. కొందరు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఇలాంటి మోసాలకు గురి కాకుండా ఉండాలంటే ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. స్టాక్ మార్కెట్లో భారీ లాభాలు వస్తాయని ఆశ చూపే సోషల్ మీడియా గ్రూపులతో ఎట్టి పరిస్థితుల్లో జాయిన్ అవ్వకూడదు. అంతగా మార్కెట్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే.. నిపుణులు నిర్వహించే తరగతులకు హాజరవ్వొచ్చు, లేదా తెలిసిన వాళ్ళ దగ్గర నెర్కకోవచ్చు. -
50 లక్షలు చల్లరు..
-
ఒక్కొక్కరికి అర కోటి
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాను కంగుతినిపించిన భారత జట్టును ప్రశంసలతో ముంచెత్తిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రోత్సాహకాలు ప్రకటించింది. కోహ్లి సేన సభ్యులకు రూ. 50 లక్షల చొప్పున నజరానా ఇవ్వనుంది. కోచ్ కుంబ్లేకు రూ. 25 లక్షలు, ఇతర సహాయ సిబ్బందికి రూ. 15 లక్షల చొప్పున పారితోషికాల్ని అందజేయనుంది. ‘టెస్టుల్లో అగ్రస్థానం నిలబెట్టుకున్న టీమిండియాకు బీసీసీఐ అభినందనలు. ఈ సీజన్లో సొంతగడ్డపై అజేయంగా కొనసాగుతోంది. ఇందుకు ప్రోత్సాహకంగా నజరానా అందజేస్తాం’ అని బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. నజరానాను ప్రొ రాటా పద్ధతిలో ఇస్తామని అందులో పేర్కొన్నారు. అంటే ఆడిన మ్యాచ్‌లను బట్టి ఈ పారితోషికాన్ని అందజేయనున్నారు. పూర్తిగా నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఆటగాడికి రూ. 50 లక్షలు, రెండే మ్యాచ్‌లు ఆడితే రూ. 25 లక్షలు ఇస్తారు. -
రూ.50 లక్షలు ఇస్తే నేను ఒకే!
నాలుగేళ్ల క్రితం దక్షిణాదిలో టాప్ కథానాయికల్లో ఒకరు ఇలియానా. ఇప్పుడు పారితోషికం ఇంతిస్తే చాలు అంటూ అవకాశాల కోసం దక్షిణాది దర్శక నిర్మాతలకు రాయబారం పంపుతున్నారనే ప్రచారం మీడియాలో హల్చల్ చేస్తోంది. ఒకప్పటి కథానాయికల పారితోషికాలు వేరు. ఇప్పటి నాయికల పారితోషికాలు బేజారు. కథానాయకుల పారితోషికాలకు దీటుగా నాయికలు పెంచేస్తున్నారు. ఇంతకు ముందు నాయికల పారితోషికాలు లక్షల్లోనే ఉండేవి. ఇప్పుడు కోట్లకు పెరిగిపోయాయి. కథానాయకులు 30 నుంచి 40 కోట్లకు పెంచేస్తే తామేమీ తక్కువ కాదన్నట్లు నాయికలు కోట్లకు పెంచేశారు. ప్రముఖ కథానాయికలిప్పుడు కోటి నుంచి నాలుగు కోట్ల వరకూ పారితోషికాన్ని పుచ్చుకుంటున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న టాప్ హీరోయిన్ నయనతార ఇప్పటి వరకూ మూడు కోట్లు పారితోషికం వసూలు చేసేవారని, తాజాగా తెలుగులో చిరంజీవికి జంటగా నటించడానికి నాలుగు కోట్లు డిమాండ్ చేసినట్లు ప్రచారం హోరెత్తుతోంది. ఇక గోవా సుందరి ఇలియానా నాలుగేళ్ల క్రితమే కోటికి పైగా పారితోషికం పుచ్చుకుని దక్షిణాదిలో అగ్రకథానాయిల పట్టికలో చేరారు. అయితే అంతకంటే అధిక పారితోషికం ఆశిస్తూ, మరింత పాపులారిటీని కోరుకుంటూ తెలుగు,తమిళ భాషల్లో అవకాశాలు తలుపుతడుతున్నా కాదని బాలీవుడ్లో మకాం వేశారు.అక్కడ తొలిరోజుల్లో పరిస్థితి ఆశాజనకంగా ఉన్నా రానురానూ అది మిథ్యగా మారింది. నాలుగేళ్లలో ఇలియానా ఐదు హిందీ చిత్రాలు మాత్రమే చేయగలిగింది.ప్రస్తుతం అవకాశాలు నిల్. దీంతో పీచేముడ్ అంటూ ఇప్పుడు తమిళం, తెలుగు భాషల్లో అవకాశాలు వెతుక్కునే పనిలో పడ్డారని సమాచారం. ఇందుకు తన పారితోషికంలో కూడా రిబేట్ ఇచ్చేయడానికి సిద్ధమయ్యారట. రూ.50 లక్షలు పారితోషికం ఇస్తే చాలు అంటూ తమిళ, తెలుగు దర్శక నిర్మాతలకు రాయబారం పంపుతున్నారని సమాచారం. దీంతో కొందరు దర్శకనిర్మాతలు ఆమెను తమ చిత్రాల్లో ఎంపిక చేసే విషయమై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తమిళంలో నన్భన్ చిత్రం తరువాత కొన్ని భారీ అవకాశాలు వచ్చినా ఇలియానా అప్పట్లో నటించడానికి అంగీకరించలేదన్న ప్రచారం జరిగిందన్నది గమనార్హం. -
నిరంజన్ కుటుంబానికి కేరళ రూ.50లక్షల సాయం
కొచ్చి: పంజాబ్‌లోని పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన లెప్టినెంట్ కల్నల్ నిరంజన్ కుమార్ కుటుంబానికి కేరళ ప్రభుత్వం బుధవారం రూ.50 లక్షల సాయం ప్రకటించింది. కర్ణాటక ప్రభుత్వం కూడా నిరంజన్ కుటుంబానికి 30 లక్షల పరిహారం అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. కేరళలోని పాలక్కడ్ జిల్లా ఎలాంబస్సెర్ట్ గ్రామానికి చెందిన నిరంజన్‌కుమార్ 2004లో సైన్యంలో చేరారు. ఎస్‌ఎస్‌జీలో చేరడానికి ముందు మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్ ఆఫ్ ఆర్మీలో పనిచేశారు. పేలుడు పదార్థాలు నిర్వీర్యం చేయడంలో నిపుణుడైన నిరంజన్ బాంబు నిర్వీర్యక విభాగం అధికారిగా ఇటీవలే పదోన్నతి పొందారు. పఠాన్‌కోట్ వైమానిక స్థావరంలో ఉగ్రవాదులు విసిరిన గ్రెనేడ్‌ను నిర్వీర్యం చేస్తుండగా అది పేలి దుర్మరణం చెందారు. కల్నల్ నిరంజన్‌కు భార్య రాధిక, రెండేళ్ల కుమార్తె విస్మయ ఉన్నారు. ఆయన కుటుంబం ప్రస్తుతం బెంగళూరులో స్థిరపడింది. -
పాత కథలు చెప్పొద్దు
పాత కథలు చెప్పొద్దు అంటోంది యువ నటి శ్రీ దివ్య. ఫర్వాలేదే ఈ ముద్దుగుమ్మ కూడా సినిమా కథలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందే అని అనుకుంటున్నారా? మొదట్లో ఒక్క అవకాశం ప్లీజ్ అనే తారలు ఆ తరువాత ఒక్క విజయం వరిస్తే చాలు. అది వారి ప్రతిభ కాపోయినా సరే తదుపరి చిత్రానికి అంత పారితోషికం కావాలి లాంటి డిమాండ్లతో దర్శక, నిర్మాతలను కలతకు గురిచేస్తుండడం ఇక్కడ షరా మామూలే. ఇక నటి శ్రీదివ్య విషయానికొస్తే ఈ అమ్మడు ఇక్కడ తొలి చిత్రంగా చెప్పుకుంటున్న వరుత్త పడాద వాలిబర్ సంఘం నిజానికి మలి చిత్రం. శ్రీ దివ్య తొలి చిత్రం కాట్టుమల్లి అయితే ఈ చిత్రం ఆమెకి ఆరో చిత్రం ఏడో చిత్రంగా కూడా విడుదలయ్యే చాన్స్ కనిపించడం లేదు. వరుత్త పడాద వాలిబర్ సంఘం జీవా, వెల్లక్కార దురై వంటి వరుస విజ యాలతో లక్కీ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న శ్రీదివ్య నటించిన తాజా చిత్రం కాక్కిసట్టై కూడా హిట్ అనిపించుకోవడంతో మంచి జోష్ మీదుంది. తదుపరి పెన్సిల్, ఈట్టి చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. శ్రీ దివ్య తొలి చిత్రం కాట్టుమల్లి ఆర్థికపరమైన కారణాల వలన షూటింగ్‌ను పూర్తి చేసుకోలేకపోయింది. అలాంటి చిత్రాన్ని దర్శక నిర్మాతలు అష్టకష్టాలు పడి పూర్తి చేయాలని భావించి శ్రీదివ్య కాల్షీట్స్ అడిగితే నటిస్తాను కానీ అప్పటి పారితోషికానికే చేయమనే పాత కథలు చెప్పొద్దు. ప్రస్తుత స్థాయికి తగ్గట్టుగా పారితోషికం చెల్లించాలి అనడంతో కాట్టుమల్లి కథ మళ్లీ కంచికి చేరే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం శ్రీదివ్య రూ.50 లక్షల వరకు పారితోషికం పుచ్చుకుంటున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంలో మధ్యవర్తిత్వం జరుగుతోంది. చివరికి ఏం జరుగుతుందో! ఇది శ్రీదివ్య, కాట్టుమల్లి వృత్తాంతం అన్నట్టు ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో వారధి అనే చిత్రంలో నటిస్తోంది.