ఆందోళనలో ఆలోచన కోల్పోతున్న వైనం
పొంతన లేని లింకులు చెప్పినా నమ్మేస్తూ.
దీన్ని స్పష్టం చేస్తూ ఇటీవల నమోదైన కేసు
రూ.20 లక్షలు.. ఓ పేద కుటుంబానికి అసాధ్యమైన మొత్తం. దిగువ మధ్య తరగతికి జీవితం. మధ్య తరగతికి కొన్ని దశాబ్దాల కష్టం. ఉన్నత వర్గాలకు సైతం పెద్ద లెక్కే. ఇంతటి నగదుని నగరానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగికి కేవలం కొన్ని గంటల వ్యవధిలో జరిగిన ‘డిజిటల్ అరెస్టు’ ఫ్రాడ్‌లో పోగొట్టుకున్నారు. దీనిపై ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేరగాళ్ల మాటకు భయపడిపోతున్న సామాన్యులు సాధారణ పోలీసులు శాంతిభద్రతలు, నేరాలకు సంబంధించిన వ్యవహారాలు, సైబర్ క్రైమ్ పోలీసులు ఆన్‌లైన్ ఫ్రాడ్స్, కస్టమ్స్ అధికారులు సుంకం ఎగవేత, అక్రమ రవాణా వ్యవహారాలు పర్యవేక్షిస్తారనే విషయాన్ని విస్మరిస్తున్నారు. రూ.20 లక్షలకు సంబంధించిన కేసు పూర్వాపరాలను ఒకసారి పరిశీలిస్తే..
1. బాధితుడికి సైబర్ నేరగాళ్లు తాము ఇంటర్నేషనల్ డీహెచ్‌ఎల్ ఎక్స్‌ప్రెస్ కొరియర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నట్లు చెప్పారు. మీ ఆధార్ కార్డుతో బ్యాంకాక్‌కు బుక్ అయిన పార్శిల్‌లో పాస్‌పోర్టులు, ఏటీఎం కార్డులు, బ్యాంకు పత్రాలు, 140 గ్రాముల డ్రగ్ కూడా ఉందన్నారు. ఆ పార్శిల్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదంటూ బాధితుడు చెప్పడంతో... తాము ఫోన్‌కు ఢిల్లీ సైబర్ సెల్‌కు బదిలీ చేస్తున్నామన్నారు.
విదేశాలకు పంపే నిషేధిత, నియంత్రిత వస్తువులకు సంబంధించిన కేసు కస్టమ్స్ పరిధిలోకి వస్తుంది. మాదక ద్రవ్యాలతో కూడిన డ్రగ్ పార్శిల్‌కు సంబంధించిన కేసులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీ నాబ్), ఎక్సైజ్, టాస్‌్కఫోర్స్ లేదా సాధారణ పోలీసులు దర్యాప్తు చేస్తారు. ఢిల్లీ సైబర్ సెల్ వంటి ఏజెన్సీలకు ఈ తరహా కేసులతో ఏ మాత్రం సంబంధం ఉండదు. కొరియర్ ఆఫీసులకు, పోలీసులకు మధ్య ఎలాంటి లింకులు ఉండవు. అలాంటప్పుడు కొరియర్ సంస్థ తాము చేసిన కాల్‌ని పోలీసులు బదిలీ చేయడం అసాధ్యం.
2. బాధితుడితో సైబర్ సెల్ అధికారిగా మాట్లాడిన సైబర్ నేరగాడు మీ ఆధార్ దురి్వనియోగంపై ఫిర్యాదు చేయాలంటూనే అదే ఆధార్‌తో తెరిచిన నాలుగు బ్యాంకు ఖాతాలు మనీలాండరింగ్‌కు వాడారని చెప్పాడు.
మనీలాండరింగ్ సంబంధిత అంశాలన్నీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) పర్యవేక్షించే అంశం. ఈ తరహా కేసుల్ని వీళ్లే నమోదు చేసి, దర్యా ప్తు చేస్తుంటారు. ఆ వివరాలు సైబర్ సెల్‌కు తెలిసే అవకాశమే ఉండదు. ఆధార్ కార్డు దురి్వనియోగం పైనా సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఉండే ఆస్కారం లేదు.
3.అసలు కథ మొదలెట్టిన సైబర్ నేరగాళ్లు వాట్సాప్ వీడియో కాల్ ద్వారా బాధితుడితో మాట్లాడి ‘డిజిటల్ అరెస్టు’ చేశారు. మీపై నిఘా ఉందంటూ బాధితుడికి చెప్పి ప్రతి గంటకూ తమను సంప్రదించాలని స్పష్టం చేశాడు.
స్థానిక పోలీసుల నుంచి సీబీఐ వరకు ఏ ఏజెన్సీ కూడా డిజిటల్ అరెస్టు అనేది చేయదు. కేసు నమోదు తర్వాత దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అంశాలు, ఇతర వ్యవహారాలను పరిగణనలోకి తీసుకుని అరెస్టు చేయడమో, నోటీసులు ఇవ్వడమో చేస్తారు. ఆపై దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేస్తారు. నిఘా ఉంచాల్సి వస్తే దానికి వారి మార్గాలు వారికి ఉంటాయి తప్ప వీడియో కాల్ ద్వారా మాత్రం కాదు.
4.బాధితుడిని భయపెట్టడంలో భాగంగా సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టు విషయం ఎవరికీ చెప్పొద్దని, దీన్ని రహస్యంగా ఉంచకపోతే మీతో పాటు కుటుంబీకుల కిడ్నాప్ లేదా హత్య చేస్తామని బెదిరించారు.
∙రాష్ట్రం, దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏజెన్సీ కూడా ఇలాంటి షరతు పెట్టదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. పోలీసులు, సీఐడీ, సీబీఐ సహా ఏ విభాగమైనా ఓ వ్యక్తిని అరెస్టు చేస్తే... దానిపై వారి సంబం«దీకులకు కచి్చతంగా సమాచారం ఇవ్వాలి. ఎవరికి సమాచారం ఇచ్చామనే విషయాన్నీ కోర్టు దృష్టికి తీసుకువెళ్లాలనే నిబంధన ఉంది. అలాంటిది ఇక కిడ్నాప్‌లు, హత్యలు చేసే ఆస్కారం పోలీసులకు, ఏజెన్సీలకు ఎలా ఉంటుందనేది విస్మరించకూడదు.
5.ఇది జరిగిన తర్వాత సైబర్ నేరగాళ్లు బాధితుడికి సీబీఐ, ఆర్బీఐ పేర్లతో ఉన్న రెండు నకిలీ లేఖల్ని వాట్సాప్ ద్వారా పంపారు. వాటిలో బాధితుడికి మనీలాండరింగ్‌తో పాటు ఫోర్జరీ కేసులతో సంబంధం ఉన్నట్లు ఉంది.
∙ఆర్బీఐ, సీబీఐలతో సైబర్ క్రైమ్ పోలీసులు అవసరమైనప్పుడు మాత్రమే సంప్రదింపులు జరుపుతారు. ఏదైనా కేసుకు సంబంధించి వాళ్లు ఇచి్చన ఆధారాలు, సమాచారాన్ని కేవలం కోర్టుకు మాత్రమే సమరి్పస్తారు. ఇలా బాధితుడికి వాట్సాప్ చేసి, డబ్బు డిమాండ్ చేయడం జరగని పని.
6.ఈ కేసుల నుంచి విముక్తి పొందాలంటే తాము చెప్పినట్లు చేయాలని బాధితుడిని భయపెట్టిన సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాల వివరాలు పంపారు. వాటిలో విడదల వారీగా రూ.20 లక్షలు డిపాజిట్ చేయించుకున్నారు.
∙కేసుల్లో రెండు రకాలు ఉంటాయి. మొదటి రకం వాటిలో శిక్షలు పడితే.. రెండో రకం వాటిలో కేవలం జరిమానాలే విధిస్తారు. అనధికారికంగా ఇతరుల పాస్‌పోర్టులు కలిగి ఉండటం, వీటిని విదేశాలకు పంపే ప్రయత్నం చేయడం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా... ఇవన్నీ తీవ్రమైన నేరాలు. వీటికి కాంపౌండబుల్ అఫెన్సుల మాదిరిగా జరిమానాలు విధించరు.
7.ఈ బాధితుడు సైబర్ నేరగాళ్లు డబ్బు డిపాజిట్ చేయమంటూ హెచ్‌డీఎఫ్‌సీ, ఫెడరల్ బ్యాంక్ ఖాతాల వివరాలు ఇచ్చారు. వీటిలోకి నగదు బదిలీ చేసిన బాధితుడు దాని కోసం తన ఫిక్సిడ్ డిపాజిట్లనూ క్యాన్సిల్ చేశాడు.
∙పోలీసులు లేదా ఏదైనా ఏజెన్సీకి నగదు చెల్లించాల్సి వస్తే సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతాలకు చెల్లింపులు ఉండదు. కేవలం డీడీలు, చెక్కులు, చలాన్ల రూపంలోనే ఈ చెల్లింపులు జరుగుతాయి. బ్యాంకు ఖాతాలోకి జమ చేయాల్సి వచ్చినా అది ప్రభుత్వానికో, పోలీసు అధిపతి పేరుతో ఉన్న దానికో మాత్రమే జమ చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment