కళాకారులపై వరాల జల్లు
►డిమాండ్ల పరిష్కారానికి మంత్రి చందూలాల్ హామీ
►మళ్లీ ప్రజా కళారూపాలే బెటర్ అనే రోజొస్తుంది: ఈటల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కళాకా రులపై సాంస్కృతిక, పర్యాటక మంత్రి అజ్మీరా చందూలాల్ వరాల జల్లు కురిపిం చారు. సోమవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధుల అవగాహన సదస్సు నిర్వహిం చారు. ఈ సదస్సుకు హాజరైన మంత్రి మాట్లాడుతూ... ఈ ఏడాది రాష్ట్రంలోని కళాకారులందరికి గుర్తింపు కార్డులు అందజేస్తామని.. ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పి స్తామని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిం చేందుకు కన్ సెషన్ బస్‌పాస్ లతో పాటు అన్ని పథకాల్లో భాగస్వామ్యం కల్పి స్తామని హామీ ఇచ్చారు. జానపద కళాకారుల సంఘం కోర్కెలను సీఎం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కార మయ్యేందుకు కృషి చేస్తామనని చెప్పారు.
సభను ప్రారంభించిన ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లా డుతూ.. తెలంగాణ గడ్డపై జరిగిన అనేక కార్యక్రమాలకు ఆట – పాటనే స్ఫూర్తి అన్నారు. ఎప్పటికైనా మళ్లీ ఓ రోజు ఈ సినిమాలు, సీరియల్స్ చూడలే మురా బాబు.. ప్రజాకళారూపాలే బెటర్ అని ప్రజలు ఆలోచించే రోజు వస్తుందన్నారు. వృత్తి కళాకారులకు ఉపాధి చూపించాల్సిన అవసరం ఎం తైనా ఉందని సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ అన్నారు. కళాకారులందరికి ఉద్యోగాలు సాధ్యం కాదని.. ఉపాధి కల్పించే బాధ్యత భుజాన వేసుకుంటామ న్నారు.
కార్యక్రమంలో ప్రభుత్వ సలహా దారు డాక్టర్ కేవీ రమణాచారి, టూరిజం, సాంస్కృతిక శాఖల కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడారు. సదస్సులో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకు న్నాయి. ఈ కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, నరసింహారెడ్డి, తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగా శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.